27, మార్చి 2009, శుక్రవారం

విరోధి ఉత్పలం
బ్లాగు మిత్రులందరికీ విరోధి నామ ఉగాది శుభాకాంక్షలతో విరోధి ఉత్పలం.


రాత్రి గడించె కోకిలల రాగ సుగీతములెల్ల ధాత్రి లో
కాంతి ప్రతిష్టచేయ, భువికాంతకు పట్టిన చీడలెల్ల నే
సాత్వికవాదినై కరుణ సాగర వాక్యముల్జెప్పి చూచినా,
రాతి మనుష్యులై వినని రాజుల పాలి విరోధి నయ్యెదన్

6 వ్యాఖ్యలు:

 1. కం:
  భారారే గారూ బా
  గా రాశారుగ విరోధి గానము మాలన్‌
  కోరారు గద విరోధిని
  శ్రీరామ రక్ష యనుచునె శిరినిక దెచ్చున్‌

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీక్కూడా మా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మీకు..మీ కుటుంబానికీ..ఉగాది శుభాకాంక్షలు..!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఆత్రేయ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. -- కంద విరోధి ( రాయడం చేతకాకనే సుమా )

  విజయమోహన్ గారూ, ఇంటిల్ల పాది ఈ నూతన సంవత్స్రరం లో ప్రేమామృత పచ్చడి పంచుకొని ఆనందించండి.

  మధురవాణి గారు, ఈ విరోధి మీ కుటుంబంలో సుఖ, శాంతి, వాణీ సౌరభాలను పరిమళించ చేయాలని ప్రార్థిస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మన నూతన సంవత్సర శుభాకాంక్షలు,మీ ఇంటిల్ల పాది ఈ నూతన సంవత్స్రరం లో ప్రేమామృత పచ్చడి పంచుకొని ఆనందించండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @AMMA ODI : నిజంగానే ! నాలుగడుగుల దూరమైతే నేనే వచ్చి మీ ప్రేమామృత పచ్చడి పంచుకొని వుండేవాడినేమో !!!

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form