9, సెప్టెంబర్ 2009, బుధవారం

చెలియా వినవా మది లోని మౌనగీతాన్ని?


నీలాల గగనాన వ్రేలాడే వెండి మబ్బుల్లారా
నిశిరాత్రి సమయాన తళతళలాడే తారల్లారా

చెప్పరే నాచెలి చిరునామా
విప్పరే నా మది మనసారా |నీలాల|

మౌనముద్ర వలపుల్లో మొలకెత్తిన ప్రేమలో
విరిసిన మనసు మురిసింది ఎందుకో
కనుపాప కబురులు దోచింది ఎందుకో |నీలాల|

చెలియా వినవా మది లోని మౌనగీతాన్నీ ....

కాలేక, కనరాక కనిపించి కలవరించి
కానున్న, రానున్న రమ్యాతి సమరంలో
లాలించి అలరించి, అందించి చుంబించి
పాలించి ప్రేమించి, ప్రేమంత రంగరించి
కీర్తించి క్రీడించి,కష్టాల కామించి
శాంతించి స్తుతించి, సరళంగ అలంకరించి
భరించి భావించి, భ్రమించి విభ్రమించి |నీలాల|

తొలిప్రేమ చెలివాకిట సుమమల్లే విరిసింది
తొలిప్రొద్దు పొడుపుల్లో మనసంత మురిసింది. |చెలియా|

నీలాల గగనాన వ్రేలాడే వెండి మబ్బుల్లారా
నిశిరాత్రి సమయాన తళతళలాడే తారల్లారా

చెప్పరే నాచెలి చిరునామా
విప్పరే నా మది మనసారా

11 వ్యాఖ్యలు:

 1. నెలరేడు దాగేను నింగి రంగులలోన
  సూరీడు రగిలేను కనరాక నీజాడ
  పవనాలు సోలేను పలుతావులెదికాక

  ఏదిక్కులని విదకనేదూరాలు నేకొలవ ?
  చెప్పరే ఎవరైన చెలి జాడ ఇపుడైన

  బరువు పెరిగిన కనులు చీకట్లు దించేను
  కన్నీట కరిగాశ చెక్కిళ్ళ కారేను..

  చెప్పరే ఎవరైన చెలి జాడ ఇపుడైన..
  పాడరే ఈగోడు తనచెవిన ఎవరైన..

  భారారె గారు .. చాలా బాగుంది..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీ చెలియ జాడకై వెతికి వేసారిన
  ఎవరైనా మీ చెలియ జాడ తెలిపిన
  తప్పక వినిపించెద మీ గోడు తన చెవిన:):)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అందమైన పాట ....మరింత అందమైన చిత్రం !

  ప్రత్యుత్తరంతొలగించు
 4. తారలన్ని దిక్కులు దాటి కానరాని జాడల్లో
  అలసిసొలసి నిద్రలోకి జారుకున్నాయేమో ...
  వెండి మబ్బులు సిగ్గుపడుతున్నయేమో రాయబారం నెరపలేక ......
  నెలరాజు నెయ్యము తో సాధించగలాడేమోకూసంత కబురంపరాద .!.....

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @ మురళి, సుజాత, పరిమళం ధన్యవాదాలు

  ఆత్రేయ గారూ, సూరీడిచేత, మలయ మారుతాల చేత కూడా వెతికించారే.. బాబ్బాబు మీకేమన్నా నా చెలి జాడ తెలిస్తే చెబుదురూ..ఏదో ఒక కవితను దక్షిణగా సమర్పించు కుంటాను.

  పద్మార్పితా , ఇది అన్యాయమండీ, మీరు వెతకకుండా వేరే ఎవరో వెతికితే వాళ్ళకు నాగోడు చెబుతారా?

  చిన్ని, నిజమేనండి, ఇక నాకు ఆ నెలరాజే దిక్కు..పౌర్ణమి రోజున అడిగి చూస్తాను :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఎలాగోలా ఏడేడు సంద్రాలు దాటేసి మీ చెలి చెంతకి చేరి మీ ప్రేమసందేశం అందిస్తాను కానీ నా చెలికాడికి పాఠాలు చెప్తారా మరి... give and get :) nice one. I read it exactly 6 times to get the wording memorized.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. వెళ్ళి చెప్పి వచ్చారా? ఏమంది ఇంతకు?
  మీ చెలికానికి నేను చెప్పటమేమిటండి, ప్రేమకావ్యాన్నే తనకోసం మీరు రంగు రంగుల ఇంద్రచాపంగా తీర్చి దిద్దుతుంటేనూ :)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. beautiful song. but one thing I don't understand. parimalam said it's nice song and nice pic. but you your cheli are in pic.అంటే పిక్ పాటకి సరిపోలేదే అని పిస్తుంది. It doesn't mean to hurt u. Really the song is superb.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. శ్రీనిక గారు, పాట నచ్చినందుకు ధన్యవాదాలు. ఇక బొమ్మ అంటారా...? ఇదిగో పాటంతా పాడుకున్నాక మీలాంటి వారు వెతికి పెడితే చివరికి ఎలాగో కలిసారు :)

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form