6, ఆగస్టు 2010, శుక్రవారం

అమ్మాయిల పేర్లు ... చీపురు కట్టలు




నాకు ఈ మధ్య నా గాళ్ ఫ్రెండ్ ( అదేలేండి కొద్దిగా వెరైటీ కోసం ఈ గాళ్ ఫ్రెండ్ ప్రయోగం ) పేరును ఈ రకంగా మార్చాలని పించి అలాగే పిలిచాను. ఎంత చక్కగా వున్నాయో చూడండి ఆపేర్లు. మీకు కూడా నచ్చాయి కదా

౧) ప్రణతి
౨) ప్రజ్వల
౩) నిశ్చల

నాకైతే అన్ని పేర్లూ నచ్చాయి కానీ మొదటి పేరు బాగుంది కదా అని ఆ పేరుతో పిలిచాను. అటువైపు నుంచి సమాధానం లేదు. సరే చెవుడేమోలే, వినపడలేదేమో అని మళ్ళీ పిలిచాను. మళ్ళీ సమాధానం లేదు. ఈ సారి గట్టిగా పిలిచాను, పిలవగానే "ఊ" అని ఏంచక్కా పలకొచ్చు కదా. అబ్బే కట్ చేస్తే..

చీపురు కట్ట తీసుకోని నా వెంట పడింది. ఇంతకీ నేను చేసిన తప్పేంటబ్బా? ఎంత ఆలోచించినా అర్థం కాక తననే అడిగాను. అసలు ఆ పదానికి అర్థం తెలుసా నీకు అని మళ్ళీ వెంట పడింది. లగెత్తి లగెత్తి గస పెడుతూ ఇటు బ్లాగుల్లో ఎవరన్నా సపోర్టు వస్తారేమోనని దాంకోని మరీ ఈ టపా వ్రాస్తున్నా. మీరన్నా చెప్పండి అందులో నేను చేసిన తప్పేంటో.

అసలు అర్థం పర్థం లేని పేర్లకంటే ఈ పేర్లు ఎంత అందంగా వున్నాయో కదా. వున్న పేరునే సరిగ్గా పలకలేని ఈ కాలంలో హాయిగా నిమిషానికోపేరుతో నేను పిలుస్తుంటే పిలిపించుకోవచ్చుగా? చెవులకు ఇంపైన పదాలతో ఎంత ఆనందమో కదా. అదే మా పిల్లలు చూడండి ఒకరేమో తన అసలు పేరునొదిలేసి చెల్సియా ట్రాక్సెల్ అంటే కానీ పలకడం లేదు, మరొకరేమో రోజలీనా అంటే కానీ పలకటం లేదు. ప్చ్.. ఇలాంటి పేర్లకంటే నేను పైన చెప్పిన పేర్లు అందంగా వున్నాయా లేవా మీరే చెప్పండి. అందుకే పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదు "ఆడు వారి మాటలకు అర్థాలే వేరులే" అని. అంతేనా అదేదో సామెత గుర్తు లేదు కానీ ....ఆడవాళ్ళ మెదడు చదవడం మహా కష్టం సుమీ! " అంటాను నేను. "అబ్బ చా వూరుకో బాసు, వాళ్ళకు అసలు మెదడుంటే కదా" అంటారా? ఏమో బాబూ, ఆ మాట నేనంటే ఈ సారి నెత్తి బొప్పి కడుతుందేమో కాబట్టి నేననను కానీ , మీ గాళ్ ఫ్రెండ్స్ దగ్గర మీరు ట్రై చేసుకోండి. ఒకవేళ తేడా వస్తే ఎవ్వరికీ కనిపించకుండా నెత్తిన గుడ్డేసుకోని వచ్చి ఇక్కడ కామెంట్ వ్రాయండి. ముందే చెపుతుండా ఆడ లేడీస్ కు నో ప్రవేశం.

33 కామెంట్‌లు:

  1. కొంపదీసి ఆ పేర్లకర్ధం చీపురుకట్టలా:-) మీక్కూడా ఇద్దరూ అమ్మాయిలేనన్న మాట. హమ్మయ్య! నాకు తోడు ఇద్దరాడపిల్లలగురించి మొత్తుకోను ఇంకోళ్ళు దొరికారు:-)

    రిప్లయితొలగించండి
  2. ""అబ్బ చా వూరుకో బాసు, వాళ్ళకు అసలు మెదడుంటే కదా" అంటారా? ఏమో బాబూ, "
    ఎంచక్కా అనీ అననట్లు అని ఎంత బాగా కవర్ చేసుకుంటున్నారో? ఉమా, ఓసారి ఇలారా! ఇక్కడ ఓ లుక్ వెయ్యి.
    అసలు ఈ పోస్ట్ కవితగారు చూసారో లేదో!

    రిప్లయితొలగించండి
  3. ఎంత మాట ఎంత మాట??మా పేర్లు మార్చడమే కాకుంట ....మెదడు ఉందొ లేదో అనే సందేహం కూడా నా??ఆడ లేడీస్...మన మంత ఏకం కావలి....మనకూ మెదడు,పేరు ఉన్నాయని చాటి చెప్పాలి....హి హి హి హి ...బాగా ఇరుకున్నారు కదా...ఇప్పుడు మీకు ఒక సామెత గుర్తుకువస్తుంది కదా .."ఆడవాళ్లా ,మజాకా ??"

    రిప్లయితొలగించండి
  4. మీ గాళ్ ఫ్రెండుకి నేనో సలహా ఇద్దమనుకుంటున్నాను..ఓ సారి లైను కలుపుతారా?

    ఆవిడని మీరు ఇలా కొత్త పేర్లతో పిలిచినప్పుడల్లా మిమ్మల్ని అచ్చ తెలుగు పేర్లతో ఉదాహరణకు పెంటయ్య, పిచ్చయ్య, ఓబులేసు, అచ్చయ్యా ఇలా పిలవమని చెబుతాను.

    రిప్లయితొలగించండి
  5. ఏం భ.రా.రె.. అర్ధరాత్రి దాకా కూర్చుని రాసావా ఏమి పోస్ట్? నిద్ర లో కాస్త పదాలు ఎక్కువ వాడేసేవు.. బుర్ర లేదని ఏలిగేషన్స్ గట్రా.... ావును సునీత,ఈ అబ్బాయి కి గంజిపెట్టీ ఇస్త్రీ చెయ్యాలి... నేను చెపుతాలే కవిత కు.. She will take care of him. అప్పుడు అన్ని పేర్ల కు అర్ధాలు టీకా తాత్పర్యాలతో సహా ఇంకా ఎవరికి బుర్ర వుందో లేదో తేలిపోతుంది.
    ఆ.సౌమ్య: మీ సలహా సూపరు.. మన భా.రా.రె ను అతని గాల్ ఫ్రెండ్ పెంటయ్య పిచ్చయ్య అని పిలవటం వూహించుకోడి ఒకసారి. :-)

    అవునూ కామెంటు లు మేమే పెట్టీనట్లు వున్నాము మీ అన్నలెవ్వరు వత్తాసు రాలేదు చూసుకోండీ..

    రిప్లయితొలగించండి
  6. నన్నొగ్గెయండి బాబు, ఇక్కడ ఎదో ఒకటి రాస్తాను, మీరు జవాబు ఏమి ఇచ్చారో అని మళ్ళీ చుసేసరికి అన్న ఎదో ఒకటి కామెంటు, అది చూసి నాకు దెయ్యం పట్టి పద్యమో, పాటో ఖూనీ చెయ్యాలి, తరువాత కధలో నెనే హీరో..

    అదిగో అదెదో పుస్తకం రాసిండు అంట, అడిగారుగా, ౪౫౦ కాపీలు ఉన్నాయి అంట, మీరు ఎవరిని ఐనా చంపాలి అనుకుంటే కానియ్యండి, వారికో కాపీ, మర్చిపోయాను అది ఇంగ్లీషు బాష పుస్తకం అట..

    రిప్లయితొలగించండి
  7. హ హ సునీతా, నేనంత ప్రేమగా పెట్టుకున్న పేర్లకు చీపురు కట్టలా అని అర్థం తీస్తారా ;)? అవును నాకిద్దరు అమ్మాయిలు. అమ్మాయిలని మొత్తుకుంటున్నావా? నాకైతే ఎంత సరదానో వాళ్ళ ఆటపాటలు చూసి.

    ఇక మీరెండో కామెంట్... కవిత కు బ్లాగ్స్ అనే పదం కూడా తెలియకుండా పట్టుకొస్తున్నా కాబట్టి ఇక్కడ నేనే మహరాజు ని :)మొత్తానికి ఉమ కు కీ ఇచ్చి వదిలారు గా ;)

    రిప్లయితొలగించండి
  8. వో..ఇక్కడో కవిత వున్నారా :-). ఈ పేరు చూసి ఒక్కసారి ఉలిక్కి పడ్డానంటే నమ్మండి. ప్రొఫైల్ చూసాక కానీ గుండె దడ తగ్గలేదు :). అయినా మీ పేర్లకంటే నేను పెట్టిన పేర్లు బాగాలేవా అండి? చూస్తా చూస్తా నన్ను ఇప్పుడు ఇరికించినా నాకూ ఓ రోజు దొరుకుతుంది. అప్పుడు చెప్తా మీ అందరి పని. :-).

    "ఆడవాళ్లా ,మజాకా ??" నిజమే నండి. వాళ్ళతో వాదించాలంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే తిండి, తిండి కావాలంటే పెళ్ళాము. ఇంక మాకు దిక్కేది మరి? ;)

    రిప్లయితొలగించండి
  9. సౌమ్య..తప్పు తప్పు లెంపలేసుకోండి. చక్కగా రాముడు పేరు పెట్టుకున్న నన్ను అలా పిలిస్తే స్వామికి కోపం వస్తుంది. లైన్ ఎందుకండీ, బ్లాగులో నా లీలలన్నీ చెప్పి దోషిగా నిలబెట్టడానికా ;)



    భావనా.. రాత్రి చికెన్ బిరియాని తిని ప్రేమ కొద్దిగా ఎక్కువై పదాలు ఎక్కువ పడ్డాయేమో ;). ఆ నువ్వు మా యింటికి వచ్చినప్పుడు చూద్దాంలే ! ఈ లోపు టీకాలు బదులు ఠీకే అనిపిస్తాగా ;)

    అయితే నాకాపేర్లు పెట్టి పిలుస్తారా? హెంతవమానం . ఆడవారిని అసలు ఆదేవుడు హృదయం లేని బొమ్మలుగా చెక్కడానికి హెంత వెక్కి వెక్కి ఏడ్చి వుంటాడో ;)

    రిప్లయితొలగించండి
  10. తారా.. ఏంటి చావు కబురు చల్లగా చెప్తున్నావు. ఎక్కడా పుస్తకం? నేనడిగింది వున్న పుస్తకాన్ని స్కాన్ చేయమని కదా... ఏకంగా బొక్కే రాసిండా!!!!!!!!!!!!!! . ఎదీ లింక్ ఇస్తావా?

    రిప్లయితొలగించండి
  11. ఇ౦తకీ మీ అమ్మాయిల పేర్లు ఎంటండి భ. రా.రే గారు....మీకో సేక్రేట్ చెప్పాన..నా పేరు స్ఫూర్తి కాదు..బట్ స్ఫూర్తి అనే పేరు నాకు బాగా నచ్చి బ్లాగ్ లోకం లో నా పేరు అలా పెట్టుకున్న..ఇంకా నుండి మిగత నచిన పేర్లని కూడా ప్రయోగిస్త లెండి.

    రిప్లయితొలగించండి
  12. మీరిక్కరన్నా, ఇలా ఇష్టమొచ్చిన పేరు పెట్టుకున్నారు. ఇంతకీ మీఅసలు పేరు కూడా కాస్త చెవులో చెబుదురూ :D

    రిప్లయితొలగించండి
  13. ఏదీ మరి చెవిలా పడేయండి....
    గుస గుసాఆఆఆఆఅ గుస గుస స్స్స్స్స్స్ స్ స్

    వినిపించాయా అండి.

    రిప్లయితొలగించండి
  14. అలా అనుకోబట్టే కదా మగ జెంట్స్ ఇలా బుక్కైపోతోంది.

    నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మీ మగజాత్యహంకారాన్ని :D

    పోన్లెండి. అప్పుడప్పుడూ ఇలా మీరు అనుకోటం వల్లే ఎలాంటి expectations లేకుండా చడి చప్పుడూ కాకుండా పన్లు చేసుకుంటున్నాము

    రిప్లయితొలగించండి
  15. హి హి...మీకో చిన్న టెస్ట్ అయితే.. నా పేరు కాస్త ఐస్ క్రీం కి దగ్గర గ వుంటుంది :)) చెప్పుకోండి చూదాము.

    రిప్లయితొలగించండి
  16. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అనేదానిగురించి తరువాత తింక్ చేద్దాం...
    మీరు నో ఎంట్రీ అంటే మమ్మల్ని మాత్రమే కమెంట్ రాయమని అర్థమా...చెప్పండి:)

    రిప్లయితొలగించండి
  17. ప్రియా, అందరూ కలిసి నన్ను బుక్ చేస్తున్నారా అయితే. మా మగజాతి అహంకారాన్ని ఖండిస్తే మీ ఆడవారు ఎవరిమీద కోపతాపాలు చూపిస్తారండి. అందుకని మా మగజాత్యహంకారం ఇలాగే పదికాలాలపాటు ఆడవారి మీద చూపిస్తూ బతికేస్తుంటాం.
    >> అప్పుడప్పుడూ ఇలా మీరు అనుకోటం వల్లే ఎలాంటి expectations లేకుండా చడి చప్పుడూ కాకుండా పన్లు చేసుకుంటున్నాము

    ఏంపనులండీ :-)

    రిప్లయితొలగించండి
  18. స్పూర్తి..
    >> నా పేరు కాస్త ఐస్ క్రీం కి దగ్గర గ వుంటుంది :))

    ఆ తెలిసింది.. ఐస్ క్రీమ్ కి పుల్ల ఉంటుంది కాబట్టి మీ పేరు పుల్లమ్మా ;)లేక పాలతో చేస్తారు కాబట్టి పాపాయమ్మా ;)

    జోక్స్ అపార్ట్.. మీపేరు వెన్నెల.

    రిప్లయితొలగించండి
  19. పద్మార్పితా, అలా నిజాలు నాచేత చెప్పించకూడదండీ :-)

    రిప్లయితొలగించండి
  20. మర్సిపోయానబ్బ,

    అన్నాయి బ్లాగ్లో మీ కామెంట్కి జవాబుగా, తనో పుస్తకం (సైన్సు)రాసినట్టు సెప్పిండు, తరువతా అదొకటే కాకుండా ఇస్త్రీ వాదం మీద మూడు పుస్తకాలు, రాసి ప్రింటి తీసి ఒక ౪౦౦ పెట్టుకుర్సున్నాడు అట, అట్టే స్కాన్, జెరాక్స్ అంటే అదొకటి పంపుతాడు, తరువాత ఇంకో పుస్తకం కంప్యూటర్ కదిలించేసరికి పోయింది అట, యఫ్.బి.ఐ. వారు ఆ కంప్యూటర్ తీసుకెళ్ళి వెతుకుతున్నరు.. మొత్తం ఇప్పటికి తేలిన లెఖ్ఖ ఐదు.. మరి..

    రిప్లయితొలగించండి
  21. హి హి హి తారా ముందుగా మీరా పుస్తకాలు చదివి ఆ తరువాత కూడా కామెంట్ వ్రాయగలిగితే అప్పుడు చూద్దాము :)

    ప్రవీణ్ నేనడిగిన పుస్తకాన్ని స్కాన్ చేసినట్లైతే ఒక లింకు కొట్టు ఇక్కడ.

    రిప్లయితొలగించండి
  22. నాగార్జునా.. char e తీసేయడం ఏంబాలెదబ్బా... ;) ఆ పేరే బెట్టర్

    రిప్లయితొలగించండి
  23. పోష్‌గా ఉంటుందని అలా కానిచ్చేస్తున్నా..., నాక్కుడా ఎవరైనా అందితే అట్లకాడ అందకపోత చీపురుకట్ట పట్టుకునేవాళ్ళు దొరికేంతవరకు ఇదే మరి

    రిప్లయితొలగించండి
  24. హి హి నాగార్జునా ఆడవారు మన కష్టాన్ని ఊరక వుంచేసుకోరండి. వాళ్ళకు చేతనైన సాయాన్ని వాళ్ళు చేస్తుంటారు. సరే ముందు మీరాపని కానిచ్చేసేయండి. అప్పుడు ఇలాంటివి బోలెడు రాసుకోవచ్చు :)

    రిప్లయితొలగించండి
  25. బాబోయ్ నిజంగానే కావాలా అది?
    అన్న దాదాపుగా స్కాన్ చేసి పేట్టేశాడు. ఐనా ఆ పుస్తకం కావాలి అంటే? ఇంగ్లిష్ లో ఐతే మీ ఊళ్ళోనే దొరుకుతుంది కదా.. తెలుగులో కావాలి అంటే ఎదో ఒక పెద్ద లైబ్రరి లో వెతకాలి తప్పదు..

    రిప్లయితొలగించండి
  26. వో..ఇక్కడో కవిత వున్నారా :-). ఈ పేరు చూసి ఒక్కసారి ఉలిక్కి పడ్డానంటే నమ్మండి. ప్రొఫైల్ చూసాక కానీ గుండె దడ తగ్గలేదు :). అయినా మీ పేర్లకంటే నేను పెట్టిన పేర్లు బాగాలేవా అండి? చూస్తా చూస్తా నన్ను ఇప్పుడు ఇరికించినా నాకూ ఓ రోజు దొరుకుతుంది. అప్పుడు చెప్తా మీ అందరి పని. :-).

    రిప్లయితొలగించండి
  27. my BABY GIRL IS BORN ON DT23-8-2012 TIME 8.34AM. PLEASE GIVE ME BEAUTIFUL NAME STARTING WITH "THA"

    రిప్లయితొలగించండి
  28. Unknown, మీరెవరో తెలియదు. కానీ అడిగారు కాబట్టి ఈ వివరణ

    "థ" మీద పేరు కోసం ఇలా బ్లాగుల్లో వెతకటంకంటే, మీకు "థ" మీద పేరు పెట్టమని చెప్పిన బ్రాహ్మణుడినే అడగడం మంచిదేమో !

    సందర్భం ఎలాగూ వచ్చింది కాబట్టి పేరు మీద నా అభిప్రాయాలివి

    ౧) ఎవో అక్షరాలు బాగున్నాయనో లేక బాపనాయన ఈ అక్షరం మీద పెట్టమన్నాడనో కాకుండా పేరు అర్థవంతంగా వుండాలి. ఇక శాస్త్రం,పెద్దోళ్ళు అంటారా? ఆ శాస్త్రం చెప్పినాయనో థ మీద దొరకకపోతే ఓ శాంతి చేసి నాలుగురాళ్ళెనెక వేసుకోని మీకు నచ్చిన అక్షరంతో పెట్టుకోమని చెప్పవచ్చు. అప్పుడు ఇరువైపుల శాంతి. ఎవరికీ ఏ అనుమానాలూ వుండవు.

    ౨) ఇంతకుముందు తరం వాళ్ళ లాగా కాకుండా, పేరు మరీ పెద్దది కాకుండా చూసుకోండి. పెద్దపేరైతే అది పాస్పోర్ట్/ వీసా లో నానా ఇబ్బందులు. అంతే కాకుండా పెద్దాయ్యాక నలుగురు నాలుగు రకలుగా పిలుస్తారు. నా స్వీయ అనుభవం :))

    ౩) మీరు పెట్టే పేరుకు మంచి అర్థము, స్త్రీ సూచకమైన పదము వచ్చేట్టుగా చూసుకోండి.

    చివరిగా, మీ చిన్నారికి ఆశిస్సులు.

    రిప్లయితొలగించండి

Comment Form