2, అక్టోబర్ 2011, ఆదివారం

కోటి ఇరవైఐదులక్షల హారం :-)

హారం భారతదేశ సంకలనిగా రూపాంతరం చెందాక చాలారోజులుగా ఈ టపా వ్రాద్దామనుకొని ఎప్పటికప్పుడు ఏవోకారణాలమూలంగా వెనక్కినెట్టేస్తూ వచ్చాను. ఈ రోజుకూడా వచ్చేవారం రాద్దాంలే అని అనుకుంటుండగా వచ్చేవారం మరో వార్షికోత్సవ టపా వ్రాయాలి కదా? దేని వార్షికోత్సవమో వచ్చేవారం తెలుస్తుంది :-)

ప్రస్తుతానికి హారం మీద ఓనాలుగు మాటలు రికార్డు చేసేస్తే ఓపనైపోద్ది. హారంలో ఇతర భారతీయభాషల్ని చేర్చాలన్న ఆలోచన వచ్చాక నాకు మొదట కలిగిన సందేహం... ఎవరైనా వచ్చి చూస్తారా అని. తెలుగులో హారం అప్పటికే రెండు సంవత్సరాలుగా నడుస్తుంది. ఆ రెండు సంవత్సరాల అనుభవం దృష్ట్యా ఈ ప్రశ్నే ప్రధానమైనది. ఈ ప్రశ్నకు కారణం లేకపోలేదు. ఈ ఆగ్రిగేటర్ నిర్వహణలో ప్రధానంగా హిట్స్ వచ్చేది మనకున్న పరిచయస్తులనుండే. అంటే మనమెంతగా ఒక గ్రూపు ను నిర్వహించగలిగితే అంతగా మన ఆగ్రిగేటర్ హిట్ అవుతుందన్నమాట. నేను నేర్చుకున్న తొలిపాఠం ఇది. ఇక్కడ టెక్నాలజీకి విలువ సున్న. మరి హారానికొక గ్రూపుందా??? ఏమో....ఏగ్రూపులో లేని వారు హారం గ్రూపేమో.... :-). మన తెలుగు బ్లాగుల్లో ఈ విషయమే ప్రధానం. ఇది కాదనలేని సత్యం.

ఈ అనుభవం దృష్ట్యా మిగిలిన భాషల్లో హారం ఏమాత్రం పాపులర్ అవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో భారతీయ ఆగ్రిగేటర్ గా రూపాంతరం చెందింది. పలు భాషలున్నా. తెలుగు కాకుండా హారం ఇప్పటి వరకు బాగా పాపులర్ ఐనది రెండుభాషల్లోనే. ౧) తమిళం ౨) ఆంగ్లం. తమిళంలో అనూహ్యంగా అంచనాలకందకుండా, నేనూహించని రీతిలో చాలా చాలా పాపులర్ ఐందని చెప్పాలి. ప్చ్..నాకు భాష వచ్చి వుంటే కనీసం తమిళంలో ఓ పేద్దటపా వ్రాసి కృతజ్ఞతలు తెలుపుకొనేవాడిని :(

ఇక ఆంగ్ల బ్లాగ్వాతావరణం మిగిలిన భాషా వాతావరణం కంటే చాలా భిన్నం. ఆంగ్ల బ్లాగులు రాసిలో ఎక్కువ కాబట్టి అక్కడ ఎవరికెవరో సరిగ్గా తెలీదు. ఆ కారణంగా అక్కడ రాసే కామెంట్లు బ్లాగుపోస్టుకు సంబంధించే ఎక్కువగా వుంటాయి. వేరే ఎజండా అంటూ వుండే సందర్భాలు అరుదనే చెప్పాలి. చాలా మంది చాలా నిజాయితీతో తమ తమ జీవితాల్లో అనుభవించిన చిన్న చిన్న ఆనందాల దగ్గరనుంచి, అత్యంత దయనీయ పరిస్థుతులను, దారుణ సంఘటనలను వ్రాస్తున్నారు. బహుశా కేవలం వారికోసమే!!! వారి మన్సుల్లో గడ్డకట్టిన భావాలను చెప్పుకోవడానికి బ్లాగింగ్ అక్కడ ఒక ప్రధాన మాధ్యమం.

హారం తెలుగులో ఎంత పాపులర్ ఐందో ఇంగ్లీషులోనూ అంతగా అయింది. అంటే ప్రస్తుతానికి తెలుగు,తమిళాంగ్లభాషల్లో బాగా నడుస్తుంది. హిందీకి ఎందుకనో చాలా చాలా తక్కువగా హిట్స్ వస్తున్నాయి.

ఇంతకీ ఈ సంవత్సరానికి గానూ హారం సాధించిన హిట్లు ఒకకోటి ఇరవైఐదులక్షలు. ఇవిగేన డబ్బులైతేనా..... నో నాగమణి ఎంజాయ్ అనేసుకుండేవాడిని ..ప్చ్ ఆ ఛాన్స్ లేదు :-)

ఆ వివరాలు ఇక్కడ. ఇవి ఈ సంవత్సరం సెప్టంబరు నెలవరకూ వచ్చిన హిట్స్





బాగుంది కదా నాకృషి? కాదులే సెల్ఫ్ డబ్బా :-). ఏమైనా అనుకోండి కానీ భిన్న భాషల్ని ఒకటే గొడుగుక్రింద ఒకటే యూనిఫైడ్ ఫార్మాట్ లో చూపడమన్నది టెక్నికల్ తెలుగు ఛందస్సు తరువాత అంతటి తృప్తినిచ్చిన పని. మరి తెలుగు నిఘంటువో అనకండి. తెలుగు నిఘంటువులో సాంకేతికాంశాల ప్రదర్శనకంటే దీక్ష పట్టుదల ముఖ్యం. అవి నావద్ద లేకున్నా టైపు చేసే మా సభ్యుల వద్ద పుష్కలం.


సెలవా మరి!!!

20 కామెంట్‌లు:

  1. మీరు చేస్తున్న కృషికి హృదయపూర్వకమైన అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. మీకు మనఃపూర్వక అభినందనలు.
    హారం మీదొక్కరిదేనా లేదా ఎవరిసహాయమైనాతీసుకున్నారా?

    రిప్లయితొలగించండి
  3. జాతిపిత మహాత్ముని జయంతి శుభాశీస్సులతో పాటుగా - హారం భారతదేశ సంకలనిగా రూపాంతరంగా చెంది/పొందిన ఈ మైలురాయికి హార్ధిక అభినందనలు. మరిన్ని వినియోగాలు నీ ఈ కృషిఫలంగా అందరికీ అందుతాయని ఆశిస్తూ...

    రిప్లయితొలగించండి
  4. Bhaaraare gaau-

    congratulations!

    Haaram telugu vaallalaki dooram aipoyindemo nani naa sandeham ! naa tapa raasesaaka meeru
    ee tapa raasaaru

    cheers
    zilebi
    http://www.varudhini.tk

    రిప్లయితొలగించండి
  5. మానస
    హరి
    అజ్ఞాత
    సునీత
    రమ్య
    జ్యోతి
    చిన్ని
    మౌలి

    స్పందించి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  6. అజ్ఞాత గారూ, ఈ ప్రశ్నకు ఇప్పటికే చాలా సార్లు సమాధానం చెప్పాననుకుంటాను. హారం డెవలప్ మెంట్ లో వేరొకరి హస్తం లేదు. కానీ హారం అభివృద్ధికి, పాపులారిటీకి ఇక్కడ కామెంట్ చేసిన వాళ్ళతో పాటుగా వేరే అనేకమంది సహాయాన్నందించారు.

    రిప్లయితొలగించండి
  7. ఉష, ఇంకా మరిన్ని వినియోగాలు అందుబాటులోకి తెచ్చే ఓపికలేదులెబ్బా.. ఉన్నదేదో చాలు ఇప్పటికి. చాలా మంది ఆంగ్ల బ్లాగుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సెర్చ్ ఫెసిలిటీ అడుగుతున్నారు. అడుగుతున్నారనేదానికంటే ఒత్తిడి ఎక్కువగా వుంది అని చెప్పాలి. రాబోయే సంక్రాంతి హారం పుట్టినరోజు. ఆరోజుకు ఆ వినియోగాన్ని అందుబాటులోకి తేగలనేమో. జాతిపిత జయంతి రోజు ఈ టపా వ్రాయడం కూడా యాదృచ్చికమే.

    రిప్లయితొలగించండి
  8. వరూధుని జిలేబి గారూ,
    మీకలా అనిపించిందా? ఎందుకలా? అలాంటి సందేహం రావడానికి కారణాలేమన్నా వుంటే చెప్తారా?
    వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. Bhaaraare gaaru-

    ee naa sandehaaniki kaaranam blogger vaari
    tapaa statistics visleshana. intaku munupu
    naa kanipinchindi tapaalu haaram ki ekkuva lankelugaa undevi.ippudu koodali ki eekuva lankelu choopistunnaai. migilina telugu bloggerlu ee vishayam gurinchi cheppa vachhu. may be i am not correct. idi oka sandeham maatram me!

    cheers
    zilebi
    http://varudhini.tk

    రిప్లయితొలగించండి
  10. జిలేబి గారూ,
    ఎవరు ఎక్కువ, తక్కువ అని కాదుగానీ..just curious, తెలుసుకోవాలన్న ఆసక్తి. బ్లాగర్ వారి స్టాటిస్టిక్స్ మీకు ఎక్కడ లభించాయి ? లింక్ ఇవ్వగలరా?

    నాకు తెలిసి ఇలాంటి గణన చేసేది ఒక్క Alexa.com మాత్రమే. ఇక్కడ ప్రతి మూడు నెలలకొకసారి వారు వెబ్సైట్ ర్యాంక్ ను ఇస్తుంటారు.అలెక్సా లెక్కలు పరిగణనలోకి తీసుకొంటే హారం మూడునెలల గ్లోబల్ ర్యాంకు 166,455 గా కనిపిస్తుంది. ఇది కాక మీవద్ద వేరే లింకు ఏమైనా ఉంటే ఇవ్వగలరా?

    రిప్లయితొలగించండి
  11. Dear Bharaare gaaru-

    Nenu chebutunna stats naa blaag ki sambandhinchi 'stats' anna column lo blogger choopistunnadi. Indulo mukhyamaina referring linku koodali vaaridi. (all time) . Andu ke migilina blaag vaari uddesam kanukkovadam uttamamani naa vyaakhya. may be I am not correct. But if this is the case probably my understanding that haaram as 'telugu' blogger samaahaaram being receding ( of course may be for better as india's samaaharam) emantaaru ?

    cheers
    zilebi

    రిప్లయితొలగించండి
  12. >>>ఈ ఆగ్రిగేటర్ నిర్వహణలో ప్రధానంగా హిట్స్ వచ్చేది మనకున్న పరిచయస్తులనుండే. అంటే మనమెంతగా ఒక గ్రూపు ను నిర్వహించగలిగితే అంతగా మన ఆగ్రిగేటర్ హిట్ అవుతుందన్నమాట. నేను నేర్చుకున్న తొలిపాఠం ఇది.
    ----
    నిజమే సుమీ
    అందుకే PR (పబ్లిక్ రిలేషన్స్) మైంటైన్ చెయ్యాలి
    టెక్నికల్ గా హారం అభిమానిని
    కానీ కూడలి మాత్రం చూడ ముచ్చటగా ఉంటుంది
    ఎక్కువ PR ఉన్నవాళ్ళ అగ్గ్రిగేటర్ హిట్టు అవుతుంది ( కూడలి తప్ప )
    ఇంతకీ ఈ కౌంటర్ ఎవరి మీద చెప్మా ???

    @ జిలేబి గారు
    మిగిలిని భాషలు పెట్టక హారం తెలుగు వారికి దూరం అయిపొయింది అని మీకు మల్లె నేను కూడా అనుకున్నాను
    కానీ అలెక్షా రాంక్ లో కూడలి తో పాటు పోటి పడుతుంది ప్రస్తుతం
    ఇది నేను ఊహించని పరిణామం ( కూడలికి చేరువలో ఏ అగ్గ్రిగేటర్ రాదు అని అనుకునే వాడిని )

    @ భారా రే
    అలెక్షా రాంక్ డైలీ అప్ డేట్ అవుతుంది ( మూడు నెలలకి ఒకసారి కాదు)
    మూడు నెలలకి ఒకసారి లింక్స్ అప్ డేట్ అవుతాయి

    రిప్లయితొలగించండి
  13. జిలేబి గారూ ఈ ర్యాంకులదేముం దిలెండి. కానీ మనం చేసింది పదిమంది వాడుతున్నారంటే అదొక తృప్తి.

    అప్పారావు గారు కౌంటర్లాగుందా... అంతలేదుకానీ ఒక కోటి హిట్లు దాటినప్పుడు రాద్దామనుకున్న టపా ఇది. ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ మొన్న రాసినానన్నమాట.
    ఓ ఈ ర్యాంకు రోజూ మారుతుందా... ?? నిజమే ఈ రోజు 159,631 చూపిస్తుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    కానీ కూడలి మాత్రం చూడ ముచ్చటగా ఉంటుంది
    ఎక్కువ PR ఉన్నవాళ్ళ అగ్గ్రిగేటర్ హిట్టు అవుతుంది ( కూడలి తప్ప )

    ________________________________________________________________________________________________

    May be you people don't know the reality.This koodali gang is $THE MOST DANGEROUS$ cold blooded gang in Telugu blogs.

    రిప్లయితొలగించండి

Comment Form