28, నవంబర్ 2010, ఆదివారం

వెన్నెల చెరిగింది.





గతంలో విరిసిన వెన్నెల
రంగుటాకుల మీద పరావర్తనమై
ఇంద్రచాప కాంతుల్ని వర్షించింది
ఆశల పర్వతాన్ని తన కాంతుల్తో నింపింది

ఋతు మార్పిడి కాలచక్ర గమనంలో
రంగురంగుల ఆశలన్నీ నేలరాలాయి.

వర్ణ పత్రాలు లేవు , హరిత వర్ణమూ లేదు
వరించిన ఆశలు లేవు, వర్షించే మనసూలేదు
పున్నమి వెన్నెల వెండిముద్దలా
కరిగి కాంతులీనుతూనే వుంది.
మరో ఋతువు కోసం మది తపిస్తూనే వుంది.

************************************************

మరో ఋతువు, మరో శుభోదయం
మానవ మనుగడ కింధనం
మనిషి జీవనానికి నవోదయం

4 కామెంట్‌లు:

  1. వర్ణపత్రాలులేవు హరిత వర్ణము లేదు

    నా కళ్ళముందు మంచుపూల వాన మాత్రమె వుంది ................కదూ :-)

    రిప్లయితొలగించండి
  2. హ హ చిన్నీ రేగొడియాలు తిని మీకు తెలివి చిటికెలో వచ్చేసినట్టుంది :). అంటే ఇంతకుముందు లేదా అని కాదులే :))

    రిప్లయితొలగించండి
  3. బొమ్మ కళ్ళకు ఆహ్లాదాన్నిస్తే
    మీ భావుకత మనసుకి ఆనందాన్నిచ్చింది.

    ప్రకృతికే కాదు మనసుకీ కొత్తదనం అన్నది కావాలి. లేకపోతే జీవితం యాంత్రికమైపోతుందేమో...

    గీతిక

    రిప్లయితొలగించండి
  4. గీతిక గారూ,
    అవునండీ ప్రకృతికి వన్నెలెంత అందమో, ఎంత సహజమో, మనిషికీ జీవితంలో తెలియని మార్పులూ అంతే సహజం. ఋతువర్ణావిష్కరణ లాగా రకరకాల భావ సమ్మిళితం. వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

Comment Form