31, జనవరి 2009, శనివారం

పద నిర్మాణ పద్ధతులు ( morphology )

గత మూడురోజులుగా గూగిల్ కి నే నొక్కడినే దరిదాపు ౨౦౦-౩౦౦ హిట్లు ఇచ్చి వుంటాను. అనుకోని తలంపుగా తెలుగు అభివృద్ధి కోసం మొదలు పెట్టిన నా చిన్న వెబ్ సైట్ http://www.haaram.com ని తరువాత దశకి తీసుకు వెళ్ళడానికి చాలా చాలా చదవాల్సి వచ్చింది. page raniking,lexical grammar,variations of BTree,morphology of english sentenses, search query formation, voice browsers etc., etc.... అన్నీ చదవనైతే చదివాను కానీ ఎక్కడ మొదులు పెట్టాలో అర్థము కాలేదు. B+ tree C# code కోసము గూగిల్ లో తెగ తిరిగాను. నా requirements కి సరిపడిన కోడ్ ఎక్కడా దొరకలేదు. సరే తరువాత చూద్దమని తెలుగు వ్యాకరణం, పదాల అనుబంధం గూర్చి చదవాలని తెలుగు వ్యాకరణం పుస్తకం చదువుతూ నేను రాసుకున్న నోట్స్ ఇది. ఇది తెలుగు లో ఇంటెర్నెట్ సెర్చ్ కైనా లేకా voice based search కైనా పునాది లాంటిది. చాలా శ్రమతో కూడుకున్నది. 2 సంవత్సరాలు పదుతుందో లేక 5 సంవత్స్రరాలు పడుతుందో అసలు పూర్తవుతుందో ...తెలియదు కానీ ఓపిక ఉన్నన్ని నాళ్ళు చేయాలి. వ్యాకరణములో పద నిర్మాణ పద్ధతులు చూశాక ... పదములో ఉన్న సంధి నిర్మాణాన్ని ఎలా గుర్తించాలో .... A very big question mark.

B+ datastructure ( 1st draft notes )
---------------------------------------------
పదము

నామవాచకము
సర్వనామము
విశేషణము
క్రియ
క్రియా విశేషణము
విభక్తి
సముఛ్చయము
ఆశ్చర్యార్ధకము
అవ్యయములు.

ఏక వచనము
బహు వచనము : ఎక్కువగా "లు" చేర్చగా వచ్చేవి.
పుం లింగము
స్త్రీ లింగము
నపుంసక లింగము
ప్రధమ పురుష
మధ్యమ పురుష
ఉత్తమ పురుష

---విభక్తి పదములచే ఏర్పడు పద సమూహాలు ( వాక్య భాగములు ):
రాముడు ( రామ ) ,వీరుడు ( వీర ), చంద్రుడు ( చంద్ర )... ప్రధమా విభక్తి
నేనున్, మిమ్ములన్ , (? కూర్చి), తెలుగు గురించి, -- ద్వితీయా విభక్తి
మీచేతన్(ను), చంద్రబాబు చే, రాజశేఖరుని తోడన్ (ను), మీతో -- త్రుతీయా విభక్తి
నాకొరకున్, నాకై -- చతుర్ధీ విభక్తి
రాముని వలన, కృష్ణుని కంటె , చెర పట్టి -- పంచమీ విభక్తి
ఇంటి లోపల సంపంగి - షష్ఠీ విభక్తి
అందులో లేనిది - సప్తమీ విభక్తి
ఓరీ ఎంత పొగరు , ఓయీ కుర్రవాడా, ఓసీ చిన్నదానా - సంబోధనా ప్రధమా విభక్తి.

--- సముఛ్చయములు : పదములు కలుపుటకు వాడునవి. అవి రెండు ( యున్,నున్ ) . ఇప్పుడు వాడుకలో లేవి . వీనికి బదులు గా దీర్ఘములను మరియు కామా(,) వాడుచున్నారు.

----తత్సమము ( మూల భాష ) : సంస్కృత ప్రాకృత పదముల నుంచి కొద్ది మార్పులచే చేరిన పదము. ఆ భాషల ప్రత్యయము తొలగించి తెలుగు ప్రత్యయము చేర్చగా వచ్చిన పదము

---- తద్భవము: సంస్కృత ప్రాకృత పదముల నుండి పుట్టిన శబ్దముల మార్పుచే ఏర్పడినవి

---- దేశ్యము : దేశీయము గా అభివృద్ధి చెందినవి ( ఊరు, పేరు, ఇల్లు, ముల్లు ...)

----గ్రామ్యము : వ్యాకరణ విరుద్ధమైనవి. ( వస్తాడు, తెస్తాడు, వచ్చేడు,తెచ్చేవి,వచ్చేవాడు, తెచ్చేవాడు....)

----అన్య దేశములు : పర భషల నుండి వచ్చి చేరినవి. ( అసలు, సుమారు, హద్దు ...)

--ద్రుత ప్రకృతికములు : న కారము చివర వచ్చేవి. ఈ నకారము లేకపోయినా పదము అర్ఠము మారదు
చేతన్ - చేత, తోడన్ - తోడ


---- ముందు అక్షరము చేర్చిన ఏర్పడు పదములు :
అ, అన్ ( వ్యతిరేకార్థము ) : అసమానము, అచంచలము,అనుమానము,అనాదరణ
స, సత్ ( మంచి అర్ఠము ) : సపరివారము, సజ్జనుడు,సలలిత,
కా, కు ( చెడ్డ ) : కుజనుడు,


---- ప్రత్యయాంత శబ్దము :
తర-తమ : సుందర తీరము, సుందరతమము,
వంత-మంత : భగవంతుడు,ముత్యమంత,చేమంతి..
వతి-మతి : గుణవతి,శీలవతి,శ్రీమతి,మందమతి

---- ఇంచు చివరగల పదాలు : వచించు, హసించు,తపించు,ఆవులించు,జాడించు,తిలకించు,ఆరగించు,గాలించు,అప్పగించు ... ( గమనిక వీటిలో కొన్ని తత్సమములు కాదు )

---- తద్భవ పదాలు ( రూపాంతర పదాలు )
ఋ అక్షరము నకు రేఫము వచ్చేవి : ఋషి --రుసి ,ఋక్కము - రిక్క
ఖ,ఛ,ఠ,థ,ఫ లకు క,చ,ట,త,ప వచ్చేవి : ముఖము - మొకము ( మొగము ), ఛెవి -చెవి, పీఠ -పీట, కథ - కత, ఫలము - పలక
ఘ,ఝ,ఢ,ధ,భ లకు గ,జ,డ,ద,బ వచ్చి చేరేవి : ఘంట - గంట ,ఘటిక - గడియ, ప్రౌఢ -ప్రోడ , ధర్మము - దమ్మము, భక్తుడు- బత్తుడు

---- సంయుక్తాక్షరాల లో ఒకటి లోపించేవి : స్వామి - సామి ,పంక్తి - బంతి

----) క్ష కారానికి క-స-చ లలో ఏదైనా వచ్చేవి :
లాక్ష - లక్క , క్షేమము - సేమము , భిక్షము - బిచ్చము

---- ఙ్ఞ కారమునకు న కారము వచ్చేవి
ఆఙ్ఞ - ఆన

---- స్వ - కారమునకు సొ- వచ్చేవి
స్వర్గము - సొన్నము
స్వత్వము - సొత్తు

---- క్యా - నుడి తొలిగేవి
మాణిక్యము - మానికము
జ్యోతి - జోతి


---- క్యా వడి తొలగి ఎత్వదిత్వములు వచ్చేవి
పద్యము - పద్దెము, పుణ్యము - పున్నెము, కన్య - కన్నె,విద్య- విద్దె

----రేఫము తొలిగి ద్విత్వము వచ్చెవి
సర్పము - సప్పము
అర్పణము - అప్పనము

---- క్రావడి లోపించేవి
ప్రసాదము - పసాదము
ప్రాయము - పాయము

---- ఉ కారము, ఒ కారమయ్యేవి
కుంతి - గొంతి
కులము - గొలము

----ణ కారము , న కారమయ్యేవి
ప్ర్రయాణము - పయనము
ద్రోణి - దోనె

---- శ, ష లకు స కారము వచ్చేవి
శాల - సాల
రోషము - రోసము

3 కామెంట్‌లు:

  1. మీరు పెద్దపనే పెట్టుకున్నట్టే కనబడుతోంది. దిగ్విజయం కలగాలని ఆశిస్తున్నాను. నేను సాఫ్టువేరువాణ్ణి కాను. అంచేత ఇతరత్రా నావల్ల కాగలిగే పనేదైనా ఉంటే చెప్పండి.

    రిప్లయితొలగించండి
  2. మున్నాగారికి, చదువరి గారి వ్యాఖ్యలకు ధన్యవాదాలు. మీ సహాయము తప్పక అవసరము అవుతుంది.మరిన్ని వివరాలు ఇ-మైల్ చేస్తాను.

    రిప్లయితొలగించండి

Comment Form