15, జులై 2009, బుధవారం

నా ప్రేమతో నీకో రూపమిచ్చాను

ఆత్రేయ గారి "నా ప్రేమతో నీకో నీకో రూపమిచ్చాను" కవిత కు సెటైర్ :) .... అత్రేయగారు నొచ్చుకోకుండా ముందే క్షమాపణలతో.............అసలు పోష్ట్...
http://aatreya-kavitalu.blogspot.com/2009/07/blog-post_4310.html

నా ప్రేమతో నీకో రూపమిచ్చాను

పిలిచి పిలిచి నోరు నొప్పిపుట్టినా
చూసి చూసి కళ్ళు కాయలు కాసినా
నడిచి నడిచి కాళ్ళు పుండ్లు పడ్డా
నా పిలుపు నిన్ను చేరలేదు

మెదడులో గుర్తుల గుంటలు పూడ్చి
త్యాగమని బోర్డు పెట్టి
మురికి నీళ్ళలో విషము కలిపి
నా ప్రాణాన్ని నేను తీసుకోలేను.

ప్రేమపేరుతో మందు తాగేకంటే
యాసిడ్ చల్లి గెలవడమే
నా కిష్టం
మొండి ప్రేమలో
ఆత్మహత్య చేసుకోలేను.

నీవు లేకనే ....నేను బ్రతుక గలనా అన్న ప్రశ్న
మరోసారి నిన్ను నువ్వు చూసుకో..
వస్తావా.. ఛస్తావా...

8 వ్యాఖ్యలు:

 1. ఆత్రేయగారు మన్నించండి....
  ఫోటో చెప్పకనే చెబుతున్నది...
  "వస్తావా చస్తావా' అని....
  మీరు కూడా అనాలా!!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అయ్యో ఇందులో నొచ్చుకునేదీ ఏమీ లేదు. ఇది ఆ చిత్రానికి స్పందన లాగుంది కానీ నే రాసిన దానికి కాదు. నేనిలా రాయలేను. క్రూరత్వాన్ని ప్రేమకు జతచేయలేను. ఆ చిత్రం ఏ ఉద్దేశ్యంతో పెట్టానో చెపుతా..

  భయం కలిగించడమే దాని పరమార్ధం.. కానీ కౄరత్వం ప్రకటించడంకాదు. గద్దించడమే కానీ గాయపరచడం కాదు.

  సాన పట్టిన కత్తులతో ఆడేటప్పుడూ..
  కరెంటు ప్లగ్గులో వేలెట్టేటప్పుడూ..
  దంచివున్న కారంలో కాళ్ళేట్టినప్పుడూ..
  అమ్మవేసిన వీరంగం గుర్తుందా .. ?

  ఆమంటలో కాలేది తనే !! ఆ శిక్ష తనదే.. తనకే సొంతం.. ఆ వీరంగం లో రెండు తగిలించినా.. ఆ బాధ తనకే !!..

  ఈ కవిత శృతి రాసిన కవితకు స్పందన. తనకవితలోని నాయకుడి రెస్పాన్సు ఇది. ఇక్కడ పైన చెప్పినట్టు.. అమ్మ వేసే వీరంగమే అతనిదీ.. తమకు చేతిలో లేని విధి విధానం వలన వేరవాల్సివచ్చింది. అది తాళలేని తన సఖి కన్నీరు కారుస్తుంది.. ఏ నిజమయిన ప్రేమికుడు అది చూడగలడు.. నయానా.. భయానా.. తనని ఓదార్చాలి.. సౌమ్యంగా చెపితే పిల్లకాయలు వినరు.. అందుకే.. ఇలా.. ఆ బొమ్మ చూస్తే భయమేయాలి.. అప్పుడే కవితకు పూర్తి న్యాయం జరిగినట్టవుతుంది. భయమో.. ఈసడింపో తనమీద కోపమో.. ఏదో ఒకటి.. తను ఇప్పుడున్న బాధనుండి బయటకు పడటానికి.. అతనికి చేతనయింది అంతే.. ఇవ్వగలిగింది అంతే ... ఆపేక్షే.. కొండంత.. ఏంచేస్తాం.. విధి వంచితుడు. తను మండుతున్నా.. తన ప్రేమకోసం.. కోపం నటిస్తున్నాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చిన్ని, మురళి, పద్మార్పిత ధన్యవాదాలు. ఈ వ్యాఖ్యలకి ఆత్రేయగారే అర్హులు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఆత్రేయగారూ.. నేను సరదాకే రాసానిది.ఏమైనా మీ వివరణ చాలా బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఆత్రేయగారు...మీ వివరణ అమోఘం..
  అందుకే అన్నారేమో!"పిల్లకాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ అని" ఏమంటారు?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. రెడ్డి గారు చాలా బాగుంది మీ పేరడి. దానికి ఆత్రేయ గారి వివరణ అర్దవంతముగా వుంది.
  Please watch my latest posting and give ur coments

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form