12, మార్చి 2010, శుక్రవారం

వేకువ వెలుగులు -10



అనంత దిగంతాల్లో ఆరని దీపం
పుడమి చేరని రక్షణ కిరణం

మధ్య దారుల్లో అడ్డుకున్న మేఘ నాధుడు
దిక్కు తోచని ధరిత్రి అలుక చూసి మురిసిన ప్రియుడు

కులుకులొలికి మేఘుని పట్టిన కడలికాంత
తెప్పరిల్లి తన చెలిని చేరిన సప్తాశ్వరూఢుడు

విహంగమై ఎగిసిన గాలి చిక్కగ నవ్విన ఉదయం,
వానజల్లుల తలంబ్రాల్లో ముగిసిన వివాహం.

2 కామెంట్‌లు:

  1. అంతంలేని అహ్లాదకరమైనవి ఈ వేకువ వెలుగులు...
    నా వ్యాఖ్యలు ఎంత వీటి ముందు మిణుకు పురుగులు!

    రిప్లయితొలగించండి

Comment Form