1, సెప్టెంబర్ 2010, బుధవారం

ఏమి వ్రాయను ఈ మృగతృష్ణ గురించి?





కళ్ళలో ప్రతిబింబించే ప్రతిమ రూపాలు
సుందర సఖీ వలపు విలాసాలు
అధర ధరహాస వింత వర్ణాలు
ఎండమావిలా బహు చేరువే!


మనసులోని భావవీచికలు వేడి గాడ్పులకు ఆవిరయ్యాయ్యా
అందాల అద్దాల మేడ మాటల బీటలు పారిందా
నిండు కుండ తొణికి ఒట్టిపోయిందా
బేధ భావల వలలో చిక్కి చిన్నబోయిందా !

అహంకారం ఆత్మస్థైర్యం
పరుషవాదం మిత్రవాదం
ఏది వరం ఏది శాపం
మనిషి మనుగడకు!

మాయా లోకంలో
యామిని కౌగిలికై
నిట్టూర్చి నిశ్చేష్టితయై
నిందను మోసిందా?

రంగేళి రాత్రులందు రసమయమై
ఆత్మ స్వరూపాన్ని ఎదురుగ కనిందా!

15 కామెంట్‌లు:

  1. గీతిక,
    చిన్ని,
    రాధిక,
    సునీత

    అందరి వ్యాఖ్యలకు ధన్యవాదలండి.

    రిప్లయితొలగించండి
  2. ఆరునెల్లు సావాసం చేస్తే వారు వీరౌతారంట....కవితల్లో మీ స్ధాయికి నేను చేరలేకపోయినా...పెయింటింగ్స్ విషయంలో మాత్రం మీరు నా రూట్లోకి వచ్చేస్తున్నారుగా:):)భలే భలే!

    రిప్లయితొలగించండి
  3. పైన చిత్రం మీరు గీసిందా.., నేను నెట్‌లో ఎవరిదో వాడుకున్నారేమో అని పట్టించుకోలేదు సుమా..

    బాగు బాగు, భలే వున్నది..
    ఇంకా మీరు గీసినవి కుడా పరిచయం చేయొచ్చుగా..

    రిప్లయితొలగించండి
  4. పద్మార్పితా, కనీస సావాస దోషంగానైనా మీ విద్య నాకు అబ్బితే బాగుండు. నాకు పైంటింగ్స్ అంత బాగా రావు. పైనది నెట్ లో చూసి పైంట్ వేద్దామని ప్రయత్నించి కార్పెట్ కు రంగులు పూసి మొత్తానికి అదేదో గా తయారయింది. ఎందుకొచ్చిన గొడవలే అని ఒరిజినల్ కాపీ పెట్టేసాను :-).

    తారా :-) పైన సమాధానమే మీక్కూడా ;)

    అయితే నేను గీసిన పైంటింగ్స్ చూస్తారా? చూసి తట్టుకోగలరా అంట :-)

    రిప్లయితొలగించండి
  5. >>కార్పెట్ కు రంగులు పూసి మొత్తానికి అదేదో గా తయారయింది

    దాన్నే మోడ్రన్ పెయింటింగ్ అంటారు..

    ఏది ఓపాలి పెట్టొచ్చుగా.. చూస్తాం

    రిప్లయితొలగించండి
  6. వో నైస్ నువ్వు వేసేవాఈ పెయింటీంగ్? ఆ పైన మబ్బులో కింద పడవ నీడా? బాగా వేసేవు భా.రా.రే. నువ్వు నేనుబొమ్మలేస్తా అంటే కామెడీ అనుకున్నా నిజం గానే వేస్తావన్నమాట ఐతే. నైస్ జాబ్.

    రిప్లయితొలగించండి

Comment Form