18, డిసెంబర్ 2009, శుక్రవారం

తెలంగాణా సీమ

నాకిప్పుడే ఒక బ్రహ్మాండమైన, ఎవరికీ రాని ఐడియా వచ్చింది. అసలు సీమాంధ్ర ఎందుకు? సీమ జిల్లాల్లో కరువు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతుంది కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళి కోస్తాలో కలిపేస్తే మా బ్రతుకులు ఏంకావాలి? అందుకని మాకిప్పుడు సీమాంధ్ర వద్దు. తెలంగాణా సీమ కావాలి. ఎట్టాగూ మీరూ వెనకభడ్డోళ్లే, మేమూ మీకంటే వెనక బడ్డోళం కాబట్టి మనిద్దరం కొట్టుకున్నా బూడిదే రాలుతుంది. ఏమంటారు. అందుకని మా తెలంగాణా సీమ లో కలిసి వుండాలనుకొనే వాళ్ళందరూ మాకు మద్దత్తు నివ్వండి. అయితే రాజధాని మాత్రం మా ఒంగోలు అయితేనే ఒప్పుకుంటాం. ఇప్పుడు ఒంగోలు లో లేము కాబట్టి, మేమున్న మా గుంటూరు ప్రాంతాన్ని కూడా అంటే వినుకొండ, నర్సరావుపేట, మాచర్ల, కారంపూడి ఇలాంటివన్నీ కలిపి మాకు తెలంగాణా సీమ కావాలి.మీ మనోభావాలకు అనుగుణంగా తెలంగాణా తల్లిని మన తెలుగు తల్లి గా పూజిద్దాం. తెలంగాణా పేరునే ముందు వుంచి సీమ పేరు ఏదో తోకగా తగిలిద్దాం. ఆంధ్రా వాళ్ళు కూడా ప్లీజ్ అని అడిగితే వచ్చి మా తెలంగాణా సీమ లో వుండవచ్చు. కాబట్టి రేపటి నుండి నేను తెలంగాణా సీమకు ఉద్యమించబోతున్నాను. వస్తే సరే సరి. లేకపోతే...?

27 వ్యాఖ్యలు:

 1. అంతగా అయితే మేమెళ్ళి ఒరిస్సాలో కలిసి "కోనరిస్సా" యేర్పాటు చేసుకోలేమా ఏమి. :) ఏమ్దివయ్యా మీతోని బొయ్యేది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. లేదా "రిస్సాకోస్తా" అని కూడా పేరు పెట్టుకుంటాం. పేరులో, వూరులో ఏముంది. కలిసి మెలిసి బ్రతకటం లో వుంది కానీ.. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అలాగలాగే. మేమందరమూ మద్దతిస్తాము.చూసారా! ఉద్యమం అనేసరికి ఫోటో కూడా మారిపోయింది:-)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @ చిలమకూరు విజయమోహన్ : రిస్సాకొస్తా..ఒరిస్సా + కొస్తా..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. గట్లనేగానీ....ఉద్యమానికి మేము భీ ఫోటోలు మార్వాల్నా ఏందీ? జర జెప్పండి సారూ:)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అదేం కుదరదు ..మీరు సీమోళ్లతో కలుస్తారో..నాటోళ్లతో కలుస్తారో..మా పలనాడుని మాత్రం మీతో కలపం..అది మా గుంటూరులోనే ఉండాలా..ఏమయినా తేడాపాడాలు వచ్చాయా..తలకాయలు లేచిపోతాయి. బ్రహ్మనాయుడి వంశస్థులం మాతో పెట్టుకోకండి..

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మేమ్ పుటోలు మార్చం, మాట మార్చం భయ్... పార్టీలు, టోపీలు భీ మార్వం. జర సొచాయిమ్చి మాటాడు మల్ల బిడ్డా...

  సిరిసిరిమువ్వా, గోదారోళ్ళం గానీ పుట్టింది, పెళ్ళి మాత్రం పలనాడులోనే ;) అందుకే మీ తీరు మాకూ వుందోచ్...

  ఇంతకీ నాయకుడెడబ్బా.. మళ్ళీ మతలబు చేయనికి ఏడ పోనాడో... తెహింతబె నేర్వనికి అండమాన్ పోయినడేమో.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఉషా, రిస్సాకోస్తా పెట్టుకుంటారో, కోనరిస్సా పెట్టుకుంటారా మాకెందుకు? మీరు "ఆంద్రోళ్ళు" మాలో కలవడానికి మేమొప్పుకోం అంతే.

  విజయ్ మోహన్ గారూ, మంచుపల్లకి నుంచి వచ్చిన సమాధానం మీకు సరిపోతుందనుకుంటా.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. సునీత గారూ, మీ మద్దత్తు తెలిపినందుకు సంతోషం. ఎన్నన్నా మనం మనం ఒకూరు. ఇక ఫొటో అంటారా మరి నిన్నటినుంచి బుడ్డి పట్టుకోని దీక్ష చేస్తున్నా కాబట్టి, దీక్ష పూర్తయిన తరువాత ఎంత సన్నబడ్డది తెలియాల కదా అందుకన్న మాట.

  మంచుపల్లకీ గారూ , ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. గదేంది పద్మార్పితా గట్లా సెప్తుండవు.
  మరి ఉద్యమం చేయాలంటే మీ పుటోలు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు, ఎలక్షన్ ఐ.డి కార్డులు, మీ ఇంటి నంబర్లు, ఇంకా మీ సెల్లు నంబర్లూ అన్ని స్కాన్ తీసి పెడితేనే మీకు ఆ అర్హత.

  అమ్మో సిరిసిరిమువ్వ గారూ, నాకు భయమేసింది.అసలే బ్రహ్మనాయుడి వంశస్థులైతిరి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఉషా మౌనంగా దీక్ష జేస్కుంటున్నా బిడ్డీ. నన్ను రెచ్చగొట్టుద్దు. రక్తం ఏరులై పారుద్ది.
  హ్మ్, నాయకుడికి రాగానే ఆఫీస్ లో మీటింగ్ ఫిట్టింగ్ పెట్టి అండమాన్ జైల్ నుంచి ఇప్పుడే వదిలారు :(

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఏందబ్బి భాస్కర్రావూ.... ఇట్లా తకరారు చేసి మన జిల్లా ను ఏమి చేయబోతుండావు...
  సిరి సిరి మువ్వ.. ;-)

  ప్రత్యుత్తరంతొలగించు
 13. వేషము మార్చెను భాషను మార్చెను అసలు తానె మారెను
  అయినా మనిషి మారలేదు -:):) సీమంద్ర బాగోపోతే "ఆంద్ర సీమ "అంటే పోలా అబ్బాయ్ !

  ప్రత్యుత్తరంతొలగించు
 14. భావనా.. ఏం తకరాదులెదూ, తిరకాసూ లేదు. మాకు తెలంగాణా సీమ కావాల్సిందే. అయినా సిరిసిరిమువ్వ గారన్నది చూసి అంత నవ్వెందుకొస్తుందమ్మా ;)


  ఇద్దో చిన్నీ, మీరందరొచ్చి లొల్లి లొల్లి జేయకండ్రి. మీరేమన్నా ఈ సారి మనసు మార్చుకొనేదే లేదు. అట్టన్నా హైదరాబాదులో చెమటోడ్చి కష్టపడి సంపాయించుకున్న ఆస్తులన్నా మావి మాకు దక్కుతాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. అయితే ఓకే. కానీ మేము కలవం.రాజులు, గోపాలుల వాదనలు, దీక్షలు మాకు అనవసరం. మేమూ ఉద్యమిస్తాం.
  హైదరబాద్ తో సహా విజయవాడ ను ప్రత్యేక రాష్ట్రం చేయాలి.
  రెండూ కొంత దూరంలో ఉన్నాయి కాబట్టి విడిపోయే ముందే మాకు రెండూ నగరాలు కలిపే విధంగా
  అడ్డంకులు లేని 8 వరుసుల ఉచిత రోడ్డు, నిమిషానికొక బుల్లెట్ రైలు, పది నిమిషాల కొక ఎర్ర బస్సు కాదు కాదు ఎయిర్ బస్సు షటిలు ఇవ్వాలి.
  మర్చిపోయా విజయవాడ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, అమెరికా కు డైరెక్ట్ సర్వీసులు, రాయితీలు కూడా కావాలి.
  టీవి ఛానల్ పర్మిషన్ కోసం అప్లై చేసాం. రాగానే దీక్ష మొదలు. కాస్త మీరు ఆగండి.
  జై ప్రవాస విజయబాద్!

  ప్రత్యుత్తరంతొలగించు
 16. ఇదేదో బాగుందేవిజయబాద్ ...
  ఆస్తులదేముంది గట్ననే ఉంటాయి ..మల్ల సెమట ఓడ్చి సంపాదించ వచ్చు ...గట్ల గడిబిడ జేయక సమైక్య గీతం అందుకో .

  ప్రత్యుత్తరంతొలగించు
 17. అయ్యయ్యో ఫణీ హైదరాబాదు ను విజయవాడను మీరెత్తుకు పోతే ఇంక మాకు మిగిలేదేంది చిప్ప. అడుక్కున్నా అర్ధరూపాయ రాలదు. ఆ పప్పులేం వుడకవు

  చిన్నీ ఇదేంబాలేదమ్మాయ్, మీరందరూ కలిసి నా నిర్ణయాన్ని గజిబిజి చేస్తున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. ఒక్కడ్ని కదపడానికి వెయ్యిమంది 'కథ'యెట్లా మలుపు తిరుగుతుందో ఉత్కంటగా.....

  ప్రత్యుత్తరంతొలగించు
 19. చిన్నీ, భావన - కాస్త అలాగే పట్టిపీఢించండి. :)

  భా.రా.రె. క్రొత్త పేరు, కోస్తా రిస్సా అప్పుడు "అమేరికా" నుండి వచ్చేవాళ్ళు కూడా "కోస్టా రికా" Costa Rica మాదిరిగా పలకొచ్చు. ఇప్పుడిక మీ సీమ కి కొత్త పేరు, కొత్త ఎల్లలు వెదుక్కోండి.

  దీక్ష లేదు, ధ్యానం లేదు మమ్మల్ని ఏమీ చేయలేరు... ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 20. చిన్నీ అదుగో మళ్ళీ అంతా గజిబిజి గందరగోళం. :(

  హమ్మా ఉషా, మీరందరూ ఇలా దాడిచేసి నా దీక్షను విరమింప చేయాలని చూస్తే ఈ సారి గులుకోజు నీళ్ళబాటిల్లో అదేదో కలుపుకోని దీక్ష చేపడతా

  ప్రత్యుత్తరంతొలగించు
 21. అమ్మో ఈ ఉద్యమం వెనుక ఇన్ని వ్యాఖ్యలున్నాయా!
  అయితే నేనూ రెడీ:)

  ప్రత్యుత్తరంతొలగించు
 22. సృజన, ఇంతకీ మీరు మా తెలంగాణాసీమ కు సపోర్టా లేక ఆంద్రోళ్ళా అది తేల్చండి ముందు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 23. అలా నిలేస్తే ఏం చెప్పను? పుట్టింది శ్రీకాకుళం, పెరిగింది అనంతపురం, చదివింది సీమలో,ఉద్యోగం ఓరుగల్లులో,అత్తగారిది రాజమండ్రి, ప్రస్తుతము ఉంటుంది హైదరాబాద్, సెటిల్ అయ్యేది విజయవాడలో....ఇదీ సంగతి!

  ప్రత్యుత్తరంతొలగించు
 24. మీరే గంగలో కలిస్తే మాకేం గానీ మమ్మల్నొదిలేసారు అంతేచాలు . మీ దీక్ష ఫలించాలని దీవిస్తున్నాం .

  ప్రత్యుత్తరంతొలగించు
 25. కనుక గంగోత్రి ఎక్స్ ప్రెస్ ఎక్కి భా.రా.రె. గారితో ప్రయాణమయ్యేవారంతా అటు. మిగిలినవారంతా ఇటు, మాది పుష్పకవిమానం. ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 26. సృజన గారూ, మీరూ అయితే మాలాగే దేశదిమ్మరులే అయితే. మనదంతా ఒకే కులం అండీ. కాబట్టి ఈ విశ్వమే మనకు హద్దు. ఈ రాజకీయ గోడలు ఎంత బలంగా వున్నా బాగుపడేవారిని చెరిపేవారుండరని, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో బ్రతకలేకపోతే ఇండియా నే మన ఇల్లు.

  లలితగారూ, మీహాస్యానికి ఇంకొద్దిగా నే కలుపుతా చూడండి.
  మేము గంగలో కలిసే ముందు మిమ్మల్ని గోదాట్లో కలిపేస్తాం ;)

  అమ్మాయ్ ఉషా మీది పుష్పకవిమానం అయితే మాది ఇన్విసిబుల్ రాకెట్. అంటే ఏంటని అడగొద్దు. మాకూ తెలియదు :)

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form