9, ఆగస్టు 2009, ఆదివారం

మిగతాది రేపు...



మనసు రాగానికి
హృదయ నాదానికి
కొమ్మపై కోకిలమ్మ
గొంతెత్తి పాడింది.

ఉషోదయ సమయాన
శాంతిలేని మదిలోన
మొలచిన దొక చిరు మొలక

మరిగే రక్తం పాదరసమై
కొమ్మ కొమ్మన క్రమ్ముకుంటే
విరిగిన మనసే రెమ్మలుగా
చైతన్య కీలలె కొమ్మలుగా
హృదయ జ్వాలలె ఊడలుగా
ఎదిగిందొక మహా వృక్షం.

ఓ ప్రభాత సమయాన...

గుండె వేగమెక్కి
నరాలు పగులగొట్టి
క్షణాన మనసు దాటి

నదులపై నడయాడి
అలలపై నాట్యమాడి
నగమెక్కి గిరుల దూకి
మైదాన రహదారుల
వడి వడిగ నడచి
చిట్టడవుల చీకటి చీల్చి
అగ్ని కీలల చెరను దాటి
వేలగొంతుల వెర్రి కేకల మధ్య
విచ్చుకత్తుల రాక్షస చూపుల మధ్య
చేరిందొక మానవ వాసం
చూసిందొక అలజడి రాజ్యం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comment Form