10, జులై 2010, శనివారం

మిఠాయిలూ = కారాలూ మిరియాలూ.

ఈ మద్దెల టపా రాసి చానా రోజులైపోయ. ఏరోజుకారోజు ముక్కుతా మూలుగుతా కూలిపని చేస్కోని కొంప చేరే సరికి ఇంటికాడ పిల్లోల్లు టెన్నిస్ ఆడాలని ఆదార్నఅటే లాక్కెళ్ళిపోతుండారు. అసలే ఎండ్లాకాలం. ఆటలైనాక నీల్లుపోసుకోకుంటే వల్లు చిమ చిమ అంటది కదా.గబక్కిన రెండి చెంబులు గుమ్మరిచ్చుకోని బువ్వ తినంగాలే కళ్ళు మూసుకోని పోతాయి. అంతే కాసేపన్నా పండుకొన్నట్టే ఉండదు. అలారం చెవిలో జోరీగలా ఒకటే నస. దాని నెత్తినొకటిచ్చి మళ్ళా ముసుగుతంతానా, ఇంటావిడ నస మొదులైద్ది. " ఏడున్నరైంది లే, లే . కూలీకి పోవాలన్లేదా " అని. ఇంగ లాభంలేదని ఎట్టాగోట్టగ గబ గబ ఎనిమిదింటికి బయటపడ్తానా, మళ్ళీ ఇల్లు చేరే సరికి ఏడున్నరైపోతా వుండాది.

అదండీ సంగతి, ఇంక టపాలేమి రాస్తాను. అయినా ఇప్పుడు ఇక్కడ టపా పడకపోయినంత మాత్రాన కొంపలేమీ మునగవు గానీ ఆఫీసులో పని చెయ్యకపోతే మునిగిపోతాయి కదా. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే నేను మహా బిజీ అనీ, అందుకని సరదాగా నయగారా ట్రిప్ వేసుకుంటే మనసుకు ఆహ్లాదమై పోస్టులు ఒకదాని తరవాత ఒకటి కుమ్మరించొచ్చనీ.... బొచ్చులేని గుండులోపల మెదడు దురద తట్టుకోలేక నయగారా ట్రిప్ వేసుకున్నాము. మేము అలా అలా ఆహ్లాదంగా ఆనందంగా ఆ ప్రయాణాన్ని ముగించుకొని వచ్చేలోపల నా బ్లాగుని లూటీ చేసెయ్యండి :)

ఇంకో కబురు, ఈ మధ్య శరత్ గారు వ్రాసిన టపా ఒకటి చదివాను.అదే బ్లాగర్ల సమావేశమని. అసలు అలా సమావేశమవసరమా అదీ మగవారితో అని నాకనిపించింది. ఎందుకంటే మగ బ్లాగర్లతో ఎన్ని కబుర్లు చెప్పినా ఉపయోగమేముంది చెప్పండి? కొద్దిగా అటూ ఇటూ తేడా వస్తే కారాలూ మిరియాలూ నూరతారు తప్పించి నిజమైన కారాలు మిరియాలు ఎప్పుడైనా పంపించాలనిపిస్తుందా మొగబ్లాగర్లకు ? పంపించడం దాకా పోయారు, సమావేశంలో నైనా స్వీట్స్ పెడతారా అంటే అదీ ఉత్తదే అని తేల్చేసారు. స్వీట్స్ పెట్టకపోయినా కనీసం ఓటెల్ కన్నా పిలుస్తారేమోలో అని ఎక్కడో వున్న చిన్న ఆశా దీపం కూడా ఆరిపోయింది. అందుకే మగబ్లాగరులారా , ఆడ లేడీస్ తో స్నేహం చెయ్యండి. వాళ్ళైతే అప్పుడప్పుడు అలిగినా, ఒకప్పుడు కాకున్నా ఒకప్పుడైనా నాలుగు మిఠాయి ముక్కలు మనోట్లో వేసే అవకాశం ఉంటుంది. ఇదిగో అలా వచ్చిన స్వీట్స్ ఇవిఇక పైన స్వీట్స్ ను, ఇంతకు మునుపు పంపిన స్వీట్స్ ను సుష్టుగా మా ఇంటిల్లపాదీ ఆరగించాము. అందరూ మీకు కృతజ్ఞతలు తెలుపమని మరీమరీ చెప్పడంతో ఎంత ఆలస్యమైనా ఈ టపా ఈరోజు వ్రాయాలని నిర్ణయంతో పూర్తిచేసాను.

ఇక చివరిగా ఈ ఆడోళ్ళున్నారే వీళ్ళ బుర్రకు రెండువైపులా పదునే. ఏదో స్నేహితులు పంపారు కదా అని హాయిగా తిని అవసరమైనంత మేర థ్యాంక్స్ చెప్పమని చెప్పి కదలకుండా పక్కకు పోవచ్చుకదా. అలా అయితే వీళ్ళు ఆడ బాసు లెందుకౌతారు? ఇంట్లో మా ఆవిడ,పిల్లలు తిన్నంతసేపు పంపిన నా స్నేహితులను పొగడ్తలతో ముంచుతూ తిన్నారా, తీరా నేను తిందామని ఒక స్వీట్ తీసుకొన్నానో లేదో అప్పటిదాకా పొగుడుతున్న మా ఆవిడ కంఠంలో తేడా వచ్చింది.

" ఎప్పుడూ మీఫ్రెండ్స్ పంపిస్తే తినటమేనా, మనమేదైనా పంపేదుందా ?" అంది? దెబ్బకు నాకు పొరబోయి గబుక్కున రెండు గ్లాసుల నీళ్ళు తాగాల్సివచ్చింది.

కొద్దిగా తేరుకోని "నువ్వు చేస్తే కదా నేను పంపేది " అని అందా మనుకొని ఠక్కున నోటికి బ్రేక్ వేసేసాను. కారణ మేమై ఉంటుందంటారు?


హలో మిత్రమ్స్, విన్నారుకదా అందరితరపున మరోసారి " కారము,తీపి దాతల్లారా సుఖీభవ."

13 వ్యాఖ్యలు:

 1. అప్పుడే అన్ని స్వీట్స్ తినేసేవా? కాసిని మాకు కూడా పంపించవచ్చు కదా. లడ్లు, కాజాలు, కారప్పూస, పకోడీ లు... హుం తిను తిను ఆశ కురుపులొస్తాయి లే..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. భా. రా. రె. గారు ఇందులో నే పంపిన రేగొడియాలు లేవే !! కొంపదీసి మీ ఇమానం డయివరుగానీ మేసేసాడా ఏందీ?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఇదేంది సోదరా అదేదో సామెతన్నట్టు అమ్రికాలో గూడా లడ్లూ,కాజాలు,కారప్పూసేనా?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. హహహ! బాగుంది. టెంప్లేటు ఇంకా చాలా బాగుంది.నయాగరా వెళుతున్నారా? గుడ్.ఎక్వేరియం తో సహా ఏదీ వదలొద్దు. అన్నీ తిరిగి రండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. భావనా :-), నువ్విలా అడుగాతావనే అన్నిటిపైనా థు, థు అని ఉమ్మేసి ఎంగిలి చేసాను. ఇప్పుడు ఎంగిలి చేసినవి పెట్టి పాపమెందుకు మూటకట్టుకోవాలి చెప్పు? ;)

  లలిత గారూ, మీరేగొడియాలు ఇమానం డ్రైవరు కాజేసిండేమో. అందుకని ఈసారి గట్టిగా మూటగట్టి పంపించండి :)

  విజయమోహన్ సోదరా, అదేకదా ఇండియాలో అమ్రికా కేండిస్ ఎలాగో , అమెరికాలో ఇండియా స్వీట్స్ అలాగన్నమాట.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. సునీత , అన్నీ నచ్చాయి కానీ స్వీట్స్ నచ్చలేదా :). నయగారాలో రెండున్నర రోజు ప్లాన్, ఎన్ని చూడగలిగితే అన్నీ చూసి వస్తాము.

  పద్మార్పితా, ఏమైపోయారు ఇన్ని రోజులు? నచ్చాయా అయితే ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. స్పీట్స్ మాక్కూడా పెట్టకపోయినా కనీసం చూపెట్టినందుకు థాంక్సు ;-) Have a nice trip to nayagara! :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అవి తప్పక మా గోదావరి జిల్లా నుంచి వచ్చిన మిత్రురాలు పంపినవేనా? :) ఇక ఈపాటికే మీరు "తి తి సం" = తినుబండారాలు తినే/తినిపించే సంఘం స్థాపన గురించి ఆలోచిస్తూ ఉండి ఉండాలే? నాకు మాత్రం సభ్యత్వం వద్దు గాక వద్దు. నయాగరా చక్కగా చూసి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగి రండి. మీ ఈ కుటుంబసమేత వేసవి విహారం మాకు చక్కని టపాని ఇస్తుందని ఆశిస్తూ.. మైత్రిభావనకి మరోసారి జిందాబాద్!

  భావన, నాకో ఊసు గుర్తుకి వస్తుందోయ్ - మా నాన్నగారు మా అందరికి నెలకి ఇన్నని చాక్లెట్స్, బిస్కట్స్ కొని విడి విడి డబ్బాల్లో సర్థి ఇచ్చేవారు. అలా ఎవరివి వారు వాడుకోవాలని ఆయన ఆలోచన. మా అన్నయ్య ఎప్పుడూ తనవి తినేసానని జాలి కబుర్లాడి పొదుపుగా వాడే నావి సగం కొట్టేసేవాడు. అలాగే చెల్లివీను. నేను కాస్త జాలి ఎక్కువై నా మిగిలిన సగం చెల్లికిచ్చేసి అనగా నా మొత్తం ధారబోసి తింగరదాన్నయ్యేదాన్ని. ఇక ఈ కథలో ఎవరు ఎవరో తేల్చగ ఆ పని నీకే వదిలేసా.. ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఇలా పిల్ల తిండ్లు తింటే పౌరుషం ఎట్టా వత్తాది? మాంఛి కొరివికారం, గొడ్డుకారం తినాల,
  జగన్ తిండ్లు (చిరు తిండ్లు అని మనం అనకూడదు ముందే సెప్తున్నా) కుడా ఏ మిరపగాయ బజ్జీ నో, మిరప పునుగులో, కారం అట్టో తినాల

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఉష, తిను బండారాలు తినిపించే సంఘం పెట్టాలంటే నాకు వంటలు పెద్దగా రావు కాబట్టి ప్రస్తుతానికి తినుబండారాలు తినే సంఘం తోనే సరి. అయినా మీకు తినుబండారాలు తినే సంఘంలో సభ్యత్వం ఉపయోగం లేదుకాబట్టి తిను బండారాలు తినిపించే సంఘంలో సభ్యత్వం ఇచ్చేస్తలే ;).

  ప్రత్యుత్తరంతొలగించు
 11. తారా, నా తిండి సంగతేం గానీ మీ ఊర్లో కొరివి కారం చిరు తిండిగా ఫేమస్ కదా. ఆ కొట్టొకటి పెట్టుకో బ్రహ్మాండంగా జరుగుద్ది. బజ్జీ ఒక్కటికి ఒకరూపాయి.పైన టిప్ రెండురూపాయలు మొత్తం కలిసి ఎనిమిది సెంట్లు. నీకష్టాన్ని చూడలేక జనాలు ఫ్రీగా కారం కాటుగ్గా పెట్టేసి వెళ్తారులే.

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form