28, నవంబర్ 2010, ఆదివారం

వెన్నెల చెరిగింది.





గతంలో విరిసిన వెన్నెల
రంగుటాకుల మీద పరావర్తనమై
ఇంద్రచాప కాంతుల్ని వర్షించింది
ఆశల పర్వతాన్ని తన కాంతుల్తో నింపింది

ఋతు మార్పిడి కాలచక్ర గమనంలో
రంగురంగుల ఆశలన్నీ నేలరాలాయి.

వర్ణ పత్రాలు లేవు , హరిత వర్ణమూ లేదు
వరించిన ఆశలు లేవు, వర్షించే మనసూలేదు
పున్నమి వెన్నెల వెండిముద్దలా
కరిగి కాంతులీనుతూనే వుంది.
మరో ఋతువు కోసం మది తపిస్తూనే వుంది.

************************************************

మరో ఋతువు, మరో శుభోదయం
మానవ మనుగడ కింధనం
మనిషి జీవనానికి నవోదయం

3, నవంబర్ 2010, బుధవారం

ఇంతబతుకు బతికి ఇంటెనకాల చావడమంటే ఇదే మరి

ఒకటో తరగతి పిల్లోడినడిగినా ఈ క్రింది అక్షరాలేమిటో ఠక్కున చెప్పేస్తాడు.



అదే నాలుగు గాట్టిగా పీకితే నాలుగు సార్లు తికమక పడ్డా ఈ క్రిందివి కూడా తప్పులు లేకుండా చక్కగా చెప్పేస్తాడు.




ఓ కంప్యూటర్ సూపర్, కత్తి, నాబొంద, మట్టి మశానం అని తెగ డబ్బా కొట్టుకోవడమేకానీ ఇంతబతుకు బతికి ఇంటెనకాల సచ్చినట్టు ఆ పైనున్న పట్టుమని పదచ్చరాలను కనిపెట్టరా ఓ కంప్యూటరన్నా అంటే మొఖం తేలేస్తాడు. :(

ఒకటో తరగతోడు ఠక్కుమని చెప్పే ఆ అచ్చరాలు పేద్ద పేద్ద లెక్కలు చిటికలో చేసోటోడు ఈ కంప్యూటర్ గాడికెందుకంత కష్టమైపోతుంది? అంతదాకా ఎందుకు ఒక పిల్లినో , పిట్టనో చూపిస్తే పాలబుగ్గల చిన్నారి కూడా కేరింతలు కొడుతూ చెప్పేస్తుంది. అలాంటిది పిల్లి, పిట్ట స్కాన్ చేసి కంప్యూటర్ గాడికిచ్చి " లక లక లక లక " ఇదేం బొమ్మో చెప్పమని అడగండి. ఏం సమాధానమొస్తుంది?

ఇలాంటి చిన్న చిన్న ఇంకా చెప్పాలంటే మనిషికి అత్యంత సులువైన విషయాలు ఈ కంప్యూటర్ కెందుకంత కష్టం?


stay tuned for artificial neural networks.



ఈ లోపు ఈ క్రింది పదాలకు మాంచి తెలుగు అర్థాలు సూచిస్తే రాబోయే పోస్టుల్లో వాడుకుంటాను.


Activation Level
Analog Computer
Artificial Intelligence
Artificial Neural Network
Axon
Binary
Biological Neural Network
Classification
Dendrite
Digital Computer
Hidden Layer
Input Layer
Layer
Matrix
Neuron
Output Layer
Neural Networks
Pattern Recognition
Prediction
Supervised Training
Signal
Synapse
Thresholds
Training
Truth Table
Unsupervised Training
Weight Matrix
Validation
XOR

అలా అని అంతా తెలుగులో వ్రాయలేను కానీ సాధ్యమైనంత తెలుగు పదాలు వాడుకుంటాను.

2, నవంబర్ 2010, మంగళవారం

నిఘంటు వేదిక కందిన పూర్తి విరాళాల వివరాలివి

మొన్న నిఘంటువు తయారుచెయ్యడంకోసం విరాళాల సేకరణలో భాగంగా అందిన విరాళాల వివరాలివి.మాకు మొదటిదశకు సరిపడా డబ్బు సమకూరినట్లే వుంది. ధనసహాయానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.













పేరుబ్లాగువిరాళము
Donor 1----Rs10,000
తెలుగుయాంకిhttp://teluguyankee.blogspot.com$50
ఆకెళ్ళ సత్తిబాబు----$100
భాస్కర రామి రెడ్డిhttp://chiruspandana.blogspot.com$516
ఉషhttp://maruvam.blogspot.com$1116
జయ http://manasvi-jaya.blogspot.comRs10,000
Donor 2----$100
Donor 3----Rs 2000
Donor 4----$25
విమలhttp://himanadam.blogspot.comRs 2500
Donor 5----Rs 2000



మొత్తం : Rs 26,500 మరియు $1907

పైవారందరికి విడివిడిగా మైల్స్ పంపుతున్నాను.