8, అక్టోబర్ 2011, శనివారం

సీనూ సీనూ సిగిరెట్టు సీనూ పెళ్ళాం బిస్కత్తు....
విలాసంగా రెండు వేళ్ళ మధ్య నాట్యమాడుతుంది. పెదవుల మధ్యగుండా రింగు రింగులు ఆకారాల్లో పొగనూ వదులుతుంది. అల్లంత దూరానా అమ్మాయి కనిపించగానే లేని ఉత్సాహం తో ఎఱ్ఱెఱ్ఱగా వెలిగిపోతుంది. అర్థరాత్రులు మస్తు మస్తు మజాగా ఊగేటప్పుడూ నేనున్నానంటూ విలాసంగా కన్నుగీటుతుంది.
వహ్...ఒకటా రెండా... ప్రతి మజిలీ ఒక సిగిరెట్టు బ్రేకు....రోజుకో ఇరవైనలుగ్గంటలు.. గంట గంటకో సిగిరెట్టు. ప్రతిసిగిరెట్టు నీకు ప్ర్రియురాలికంటే ప్రియం. మైకం వదిలేదాకా ప్రియురాలి పిలుపు అత్యంత మధురం. మైకంలోకి వెళ్ళేదాకా సిగిరెట్టు మరీప్రియం.

అందమైన ఉదయం ఆ ఉదయపు స్వచ్ఛత
ఎప్పుడు చూసావు?
సుందర సాయం సంధ్యలను, మిణుకుమనే నక్షత్రాల కాంతిని
ఎన్నడు చూసావు?
పెరటి గుమ్మంలో మల్లె చెట్టు పూసిందట
చిరుగాలి మోసుకొచ్చే సువాసన చేరిందా?
అమ్మ చేసిన కమ్మనైన వంటరుచైనా
తనివితీరా జిహ్వ రుచిచూపిందా?

ఓరీ దౌర్భాగ్యుడా... దుర్బలమానసిక చాపల్యుడా... ఇవినీకు అనుభూతిలోనికొచ్చి సంవత్సరాలు గడిచింది కదా? ఔను.. పైవాటిని తిరిగి సంపాదించడం పోగొట్టుకున్న నీవల్లే ఔతుంది. ఎలాగంటారా?

రేపటినుంచి సైంటిఫిక్ అధారిత ధారావాహిక... సీనూ సీనూ సిగిరెట్టు సీనూ పెళ్ళాం బిస్కెత్తు.

మనవి : మన బ్లాగర్లలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సిగిరెట్ ఎప్పుడు ఎలా మొదలుపెట్టారో కామెంటు రూపంలో తెలియచేస్తే నా ధారావాహికలకు ఎంతో సహాయం చేసిన వారవుతారు. అమ్మాయిలనడిగానని ముక్కుమీద వేలుతో గీరుకోనవసరంలేదులెండి. ఇప్పుడు ఈ సిగిరెట్టు ఆడా మగా పట్టింపు అస్సలు లేదు. అలాగే మీరు పొరపాటున సిగిరెట్ మానేసినా ఎలా మానేసారో చెప్తే మరీ మరీ మేలు చేసినవారవుతారు.

6 వ్యాఖ్యలు:

 1. నిజం సిగరెట్ తాగలేదు కానీ చిన్నప్పుడు కాగితంలో దూది చుట్టి వెలిగించుకుని ఊది తరువాత నోట్లో పెట్టుకుని తాగేవాళ్ళం.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ప్రవీణ్..మంచిది. చిన్నప్పటి విషయాలు కూడా చేరుస్తా.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ముఉందర మీతో మొదలు పెట్టండి భా రా రే గారు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అలాగే నేను మొదలెడతాకానీ మీరు అసలు ఎలా మొదలెట్టారో చెప్తే ఈ పుస్తకానికి సహాయం చేసినోళ్ళవుతారు

  ప్రత్యుత్తరంతొలగించు
 5. i started smoking when i was in engineering 1st year.. it was just for style, fashion..etc. I think, people who dont smoke in their teen age will never smoke.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అజ్ఞాతా.. ఇంకా తాగుతూనే వున్నారా? తాగుతుంటే మీకు కలిగిన భావాల్ని అజ్ఞాతంగా నే ఇక్కడ పంచుకోగలరా?

  ఇక మీరు చెప్పిన టీనేజ్ లో సిగిరెట్ అలవడకపోతే ఎప్పటికీ అలవాటుకాదు అనడం తప్పు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరేంతవరకు ఈ సిగిరెట్ కు తీవ్రవ్యతిరేకిని. అంటే అసలు ఈ జన్మలో తాగుతాననుకోలేదు :-).

  ఇద్దో ఆ వుద్యోగ పుణ్యంగా మొదలైన ఈ అలవాటు విడతలవారిగా సుమారు పదకొండేళ్ళు తాగాను. విడతలవారిగా అంటే మొదలైన రెండు మూడేళ్ళు రోజుకు రెండునుండి నుండి నాలుగు సిగిరెట్లు. తరువాత మూడునాలుగేళ్ళు 5 నుండి 7 దాకా. ఆతరువాత కాలం 6 నుంచి 9 దాకా.

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form