7, నవంబర్ 2009, శనివారం

a2z వారి నుంచి హారం వారికి విజ్ఞప్తి - హారం వారి సమాధానం

ముందుగా a2z వారి టపా


"తెలుగు బ్లాగులు వృద్ధి కోసం మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. నేను రిక్వెష్ట్ చేయకుండానే నా బ్లాగును మీ సైట్ ద్వారా ప్రచారం ఇస్తున్నందుకు మై హర్టఫుల్ థాంక్స్. కూడలి నుంచి తప్పుకోవడం వలన, మీ నుంచే ఎక్కువ హిట్స్ రావడం నేను గమనించాను. ఫ్యూచర్ లో మీకు నాకు మధ్య విభేదాలు రాకుండా వుండటానికే ఈ టపా.

నా బ్లాగులో నా వ్యక్తిగత అభిప్రాయాలతో పాటు, వేరే వాళ్ళ అభిప్రాయాలు, నాకిష్టమైన న్యూస్ లతో పాటు ఫోటోస్ కూడా వుంటాయి. నా టార్గెట్ రోజుకు మినిమం 15 పోస్ట్లు. అది రీచ్ అయిన రోజు మీ హోంపేజి మొత్తం నా పోస్ట్ల లింకులతో నిండి పొతే చాలా అసహ్యంగా వుంటుంది. అలా అని నా ఒక్కడికే స్పెషల్ restriction పెడితే నా ego దెబ్బతింటుంది. Rule should be Rule for all. So ఎవరైనా, ఏ బ్లాగు అయినా(not just me) , 1 or 2 or 3 or 4 లేటెస్ట్ పోస్ట్స్ మాత్రామే మెయిన్ పేజిలో కనిపించేటట్లు వుంటే బాగుంటుందని నా అభిప్రాయం.

నా ఒక్కడికే స్పెషల్ restriction పెట్టాలని ఆలోచన వస్తే దయచేసి నా బ్లాగుకు మీ సైటు నుంచి లింక్స్ పూర్తిగా తొలిగించండి."


సమాధానం

ముందుగా హారం మీద మీకున్న అభిప్రాయానికి ఇంచుక ఆశ్చర్యం వేసింది. మీరు ఏవిధమైన ఆధారలతో అభాండాలు వేస్తున్నారో తెలియచేయకోరుతాను.బహుశా రోజుకు 15 టపాలు వ్రాసేవారు మీరే అయివుండి మీ బ్లాగు మాత్రమే అలా అయివుండవచ్చు.ఇంతకంటే హారంలో వ్యక్తిగత కక్ష లేదా ఆపేక్ష వుండవు.

హారం ఏవిధమైన రూల్స్ ను పాటిస్తుందో బహిరంగ పరచకపోవడం లోపమే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని వివరాలు ఇక్కడ

1) హారం మొదటి పేజీలో రెండు రోజుల వ్యాఖ్యలను చూపించడం జరుగుతుంది.ఇవి 1౦౦ కావచ్చు 1౦౦౦ కావచ్చు ఏవిధమైన ఆంక్షలు లేవు

2) మొదటి పేజీని సాధ్యమైనంత సుభ్రంగా వుంచడానికి ప్రయత్నిస్తున్నాము. కాబట్టి బ్లాగర్లు తమ తమ అభిప్రాయాలను రెండు మూడు పంక్తులు ఒకటిగా కాకుండా క్రోడీకరించి వ్రాయమని మనవి

3) మా బ్లాగు మా ఇష్టం అనుకొనేవాళ్ళూ వుంటారు కనుక, మిగిలిన పాఠకుల సౌకర్యాన్ని దృష్టిలో వుంచుకొని కొన్ని నిబంధనలు పాటిస్తుంది

అవి
a) పేరులేని టపాలకు హారం ఒక పేరు పెడుతుంది. దానిపేరు అనామిక (హారం)
b) సాధ్యమైనంత వరకు మీ టపా శీర్షికలలో అసభ్య పదాలను లేకుండా చూసుకోండి. హారం కొన్ని కీలక పదాలను గుర్తిస్తుంది. ఈ పట్టిక బహిర్గతము చేయలేము.
c) రోజుకు ఒక టపా వ్రాయడమే కష్టమైన దినచర్యల్లో రోజుకు ఆరు, ఏడు వ్రాస్తున్నామంటే అందులో ఎంత పస వుంటుందో గుర్తించి చెప్పడం మా ఉద్దేశ్యం కాదు కానీ, మిగిలిన వారి టపాలు అందులో కొట్టుకొని పోకుండా ఈ క్రింది పద్ధతి అవలంబిస్తుంది.

" రెండు రోజులలో మీరు వ్రాసిన టపాల సంఖ్య 1౦ దాటినట్లైతే మీ తరువాత టపా మళ్ళీ హారంలో కనిపించడానికి 48 గంటలు ఆగాలన్న మాట". ఈరోజు దాకా ఈ సంఖ్య 15 గా వుండేది. 15 దాటితే వారి టపాలేవీ( పాత టపాలతో సహా ) హారంలో కనిపించేవి కావు. ఈ నిబంధన ను కొంచెం సడలించి పైవిధంగా మార్చడమైనది.

ఇక మిగిలిన సదుపాయాలు

4) ఈనాటి హారంలో ఈ రోజు టపాలను మాత్రమే చూపిస్తుంది
5) ఖజానా లో మీఅన్ని టపాలతో పాటి మీ టపాలలో చిత్రాలు వున్నట్ట్టయితే అందులోనుంచి ఒక చిత్రాన్ని కూడా చూపిస్తుంది.
6) వ్యాఖ్యల పేజీ లో వ్యాఖ్యలతో పాటి రచయిత చేసిన అన్నివ్యాఖ్యలను పొందుపరచడమైనది.
7) గ్రాఫు పేజీ లో ఈ వారం టపాల వ్యాఖ్యల అనాలసిస్ చూడవచ్చు.

8) పుస్తకహారం లో అరుదైన పుస్తకాలను పొందుపరచాలని కోరిక

9) హారంలో సభ్యులవ్వాలంటే ఈ లింకు ను క్లిక్ చేయండి

10) మీకు హారం నచ్చినట్టయితే హారం లోగోను ప్రచారం పేజీ నుంచి మీ బ్లాగులో కలపండి
11) మాగురించి ఈ సోది . ఇందులో ప్రస్తుతానికి అన్నీ హారం వారే :)

12) సభ్యులకు ప్రతినెల మొదటి ఆదివారం పోయిన నెల టపాల పి.డి.యఫ్ అందించడం జరుగుతుంది. ఈ నెల పి.డి.యఫ్ పోయిన వారమే రావాల్సింది. కానీ ఇంతకు ముందు వచ్చిన పి.డి.యఫ్ లను చూసి సభ్యులు సలహా ఇవ్వడంతో ప్రోగ్రామ్లో కొన్ని చేర్పులు మార్పులు చేస్తున్నాను. అన్నీ అనుకూలిస్తే ఈ ఆదివారానికి మీ పి.డి.యఫ్ లు రెడీ.

ఇవి స్థూలంగా హారంలో అందరికీ కనిపించే సదుపాయాలు. ఇక హారంలో వుండడం లేకపోవడం పూర్తిగా వ్యక్తిగతం కావున చర్చలకు ఆస్కారం లేదు. వైతొలగ తలచినవారి దయచేసి admin@haaram.com కు మైల్ పంపండి.

మీ సలహాలకై వేచి చూస్తూ మీ హారం

21 వ్యాఖ్యలు:

 1. :) బహు బాగు.

  హారం, మణిహారం
  మా హారం, అందెల రవం
  మన హారం, సుమ హారం
  అందరి హారం, అహో సుమధురం
  భా.రా.రె. నీదు ప్రయత్నం మాకు ముదావహం!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీ సాంకేతిక వివరాలు చాలా చక్కగా వున్నాయి. మీ నియమాలు, పద్ధతులూ బావున్నాయి. అదే పనిగా టపాలు రాసే వారు సొంత సైట్ వంటివి ఆలోచించాలేమోనండీ.
  నా స్వంత ఆలోచన మాత్రమే.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఉష గారు, అవునండీ అది మన హారమే :)
  మీ కవిత హారానికి మరో మణిహారం. చాలా బాగుంది. టిసుకెళ్ళి హారంలో ముత్యంగా త్వరలో పొదుగుతాను.

  హారాన రాబోతున్నాయ్ మరిన్ని సొబగైన మేలిముత్యాలు. వేచి వుండండి.

  చిరుకవిత కు మరో సారి ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఆహా మారురూపున మా పాత మిత్రుడు. చూసి ఎంత ఆనందం వేసింది నాలో నేను గారూ.. మీరు మీరే :)

  హారం పద్ధతులు నచ్చినందుకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. బాగున్నాయండి హరాల గల గలలు. మీ హారాన మేలిమి ముత్యాలంటి సంపాదకులంతా , పచ్చలంటి పాటలను తెచ్చి, కెంపులంటి కధలను కలిపి , పుష్య రాగ మంత విలువైన పద్య వివరణ చేస్తూ, గోమేధికమంత ఖజానా పెట్టి ,నీలాలంటి గ్రాఫులను , వైఢూర్యాలంటి వ్యాఖ్య లను దానిలో దాస్తే.... మేలిమి రత్నాలంటి రచయలంత మిమ్ములను భేష్ భేష్ అని, పగడాలంటి పలుకులను బహుమతి గా ఇవ్వాలని కవితా వజ్రమంటి ఉషా, కృష్ణ నీలమంటి భావన, వైఢూర్యపు తునకంటి జ్యోతి (అమ్మాయి లు ఇంకా మీ అందరు కూడా ఒక సంతకమేస్తే, మీ పేర్లు కూడా కలపొచ్చు శుభాకాంక్షలలో వచ్చి ఈ పోస్ట్ లో ఒక సంతకమెయ్యండి) మీకు శుభాశిస్సులు అందిస్తున్నారహోచ్... ఢంటక ఢంటక ఢంటక ఢన్.. (అంటే బాజా కొట్టి చెప్పేమన్న మాట)
  చిన్నప్పుడు చదువుకున్న పొట్లకాయంత పోలీసు దొండకాయంత దొంగ కోసం అని చదివిన కధ గుర్తొచ్చిందా నేను మొన్నీ మధ్యే అమ్మ ఒడి బ్లాగ్ లో చదివా.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. 'బాజా' కొట్టరేమో కదు సారీ తప్పు చెప్పేను పైన దానిలో, 'ఢంకా బజాయించి' అని వేసుకోండి, అక్కడక్కడ పూల దండ, బొకే, శుభాకాంక్షల శ్రీ గంధాలు వేసుకోండి.. ఏం..

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఉష గారు, భావనగారూ అంతా మీరే చెప్పేసారు ఇంక చెప్పడానికి ఏముంది అందుకే
  మీతో పాటే నేనూ.....
  "నవరసాల సారం
  మన హారం"
  అంటూ ఢంకా మోగిసున్నా

  ప్రత్యుత్తరంతొలగించు
 8. రోజుకు పదిహైను టపాలా? మీరు రాయగలరు. పాఠకులు చదవలేరు. పారిపోగలరు. పాఠకుడి ఆసక్తి నిలబెట్టినప్పుడే రచయిత విజేత కాగలడు. పాఠకుల సౌలభ్యం కోసం హారం వారు ఏర్పర్చిన నిబంధనలు బాగున్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. భాస్కర రామి రెడ్డి,
  1) నేను ఎటువంటి అభాండాలు వేయలేదు సార్. మీ రూల్స్ ఏమిటో తెలియక నా టపా వ్రాసాను.
  2) ఇప్పుడే మీ రూల్స్ చదివాను. మీ రూల్స్ బాగానే వున్నాయనిపిస్తుంది. నాకు నచ్చని రోజు నేనే నా బ్లాగు తొలిగించమని ఇంకో టపా వ్రాస్తానులేండి.

  cbrao, మీరు విజేత కాండి. నాకా వుద్దేశం లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. భా.రా.రె., నిజంగా మీ సాంకేతిక నైపుణ్యతకి మెచ్చి, మీరు వెచ్చిస్తున్న సమయానికి అబ్బురపడి వ్రాసిన మెచ్చుకోలు మాటలవి. ఇప్పుడూ అంటున్నను ఇంకొంచం కలిపి ...

  హారం, టపాల సమాహారం
  హారం, సమాచార సదుపాయం

  హారం చేరాలి కీర్తికిరీటం
  హారం కావాలి నవరత్న ధరహాసం


  భావన, "వజ్రం" తో పోల్చావ్. వాహ్, ఆ ఫీలింగ్ ఎంత బాగుంది. ముందుగా వస్తే ఈ సౌకర్యం వుందన్నమాట. ;) 'మా ఉషమ్మ మేలిమి ముత్యం, వరహాల మూట, వరాల కొండ' అనే మా నానమ్మ మాటలు కంటి చెలమతో మసగ్గా మదిఫలకం మీద అగపడుతున్నాయి.

  చింతకాయంత చిన్నోడికి వంకాయంత వజ్రం దొరికితే, బీరకాయంత బీరువాలో దాచి తాటికాయంత తాళం వేస్తే దోసకాయంత దొంగోడొచ్చి ఎత్తుకెళ్ళిపోయాడట. ఇదమ్మాయ్ నేను నేర్చిన కథ, నా తెలుగు స్కూల్ పిల్లలకి చెప్పినదీను. ;)

  వెన్నెల, ఈ సారి మీ వ్యాఖ్య చూసాకే వ్రాస్తాను, సరేనా. ఇక ఈ టపాకి నా రవ్వల కాంతులిక పంచను. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. వెన్నెలా మేము చెప్పింది వెన్నెల చెప్పింది ఒకటా.. వెన్నెల దారే వేరు ఆమె తీరే వేరు.. మీరెంత మధురం గా వెన్నెల వలను విసిరి సమ్మోహన పరచ గలరో మేము ఇంతకు ముందు చూసేము కదా. భా.రా.రే పైన నా కామెంట్ లో 'వజ్రపు మెరుపంటి వెన్నెల' కూడ కలుపుకోండి మన వెన్నెలమ్మ తరపున..

  ప్రత్యుత్తరంతొలగించు
 12. అయ్యో ఉష గారు ! ఒక్కసారే అలా అనేసారేంటండీ ? మీరలా తొందరపడి ఏ నిర్ణయాలూ తీసుకోకండీ. మీ రవ్వల రత్నాల కాంతుల వెలుగులు వాఖ్యలలో కనపడకపోతే.. అందరూ కలసి ఆ డంకా ఏదో నా వీపు మీద వాయించేయగలరు(ముఖ్యంగా భా రా రె గారు).
  మీ అంతటివారు అంత చక్కగా మా అభిప్రాయాలు కూడా మీ వాఖ్యలలో తెలిపేసినందుకు కృతజ్ఞతా పూర్వకంగా రాసినది మాత్రమే ఆ వాఖ్య. ఇది తప్ప నాకు నిజంగా వేరే ఉద్దేశాలేమీ లేవండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. భావనగారూ మీరు "ఢంటక ఢంటక ఢంటక ఢన్... అని మ్యూజికల్ హిట్లు భలేకొడతారండి. ఇంతకీ ఇంకే రాళ్ళు మిగలలేదేమో..చిన్నప్పుడు వూర్లో పిచ్చిగుంట్ల వాళ్ళ కథలు చెప్పేటప్పుడు రత్న ఖచిత(?) కిరీటాలు , మరకత మాణిక్య వజ్ర వైడూర్యాలు కథచెప్పినంత సేపూ అన్నీ నాదగ్గరనే వున్నట్టనిపించేది. అలాగే ఇప్పుడూనూ :)

  ఏమ్మాయ్.. మాటపాలని బాజా ఊదిన టపాలంటావా? చెప్తా నీ పని.jk నో సారీస్ .

  అంతలోనే ఢంకా భజాయించి అనిచెప్తారా? ఇందులో మళ్లీ పూలదండలూ,బొకేలూ, గంధపు లేపనాలు, చందనపు మైపూతలు.ఇన్నింటి నడుమ ఈ సమాహారానికి ఎంత అదృష్టమో కదా !

  ఇప్పుడో సాంగ్

  హారమైనా కాకపోతిని ఆడువారి మెడను చేరగా....టయ్ టయ్..

  ప్రత్యుత్తరంతొలగించు
 14. వెన్నెల గారూ అలా అన్నారేంటండి "అంతా మీరే చెప్పేసారు ఇంక చెప్పడానికి ఏముంది "..
  మీరు తలుచుకోవాలేగానీ కవితా వెన్నె లలా జాలువారదా? ఇక మీ ముగ్గురి ( మీరు,భావన, ఉష ) సంభాషణలు భలేవున్నాయి. కానివ్వండి ఏదో శని ఆదివారలిలా కాలక్షేపం.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. C.B.Rao గారు, నిబంధనలతో పాటి హారం నచ్చినందుకు ధన్యవాదాలండి

  a2z dreams గారూ, మీకు ఈ ప్రశ్న రావడం సహజమే. ఇలా ఒకటి రెండు సార్లు అయినట్టుగా వుంది. ఏమైనా ఎవరి బ్లాగు వారిష్టం. కాబట్టి ఎవరినీ తప్పుపట్టలేము కానీ ౧౫ పోష్టులు రోజూ వ్రాయాలంటే మనము బ్లాగుమీద ఎంతసమయము కేటాఇస్తున్నామో కూడా ఒకసారి ఆలోచించండి. బ్లాగే జీవనాధారం అయితే సమస్యే లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. ఉష, మీరు రువ్విన రవ్వల కాంతుల మణిహారం హారానికి త్వరలోనే అలంకరిస్తాను. హారం పైన, హారం వారిపైన మీ అభిమానాకి మరో సారి కృతజ్ఞతులు.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. భాస్కర రామి రెడ్డి ,

  you are right sir. నా ఆలోచన్లే జీవనాధారం చేసుకునే ప్రోసస్ లో వున్నాను. నేను, నా బ్లాగు కోసం కేటాయించే సమయం వృధా అని ఎప్పుడూ అనుకోను.నా సమయాన్ని చర్చల ద్వారా ఎవరి అభిప్రాయన్నో మార్చడానికి కాకుండా, కామెంట్స్ తో ఒకరిని వెటకారం చేయడానికో కాకుండా, నా అభిప్రాయాలకు నా ఆలోచనలకు నా బ్లాగులో అక్షర రూపం ఇస్తున్నందుకు నాకు ఆనందమే తప్ప విచారం లేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. దాని మీద చర్చ అనవసరం. మీరు నా మీద చూపిస్తున్న కెర్‌కు థాంక్స్.

  నా రిక్వెష్ట్ కు స్పందించినందుకు థాంక్స్, my doubts cleared, I responded back(మీరు పాటిస్తున్న నిబంధనలు అందరికీ ఒకేలా వుంటాయి అంటున్నారు కాబట్టి, ప్రస్థుతం నా బ్లాగు మీ సైటులో కనపడటంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.
  ) and there ends.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. భా.రా.రే: నేనా మ్యూజికల్ హిట్టా? అబ్బే లేదబ్బా అంత లేదు... ఇంక రాళ్ళేమి లేవు మరి. నవ రత్నాలను కవర్ చేసేను.. నాకు "పిచ్చిగుంట్ల వాళ్ళ కథలు" తెలుసు కాని అందులోని వజ్ర మాణిక్యాల వివరాలు తెలియదు. :( మెచ్చుకున్నారా వెక్కిరిస్తున్నారా?

  హారం కావాలనుందా పూల హారమా, పచ్చల హారమా.. అప్పుడెప్పుడో కోపం వచ్చి ముక్కు పుడక మీద రాస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు వున్నారు.. ఇప్పుడు హారం అంటున్నారు.. ఎన్ని అవ్వాలనుందేమిటి?

  ఉష: నువ్వు కవితా వజ్రానివే కదా అందుకే అన్నాను. you deserve it my girl

  ప్రత్యుత్తరంతొలగించు
 19. భావనా మిమ్మల్ని వెక్కిరించే అంత సాహసమే, ప్రకాశం వారని తెలిసి కూడా :) అబ్బా, ఎప్పటికేది తోస్తే అలా మాట్లాడుతుంటామండీ మీరవన్నీ పట్టుకోని నన్ను రాచి రంపాన పెట్టేట్టున్నారే తల్లీ..:)

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form