24, జులై 2009, శుక్రవారం

అందుకే ఇలా !

నువ్వు పరిచిన దారిన అడుగు పడేలోపు
పాదం కందకుండా పూలపాన్పు నింపుతావు

జరుగుబాటు పాట్లు రోజుల్ని మింగేస్తుంటే
పెనవేసుకున్న బంధం ముడివేసుకొంటుంది

యాంత్రిక మంత్రం జపిస్తూ జీవితం ఏకాంతాన
ప్రాతః కాల ప్రభాతాన్ని జారిపోకుండా దాచుకుంది

అరచేతి గీతల్లో అన్ని భాగ్యరేఖలున్నా
నీ ప్రేమ గీతక ముందు అభాగ్యగీతలే

లయతప్పని హృదయాన రణగొణధ్వనులే
సంసార జీవితాన ప్రణయ నాదాలు

ఇందుకు అని ఏ ఒక్కరైనా వివరించరా?
ప్రేమ ఔన్నత్యం అని నాతో అంగీకరించారా?


మరువం ఉషగారి కవితకు వ్యతిరేక స్పందన.

31 కామెంట్‌లు:

  1. kavitaa kadana rangamanna maaTa baagundi. jugalbandi.. diiniki pratigaa inkaa evarainaa marO kavita vEstaarEmO cuuddaam.

    రిప్లయితొలగించండి
  2. హి హి.. ఆత్రేయగారు, ఎవరిదాకా ఎందుకు.. మీరేచేస్తే పోలే ఆ జుగల్బందీ. :-)

    రిప్లయితొలగించండి
  3. ఉష గారు బ్లాగులో ఓ రెండు మాటలేశా.. ఇంకా తిరుగు టపా రాలేదు.. చూడాలి ఉష గారేమంటారో

    రిప్లయితొలగించండి
  4. చూసా మీ వ్యాఖ్యను ... వీకెండ్ ఎంటర్టైన్మెంట్ మొదులైంది అయితే..

    రిప్లయితొలగించండి
  5. బాబా గారు, ఓ సారిటు రారూ? బా.రా.రె. గారు, చాలా బాగుందండి మీ వ్యతిరేక కానీ ఆశాజనక ప్రతిస్పందన. ఆసక్తికరమైన అల్లిక. మరి మొదటి పంక్తిలో "నవ్వు" అన్నది మీ వరసకి తగ్గట్లు "నువ్వు" గా శృతి చేసారేమి? ఇంకా నా ప్రేమ కావ్యం మత్తు దిగినట్లులేదే... ;) ఆత్రేయ గారన్నట్లు మరో బాణీ వస్తే బాగుంటుంది. ఆయన నా కవితకి వ్యాఖ్యగా మరొక కవిత వ్రాసేసారు కానీ నా కవితకి అనుగుణమైన అల్లిక అది. కనుక ఏ బాబా గారో [నా మంచికే సరిదిద్దుతారు కనుక] ఓ చూపు వేస్తే బాగుంటుంది. ప్రదీప్, ఆనంద్ నా జట్టు కనుక మీతో పచ్చికొట్టించేస్తా :)

    రిప్లయితొలగించండి
  6. ఆత్రేయ గారు, చూసానండి, కాస్త బుర్ర పదునుపెట్టుకు వస్తాను. ప్రస్తుతం multi tasking నడుస్తుంది.

    రిప్లయితొలగించండి
  7. భలే, పరిమళం గారు మీ బండి ఎక్కారక్కడ [మరువంలో] మీకొక వోటు పడిందన్నమాట, భా.రా.రె. గారు.

    రిప్లయితొలగించండి
  8. ఉషగారూ, నిజమేనండోయ్.. ఇప్పటిదాకా నేను అది "నువ్వే" అనుకుంటున్నాను. ఏంచేస్తాం నాకు నాలుగు కళ్ళు :). మీరెంతమందున్నా, మా పరిమళానికి సాటి వస్తారా? అయినా ప్రదీప్,ఆనంద్ ని మీ జట్టులో ఎలా వెసుకొంటారండి. మీదంతా తొండి ఆట. మీ కనుగుణంగా మరో కవిత రానివ్వండీ, మారుపేరుతో మళ్ళీ రాస్తా:)

    రిప్లయితొలగించండి
  9. మీరు మరువం బ్లాగ్ లో రాసింది బాగుంది ...నాకిక్కడ వ్యతిరేక స్పందన అర్ధం కావడంలా ,ఇంకో నాలుగు సార్లు చదవలేమో...

    రిప్లయితొలగించండి
  10. మీరయితే ఉషగారి ప్రేమకావ్యానికి వ్యతిరేక స్పందననుకొంటున్నారేమో.. కాదండి. ఇంకో బుల్లి కవిత వ్రాసారు చూడండి.
    http://maruvam.blogspot.com/2009/07/blog-post_23.html

    రిప్లయితొలగించండి
  11. ఉష గారు నా ఓటు తప్పుగా లెఖ్ఖేట్టారోచ్. నేను రీకౌంటింగు డిమాండు చేస్తున్నానధ్యక్షా...

    రిప్లయితొలగించండి
  12. కౌంటింగ్ ఎందుకు ఆత్రేయ గారూ.. ఏకంగా కుర్చీ ఎక్కేద్దాం పదండి.

    రిప్లయితొలగించండి
  13. >>నువ్వు పరిచిన దారిన అడుగు పడేలోపు
    పాదం కందకుండా పూలపాన్పు నింపుతావు
    నువ్వు పరచిన దారిలో నీకోసం నేను పూల బాట/పాన్పు నింపితే నా పనితనం ఏముందీ?
    నెనే నీకు దారిని పరిచి, పూల బాటనేర్పాటు చేస్తే అది నాకు నీమీద కన్సర్న్ ని తెలియజేస్తుంది. కదాఆఆఆ?

    రిప్లయితొలగించండి
  14. ఆత్రేయ గారు, నేనిక మీపై నిరసన లేవనెత్తి నిరాకవితాదీక్ష పూనాల్సిందేనండి. ఏదో కూడల్లో కలిసుంటున్న పాతకాపులం అని కూడా చూడకుండా మిత్రద్రోహంచేస్తారా. కాస్త చూసీచూడకుండా నా bluff పనిచేసే దాకా రానియలేదు. అడ్డంపడిపోయారు. కుర్చీలు, అధ్యక్ష హోదాలు, ఓట్ల లెక్కింపులు వరకు వెళ్ళిపోయారు. ఇదే నా శాపం, మీ పార్టీలో అంతర్గత కలహాల చిచ్చు రేగి మధ్యంతర ఎన్నికలు వచ్చి, పరిమళం పార్టీ ఫిరాయించి నా పార్టీలోకి వచ్చి నా కవితే నెగ్గు గాక! ;)

    రిప్లయితొలగించండి
  15. చిన్నీ, ఎంత అమాయకంగా నా కొరకు ఈ వర్గవాదులతో పోరాడటానికి సిద్దపడ్డారో కదా. నేను వచ్చేసా ఇక మనం బలీయ శక్తి ;)

    రిప్లయితొలగించండి
  16. భా.రా.రె. గారు, తొండి ఆడకుండా ఎలా నెగ్గగలం చెప్పండి. సందుల్లో క్రికెట్, కబాడికే తప్పవవి, ఇక బ్లాగుల కుమ్ములాటకి మినహాయింపు ఎలా. దేముడా దేముడా ప్రదీప్, ఆనంద్ నా వర్గం నుండి నిష్ర్కమించకుండా చూడు, భా.రా.రె గారితో వేయి కవితల నోము చేయిస్తాను. అన్నట్లు మీ మారుపేర్ల చిట్టాకి ఎంత ధర పలుకుతుందేమిటీ. కాస్త చెప్పేయండి. ఒకటే షరతు, అపుడైనా కాస్త బారు తగ్గించి పొట్టి పేరు పెట్టుకోండి భా.రా.రె. గారు [వారెవ్వా నాకు కూడా ప్రాస వచ్చేస్తుంది] ;) jk

    రిప్లయితొలగించండి
  17. సాహితీ మిత్రుల్లారా, మరువంలో మాపటికి "ఎందుకిలా" అన్నదానిపై మీ అందరికీ ప్రతి వ్యాఖ్య వ్రాస్తాను అంతవరకు, నా వనాన్ని కిష్కింధకాండ చేయకండేం. :)

    రిప్లయితొలగించండి
  18. కవితలు వ్రాసేవాళ్ళకి కథలు నచ్చవు కదా. ఆ డౌట్ వచ్చే ఈ టాపిక్ వ్రాసాను : http://sahityaavalokanam.net/?p=167

    రిప్లయితొలగించండి
  19. Whoever comes here, Come and enjoy the mega show at http://sahityaavalokanam.net/?p=167.

    No entry fee :-)

    రిప్లయితొలగించండి
  20. ఊషగారూ, ఇంకా మారుపేర్లు పెట్టుకోలేదు..మీకు అనుకూలంగా ఇంకో కవిత వస్తే పెట్టుకుందామనుకున్నా కానీ అవసరం రాలేదు. పేరు ప్రసక్తి వచ్చింది కదా.. ఆ "గారు" ను తీసి గట్టుమీద పెట్టండి. అప్పుడు ౩ అక్షరాలే.. భారారె.
    హమ్మా, మారుపేర్లు పెట్టుకున్నా చెప్తారా ఏంటి? ఇక ధర అంటారా ఏదో మీ భాగ్యం మా ప్రాప్తం.
    "వారెవ్వా" నాకు కూడా ప్రాస వచ్చేస్తుంది... హి హి హీ.. ఇంకేం మీరు కూడా వర్గవాదుల్లో చేరిపోవచ్చు.

    రిప్లయితొలగించండి
  21. అయ్యబాబోయ్..చాలా ఆలస్యంగా వచ్చినట్టున్నాను.. యుద్ధము-శాంతి కూడా జరిగిపోయినట్టుంది..

    రిప్లయితొలగించండి
  22. మురళిగారూ, శాంతి ఎక్కడండీ , యుద్ధం ఇప్పుడే మొదలైంది

    రిప్లయితొలగించండి
  23. మీరు చెప్పేవరకు ప్రేమకావ్యంకి వ్యతిరేకత అనుకున్న:)...చూసోచ్చాము .
    @ఉష ...ఎంతైనా మనం మనం ఒకటికదా..ముందు వెనుక ఆలోచించక దూకేయడమే :)

    రిప్లయితొలగించండి
  24. భా.రా.రె. వార్నీ ఇంత సులువైతే ఇక నాకు ఢోకా లేదండి. కుర్చి మళ్ళీ నా పైవు జరిపేసా..;)
    మురళీ గారు, ఇంతకీ మీరు నా పార్టీలోనే వున్నారా లేదా.శాంతీ లేదు సంధీ లేదు ఏకంగా సమరమే.:)
    చిన్నీ, మరి మరువంలో ఓటు కలపలేదేమి? ఋజువు చూపాలి కదా? ;)
    అందరికీ నెనర్లు. కాసింత సరదా, యాంత్రికత్వం నుండి బయటకి లాగే వరస.

    రిప్లయితొలగించండి
  25. ఉషగారూ.. సరదా ఇక్కడేముందండీ.... పైనున్న లింకు చూస్తే మీకు ఇంక ఏ హాస్య యోగాసనాలూ వెయ్యక్కరలేదు.. వద్దనుకున్నా నవులే నవ్వులు.

    కుర్చీ అంత సులభంగా ఇస్తామా.. మీరు వర్గవాదానికి మాత్రమే అర్హురాలు. కుర్చీ దాకా వెళ్ళారి.. అక్కడ చానామంది క్యూ అమ్మా..

    అవునండీ.. ఏదో వానా కాల కాలక్షేపం :)

    రిప్లయితొలగించండి
  26. మూర్ఖు లల్లో వీర మూర్ఖులు నాస్తిక
    అక్కు పక్షి చీక ఆకు పక్షి
    కిథలు జెప్ప నరులు కిలకిల మనినవ్వె
    విశ్వదాభిరామ వినుర మూర్ఖ

    చీక ఆకు = చీకాకు లేదా చీకాకుళం

    రిప్లయితొలగించండి
  27. అరెరే ...ఎంత చర్చ మిస్ ఐపోయా ...ప్చ్ ....
    మీ కవిత బావుందండీ ...తర్వాత జరిగిన చర్చ మరీ బావుంది .

    రిప్లయితొలగించండి
  28. పరిమళం గారూ ఏం పరవాలేదు మళ్ళీ ఉష గారు "ప్రేమలేదని, ప్రేమించరాదని" అని పాడకపోతారా, మనకు దొరక్కపోతారా?

    రిప్లయితొలగించండి

Comment Form