8, మార్చి 2010, సోమవారం

వేకువ వెలుగులు - 6 By ఉష

పగలు చిక్కబడి రేయి వగల హారంగా మారేనని,
రేయి రాగాల పొద్దుగా రంగవల్లి దిద్దేనని..

రేయింబవళ్ల రాకపొకల్లో జగతి మురిసేనని,
వనకన్నియలు ఋతువుల వలువల్లో మెరిసేనని..


మోమున మెరిసేటి ముత్యపు నవ్వున,
గోముగ చూసేటి చూపున జవరాలు.

రివ్వున ఎగిసేటి తలపుల ఉప్పెన,
కమ్మిన కల వీడని తడిపొడి తపన.

ఉదయాలు మాట వెదుక్కునే స్పందన,
హృదయాల మాటున దాగిన బంధమేగా..

చిరుజల్లున గోరువెచ్చగ సోకే ఈ ఉదయం,
మనసుని రంజింపచేసే మరో కమ్మని పఠనం..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Comment Form