21, సెప్టెంబర్ 2009, సోమవారం

సతీ సత్య భామచిక్కని పాలును, చక్కెర,
మక్కువ మీరగ, కలిపిన మాపాపా, పా
లెక్కువ యని ,ఆ కుర్చీ
నెక్కి, గబగబ దొరలించె నేర్పుగ "సింకు"న్
అయ్యది గన్న సతీమణి
చెయ్యిన దాల్చెను గరిటెను, చేసెద నీకున్
వియ్యము, నేడెంతైనన్,
కయ్యము నైనను, ఇకనిది కష్టము నాకున్మీ యయ్యను జూడన్, నీ
కెయ్యడల మదిన కలుగు ఎకిలి చేష్టలు ,నీ
సొయ్యము నణచెద, నిక్కము
కయ్యము నైనను, వెరవను కాచుకొ పిల్లా


పాప స్వగతం...

నేచేసిన పాపము ఏ
మీ? చేత గరిట ఎలాగు? మెల్లగ ఎటులన్
నే ఛేదింతు? అపాయము
గాచేవారెవ్వరీ అకాల సమయమున్అప్పుడు నా బంగారు కొండ మదిలోన మెరుపుతీగ మెరిసింది ఆపద్బాంధవుడు నాన్న గుర్తుకు వచ్చారు.నాన్నా యన్న పిలుపు గని
చిన్నా ఏమిటని అదురు చిత్తము తోడన్
మన్నన జేయ జనె, రా
నున్న ట్టాపద తెలియక నొడుపుగ బోతిన్ఎదురాయె సతి గరిటతో
న, తనకు నిపుడేది దిక్కు? నా పరు వేలా
గు తనయ ముందని? సతితో
న తగవు లాడగ, సతిమారె నయొ భామగతిన్

12 వ్యాఖ్యలు:

 1. అమ్మో అమ్మో గ్లాసుడు పాలకి ఇంత ఛందోబద్ద శిక్షణే? భామాకలాపాలు, భర్తగారి పద్యాలు - కందమా, సీసమా, తేటగీతా, మత్తేభమా, ఆటవెలది, ఉత్పలమాల, చంపకమాల.... ఏమో ఏమగునో కానీ ఈ అలంకారాల కారాల గారాల కాపురం! ;) హతవిధీ, ఆ పాపను, పాప వాళ్ళ నాన్నను, భామగారిని కాపాడి రక్షించు తెలుగు పద్యమా! Good work bhaa.raa.re. gaaru. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. హ ...హ్హ ...సత్యభామగారు శాంతించార? .....ఎక్ష్ల్ లెంట్ ....బా ..రా ..రే గారు .-:)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చాలా బాగా రాసారు!! వచనం కన్నా పద్యాలు ఎక్కువ ఇష్టంగా రాస్తున్నట్లనిపిస్తుంది. ఇంతకీ శ్రీమతిగారు శాంతించారా??

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఉష గారండి, ఏంచేస్తాం ఆ గ్లాసు పాలే మా పాలిట భామాకలాపం అప్పుడప్పుడు. "కంది"రీగలు, "సీసపు" గోళీలూ, "తాటకి" గీతాలూ, "మత్తేభ" నాట్యాలూ, "జంప"క మాలాలూ అన్నీ కనిపిస్తాయారోజు :) ప్చ్, "సత్య" గా మారిన రోజు మమ్మల్ని మేమే రక్షించుకోవాలి.  చిన్నీ, ధన్యవాదాలు. సత్యభామ శాంతించడం ఎంతసేపండీ, ఆరోజు "పులిహోర" కలిపితే చాలు :)  సునీత గారూ, ధన్యవాదాలు. ఈ పద్యాలు ఏదో ఇంటర్మీడియెట్ దాకా చదివిన విద్యను మర్చిపోకుండానే నండి. వ్యావహారిక భాష తప్పించి గ్రాంధిక భాష శూన్యం.కాబట్టి అంతకంటే ఏదో సాధించాలని ఉత్సాహములేదు. ఉన్నా ఉద్యోగ పరిమితుల దృష్ట్యా రెండో రోజుకే ఆవిరై పోతుంది.
  వచనము వ్రాయకూడదనేమీ లేదండీ. వచనమంటే పేజీలు పేజీలు టైపు చేయాలగదా? అది తప్పించుకోడానికి ఈ కవితలూ, పద్యాలూ. మా భామ కోపమంతా పట్టుమని ఒకరోజు కూడా వుండదు ( ఎక్కువే సుమా :))

  ప్రత్యుత్తరంతొలగించు
 5. హ హ హ బాగుందండి భామా కలాపం పాపా విలాపం.. ముందు అసలు మిమ్ములను ఆ అని కన్నెర్ర చేస్తే ఆగేలా కంట్రోల్ పెట్టాలి పిల్లలు దెబ్బకు మాట వింటారు.. ప్రతి దానికి నాన్న సపోర్ట్.... హన్నా.... (మనలో మన మాట కాదు కాదు శ్రీమతి గారితో మాట పద్యం మాత్రం బాగా రాసేరండోయ్) :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. భావనగారూ, భామా కలాపం, పాపా విలాపం టైటిల్ బాగుంది. ఇద్దరి నడుమ నేనొక్కసారి విలాసంగా ( విలాపం కాని రోజు) నవ్వు కుంటాను.
  అమ్మో కన్నెఱ్ఱ చేసి కంట్రోల్ లో వుంచుదామనే, ఇది మరీ అత్యాశ అండీ :) సేమ్ కంప్లైంట్ మా ఇంటిలో కూడా , నా ఆపు చూసుకుని పిల్లలు చెడిపోతున్నారంట. అప్పటికి నేనేదో సింక్ లో పాలు పారబోయమన్నట్టు. ఏం చేద్దాం :) శ్రీమతికి మీ మాట చెవిలో వేసానండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. రక్షణార్థం తమరు వారమున ఎన్ని పర్యాయములు పులిహోర కలిపెదరో సెలవిండు:):)Excellent!!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మురళి నచ్చినందుకు ధన్యవాదాలు

  పద్మార్పితా, మీరిలాంటి ప్రశ్నలేస్తే ఎలాగండీ :-) అవి దేవ రహస్యాలు. నచ్చినందుకు ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 9. me bhamakalapam chalabagundi.
  meru chinniki pampe comments na mailki vasthunnayi...adela?

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form