2, నవంబర్ 2008, ఆదివారం

ఈ అనంత విశ్వంలో నేనెక్కడ, నీవెక్కడ, ఆ దేవుడెక్కడ ?











ఈ అనంత విశ్వంలో నేనెక్కడ, నీవెక్కడ
నా కులమేక్కడ , నీ కులమేక్కడ
మతమెక్కడ ,దాని గురువు లెక్కడ
గుడు లెక్కడ,గుడి పూజారులెక్కడ ?


తెలంగాణా ,రాయలసీమ లెక్కడ
ముంబై , బీహారు లెక్కడ
తెలుగెక్కడ , తమిళ మెక్కడ
అసలు మనిషెక్కడ ?


రాజ్యా లెక్కడ ,రాజ మంత్రిణి లెక్కడ
రాజు లెక్కడ ,యువ రాజు లెక్కడ
బాబు లెక్కడ ,ప్రజా పార్టీ లెక్కడ
జయాపజయా లెక్కడ ?


భూగోళ మెక్కడ, దాని స్థానమెక్కడ
అసలు విశ్వమెక్కడ, దాన్ని సృస్టించిన దేవుడెక్కడ?

2 కామెంట్‌లు:

  1. భా.రా.రె. అదే కదా మరి ఇన్నాళ్ళుగా ఈ శోధన. వీటన్నిటికీ సమాధానం, అర్థం దొరకకనే కదా యుగాల తరబడి తఫస్సులు, వేదనలూను :) అసలు లేదని కొందరు, వున్నా వీడేనని మరి కొందరు, వున్నా లేకున్నా నాకొకటే అని మరిందరూ అంతా కలిసి విశ్వానికి, విశ్వాసానికి నడుమ కొట్టుకుంటున్నది. నావంటి కొందరికి ఆయన హృదయవాసి. ఆ లయలోనే విశ్వాంతరాళలో చలనానికి ఉనికీను. నా సొదలు, వ్యధలిలావుంటాయి.

    దేవా! కానుకగా నా మరుజన్మ నీకిచ్చేస్తా. http://maruvam.blogspot.com/2009/06/blog-post_23.html మొదటి వ్యాఖ్యలో మరి కొన్ని లింక్స్ ఇచ్చాను. ఈ టపాలో కాస్త ఎక్కువమందిమి పాలుపంచుకున్నాము.

    రిప్లయితొలగించండి
  2. Just to recap ఆథ్యాత్మిక పరంగా బోధించే వైరాగ్యం, నిరాడంబరత నాకు ఇష్టం. అంతకుమించి ప్రకృతిలోని ప్రశాంతతనిచ్చే ఏ రూపైనా నాకు నచ్చుతుంది. నేను విగ్రహారాధన, మూర్తి అలంకరణ, పాదసేవలు, వ్యక్తి పూజలు - ఈ మాదిరివేవీ చేయను. నా మనసే నా మందిరం. కానీ దైవాన్ని నమ్ముతాను. as per me god is belief. that power can not be a threat nor a bribe for me to look up to... You do not need a crane to lift a pin; he is simple,close to your heart. Feel his presence. That's it.

    రిప్లయితొలగించండి

Comment Form