18, ఆగస్టు 2009, మంగళవారం

వ్రాయనా నేనొక తెలుగు పాటా... మీరు పాడువారా?

బ్లాగుల్లో గుణింత కవిత ఆద్యురాలు పద్మార్పిత గారిచ్చిన థాట్ తో..


చ్చిన చెలి ఓర చూపుల
నా కనుల ప్రేమ కావ్యం రచించలే
నిత్యము నీ నామ జప తపమున
నీ పరువపు వయసు నా దాయలే..నా హృదయం నీ దాయలే |నచ్చిన|

నులక మంచం మావిటాల నెచ్చెలి
నూర్పుల సొమ్మసిల్లి పోయెలే
నృపాల గీతం పాడెలే -2
నెలరాజు సిగ్గు పడి
నేల చూపులు చూసెలే
నైషధ కావ్యము రచించెలే -2 | నచ్చిన |

నొకపరి గడుసరి గలగలల మధువని
నోటిమాట లాపి నధరామృతము నందించెలే
నౌరాయన రాతిరిని మురిపించెలే, నిశిరాత్రి
నందన వనము పూయించెలే ! |నచ్చిన|

28 వ్యాఖ్యలు:

 1. నేను పాడువాడిని కాదు కానీ, మీ పాట బాగుందండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బ్లాగుల్లో గుణింత కవిత ఆద్యురాలు పద్మార్పిత గారిచ్చిన థాట్ తో..

  emi thought ichharo artam kaledu.
  bagundi mi paata.
  naku kua oka idea vachindi kakpothe nenu epudu kavithalu,paatalu rayaledu.
  kani try chesta.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మురళి గారికి గానము చేయుట రాక పోవుటయా? ఎంత మాట?

  స్వప్న గారూ, ఏమి ఆలోచన? మాకు చెప్పకూడదా?

  భరద్వాజ్, అంతకంటేనా? I am flattered.Let's post it in sainyam.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నే పాడతా!! ఛీఛీ వద్దులే!! మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం నాకిష్టంలేదు.:):)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. okay cool ... but am I allowed to make a few changes to the song to suit the tune?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. భాస్కర్, ఏం పరవాలేదు, బాత్రూమ్ లో పాడుకోవటానికి సరిపోతుందేమో చూడు.

  భవానీ గారు, ధన్యవాదాలు

  భరద్వాజ్, It's all yours.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Cool, I already have tune ready right now .. lemme see how it fits. My only problem is that I only have female singers to help me out right now .. os the perspective should change a little. Lemme try it out first.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మీరు చక్కగా అప్పటికప్పుడు ఎలా అల్లగలరో?....గ్రేట్!...

  ప్రత్యుత్తరంతొలగించు
 9. స్వప్న గారూ..
  >>emi thought ichharo artam kaledu.
  ఇక్కడ నాకు గుణింతము మొదటి అక్షరంతో వ్రాయాలని ఆలోచన రావడానికి మూలకారణం.


  I guess, better with an example. See this link

  http://padma4245.blogspot.com/2009/07/blog-post_06.html

  ప్రత్యుత్తరంతొలగించు
 10. చిన్ని గారూ..అదేమి ప్రశ్న అండీ..
  >>మీరు చక్కగా అప్పటికప్పుడు ఎలా అల్లగలరో

  మిషన్ ఉంటే ఎంతసేపండీ.. ;) కొంచెం కుళ్ళు జోకులావుంది కదా? అసలు రహస్యమండీ.. రోజూ ఆఫీస్ కు వెళ్ళాలంటే గంటన్నర ప్రయాణం.. గోళ్ళు గిల్లుకావలని పించని రోజు , ఏదో ఇలా కలా పోసన ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. మిమ్మల్ని మెచ్చుకుంటుంటే ఇలా తిడతారా ...హు . .ఓహో....మీ ప్రయాణం లో కనబడే సీతకోకచిలుకలిదా ఆ గొప్పదనం ....ఇప్పటివరకు మీదనుకున్నాను :):)...కానివ్వండీ ఎలా రాసిన మేం చదువుతాం .-:)

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @చిన్ని, అసలు రహస్యం కనిపెట్టేసారు.

  నేస్తం, పాట నచ్చి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.

  Bharadwaj, eagerly waiting for the tune.:)

  ప్రత్యుత్తరంతొలగించు
 13. మక్కువమీర ఈ కవిత చదివి
  మాటరాని మాదిరయిపోయి
  మిక్కిలి సంతోషముతో
  మీకొక వ్యాఖ్యవ్రాయుదునని తలంచి
  ముందుగా వచ్చినయెడల
  మూడు ముక్కలైనా వ్రాసేదాననని
  మృధుభాషణము చేసెడిదాననని
  మెత్తగా నాల్గు తగిలించేదాననుకున్నాను.
  మేరుపర్వతం మీ బ్లాగుయని
  మైమరచి నర్తించు కవితలే ఆదిదంపతులని
  మోదమున నడయాడు మేమే ప్రమధగణాలని
  మౌనం విడిచి మనసారా
  మంచిమాట వినిపించను వచ్చితి, మిత్రమా!
  ... సర్వం భా.రా.రె నమః ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 14. అయ్యో మొన్నటినుంచి మౌనవ్రతంలో వున్నారా? కవితలతో పొట్ట వుబ్బినట్టుందేమో చూసుకున్నారా... on lighter vein .:-)

  తూచ్..తూచ్.. గుణింతాలు లేవోచ్..మేము ట్యూన్ కి అణుగుణంగా పాటను మార్చుకున్నామండి.

  ఇంక అంతా భరద్వాజ్ ( మలక్పేట్ రౌడి ) మహిమ ..గుణింతాన్ని గోదాట్లో కలిపేసాను మమ కార మరువమా !

  సర్వం భారారే నమః, ఈ మంత్రమేదో క్రొత్తగా వుందే.. సుస్వర మరువం నమః.

  మాకు పాడటానికి S.P.B లు లేకపోవటంతో, అబ్బాయి గానం కాస్తా పూర్తిగా అమ్మాయి గీతికయింది :(

  తుదకు ఇలా మిగులుతుందేమో..

  నీ చిలిపి ఓర చూపులె
  నా కనుల ప్రేమ కావ్యం రచించలే
  నిత్యము నీ నామ జపమె
  నా మదిన విరహ గీతికయ్యెలే -- నా హృదయం నీదాయలే |చిలిపి|

  మూలనున్న మల్లె చెండు
  కన్ను గీటి పిలిచెలే
  సుగంధ తాపం ఫూసెలే

  నులక మంచం సందెకాడ
  వయసు హోరులొ సొమ్మసిల్లి
  నృపాల గీతం పాడెలే |చిలిపి|

  నెలరాజు సిగ్గుతోన
  నేల చూపులు చూసెలే
  నైషధ కావ్యం రచించెలే

  ఒకపరి గడుసరి మన్మధ తాపసి
  తీయని ముద్దుల ముంచెలే
  తనువును తీగెల తీర్చెలే
  ఔరాయన రాతిరిని మురిపించెలే,నిశిరాత్రి
  నందన వనము పూయించెలే |చిలిపి|

  రాతిరంతా నిదురలేనీ దీపమొలక
  విరహ బాధ తాళలేక తొలగి పోయెలే
  వింత చూపు విసిరెలే ! |చిలిపి|

  ప్రత్యుత్తరంతొలగించు
 15. oh wow మీ భాషాపటిమ అమోఘమండి. పోతే మొదటి పేరా రెండవ వ్యాక్యానికి బదులిది - "మీకు సమయమాసన్నమైనదన్న మాట" ఇకపోతే నా పని అవసరం లేకుండానే ఎవరిదో identity బయట పెట్టారు కనుక వారే చూసుకుంటారు. jokes apart, both deserve an applause and definitely suits to a classic movie రాఘవేంద్ర రావు గారు వెంకటేష్తో ఏమన్నా కళాఖండం తీస్తున్నారేమో గేయరచయితగా recommend చేయమని భారవివి అడగండి. హ హ హ్హా

  ప్రత్యుత్తరంతొలగించు
 16. ఉష గారూ, నాకు భాషా పటిమా? అలా కాదు కానీ ఇంకోమాట చెప్పండి.
  >>పోతే మొదటి పేరా రెండవ వ్యాక్యానికి బదులిది - "మీకు సమయమాసన్నమైనదన్న మాట"
  ఇది అర్థం కాలేదండీ.

  మీరు పాడతారా? మరి మాకు ఇప్పటిదాకా వినిపించలేదేమి?భారవి గారికి ఇప్పుడే మా సెగెట్రి ఫోన్ చేస్తే కనీసం ఘోష్ట్ గా కూడా ఖాళీేదటండీ. మీరేమైనా రెకమండ్ చేయకూడదూ :)

  ప్రత్యుత్తరంతొలగించు
 17. It's a joke sir. Since you said "కవితలతో పొట్ట వుబ్బినట్టుందేమో చూసుకున్నారా... " I kind of threatened you ;) " భా.రా.రె, నీకు మూడింది" అన్న రీతిలో. ఇకపోతే మీరెవరో రౌడీ గారి ఆనవాళ్ళు బయటపెట్టారు కనుక వారే నాక్కావాల్సిన పని చేసిపెడతారని అన్నాన్ననమాట. చాలా నాయనా. ఒక వ్యాఖ్యకి 2 సమాధానాలు. హు.. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 18. హ హా హ్హ.. చూశారా మీచేత ఎలా చెప్పించానో :)

  ప్రత్యుత్తరంతొలగించు
 19. ఇంత మంది పాడాక ఇంక నా పాట ఎవరు వింటారు!!! అందుకే ఎంజాయ్ చేసేస్తా!!!:):)

  ప్రత్యుత్తరంతొలగించు
 20. @పద్మార్పిత, మీరు పాడాలేగానీ, మేము వినటానికి సిద్ధం :)

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form