8, అక్టోబర్ 2010, శుక్రవారం

భలే స్మార్టూ ఈ ఫోన్సూ. చిన్న సర్వే ( అభిప్రాయ సేకరణ )

మనకు ఇండియాలో ఎన్ని Smart phones వుండవచ్చో !!! ఈ రోజు ఏదో మీటింగ్ లో కూర్చొని వుంటే ఈ అనుమానం కలిగింది. ఇంటికొచ్చి గూగ్లింగ్ చేస్తే 2009 లెక్కల ప్రకారం ఈ విధంగా వున్నదని DataQuest వారు చెప్తున్నారు.

చూస్తుంటే వాడక దారుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గే సూచనలేమాత్రము ఏ దేశంలో కనిపించడం లేదు కదా. ఇక ఈ వ్యాసం విషయానికి వస్తే ఇంతకీ భారతదేశంలో Android Phones వచ్చాయా? IPhones వచ్చాయని విన్నాను. ఇంకా Nokia ఏఏ మోడల్స్ విడుదలచేసిందో తెలియదు. వేరే ఎవరెవరు రంగంలో వున్నారో తెలియదు కానీ ఈ Smart phones అన్నింటికి ప్రధానంగా కావలసింది wireless internet.

1) ఇప్పుడు మనకు ఈ wireless internet speed ఎలా వుంది? అంటే చిన్న వుదాహరణగా చెప్పాలంటే మన Aggregators ని Smart phone లో browse చేయాలంటే అసలు download అవుతుందా?

2) అలాగే browsing (Data plan) unlimited గా చేసుకోవచ్చా లేదా upload/download size మీద ఏమైనా నిబంధనలున్నాయా

3) voice recognze చేసే Smart phones ఏవైనా మార్కెట్ లో వచ్చాయా? అవి ఏ operating systems ని వాడుతున్నాయి. [ అమెరికాలో Apple, Andriod Operating System లాగా ].

4) ఒకవేళ వుంటే English voice మాత్రమే recognize చేయగలవా లేదా భారతీయ భాషలను కూడా recognize చేస్తున్నాయా?

5) అసలు Indian english ఈ voice recognizers కి అర్థమవుతుందా ? :-)

అబ్బో ఇప్పటికే చాలా చాలా ప్రశ్నలడిగినట్టున్నా కదా :-)

అసలు విషయానికొస్తే మన బ్లాగర్ల వద్ద Smart phones ఇప్పటికే కుప్పలు కుప్పలు వుండి వుండాలను కుంటున్నాను కాబట్టి పై ప్రశ్నలకు సమాధానాలు చిటికెలో చెప్పేస్తారేమో అని చూస్తున్నాను.

చివరిగా మరో ప్రశ్న, ఈ Smart phones కస్టమర్ సర్వీస్ ఎలా వుంది? ఏదో అవసరమొచ్చి పొరపాటున ఫోన్ చేస్తే లైన్ easy గా దొరుకుతుందా? లేదా నీ ఫేస్ కి ఈ music చాలా ఎక్కువ అని free గా సంగీతం వినిపించి నరాలు తెంచేస్తున్నారా?

టపా అంతా ప్రశ్నలే కదా ! అందుకే అన్నారు


బ్లాగులు చదవుకురా
బుఱ్ఱలు చెడునురా

అని. మరో మాట కూడానండోయ్...

పిల్లగాడైతే మాములు ఫోను
పక్కన పిల్లుంటే ఐ-ఫోను

14 వ్యాఖ్యలు:

 1. 256 kbps కన్నా ఎక్కువ లేదు. దాంతో వైఫై డివైజెస్‌కి సిగ్నల్ సరిగ్గా లేదు. నేను వైరలెస్ రౌటర్ పంపించా గుంటూరుకి. దాన్ని హుక్ చేసాక ల్యాపీలో షోమి వైరెల్స్ నెట్వర్క్స్ అంటే చూపట్లేదు లేక చూపినా లోడ్ కావట్లేదు పేజీలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ______________________________
  256 kbps కన్నా ఎక్కువ లేదు.
  ______________________________

  Bhaskara anna- Are you saying about 2G or 3G? AFAIK, we've good data rates on 3G. But If you use mobile phone as 3G modem, I think you can't get better data rates. Let us see what others say.

  I'm wondering whether do we have wirless routers from Wireless wan(2g or 3G) to Wi-Fi(Wireless LAN). I think till now we've only [A]DSL routers with built in FE(for PPPoE) and a Wi-Fi port. Let me know if I miss any thing?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. cell phones సంగతి సరే కాని మీటింగ్ లో కుర్చుని ఇవ్వా నువ్వు ఆలోచిస్తోంది? :-|

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Few products that convert 3G to Wi-Fi

  http://www.techchee.com/2009/09/11/huawei-e5-portable-3g-wifi-router/

  http://www.dlink.com/products/?pid=524

  http://blogs.techrepublic.com.com/hiner/?p=899

  భాస్కర రామి రెడ్డి:Pl. feel free to remove my comments, if you think unrelated to post!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. 1) ఇప్పుడు మనకు ఈ wireless internet speed ఎలా వుంది? అంటే చిన్న వుదాహరణగా చెప్పాలంటే మన Aggregators ని Smart phone లో browse చేయాలంటే అసలు download అవుతుందా?

  I tried accessing maalika and haaram over GPRS & 3G networks of BSNL with Nokia 5800. Over GPRS it took 3-4 mins to load. Over 3G around 30-40secs.


  2) అలాగే browsing (Data plan) unlimited గా చేసుకోవచ్చా లేదా upload/download size మీద ఏమైనా నిబంధనలున్నాయా?
  There are data plans with unlimited download but expensive. There are some from BSNL offering 200MB free data download, after that you have to pay 1ps per 10kbps.


  Over 3G browsing experience was good.
  I felt the difference big between 512KB/s(over 3g) and 10KB/s(GPRS) when compare to 20MB/s to 512KB/s :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. my experience is pretty bad as they work more as handhelds than phone. Not able to have telugu font is my biggest complaint. mine is windows mobile OS

  ప్రత్యుత్తరంతొలగించు
 7. the problem is vth mobile browser in gprs phones. opera mini is a good solution. the blog aggrigaters open in almost a blink :D
  the speed is also okay.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @గణేష్. భాస్కర రామరాజు ఇక్కడ వుండటంతో వివరాలు తెలిసి వుండకపోవచ్చు. ఇక పోతే మీ ప్రశ్నకు మీరే సమాధానం కనుక్కోవడం బాగుంది. మీ వ్యాఖ్య టపా కు సంబంధించిందే. అయినా టెక్నాలజీ మాట్లాడుకొనేటప్పుడు మనం గిరిగీసి నేనిది తప్ప మాట్లాడను అని ఎవ్వరూ అనుకోరేమో కదా. నేర్చుకోవడమే ముఖ్య విషయం కాబట్టి.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. భావనా నువ్వు మీటింగుల్లో ఓ పడి పడి వింటావా లేక ఓ కునుకేస్తావా? ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. బద్రి మీ సమాధానాలు బాగున్నాయి. మనకు కూడా నెట్ అంత ఫాస్ట్ గా వున్నందకు ఆనందంగా కూడా వుంది. కాకపోతే unlimited data plan ఎక్కువగా వుండటం నచ్చలేదు. 200 MB data download మనలాంటోళ్ళకి ఒక్కరోజు కూడా రాదేమో :-(.

  మీరు speak it లాంటి applications ఈ డివైజెస్ లో వాడి చూశారా? భారతీయ భాషలకు ఇలాంటి application ఏమైనా వుందా? ఏ OS ఎక్కువ పాపులర్ అయింది. వివారేలేమైనా తెలిస్తే చెప్పగలరా.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. సత్యసాయి కొవ్వలి గారూ, తెలుగు అక్షరాల విషయంలో వీవెన్ గారేమైనా కృషి చేయగలరేమో చూద్దాము.


  krishna, yes, Opera mini is a perfect fit. అయితే తమరు బ్లాగులని , aggregators ని gprs phone లో ఆడేసుకుంటున్నారన్నమాట :p

  శ్రీకాంత్ గారూ, మీ సమాచారానికి ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form