6, ఫిబ్రవరి 2010, శనివారం

జగమెరిగిన సత్యవాక్పరిపాలకులు

అలజడి జడివానయై వెల్లువెత్తిన మదిలో
మాయని అమాయక రూపం వెలుగుచూసింది
ఉరుకుల పరుగుల నవీన జీవితంలో
గతరాత్రి వర్షించిందొక కఠిన శిల్పం

చీకటి వెలుగుల సంగమ కాలంలో
మనసులోని ఆలపన సంధ్యారాగామా
పులుముకొస్తున్న చీకటి తెరలు చీల్చగ
వెల్లువెత్తే పూర్ణచంద్రోదయ వెన్నెల గీతమా

జగమెరిగిన సత్యవాక్పరిపాలకులు
వల్లెవేసే సత్యకాల మత సూత్రాలు
ఇలలో మనలో నాటే నాటుబీజాలు
ప్రగతి రథచక్రం క్రింద నలిగేనా
జాతి జాగృతి చూసేనా?

వేదనిధికి వైద్యం చేస్తూ
ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్నామా
సత్యాసత్యాల మిధ్యా గమనంలో
అసలు దారే మరిచామా?

వాస్తవికత మరచి ఎండమావుల వెంటపడ్డామా
కందిరీగల పుట్ట చూపి తేనెపట్టని చెప్తున్నామా
మందభాగ్యుల మదిలో విషం చిమ్ముతున్నామా

నా మదిలో కురిసిన హిమబిందువులకు
హృదిలో పొంగిన భావస్పందనలివి

14 వ్యాఖ్యలు:

 1. వాస్తవికత మరచి ఎండమావుల వెంటపడ్డామా
  కందిరీగల పుట్ట చూపి తేనెపట్టని చెప్తున్నామా
  ..నిజమేనేమో .....పునరాగామనమా!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Theme మొత్తం మార్చేసావు. ఏంటి విశేషం? ఇప్పుడు బ్లాగు చూడటానికి బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఆ మధ్య ఎవరిమీదో అలిగి కామెంట్ బాక్స్ తీసేసినట్టున్నారు ! అహ...మాటమీద నిలబడే అలవాటులేదా మీకు అని అడుగుతున్నానండయ్యా....

  ప్రత్యుత్తరంతొలగించు
 4. భా.రా.రె. ఏన్నాళ్ళకెన్నళ్ళకెన్నళ్ళకు ఎన్నెల్లు తిరిగొచ్చే...

  ఏమిటిది, ఈ మది అదేమిటి, అందు ఆ గడబిడేమిటీ... కటిక రాయికైనా కన్నిరుంటది సారూ... ఎండమావిలో దప్పిక తీరుచుకునే జీవాలు ఇదిగో నాలా ఇలా నోరు తెరుచుకుని మీ బ్లాగెప్పుడు తెరుస్తారాని ... :) నవ్వే కళ్ళకీ నవ్వురాని కథలుంటాయి. ఏమిటీ మళ్ళీ ఉగాది పచ్చడి కలుపుతున్నట్లున్నాను. కానీండిక, మీ నవ్వుల హరివిల్లిలా మొదలౌవకూడదు కానీ ఇక రూటు మార్చండి. ఉన్నవి చాలవని ఎందుకయ్యా కొత్త వెతలు మాకట.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు సారు. బాగుంది మీ కొత్త టెంప్లేట్.

  సత్యాసత్యాల మిధ్యా గమనంలో
  అసలు దారే మరిచామా?

  గమనం మిధ్యనుకుంటే
  అసలు దారి మాయే..

  సత్యాఅసత్యాలకు అతీతమైనదొకటి వుందంటే
  అది పూర్ణమైన మాయే అది మౌనమే..

  ప్రగతి రధ చక్రం కింద నలగాలని జాతి జాగృతి లోన వెలగాలని ఆశిస్తున్నా నేను కూడా..

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Happy Happy Birthday Bhasker..

  May god bless you with good health, wealth and success in everything you do..

  ప్రత్యుత్తరంతొలగించు
 7. కొత్త మూస బాగుంది కంటికి హాయిగా.
  మదిలో కురిసిన హిమబిందువులా, మిడట్లాంటిక్కుని మేట వేసిన హిమసమూహాలా? :)
  హారానికీ మీకూ పుట్టిన్రోజు శుభాభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. వ్యాఖ్యానించిన మిత్రులందరికీ నెనరులు. సమయాభావంతో ఈ రోజు ప్రతివ్యాఖ్య వ్రాయలేకపోతున్నారు ఈ సత్యవాక్పరిపాలకుడు ;). తీరికలో మళ్ళీ వస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. హమ్మయ్య! వచ్చేసారు!గత వారం రోజులుగా బిజీ, అందుకే ఇటువైపు రాలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form