12, నవంబర్ 2008, బుధవారం

చంద్ర యానం - నా ఆత్మ కథ -2

పోయిన సారి కలుసుకున్నప్పుడు, నా పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకున్నారు కదా, మరి నా ప్రయాణ ఘడియలు దగ్గర పడుతున్నాయి.నన్ను సురక్షితంగా భూ కక్ష లో వదిలి పెట్టడానికైతే వాహనము వుంది కాని ఆ తరువాత అక్కడ నుండి చంద్రుని మీదకి వెళ్ళడానికి అసలు దారి వుందో లేదో , వుంటే దాని నిండా ఎన్ని ముల్లు వున్నయో అన్నీ సందేహాలే.అప్పుడప్పుడు నాకూ అనిపిస్తుంది ఏ భీమసేనుడో వచ్చి నన్ను గిర్రున తిప్పి ఒక్క విసురు విసిరేస్తే పోలా, ఇన్ని కష్టాలు ఎందుకు అని. కానీ ఏమి చెస్తాము ఇప్పుడు ఆపనులు చెయడానికి ఇది కలియుగమాయె బకాసురులే కాని భీమసేనులు లేరాయె.
ఇంతకి జర్ని చేసేది నేను,భూమి మీద ఇంట్లో కూర్చొని మీటలు నొక్కే శస్త్రవేత్తలకి కష్టాలు ఏమి తెలుస్తాయ్? తెడా వస్తే అంతు పత్త లేకుండా పొయేది నేనా కదా. అందుకే బుద్ధిగా మాప్ దగ్గర పెట్టుకోని రోడ్ వెతుక్కుంటున్న.ఒక్కటి అర్ధమయి చస్తే కదా.ఇలా లాభము లేదని ఇస్రో లో ఒక సీనియర్ శాస్త్ర వేత్త, నేను కలిసి ఒక రొడ్డు పక్క ఇరాని చాయ్ హోటెల్ లో గట్టిగా దమ్ము లాగి పునాదుల దగ్గరనుంచి మొదలెట్టాము.

నాకసలే బోలెడు సందేహాలు ఒకటొకటిగా అడగడము మొదలెట్టాను.
" మీరైతే నన్ను పైకి పంపుతున్నార లేక నిజంగానే 'పైకి' పంపుతున్నరా? నేను అంత ఎత్తుకు వెళ్ళాక కింద పడనని గ్యారంటీ ఏంటి" అని? ఇదుగో అప్పుడు మొదలైంది ఎదేదో చెప్పాడు నాకు అర్థమైంది మీకు చెప్తున్నా.

ముందుగా భూ కక్ష అంటే ఎంటొ మొదలెట్టాము.భూమి చుట్టూరా స్పేస్ లొ ఏ వస్తువైనా మళ్ళీ మళ్ళీ అదే దారిలో తిరిగితే దాన్ని కక్ష అన్నడు ( An orbit is a regular, repeating path that an object in space takes around another one. An object in an orbit is called a satellite) . సరే అని తల ఒక సారి పైకి మరొక సారి అడ్డంగా ఊపా. అందుకే నెమో ఈసారి బొమ్మలేసాడు.


ఏంటి ఇన్ని దారులున్నయి అని అడిగా. దానికి సమధానంగ ఇంకో 4 బొమ్మలేసాడు.వేస్తూ ఇది చంద్రయాన్ దారి కాదు మనము ఇంకా భూమి పైకే పొలేదు అన్నాడు. ఈ బొమ్మల గొడవేంట్రా బాబు అనుకున్నా కాని చూడగా చూడగా నాకే అర్థమైంది, ఇంక మీకు కాకుండ పోయే ప్రసక్తే లేదు.
అంతా బాగనే వుంది కాని ఇంతకి పోలార్ ఆర్బిట్ అంటే ఏమిటని అడిగా, దానికి సమధానంగా ఒక చిన్న నవ్వు నవ్వి,అసలు ఆర్బిట్స్ అన్ని కూడా భూమికి వున్న ఎత్తు అవి భూమద్య రేఖతో చెసే కోణమును బట్టి రక రకాల పేర్లు పెట్టరు అన్నడు. కొన్ని చెప్పమని అడిగా..





పోలార్ ఆర్బిట్ : ఉపగ్రహము భూమధ్య రెఖతో 90 డిగ్రీల కోణం చెస్తూ ఉత్తర దక్షిణ ధృవాల మీదుగా సంచరిస్తుంటే అది పోలార్ శాటిలైట్. భూమి శాటిలైట్ కిందగా పడమర నుంచి తూర్పుగా తిరుగుతుంది కాబట్టి భూమి ని అంతా పరిశీలించడానికి ( మాప్స్ ) ఇటువంటివి వాడుతారు.అంటే మన భూభాగంలో శత్రువులు ఎవరైనా చొరబడ్డరా లాంటి విషయాలు గట్రా తెలుసుకోవడానికి ( ఇన్ని వున్నా మరి కార్గిల్ చొరబాట్లు ఎందుకు అడ్డుకోలెక పొయమో? బహుసా రిమోట్ సెన్సింగ్ పరికారలు సరిగా లేవేమో..) .కానీ వీటి ద్వారా భూమి మీద ఏ ఒక్క ప్రదేసాన్ని స్థిరంగా గమనించలేము.

ఈక్విటోరియల్ ఆర్బిట్స్ : ఇవి భూమధ్య రేఖకు సమాంతరంగా సంచరిస్తుంటాయి.సధారణంగా ఇవి వాతావరణ వివరాల సేకరణకు వాడతారు.

జియో స్టేషనరి ఆర్బిట్ : ఇవి భూమి మీద నుంచి మనము చూసినట్లైతే ఎప్పుడూ ఒకే స్ఠానంలో స్థిరంగా వుంటాయి. ఇంకో రకంగా ఇవి భూమితో పాటే అదే వేగంతొ భూమధ్య రేఖతో 0 డిగ్రీల కోణం చెస్తూ భూ వెగంతో తిరుగుతుంటాయి. ఇవి కమ్యునికేషన్ కి చాలా అవసరము. ఇవి మన ఇన్సాట్ శాటిలైట్ లాంటివి.

ఇలా చాల వున్నాయి కాని ప్రస్తుత విషయానికి వస్తే నువ్వు కింద పడవా అంటే ఎందుకు పడవు? మన P.S.L.V సరిగా పనిచేయక పొతే దబ్బుమని కింద పడతావు.నిన్ను కొంత ఎత్తులో ఒక నిర్నయించిన వేగంతో వదలేస్తే అప్పుడే నువ్వు నీ రెక్కలతో తిరుగుతావు అని చెప్తుంటే మా ఎదురుగా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఇదిగో నా కెమరా తో ఫొటో కూడా తీసా.



మొత్తానికి దెబ్బలైతే ఎవరికి లేవు గాని, మా గురువు గారు గొప్ప సత్యం చెప్పారు.భూమికి గురుత్వాకర్షణ,వాతావరణము లేకపోయినచో ( మన ముండము..అది వేరే సంగతి) ఆ నిచ్చెన కింద పడకుండా అలా ఋజు మార్గం లో వెళ్తుంది అని. కాబట్టి నువ్వు నీ ప్రయాణం లో ఎలాగు భూమికి ఎత్తులో వాతావరణము లేని చొట చంద్రుని పోలార్ ఆర్బిట్ లో తిరుగుతావు కాబట్టి నీకు ఇనెర్షియా పెద్ద సమస్య కాదు. సమస్యల్లా భూ కక్ష లో భూమ్యాకర్షణ , లూనర్ ఆర్బిట్ లో చంద్రుని ఆకర్షణ లకు లోను కాకుండా వేగాన్ని జాగ్రత్తగా సరి చెసుకుంటె చాలు అన్నాడు.


సరే అవన్నీ నాకెందుకు కానీ మీరీ కిందనుంచి మీట నొక్కుతారు కదా , మరి నా ప్రయాణ టైం అయింది అని బయలుదెరా..
( ఈ ఆర్టికల్ రాస్తుంటే టెక్నికల్ వ్యాసము తెలుగు లో ఎందుకు మొదలెట్టానా అని నన్ను నేనే ఛండలంగా తిట్టుకొని చెంప దెబ్బలు వేసుకొని ఇక బుద్ధుంటే తెలుగు లో ఇలాంటి ప్రయోగాలు చేయ కూడదని ... సెలవు )

2 కామెంట్‌లు:

  1. ఎప్పటిదో ఒక రష్యన్ కథ.

    ఒక జంట ఏ విధంగా అడవిలోకి వెళ్లి, ఆ అడవిని వ్యవసాయ యోగ్యం చేశారో వివరిస్తుంది. అంతా చేస్తే వాళ్లు చివరకు బాపుకున్నది ఏమీ లేదు. కాకుంటే ఆ తరువాత అక్కడ సెటిల్ అయిన వారికి మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

    మీరు ఇలా సాంకేతిక టపాలు వ్రాయటం కూడా, ఎంత కష్టంగా ఉన్నా కొనసాగించాలని నా ఉద్దేశ్యం. తరువాత తప్పకుండా పనికి వస్తాయి. షేక్స్పియర్ రచనలు ఆంగ్ల భాషకు పనికి వచ్చినట్టు.

    రిప్లయితొలగించండి
  2. Some resources
    http://te.wiktionary.org -- feel free to add standard meanings missing from this site.
    http://telugupadam.org -- feel free to add new words coined by you to this site, so that it will be helpful for next writers.
    http://www.pracheepublications.com/ - click on #adhunika vyavahara kosam# Link on left side.

    రిప్లయితొలగించండి

Comment Form