30, ఏప్రిల్ 2010, శుక్రవారం

హలో తెలుగు బ్లాగర్స్ .........

ఈ మధ్య టపాలు వ్రాసి టోపీలు పెట్టి చాలా రోజులైంది. ఏదో అనుకోని పనుల్లో కూసింత బిజీ బిజీ. పనులు సక్రమంగా అనుకున్న రీతిగా సాగి పోయాయి. మళ్ళీ నాగాలి గోళీ కాయలా గాలి సుయ్య్ మని పొంగినట్టి వున్నట్టుండి బ్లాగులవైపు మళ్ళింది. ఈ మధ్య చాలానా గ్యాప్ వచ్చినట్టుంది కదా !. అయినా రాసి రాసి పెన్నులో సిరా ఖాళీ అవడమో కీబోర్డ్ లో "కీ" లు అలాగే చేతి కీళ్ళు అరిగిపోవడం తప్పించి పెద్దగా ఆరోగ్యం బాగయ్యింది లేదు. అంతా మాయ గానీ ఈ పెపంచకంలో రాసేదెవరు చదివేదవరు? హుష్... అలుపొచ్చేస్తూంది. సరిగ్గా మూడు లైన్లు రాసానో లేదో దీని సిగతరగ మళ్ళీ ఈ చంచల మనసు సాంకేతిక సమ్మోహిత యై సవర్ణదీర్ఘ సంధులు, గుణ సంధులు అంటుంది. ఈ సంధి ప్రక్రియలకు ఇంకా ముహూర్తం పెట్టలేదు కానీ హారం లో కాస్త రమ్ము, జిన్ను కలిపి కొత్త సీసాలో పాత సారాలా మార్కెట్ చేసుకుందామని ఈ టపా.

హారం రూపు రేఖలు మార్చుకొని కొంగ్రొత్త చీర కట్టుకొని మరిన్ని అందాలతో పాఠకలోకాన్ని మైమరపింప సమాయత్తమై మీ ముందు రేపు ప్రత్యక్షం కాబోతుంది. ఇలా అన్నానంటే ఇప్పుడు వున్న రూపు బాగాలేదని కాదు. ఒకే రూపు తో సంవత్సర కాలంగా కనిపించేటప్పటికి నాకే మొఖం మొత్తింది. ఇలా మొఖం మొత్తిందని ప్రతిదీ ప్రతి సంవత్సరం మారుద్దామంటే కుదరదండోయ్..గొడవలై పోగలవు జాగ్రత్త సుమా ! అందుకే దానికి క్రొత్త హంగులు.ఏమిటా హంగులు?

ముందుగా హోమ్ పేజి అనాటమీ వివరిస్తాను. హోమ్ పేజీ యే కాదు, హారం లో ప్రతి పేజీనీ ఐదు భాగాలుగా విడగొట్టడం జరిగింది. [ ఇప్పుడున్న హారం కూడా అలాగే ఐదుభాగాలుగా వుంది.]

౧) హెడర్ .. ఇది హారం లోగో కు ప్రత్యేకించ బడింది
౨) ఎడమ వైపు భాగము .. ఇది రచయితల పేర్లు వారు వ్రాసిన వ్యాసాలు లేదా వ్యాఖ్యల కోసం వినియోగించడం జరిగింది.
౩)మధ్య భాగము ... ఇందులో రచయితల వ్యాసాలు, లేదా వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు చూపడానికి నిర్దేసించింది.
౪)కుడి భాగము ... ఇది హారం చేసే రకరకాల విశ్లేషణలు చూపడానికి నిర్దేసించింది.
౫) ఆడుగు భాగము ... ఇది హారం కాపీ రైట్ కోసం నిర్దేసించింది.

హారం ఈ సారి గ్లోబల్ హారం గా ఎదగడానికి తొలి మెట్టు కట్టు కుంది. ప్రయోగాత్మకంగా ఇంగ్లీష్ బ్లాగులని కూడా చూపడానికి సిద్ధమైంది. ప్రయోగాత్మకంగా అనేకంటే సాంకేతిక ఆంగ్ల బ్లాగులను ఒకచోట చూస్తే ఎలా వుంటుందో అన్న దురాశతో మొదలెట్టిన ప్రయత్నం. అంటే హారం మల్టిలింగ్వల్ వెబ్ సైట్. ఆల్ వియ్ నీడ్ ఈజ్ ఫ్యూ కాన్ఫిగరబుల్ చేంజెస్.విత్ దీజ్ ఛేంజెస్ హారం కెన్ షో ఎని యూనికోడ్ లాంగ్వేజ్ ఇన్ ద సేమ్ ఇంటర్ ఫేస్.

ఈసారి హారంలో మరిన్ని సదుపాయాలు పొందుపరచడమైనది.అందులో కొన్ని

1) గతవారం రోజుల్లో ఎక్కువగా ఏబ్లాగులు పాఠకులు చదివారో చూపుతుంది. ఈ వ్యాసాలను కేవలం హిట్ ల ఆధారంగానే కాకుండా వేరే parameters కూడా వాడుకుని చూపుతుంది. ఈ టపాల/వ్యాసాల పట్టిక రోజుకొక సారి మాత్రమే మారు తుంది.పూర్తి వివరాలకు రేపు హారాన్ని దర్శిస్తే సులభంగా అర్థమవుతుంది.

2)అలాగే తక్కువగా వీక్షించిన వ్యాసాలను కూడా క్రోడీకరించి సముచిత స్థానం ఇవ్వడం జరిగింది.ఇదికూడా రోజుకొక్కసారే మారుతుంది.

3) అంతర్జాల పత్రికలలో వచ్చిన వ్యాసాలను పదిహేను రోజుల పాటు హోమ్ పేజీలో అలానే వుంచడం జరిగింది. అంటే చందమామ,జ్యోతి,స్వాతి,భూమి లాంటి పత్రికలే కాకుండా వివిధ వెబ్ పత్రికల రచనలు హైవాల్యూమ్ బ్లాగు లిస్టులమధ్యలో కొట్టుకొని పోకుండా వుండడానికై ఈ జాగ్రత్త తీసుకోవడమైనది.

4) పద్య, సాహిత్య ,వార్తా బ్లాగులను అలాగే కవితా బ్లాగులను విడిగా చూపడమైనది.

5) వివిధ విభాగాల్లో వ్రాసిన వ్యాసాలను కూడా క్రోడీకరించి [సాధ్యమైనంత తప్పులు లేకుండా ] చూపడానికి కూడా అనువుగా హోమ్ పేజీని డిజైన్ చేయడమైంది.అంటే మీరు చాలా సులభంగా పద్యాలను, పాటలను, సంగీతపు వ్యాసాలను, హాస్య/వ్యంగ్య వ్యాసాలను, సాంకేతిక వ్యాసాలను చదువుకోవచ్చు.

6) కామెంట్ల పేజీలో ప్రత్యేకించి పాటల టపాలను చూపించడం జరిగింది.

ఈ మార్పులు చేర్పులు చేయడానికి హారం రేపు సిద్ధపడుతుంది. కాబట్టి రేపు రాత్రి తొమ్మిది నుంచి అనగా భారత కాలమానం ప్రకారం ఎల్లుండి ఉదయం ఆరున్నర నుంచి ఓ మూడు గంటల పాటు హారం పని చేయకపోవచ్చు.

ఇవెట్టున్నా మిమ్మల్ని పలకరించి చాలా రోజులైంది కదా... మస్తుగున్నారా అందరూ, పిల్ల, పాప, గొడ్డు గోద అంతా కుశలమేనా? ఎండాకాలం కదా, ఇంటికొక పెళ్ళి తోరణంతో ఊౠ వాడా సిద్ధమయ్యాయా? గొంతులెండిపోతున్నాయా? చొక్కాలు తడిచిపోతున్నాయా? గోళీ సోడాలు తాగుతున్నారా !!!

సక్కనైన సందమామ మబ్బుసాటుకెళ్ళింది
కంటిమీద రెప్పలేమో సందుసూసి మూసుకొన్నాయి.

బై బై....

19 కామెంట్‌లు:

  1. మ్మ్.. చాలా రొజుల తరువాత... భా రా రే గారు ..

    looking forward to see NEW LOOK :-))

    రిప్లయితొలగించండి
  2. మంచి మార్పులు చేస్తున్నారు. అభినందనలు... సాంకేతిక బ్లాగులను ఒకచోట చేర్చాలనుకోవడం ముదావహం.

    రిప్లయితొలగించండి
  3. రవిచంద్ర గారి మాటే నా మాట ! రావి శాస్త్రి గారి కథలు చదువుతున్నారా ఏమిటి ;)

    రిప్లయితొలగించండి
  4. ఎడమవైపు భాగంలో బ్లాగు రచయితలు బ్రాకెట్లో వాళ్ళ రచనల సంఖ్య ఇస్తున్నారు కదా, అది దాని పరిధిని దాటుకుని మధ్యలో భాగానికి వచ్చేస్తుంది. కొత్త రూపంలో దాన్ని సవరించగలరు.

    రిప్లయితొలగించండి
  5. హమ్మయ్య .....వచ్చేసారా !ఈ చిరు సవ్వడి వినబడక బ్లాగ్ లోకం నిశబ్దంగా వుంది ....అంతా కులాసానా (మలేరియా డిపార్టుమెంటు డవిలాగు ) .....ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి ..వడియాలు పచ్చళ్ళు బానే పట్టేస్తున్నారు .సాయంత్రాలు చల్లంగానే ఉంటున్నాయి :-):-)

    రిప్లయితొలగించండి
  6. భా.రా.రె. సంతోషం + అభినందనలు. హారానికి మీరిచ్చిన వివరాలతో క్రొత్త రూపు ఊహా చిత్రం బావుంది. ఆ క్రొత్త మెరుగలకి ముందు ఓ సారి ఇప్పటి హారం పిక్చర్ తీయటం మర్చిపోకండి. హారం ఇలాగే మరిన్ని క్రొత్త హంగులతో ఎప్పటికప్పుడు సాంకేతికపరంగా మున్ముందుకు సాగాలని అభిలషిస్తున్నాను.

    పోతే, ఋతువు మారినట్లే, మీ నుంచి మళ్ళీ సాహిత్య వ్యాసాలు, కవితలు సవ్వళ్ళు చేయాలని, క్రొత్త హారాన మణులుగా మెరవాలని ఆశిస్తూ...

    రిప్లయితొలగించండి
  7. good luck - all the best.

    one suggestion. Apart from showing most visited or most popular from previous week, you could also have an editor's pick of the week or month.
    Similarly newcomer of the week or month.

    A post or a blog that is already popular will come to the notice of the people somehow or other - it really does not need an extra boost. What needs the little extra help is the little undiscovered gem(s). And this may not be possible by automated processes - some human intervention may be required.

    రిప్లయితొలగించండి
  8. గతవారం రోజుల్లో ఎక్కువగా ఏబ్లాగులు పాఠకులు చదివారో చూపుతుంది. ఈ వ్యాసాలను కేవలం హిట్ ల ఆధారంగానే కాకుండా వేరే parameters కూడా వాడుకుని చూపుతుంది. ఈ టపాల/వ్యాసాల పట్టిక రోజుకొక సారి మాత్రమే మారు తుంది.
    ___________
    ఈ పీచర్ బావుంటుంది. అలాగే వీలైతే ఈ నెలలో ఎక్కువగా చూసిన టపాలు,గత నెల ఎక్కువగా చూసిన టపాలు లాంటివి కూడా కలిపితే బావుంటుంది

    రిప్లయితొలగించండి
  9. సంతోషం. కొత్త హారాన్ని త్వరగా చూడాలని వుంది. ఈమద్య మీరు కనిపించడం లేదెందుకని మీకు ఈమెయిల్ ఇద్దామనుకుంటూనే వున్నాను. ఈలోగా మీరు ఈ పోస్టు వేసేసారు.

    రిప్లయితొలగించండి
  10. మంచుపల్లకి గారూ, కొత్త రూపంతో వచ్చింది చూడండి. ఇంకా అక్కడక్కడ Layout issues వున్నాయి.

    రిప్లయితొలగించండి
  11. రవిచంద్ర గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు సూచించినట్టు ఈ వెర్షన్ లో అలా రాకుండా చూసాను.

    రిప్లయితొలగించండి
  12. శ్రావ్యా గారూ, అయినా మీకు ఇప్పుడు రావిశాస్త్రి గారు ఎందుకు గుర్తొచ్చారండి? ;)

    రిప్లయితొలగించండి
  13. చిన్నీ గారూ, వచ్చెసా వచ్చెసా, మళ్ళీ గస పుట్టే దాకా రాస్తా ;) అవునండి వడియాలు, అప్పడాలు మీరు పెట్టుకోవడమేనా? మాకు లేవా?;)

    రిప్లయితొలగించండి
  14. ఉషా, మీ సూచననౌసరించి మొత్తం బ్యాకప్ తీసి పెట్టాను. ఇక సాంకేతిక విషయానికొస్తే చాలానే విన్యాసాలు మిగిలి వున్నాయి. తీరిగ్గా ఆలోచిద్దాంలేండి.
    కవితల సవ్వళ్ళు, సాహితీ విన్యాసాలు నేనా? మీకంటేనా?

    రిప్లయితొలగించండి
  15. కొత్తపాళీ గారూ, మీ సూచన బాగా నచ్చి అప్పటికప్పుడు ఎక్కువ గా వీక్షించిన వాటిని రెండో స్థానాన చూపిస్తున్నాను. ఇక పోతే ఎడిటర్ పిక్ ఆలోచన బాగుంది కానీ, మ్యాన్యువల్ గా చేసే ఈ పని నేను సమయానికి చేయలేనండి. ఎవరైనా ఆ బాధ్యత తీసుకొని ఎడిటర్ గా వ్యవహరిస్తే తప్పక చూపిస్తాను. న్యుకమర్ ఆలోచన బాగుంది. ఇంప్లిమెంట్ చేస్తాను.

    రిప్లయితొలగించండి
  16. శివ గారూ ఈ నెల, పోయిన నెల ఎక్కువగా చూసిన వానిని చూపించ వచ్చు. కానీ స్పేస్ ప్రాబ్లం గా వుంది. ఇప్పటి దాని స్పందన బట్టి వేరే ఇంకో పేజిలో చూపించే ప్రయత్నం చేస్తాను.

    రిప్లయితొలగించండి
  17. శివ గారూ ఈ నెల, పోయిన నెల ఎక్కువగా చూసిన వానిని చూపించ వచ్చు. కానీ స్పేస్ ప్రాబ్లం గా వుంది. ఇప్పటి దాని స్పందన బట్టి వేరే ఇంకో పేజిలో చూపించే ప్రయత్నం చేస్తాను.

    రిప్లయితొలగించండి

Comment Form