26, అక్టోబర్ 2009, సోమవారం

రంగులు మారే లోకంరా ఇది!

ఉషగారి "గారడీ" కవిత స్ఫూర్తితో ...రంగులు మారే లోకంరా ఇది

రంగులు మారే లోకంరా ఇది
ఋతువులు మారే జన్మమురా ఇది
ఉరుకుల పరుగుల లోకంరా ఇది
పడి లేచే జన్మమురా ఇది.

ఒకపరి ఋతుగమనంలో వెచ్చని వెన్నెలనురా
మరొకపరి జీవనగమనంలో ఎర్రని ఎండను రా!

కొడిగట్టే దీపమునేనే వెలిగే దివ్వెను నేనేరా
రంగులు మార్చే లోకంలో రంగవల్లిని నేనేరా!

నలుపైనా తెలుపైనా
వెలుగైనా చీకటైనా
జీవన వాహినిని నేనేరా!

వెన్నెలనైనా ఎర్రని ఎండను ఐనా
ఉషోదయ కిరణాన్నైనా
జగతికి జాగృతి నేనేరా!

మధ్యాహ్న ప్రచండాన్ని
సంధ్యా సమయ సమీరాన్ని
మనిషికి విజయగీతికను!

ప్రేమ వర్షాన్ని నేనే
ద్వేష దావాగ్నిని నేనే
విధ్వంస కారకినీ నేనే
సృష్టికి మూలమూ నేనే !

జీవన ఆనందినిని , చరిత్ర సృష్టికర్తను
వర్తమాన రచయిత్రిని, మానవ రూపకర్తను.

నలుపును నేనే తెలుపును నేనే
వెలుగును నేనే చీకటిని నేనే
మానవ చరిత్రకు మజిలీని నేనే.

ఇంటిని నడిపే సంపెంగను రా
పుడమిని పాలించు ఋతుమతినిరా!

14 కామెంట్‌లు:

  1. భా.రా.రె. తత్వం చదువుతున్నట్లుగా వుంది. చక్కగా వ్రాసారు. నిజానికి నా కవిత దీనికి స్ఫూర్తా అనిపిస్తుంది. ఇక్కడే ఆవిష్కరణ సంపూర్ణంగా తోస్తుంది.

    రిప్లయితొలగించండి
  2. అటు నేనే
    ఇటు నేనే
    ఎటైనా నేనే
    అని ఎంతబాగా చెప్పారండి!

    రిప్లయితొలగించండి
  3. 'అందుకే
    పారదర్శినిని తొసేసి
    నీ లొపల చూడవొయీ నేస్తమా-
    నెనున్నానక్కడ 'మారనీ రంగులలో!'

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  4. 'ప్రేమ వర్షాన్ని నేనే
    ద్వేష దావాగ్నిని నేనే
    విధ్వంస కారకినీ నేనే
    సృష్టికి మూలమూ నేనే !'
    ప్రతీ పదంలో ఎంత భావమో!. చాలా బాగుందండీ.



    కానీ... నా పేరు రా(లే)కుండా మీ ఏ కవితా పూర్తి కాదనుకుంటా....!?

    రిప్లయితొలగించండి
  5. చిన్నీ గారూ, నేను చెప్పింది నాకే అప్పచెబుతున్నారా?

    ఊష గారూ, మీకు నమ్మశక్యం కాకున్నా నిజమదే ! Feel better

    పద్మార్పిత, అవునండీ మరీ జగమంతా మీరే !

    సునీత గారూ ధన్యవాదాలు.

    జిలేబీ, బాగా చెప్పారు, రంగులు మారే లోకంలో మారనిదొకటే రంగు.

    తృష్ణ గారూ, ధన్యవాదాలు.

    వెన్నెల ఇది మరీ బాగుందండీ, ముందొచ్చిన చెవలకంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని, నాకవితలు చూసి మీరే ఆ కలం పేరు పెట్టుకొని :)
    మీ పేరులేకుండా నాకు కవితలు రావండీ :). కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. జగాలనేలే జగజ్జనని రూపాన్ని, లీలా విలాసాన్ని బాగా చెప్పేరు...
    ఇంటి నేలే సంపెంగని,
    ధరణి నేలే త్రిపురాంబిక ను
    ప్రేమించే స్వాధినపతిక ను
    ఆగ్రహించే కలహ కంఠితను...
    నేనే నీ కాధారం
    నీ వునికే నా లీలా వినోదం..

    రిప్లయితొలగించండి
  7. అబ్బా! చ్చా! నిజమా
    వెనకటికి మీలాంటి ఆయనే గిల్లి జోలపాడాడంట

    రిప్లయితొలగించండి
  8. భావన గారూ,
    ఇంటి నేలే సంపెంగని,
    ధరణి నేలే త్రిపురాంబిక ను
    ప్రేమించే స్వాధినపతిక ను
    ఆగ్రహించే కలహ కంఠితను...
    నేనే నీ కాధారం
    నీ వునికే నా లీలా వినోదం..

    కాదా మరి? సమస్త లోకాలూ మీ వెంటే కదా :)

    రిప్లయితొలగించండి
  9. @వెన్నెల: నన్నే వెక్కిరిస్తావా సౌందర్యా :-) ఎక్కడో గిల్లానంటున్నారుకదా, అందుకే నా రాబోయే టపా వెన్నెల జోలపాట.. watch out this weekend.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. మీరు మహా కుళ్ళుమోతులండీ...
    సరే అలగేకానియ్యండీ
    ఇంతకీ మీరు నాకు జోల పాడుతారా లేక నేనే ?.?.?. నాకసలే జోల

    పాటలకి నిద్ర తొందరగా వస్తుంది (అప్పుడు నా సౌందర్యమూ పెరుగుతుంది అనుకోండీ )

    ఆ... ఎమో లేండి తినబోతు రుచడగడం దేనికీ ?

    రిప్లయితొలగించండి

Comment Form