10, నవంబర్ 2011, గురువారం

మా రోజులే వేరులే.... అసలు ఆ రోజుల్లో ....

హ హ అదేనండి పాతది ఏదైన ప్రతిదీ అపూర్వము కదా. అది ఎంతచెడ్డదైనా గొప్పదే అనుకునే వారికోసమన్న మాట.

ఆ మధ్య ప్రెస్ కౌన్సిల్ వారు చాలా పత్రికలు,పుస్తకాలు అంతర్జాలంలో పెట్టినప్పుడు యథాశక్తి ప్రతి పత్రికనూ ప్రతి పుస్తకాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. అందులో ఈ ఆంధ్రవిద్యార్థి నా దృష్టిని మొదటినుండి ఆకర్షిస్తూనే వుంది. కారణం లేకపోలేదు. ఇందులో చాలా వరకూ మంచి మంచి పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించారు. అప్పుడప్పుడూ అవి చదువుతూ వుంటే అందులో మిగతా విషయాలు కూడా చూస్తుంటాము కదా.అసలే నాకు ప్రక్క చూపులెక్కువ మరి ;-). అలా కనిపించిన ఒక అతిచిన్న మోసపు ప్రకటన ఇది. ఆరోజుల్లో ఐదురూపాయలంటే ఎంత విలువో కదా? ఇంతకీ ఈ ప్రకటన 1934 వ సంవత్సరం అక్టోబరు 1 వతేదీ వచ్చిన పత్రికలోనిది.ఇలాంటి మోసాలు అప్పుడు బహుశా పత్రికల్లో వచ్చేవేమో !! ఇప్పుడు ఏకంగా T.V ల్లో కనిపిస్తున్నాయు. కాలం మారింది. ప్రచారం చేసే మాధ్యమం మారింది. మనిషి బలహీనత అలాగే వుంది. ఆ బలహీనతలనాధారంగా క్రొత్త క్రొత్త మోసాలు పుట్టుకొచ్చాయేమో కానీ నిజానికి మనిషి మారలేదు, మోసం తగ్గనూ లేదు.

5 వ్యాఖ్యలు:

 1. ఇలాంటివి పాత రోజుల నాటి పత్రికలన్నింటిలోనూ చూస్తూనే ఉండేవాళ్ళం కదూ! ప్రేమ, సినిమా ఛాన్స్,లంకె బిందెలు, ఇలాంటి విషయాల్లో కూడా ఇలాంటి జ్యోతిష ప్రకటనలు ఉండేవి. అంతేనా? అడ్డాలు నిలువులు కూడినా ఒకే మొత్తం వచ్చేలా (అప్పటి సుడోకు అన్నమాట),గళ్ళు, కెమెరా ప్రకటనలూ..అవన్నీ ఇప్పుడు చూస్తుంటే తమాషాగా అనిపిస్తుంది.

  ఇప్పుడు ఇవి టీవీలకు పాకి ఏకంగా ఫలానా యంత్రం ఇంట్లో పెట్టుకుంటే దిష్టి ఉండదనీ,డబ్బు వచ్చి పుట్టలుగా పడిపోతుందనీ ప్రకటిస్తున్నారు. మీరన్నట్టు ఎన్ని మారినా మనిషి బలహీనతలు ఆశలు మాత్రం మారలేదండీ

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అవునండోయ్..సుజాత గారూ, మీరు చెప్తుంటే నాకూ గుర్తుకొస్తున్నాయి. ప్రేమ, సినిమా ఛాన్స్ ఇవి చూసిన గుర్తు లేదు కానీ లంకెబిందెలు, ఎటుకూడినా తొమ్మిదొచ్చే గళ్ళు బాగా గుర్తున్నాయి. కాకపోతే నేను చూసిన మూడు గళ్ళ లెక్కలో పూర్తి చేసి కార్డుముక్క మీద వ్రాసి Rs 10 రూపాయలు మనియార్డరు చేస్తే Rs 500 రూపాయలు ఇస్తామని ప్రకటన. వార్నీ ఇంత చిన్న లెక్కచేస్తే 500 లా అనుకోని పదిరూపాయల మనియార్డరు కోసం తన్నులు తిన్న జ్ఞాపకం కూడా :))

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఇంకోటి కూడా ఉండేది. మీరు ఇంట్లోనే ప్రింటింగ్ ప్రెస్సు నడపండి - ఓన్లీ యాభై రూపాయలు మాత్రమె ఎం వో చెయ్యేస్తే మీ కు ఇంటికే అధునాతన ప్రింటింగ్ ప్రెస్సు వచ్చును - ఆ యాభై రూపాయలు పంపిస్తే ఓ చెక్క పెట్ట లో ఇంకు పాడ్ లో అద్ది సో కాల్డ్ ప్రింట్ చేసే లెదరు పీసులు వచ్చేవి. మరొక్కటి ఈ గళ్ళు పూర్తి చేస్తే శిఫాను చీర ఉచితం ! ఓన్లీ ముప్పై రూపాయలు పంపించవలె !

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form