29, మార్చి 2011, మంగళవారం

అందనంత ఎత్తులో అంతులేని మమత


ఎక్కడో గ్రుచ్చుకొనే ముల్లు
జీవితపు చిక్కు ముళ్ళలో
పదునెక్కి చిక్కబడిన ముల్లు

అంతులేని మమత
అందనంత ఎత్తులోనువ్వు
జీవన రాగాలాలపిస్తూ
గలగలా పారే సెలయేటిలా

ఉరుకుల పరుగుల జీవితంలో
దుమ్ముకొట్టుకుంటున్న జీవితం
అప్పుడప్పుడూ రాలిపడే నక్షత్ర రజం
మిగిలిన జీవితాన్నీ కాల్చేస్తుంది

ఆగి ఆగి వీచే సుడిగాలిలో
అప్పటిదాకా ప్రోగైన
మమతానురాగాల కుప్ప
కొట్టుకు పోయింది

ఏదీ నీస్పర్శ? ఏదీ ఆ మమత?
ఏదిక్కున వెదకేది? ఎలా వగచేది?

జీవితం సాఫీగా నడుస్తుంది
దిక్కులేని బాటసారికిమల్లె.

8 కామెంట్‌లు:

  1. ముల్లా? - ఆ ఏముంది? చాణక్యుడిలా కాల్చి నీళ్ళలో కలిపి తాగేస్తే సరి...

    మమతా? ఆవిడెక్కడో రైళ్ళ పరిస్థితి చూస్తోందని విన్నానే! ఇప్పుడు ఎత్తులు, సెలయేళ్ళు చూస్తోందన్నమాట...:) అయినా ఆ రెండో పాదంలో పై రెండు లైన్లు అటూ ఇటూ మార్చేసి చూడండి, కొద్దిగా క్లారిటీ వస్తుందేమో కవితకు?...లేకపోతే ఆ బెనర్జీకి అంకితమివ్వొచ్చు...

    ఒక్కటే గుర్తు - ఎప్పటికైనా ఉరకటమే పరమావధి, పరుగులు పెడితే ఇప్పుడే అవసరం లేని సమాధి

    కుప్పలు పెడితే సుడిగాలి అవసరం లేదనుకుంటా.....చిరుగాలే చాలు.....అందుకు కొండలు, పర్వతాలు పెంచుకోవాలి...

    ఇహ మిగతా నాలుగు లైన్ల గురించి చెప్పేదేమీ లేదు....

    చాలా రోజుల తర్వాత రాసేందుకు అవకాశం వచ్చింది...రాసినందుకు, రాయించినందుకు సంతోషం...

    రిప్లయితొలగించండి
  2. జీవితపు చిక్కు ముళ్ళలో
    చిరుస్పందనలు చిక్కబడి పోయాయా!
    హ్మం ..దిక్కులేనిబాటసారికి జీవితం సాఫియే కదా:-):)

    రిప్లయితొలగించండి
  3. హహహ్హ్హ ..వంశీ గారూ మీరుండాల్సిన వారు సుమా.. ఈ మమత ను తీసుకెళ్ళి ఆ మమతకు ముడేసారు. ప్చ్..చాణుక్యునికి కుచ్చుకున్న ముల్లు వేరు కాబట్టి ఆయనకు అలా ఆ ముళ్ళనీళ్ళు సంవత్సరాల తరబడి పనిచేసాయి. అయినా ఆయనకున్నది అదొక్కటే పని కదా మరి . మరి మనకో :-).

    కవితను చీల్చి చండాడి నందుకు నిజంగానే కృతజ్ఞతలు. మీరు చెప్పిన ఆ రెండో పాదమేదో నాకు సరిగ్గా అర్థం కాలేదు కానీ , నేను పొద్దుటీడి రైల్లో రైలుకంటే వేగంగా ఏ సుదూర ప్రాతాల్లోనో విహరిస్తూ వ్రాసేటప్పుడే మారిస్తే బాగుంటుందేమో అనుకొని టైటిల్ గా పెట్టిన మాటలేమో..అవే ఐతే..ఆ నాలుగులైన్లు ఇవి. కుదరకపోతే మన బెనర్జీ ఎలాగూ వున్నాడు కదా.. వాడికి అంకితమిచ్చినా వాడు తిట్టుకుంటాడు కాబట్టి ఆలైన్లేవో చెప్పేసి కూసింత బంగ్లా బాబుకు కూడా మనశ్శాంతి చేకూర్చండి :)

    అందనంత ఎత్తులో
    అంతులేని మమత
    జీవన రాగాలాలపిస్తూ
    గలగలా పారే సెలయేటిలా

    నిజమే సుమా.. ఈ కుప్ప కొట్టుకుపోవడానికి సుడిగాలి అక్కరలేదు. చిరుగాలైనా చాలు. అలా అనుకుంటే

    ఆగి ఆగి వీచే చిరుగాలికే
    అప్పటిదాకా ప్రోగైన
    మమతానురాగాల కుప్ప
    కొట్టుకు పోయింది.

    వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. చిన్నీ :-)... ఒక్కోసారి దిక్కులేని బాటసారికి ఎంత స్వతంత్ర్యమో కదా.

    రిప్లయితొలగించండి
  5. hayyO ప్రజారాజ్యం పార్టీ అభిమానులు మరీ మరీ అడిగారని , సుడిగాలిని 'చిరు'గాలి అనేస్తారా హన్నా !

    'చిరు' గాలికే కొట్టుకు పొతే అది 'మమత'అనురాగాల కుప్ప, 'జెయలలిత' అనురాగం అలయితే సుడిగాలి నా :)

    మీరు టపాలో చెప్పిన మమతకైతే సుడిగాలి కే గాని చిరుగాలికి చెరగదు,చెదరదు :)

    రిప్లయితొలగించండి
  6. బాసూ, కాసేపాగు..నన్ను కిరికెట్ చూడనీ.. అయినా నేనెక్కడ మార్చాను..:-) పైన శిలాఫలకం కట్టుకోని అంత బాగా కనిపిస్తుంటే. ఓ పని చేద్దాం ఇండియా గెలిస్తే సుడిగాలి లేకపోతే చిరుగాలి.

    రిప్లయితొలగించండి
  7. అయ్యబాబోయ్ అక్కడ ఆవిడ టపాలు తీసెయ్యాలని పాకిస్తాను పై కావాలని బె ట్ పెడితే మీరు ఏక౦ గా 'చిరు'ని ప౦పి౦చేసారు .

    మొత్తానికి బానే డిసైడ్ ఐంది :-)

    రిప్లయితొలగించండి

Comment Form