26, జులై 2011, మంగళవారం

మిట్టూరోడి పుస్తకం.. కథల పుస్తకానికే కాదు, బూతు పుస్తకానికీ తక్కువే


ఆమధ్య ఇండియా వెళ్ళినప్పుడు ఓ నలభై పుస్తకాల దాకా కొని తెచ్చుకొన్నాను. అందులో రకరకాల పుస్తకాలున్నాయి.అంటే అలా పైపైన ఓ లుక్కేసే పుస్తకాలనుంచి, జీవితకాలం చదివినా అర్థం కాని పుస్తకాలదాకా. మరికొన్ని ఆనోటా ఈనోటా విని ఎలా వుంటుందో చదవాలన్న కుతూహలం తో కొన్న పుస్తకాలు. అలా కొన్న పుస్తకాలల్లో మిట్టూరోడి పుస్తకం ఒకటి.

పుస్తకం రంగు బాగుంది. క్రొత్త పుస్తకం కాబట్టి వాసనా బాగుంది. అట్టపై వేసిన బొమ్మా బాగుంది. అలాగే పుస్తకం పై వ్రాసిన కథల పేర్లూ బాగున్నాయి. కథలన్నా ( చందమామ కథలు తప్పించి ) , నవలలన్నా ఆమడ దూరం పరిగెత్తే నాకు ఇంత మంచి బాహ్య సౌందర్యం గల్ల పుస్తకం అలా పుస్తకాల అరమరలో కనపడితే చదవాలన్న కోరిక మరీ ఎక్కువవ్వడంతో అక్కడక్కడ ఓ కథ చదివి వుండబట్టలేక ఈ టపా.

అసలు ఇంతలేసి పుస్తకానికి ఒక పోస్టుకూడా అవసరమా అనిపించింది కానీ, ఇందులో అక్కడక్కడా తగిలే గ్రామ్య భాషే ఈ టపాకు ప్రేరణ.

అక్కడక్కడా అని మాత్రమే ఎందుకన్నానంటే, మీకు ఏ కథ తీసుకున్నా నాబట్ట, సవితి, లంజ, గుడిసేటి ముండ ఇలాంటి పదాలు లేని కథ భూతద్దము పెట్టి వెతికినా కనిపించదు. తల్లి ని కూడా కొడుకుచేత లంజ అని పిలిపించి ప్రసిద్ధికెక్కిన రచయితగా చిరకాలం నిలిచిపోతారనడంలో సందేహం లేదు. వాటిని తిరిగి ఇక్కడ ఎత్తిరాయడం కూడా దండగే. కథ/కథలు చదువుతున్నంత సేపూ పాఠకుడు ఈరకమైన భాషనుపయోగించే జాతిని నేనెక్కడైనా ఇలాంటి సందర్భాలలో చూసానా అని కచ్చితంగా ప్రశ్న వేసుకోక మానడు. కథల్లో రాయలసీమ మాండలికం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ నేను పెరిగిన ఊళ్ళలో సాధారణ పరిస్థితులు లేదా కథా సన్నివేశ పరిస్థితులలో ఎక్కడ కూడా ఈ భాషవాడడం చూడలేదు.





నేను మరిచిపోయిన లేదా గుర్తున్నా కాల ప్రవాహంలో క్రొత్తగా తోచిన మాండలిక పదాలు

అలివిగాని
యెంటికలు
లోటా
సమ్మచ్చరం
యెంగటేస్పరస్వామి
తిరప్తి
గెన్శిగెడ్డ
సినబ్బ
మఖాయిష్టం ( మహాయిష్టం)
కుశాల
ఈమద్దిన

ఇంతటితో ఈ బొక్కు అటకెక్కేసింది.

30 కామెంట్‌లు:

  1. నలభై పుస్తకాలు!! గ్రేట్ అండీ..
    ఆ కథల భాష గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయండీ.. ఆ పుస్తకంలోనే 'మునికన్నడి సేద్యం' అని ఒక నవలిక ఉంటుంది. అది మాత్రం తప్పక చదవండి..

    రిప్లయితొలగించండి
  2. ఆ మిట్టూరోడి పుస్తకం గొడవ నాకు తెల్దుగానీ, మీరు వ్రాసిన ఆ పదలన్నీ ఇప్పటికీ మా ఊర్లో వాడేటివే.

    రిప్లయితొలగించండి
  3. @మురళీ గారూ, బహుకాల దర్శనం. కథల దుమ్మిదులిపి విశ్లేషణలు వ్రాసే మీరు చెప్పినందుకైనా ఆ కథ చదివి మళ్ళీ ఆకథమీద నా అభిప్రాయం వ్రాస్తాను :)



    @నవీన్, ఆ పదాలు మీ ఊర్లోనే కాదు, ప్రతి పల్లెటూళ్ళో వినిపించే పదాలే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది రచయిత కథను చెప్పటానికి ఒక వాతావరణాన్ని శృష్టిస్తాడు. పాఠకుడు ఆ వాతావరణంలోకెళ్ళి ప్రశ్నవేసుకుంటాడు. ఇలా ఈ కథా సన్నివేశంలో ఎప్పుడైనా ఇలాంటి భాషను ఉపయోగించగా విన్నామా అని.

    రిప్లయితొలగించండి
  4. మిట్టూరోడి గురించి చర్చలే తప్ప ఆ కధలింతవరకూ నేను చదవలేదు ( అదే మంచిదంటారా!) గెన్సిగెడ్డ అంటే ..మేం సెగ్గడ్డ అంటాం అదా! ( చీము కురుపు)

    రిప్లయితొలగించండి
  5. :) నేనూ తెచ్చి చదవటం మొదలు పెట్టి తర్వాత ఆటక మీద పెట్టాను. తర్వాత మళ్లీ చూద్దాం లెమ్మని.

    రిప్లయితొలగించండి
  6. I liked Bapu's Illustrations the most. Nevertheless, this is not so avoidable book. Munikannadi Sedyam is the best bet.

    రిప్లయితొలగించండి
  7. లలిత గారూ, ఛంపేశారు పొండి.
    గెన్సుగడ్డ అంటే మాత్రం చిలకడదుంప.
    గెన్సిగడ్డ అని వేరే ఏమైనా ఉందేమోమరి.

    రిప్లయితొలగించండి
  8. http://poddu.net/?q=p/617

    అలివిగాని = సాధ్యం కాని (అలవిగానిచోట అధికులమనరాదు..కొండ అద్దమందు కొంచెమై కనిపించదా? విశ్వదాభిరామ వినురవేమ)
    యెంటికలు = వెంట్రుకలు
    లోటా = గ్లాసు
    సమ్మచ్చరం = సంవత్సరం
    యెంగటేస్పరస్వామి
    తిరప్తి
    గెన్శిగెడ్డ = చిలగడ దుంప
    సినబ్బ
    మఖాయిష్టం ( మహాయిష్టం)
    కుశాల = సంతోషం
    ఈమద్దిన = ఈ మధ్యన

    ...

    రిప్లయితొలగించండి
  9. @మందాకిని గారు: "గెన్సుగడ్డ" అనేదొకటుందని నాకివ్వాళే తెలిసింది. మావైపది "గెనిసి గడ్డ" :-D

    "సినబ్బ, కుశాల" మినహాయిస్తే మిగతావన్నీ మావూర్లో వాడేవే. మాది రాయలసీమకూడా కాదు.

    రిప్లయితొలగించండి
  10. తిరుపతి పరిసర గ్రామాల్లో రచయిత వాడిన భాష సర్వసాధారణం.మీకు అవి బూతుగా కనిపించవచ్చేమో గానీ ఈ ప్రాంత గ్రామాల వారికి మాత్రం అప్పుడప్పుడు వినబడే పదాలే.

    రిప్లయితొలగించండి
  11. తిరప్తి - తిరపతి
    యెంగటేస్పరస్వామి- వెంకటేశ్వరస్వామి (ఊహ), సినబ్బ తప్ప (రవి గారు చెప్పిన అర్థాలతో) అన్నీ మా ఊర్లో వినిపించే పదాలే మినర్వాగారు.
    మాది సీమే లెండి.

    రిప్లయితొలగించండి
  12. చిలగడ దుంపల్ని కన్నడం లో గెణసు గడ్డె అంటారు లెండి.
    అది ఇలా రాయలసీమ మాండలీకంలో కలిసిపోయి గెన్సుగడ్డ అయ్యింది. రాయలసీమ లో కన్నడపదాలు కల్సి పోయి చాలావరకు రూపాంతరం చెందాయి.బళ్ళారి దగ్గర గా ఉండటం వల్లనేమో!!!అందులో కొన్ని మచ్చుక్కి....అరటిపండు-బాళేఫండు, గోంగూర-పుండుకూర(కన్నడం లో పుండీసొప్పు/హుళిసొప్పు అంటారు గోంగూర ని)ఉప్మా-ఉప్పిట్టు-ఉప్పుడుపిండి,ఉర్లగడ్డ-ఉల్లిగడ్డ.... ఇలా ఇంకా చాల ఉన్నాయ్.
    భయపడేలా, బెంబేలెత్తించేలా ఉంటాయి.
    -sudha-blr

    రిప్లయితొలగించండి
  13. @రాజీవ్, thanks for your comment and consensus

    లలిత గారూ, మమ్మల్నిలా అవమానపరుస్తారా. అది గెనుసుగడ్డ. చాలా రూపాంతరాలున్నాయి. గెన్సుగడ్డ, గెన్సిగడ్డ, దెనుసుగడ్డ,దెన్సిగడ్డ..ఇలా. మొత్తానికి మా ఊరోల్ల పదం ఒకటి నేర్చుకొన్నారు :)

    కృష్ణప్రియ గారూ, ఈ పుస్తకం చదవాలని బయటకు తియ్యడం ఇది నా రెండవ ప్రయత్నం. రెండు సార్లూ నాది ఇదే అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  14. సుజాత గారూ ఈ పుస్తకానికి పెద్ద ఎస్సెట్ అవేనేమో. నేను దరిదాపు పది చిన్న చిన్న కథలు చదివుంటాను.కథా వస్తువు బాగున్నా, పాత్రలచేత అనవసరంగా నోరు పారేపిస్తూ కథనాన్ని అల్లడం నాకు నచ్చలేదు. స్థూలంగా ఈ పది కథల్లో నాకొచ్చిన అభిప్రాయం, ఊర్లో కనిపించిన ప్రతి మగవాడు నాబట్ట, కనిపించిన ప్రతిఆడది లంజ. బహుశా విజయమోహన్ గారు చెప్పినట్టు తిరుపతి పరిశరప్రాంతాల్లో ప్రజలు అవసరమున్నా లేకున్నా ఇలాగే మాట్లాడు కుంటారేమో కానీ, నాకు తెలిసి..ఇలా మాట్లాడితే ఇరగ కుమ్ముతారు. ఇక మీరు, మురళి గారు చెప్పిన కథ చదవడం మొదలు పెట్టాను. ఆ కథఇంత వరకూ బాగుంది. ఇంకా పూర్తవలేదు.

    ఈ కథలేమో కానీ, సహజ అని ఇంకో కథ చదివాను. అక్కడ మీరు నాతో పోట్లాడవచ్చు :)

    రిప్లయితొలగించండి
  15. మందాకిని గారూ, అది గెనుసు గడ్డే.. లలిత గారిని సమాధాన పరిచి బ్రతికించారు :)

    రవి గారూ, ప్రొద్దు లింకు ఇంకా చూడలేదు. తీరిక చూసుకొని చూస్తాను. ఇక మీరు చెప్పిన అర్థాలన్నీ సరైనవే. అయినా ఇవన్నీ మీకెలాతెలుసబ్బా :)

    రిప్లయితొలగించండి
  16. Indian minerva గారూ, ఏఊరండీ మంది.. మా భాషను ఇంత చిన్నబుచ్చుతారా :)
    "కుశాల " ఈ పదం చిన్నప్పుడు చాలా తరచుగా వినేవాడిని కానీ ఇప్పుడు నాకే కొత్తగా అనిపించింది.

    విజయమోహన్ గరూ, తిరుపతి పల్లెటూళ్ళ గురించి నాకు తెలిసింది సున్నా. బహుశా రచయిత అక్కడ పరిసర ప్రాంతాలమీద అధ్యయనం చేసి వ్రాసి వుంటాడేమో. ఎవరైన తిరుపతి వాళ్ళు చెప్తేకానీ మనకు తెలిసే అవకాశం లేదు.

    రిప్లయితొలగించండి
  17. మందాకిని గారూ యెంగటేస్పరస్వామి- వేంకటేశ్వరస్వామి మీ ఊహ కరక్టే, సినబ్బ అనేది కొన్ని ప్రాంతాల్లో చిన్నాన్న కు పర్యాయపదంగా వాడుతారు.

    సుధ గారూ, మీ వివరణకు ధన్యవాదాలు, అది గెనుపు గడ్డ ( గెనుపులు గల గడ్డ ) నుంచి, అలా అలా మారి ఇలా తయారయ్యిందేమో

    రిప్లయితొలగించండి
  18. అలి౦గాని
    ఎ౦టికలు

    సవచ్చర౦

    ఎ౦కటేసుర సామి
    తిరవతి
    గె౦చి గడ్డ ,గె౦సి గడ్డ :)
    బో ఇష్టం
    కుసాలుగా
    ఈ మద్దెల, ఈ మద్దెన
    చిన్నబ్బ,సిన్నబ్బ

    రిప్లయితొలగించండి
  19. అయ్యా! పల్లెటూళ్ళలో ఈమాటలు మామూలే! గుంటూరు చుట్టుపక్కల ఊళ్ళలో ఈ మాటలు వినపడనివేమీ కాదు. "నీ యమ్మ" అని మాటల్లో ఎప్పుడయినా వాడి ఉన్నవాళ్ళకు ఈమాటలు కేవలం బూతుని సూచించే మాటలే కావనీ, వాటికి వేరే అర్థాలూ కాలక్రమేణా స్థిరపడవచ్చనీ అర్థమవుతుంది. మిగతావాళ్ళకు నాగరికత ముదిరిందనే సరిపుచ్చుకుంటాను నేనయితే.

    రిప్లయితొలగించండి
  20. అజ్ఞాత గారూ, మీ వ్యాఖ్య కు ధన్యవాదలు. ఇక్కడ నా వుద్దేశ్యం పల్లెటూళ్ళలో ఈ మాటలు తెలియనివి, వాడనివి అని కాదు. బహుశా మీరొక్క సారి అందులో కథలు చదివితే నా అభిప్రాయం బోధపడవచ్చు.

    రిప్లయితొలగించండి
  21. btw మీ టపా చదువుతు౦టే , చదువుకోనేప్పుడు నా మిత్రుడొకరు వాళ్ళమ్మని మాటకి ము౦దు వెనుక నీయమ్మ అనో ఏదో అ౦టాడని కోప౦ వచ్చి౦ది ( నేనున్నప్పుడు బానే జాగ్రత్త పడ్డాడు, మా తమ్ముడు వాళ్ళ ము౦దు మొహమాట పడలేదట :) ) . కాని తనకి వాల్లమ్మ౦టే ఎ౦త ప్రేమ అ౦టే చెప్పలేను. కొడుక్కి కూడా నేర్పిస్తున్నా డేమో ఈ సారి ఫోన్ చేసినప్పుడు కనుక్కోవాలి ;-)

    రిప్లయితొలగించండి
  22. మౌలి, అలాగే ఫోను చేసి కనుక్కోని నాకు కూడా చెప్పండి మరి :)

    రిప్లయితొలగించండి
  23. hmmm ..ఫోన్ చెయ్యక్కరలేదు అనుకు౦టా భాస్కర్. నేర్పి౦చేసి ఉ౦టాడు .:) ఇప్పుడు నా అభిప్రాయ౦ ఏ౦టి అ౦టే మీరు చదివే పుస్తకం కుడా మ౦చిపుస్తకమే అయ్యు౦టది మరియు మీరు పూర్తిగా చదివేస్తారు .టై ౦ పట్టుద్ది అ౦తే :)

    రిప్లయితొలగించండి
  24. మౌలి, ఫోన్ చెయ్యక్కర్లేకుండానే తెలిసిందంటే మీ అబ్బాయో/అమ్మాయో కాదుకదా :-) పుస్తకం పూర్తిగా చదవలేనులేండి. కథల పట్ల నాకు అంత పెద్దగా ఆసక్తి వుండదు.

    రిప్లయితొలగించండి
  25. హ హ .చెప్పాను కదా నా స్నేహ౦ అని . అమ్మని అని, భార్యని అనకు౦డ ఉ౦డకపోవచ్చు అప్పుడు కొడుకు వినేస్తాడు కదా అని. (వాళ్ళమ్మ ఇప్పుడు లేరు, కాబట్టి ఆమెని భార్యలోనే చూసుకోవాలి మరి. :)) .

    రిప్లయితొలగించండి
  26. మౌలి, ఇది మరీ బాగుందండీ, అమ్మనైతే అనేసాడు, మరి అది కొడుకు కు ఎందుకు నేర్పలేదు? అంటే అందులో తప్పేమైనా కనిపించందా అతనికి?
    అంటే చిన్నప్పుడు తెలిసో తెలియకో అనేసి, పెద్దయ్యాక తప్పు అని తెలుసుకున్నారా ఏమైనా?తప్పులేకపోతే శుభ్రంగా నేర్పించ వచ్చు కదా :)

    రిప్లయితొలగించండి
  27. తనకెవ్వరు నేర్పారు ప్రత్యేక౦గా :), అది సరే మీరిలా౦టి వ్యాఖ్యానం చేసిన పుస్తక౦లొ బాపు బొమ్మలెలా గీసినట్టు అని అనుమానమొచ్చి౦ది , సమాధానం రమణ కోతికొమ్మచ్చిలో ఉ౦టు౦ది (అది చదివెయ్య౦డి :) )
    ఇ౦కో విశేషమే౦టి అ౦టే , ఆ భాష ఎక్కువగా వాడే పల్లెలలో ఈ పుస్తకం ఎలాగు కొనరు..చదవరు పెద్దగా.

    రిప్లయితొలగించండి
  28. మాది కడప జిల్లా రాయచోటి సంబేపల్లి మండలం గున్నికుంట్ల . ఈ పుస్తకం లోని రచనలు వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంది . ఎక్కడా కూడా కల్పితం లేకుండా మన భాషా ను భావితరాలకు అందించారు . కవి గారు . ఎవరి మెప్పు కోసంమో మంచి పదాలను వాడుకుండా .. ఉన్నది. ఉన్నట్లు రాయడానికి ఎంత దైర్యం ... సాహసం .. చేశారో ఈ కవి నాయినీ నరసంహనాయుడు గారు . మీకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి

Comment Form