15, ఆగస్టు 2009, శనివారం

స్వాతంత్ర్య భారతి -- సంకెళ్ళు త్రెగిన వేళ

భరత వృక్షం విరగ పూచింది
పరీమళాల శోభించింది.

వేదశాఖలు పూచిన భూమి
హస్తకళల భాసిల్లిన భూమి
కావ్య గాన నృత్య నిత్య శోభిత
న్యాయశాస్త్ర వేదాంతిక.
సుమనోహర సస్యశ్యామల

--ఇప్పుడు
పరిమళాల వనాన సువాసన గ్రోల
అరుదెంచిరి భరత వీరులు

నదీనదాల భాసిల్లు భారతి నాది
చుక్క నీరు లేని పల్లెలెన్నో
విద్యుద్దీప శిఖ బారతి నాది
నిత్య చీకటి పల్లెలెన్నో

పరమత సహనం మాది
మత మార్పిడి పెద్దలం మేము
కుల మతాలకతీతులం
కార్చిచ్చులు రగిల్చే విద్యార్థులం.

మల్టి స్పెషాలిటీ స్పెషల్ వైద్యంలో గాలి కెగిరే ప్రాణాలు
కార్పొరేట్ విద్యా ప్రాంగణం లో కొడిగట్టే బాల్యాలు
పల్లెల జీవనంలో స్వచ్చత ఎక్కడ?
నగర జీవనంలో జీవితమెక్కడ?

ఇలా ఎంత కాలం?


నానా జాతి వృక్షానికి తోటమాలి ఎవరైతేనేం
పీల్చేది సుమబాల పరిమళాల కాదు
చెట్టు మొదళ్ళనే పీల్చుతున్నారు.

దేశ హద్దు కుంచించుకుంటేనేం?
భావి రాష్ట్ర బౌండరీల లెక్కలతో
భరత బిడ్డ్లలు బిజీ బిజీ.

భాషా బేధాలు సాంస్కృతిక భావాలు
వరమా? శాపమా?

కార్చిచ్చు కాలనాగు
పుట్టబోయే భరత బిడ్డ గుండెలో విషం గ్రక్కక ముందే
పిడికిలి బిగించి గుండెను రగిలించి
చీడ పురగుల పీడ చీడలు చీల్చ
యువశక్తి నరాలు తీగలు చేసి
ఉరి వేయదా పేట్రేగుతున్న
విషనాగు విషజ్వాలలను.

6 కామెంట్‌లు:

  1. భరతమాతా మీకు ప్రణామములమ్మా...జైహింద్!

    రిప్లయితొలగించండి
  2. అయినా మేరా "భారత్ మహాన్ " అంటాను .ఎవరికైనా అభ్యంతరమా ? -:)

    రిప్లయితొలగించండి
  3. పల్లెల జీవనంలో స్వచ్చత ఎక్కడ?
    నగర జీవనంలో జీవితమెక్కడ? ..true

    రిప్లయితొలగించండి
  4. Good one. My top post and a couple of links mentioned within there, all 3 kavitalu share a lot of synergy with this your work. As well as my 4th పల్లె పగలబడి నవ్వింది "http://maruvam.blogspot.com/2009/06/blog-post_13.html" Yet and above and beyond there is a hope "we shall overcome.."

    Saare Jahan Se Achchha
    - Muhammad Iqbal

    Better than the entire world, is our Hindustan,
    We are its nightingales, and it (is) our garden abode

    If we are in an alien place, the heart remains in the homeland,
    Know us to be only there where our heart is.

    .

    .

    రిప్లయితొలగించండి
  5. @padma4245 ,srujana, మురళి ధన్యవాదాలు

    @చిన్ని.. మిమ్మల్ని అడ్డుకొనేదెవరండీ :)


    @ఉష, Whenever time permits, I'll read them. promise.

    Where the mind is lead forward by the ever widening thought and action, where the mind fills with heaven of freedom..Where the inner soul digs to the depth of the truth.. .we are proud and we belongs to that.

    రిప్లయితొలగించండి

Comment Form