3, నవంబర్ 2010, బుధవారం

ఇంతబతుకు బతికి ఇంటెనకాల చావడమంటే ఇదే మరి

ఒకటో తరగతి పిల్లోడినడిగినా ఈ క్రింది అక్షరాలేమిటో ఠక్కున చెప్పేస్తాడు.



అదే నాలుగు గాట్టిగా పీకితే నాలుగు సార్లు తికమక పడ్డా ఈ క్రిందివి కూడా తప్పులు లేకుండా చక్కగా చెప్పేస్తాడు.




ఓ కంప్యూటర్ సూపర్, కత్తి, నాబొంద, మట్టి మశానం అని తెగ డబ్బా కొట్టుకోవడమేకానీ ఇంతబతుకు బతికి ఇంటెనకాల సచ్చినట్టు ఆ పైనున్న పట్టుమని పదచ్చరాలను కనిపెట్టరా ఓ కంప్యూటరన్నా అంటే మొఖం తేలేస్తాడు. :(

ఒకటో తరగతోడు ఠక్కుమని చెప్పే ఆ అచ్చరాలు పేద్ద పేద్ద లెక్కలు చిటికలో చేసోటోడు ఈ కంప్యూటర్ గాడికెందుకంత కష్టమైపోతుంది? అంతదాకా ఎందుకు ఒక పిల్లినో , పిట్టనో చూపిస్తే పాలబుగ్గల చిన్నారి కూడా కేరింతలు కొడుతూ చెప్పేస్తుంది. అలాంటిది పిల్లి, పిట్ట స్కాన్ చేసి కంప్యూటర్ గాడికిచ్చి " లక లక లక లక " ఇదేం బొమ్మో చెప్పమని అడగండి. ఏం సమాధానమొస్తుంది?

ఇలాంటి చిన్న చిన్న ఇంకా చెప్పాలంటే మనిషికి అత్యంత సులువైన విషయాలు ఈ కంప్యూటర్ కెందుకంత కష్టం?


stay tuned for artificial neural networks.



ఈ లోపు ఈ క్రింది పదాలకు మాంచి తెలుగు అర్థాలు సూచిస్తే రాబోయే పోస్టుల్లో వాడుకుంటాను.


Activation Level
Analog Computer
Artificial Intelligence
Artificial Neural Network
Axon
Binary
Biological Neural Network
Classification
Dendrite
Digital Computer
Hidden Layer
Input Layer
Layer
Matrix
Neuron
Output Layer
Neural Networks
Pattern Recognition
Prediction
Supervised Training
Signal
Synapse
Thresholds
Training
Truth Table
Unsupervised Training
Weight Matrix
Validation
XOR

అలా అని అంతా తెలుగులో వ్రాయలేను కానీ సాధ్యమైనంత తెలుగు పదాలు వాడుకుంటాను.

11 కామెంట్‌లు:

  1. గుండ్రంగా రాస్తే గుర్తు పడుతుందేమో
    కొంచెం కాపీ బుక్కులు కొనుక్కోండి ;)

    ఓ పదేనేల్ల క్రితం కాలేజీ ప్రాజెక్ట్ లో pattern recognition with ANN చేసాం. అప్పటికింకా కంపూటర్లంత విరివిగా వాడకంలోకి రాలా.

    viva లో ఓ పిచ్చి professor మమ్మల్ని తెగ ఆడుకున్నాడు. he expected that the program will automatically identify the patterns (without training) and thus extremely disappointed that we did some useless work ;)

    రిప్లయితొలగించండి
  2. Binary -- ద్విసంఖ్యా మానం
    Weight Matrix -- భార మాత్రిక
    Validation -- సరిచేయు
    Training -- శిక్షణ
    Prediction --
    Classification -- వర్గీకరణ
    Artificial Intelligence -- కృత్రిమ తెలివి -)

    రిప్లయితొలగించండి
  3. Validation - పరిశీలించు
    Prediction - జోస్యం

    @oremuna
    కృత్రిమ తెలివి...బాగుంది :-)

    రిప్లయితొలగించండి
  4. Layer - పొర
    Hidden Layer - దాగిఉన్న పొర
    Matrix - మాత్రిక
    Training - శిక్షణ
    Truth Table - నిజ నిర్దారణ పట్టిక

    రిప్లయితొలగించండి
  5. truth table -satya pattika
    neuron -naadI kaNam
    artificial intelligence- krutrima medha(ssu)

    రిప్లయితొలగించండి
  6. WitReal :)).... కాపీ పుస్తకాలు తెలుగుకు వ్రాయలేదుకానీ ఇంగ్లీష్ మూడోబడి అచ్చరాలకు మాత్రం ఓ తెగ అరగదిద్దాను. తీరా ఇప్పుదు చూస్తే నాకు మూడో బడి రాదు. గుండ్రంగా వ్రాస్తే గుర్తు పడుతుందేమో.. ఏమో చూద్దాం. అప్పటి ANN ఇంకా గుర్తు వుందా? ఇప్పుడు మీరు ఎందులో చేస్తున్నారు?

    అయినా మీ Wit కాకపోతే viva కొచ్చిన prof మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా? నిజంగానే!!! అయితే నోబెల్ ప్రైజ్ గ్యారెంటీ :-)

    రిప్లయితొలగించండి
  7. oremuna, అమర్ (Amar), కృష్ణుడు ...తెలుగు పదాలు బాగున్నాయి కొన్నిటిని తప్పక వాడతాను.

    కృత్రిమ తెలివి :-)) this is super.. but I like

    కృత్రిమ మేధ . ఇంకా మంచి పదం దొరికేదాకా దీనికి నేను పంకాను. అలాగే నాడీకణం, సత్యపట్టిక, పొర,వర్గీకరణ,శిక్షణ,భార మాత్రిక బాగున్నాయి.

    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. >> గుండ్రంగా వ్రాస్తే గుర్తు పడుతుందేమో.. ఏమో చూద్దాం.
    pattern లో బాగా variation వుంటే recognition కష్టమవుతుంది.

    >> అప్పటి ANN ఇంకా గుర్తు వుందా?
    బూజు దులపాలి సార్.. పదేల్లనించి కోడింగే చెయ్యటం లేదు. iima కి వెల్లొచ్చిన తర్వాత సాఫ్ట్వేరంటేనే మర్చేపోయా ;)

    >> ఇప్పుడు మీరు ఎందులో చేస్తున్నారు?
    పనీ పాటా లేక బ్లాగుల్లో కామెంట్లు రాసుకుంటున్నా ;)

    రిప్లయితొలగించండి
  9. ఛీ చీ witreal..మీలాంటోళ్ళందరూ పొయ్యి అలా అది చేయ్యండ్రా, ఇది చెయ్యండ్రా అని orders ఇచ్చే సదువులు సదివేత్తే ఇంక సరైన పనులెవరు సేత్తారంట :)

    వు గుండ్రంగా అని కాదు కానీ variable width problem అవుతుందేమో.

    >>> పనీ పాటా లేక బ్లాగుల్లో కామెంట్లు రాసుకుంటున్నా ;)

    ఇది సూపరు.. :-)))

    రిప్లయితొలగించండి
  10. భాస్కరరామిరెడ్డి గారూ !
    మీ కృషికి అభినందనలు.
    మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు
    - శి. రా. రావు
    శిరాకదంబం

    రిప్లయితొలగించండి

Comment Form