14, నవంబర్ 2011, సోమవారం

I am at cross roads

నాకొక పెద్ద సమస్య వచ్చిందిప్పుడు. హారం లో పాఠకుల వ్యాసాలను ప్రచురిస్తానని మొన్న ఒక టపా వ్రాసాను కదా. ఇప్పుడు నాకొచ్చిన సమస్య దానిమీదనే నండి. ఏమి సమస్యంటారా? వ్యాసాలు ప్రచురించటానికి అసలు నాకేమి కావాలో తెలియడంలేదు :(.

ఎప్పుడొచ్చిన వ్యాసాలను ఎప్పటికప్పుడు ప్రచురించాలా? లేక ఓ తొమ్మిది పది వ్యాసాలొచ్చేదాకా వేచి చూసి అన్నీ కలిపి ఒక్కసారిగా పత్రికలా ప్రచురించాలా? మొన్న టపా వ్రాసేటప్పుడు ఎప్పటి వ్యాసాలను అప్పుడు ప్రచురిద్దామనుకొన్నాను. కానీ అప్పుడు బ్లాగులో ప్రచురించేదానికి హారంలో ప్రచురించేదానికి తేడా ఏముంటుంది?

ఒకవేళ అన్నీ కలిపి పత్రికలా ప్రచురిద్దామనుకుంటే, అసలు పత్రికకు కావాలసిన ప్రాధమిక సూత్రాలే కాక హంగులు,ఆర్భాటాలు ఏవీ తెలియవు. అంటే ఒక పత్రిక అంతర్జాలంలో తయారు చేయాలంటే ఏమేమి ఫీచర్స్ అవసరము. అంతర్జాలంలో ఇప్పటికే ఉచితంగా ఎవరైనా online magazine software ఉచితంగా అందిస్తున్నారా? మనమే స్వంతగా కోడ్ వ్రాయాలనుకుంటే ఆ సాప్ట్వేర్ ఉపకరణిలో ఏమేమి ఉంటే బాగుంటుంది.

చివరిగా అసలు బ్లాగుకు పత్రికకు తేడా ఏమిటి?అబ్బో చాలా ప్రశ్నలే అడిగాను కదా? మీకేమైనా ఈ online magazine నిర్వహణలో అనుభవమున్నా, లేదా మంచి ఆలోచనలున్నా తెలియచేయ మనవి.

14 కామెంట్‌లు:

  1. భాస్కర్..

    ఎందుకంత టెన్షన్. నీ దగ్గరున్న వ్యాసాలను బట్టి రోజుకొకటి లేదా వారానికి రెండు వ్యాసాలు అనే విభాగాలలో పెట్టు. కాని ఆ రోజులు మాత్రం తప్పక పాటించాలి.ఇలా క్రమం తప్పకుండా పెడుతుంటే ఓహో! ఈ రోజు హారంలో కొత్త వ్యాసం వస్తుందికదా వెళ్లి చూద్దాం అని రీడర్స్ అనుకుంటారన్నమాట..
    ఇక బ్లాగు , పత్రిక అంటే.. బ్లాగు అంటే మనకు నచ్చినవి, మనకు వీలైన సమయంలో ఏదైనా రాసుకోవచ్చు. కాని పత్రిక అన్నప్పుడు దాన్ని క్రమం తప్పకుండా మెయింటెయిన్ చేయాలి. కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యాసాలను ఎంపిక చేయాలి..

    నా అభిప్రాయం ఇదన్నమాట..

    రిప్లయితొలగించండి
  2. జ్యోతి,
    టెన్షన్ కాదండి, సలహాలకోసమే ఈ టపా.
    సూచన బాగుంది. ఇలా అయితే ఓ రోజు కూర్చొని అన్నింటిని వ్యాసాలక్రింద copy చేసి schedule చేసి పెట్టేస్తే సరిపోతుంది. ఈ సౌకర్యం ఇప్పటికే హారంలో వుంది కాబట్టి నాకు శ్రమా తక్కువే.అలగే మర్చిపోవడమన్న సమస్యా వుండదు కానీ, ఒకనెలకు నాదగ్గరున్న వ్యాసాలన్నీ అయిపోయే.అప్పుడెలా :-))

    రిప్లయితొలగించండి
  3. అజ్జాతా భలే. నిజమే కదా..నాకసలు ఆ ఆలోచనే రాలేదు.

    ప్రవీణ్ యు ఆర్ మోస్ట్ వాంటెడ్ పర్సన్ హియర్ నౌ.

    రిప్లయితొలగించండి
  4. జ్యోతి గారు చెప్పినా కామెంట్ పై మీరు ఇచ్చిన రి కామెంట్ కి నా ఈ కామెంట్ ::: మీ దగ్గర వ్యాసాలు ఐపొతే ఎలా? అన్నారుకదా , ముందుగా జ్యోతి గారు చెప్పినట్టు ఒక నిర్ణీత క్రమం అనుసరించండి ....కాని ముందుగా....15 రోజులకి ఒక వ్యాసం లేదా రెండు వ్యాసాలు మాత్రమె పెట్టండి ..అలా ఓ ఆరు నెలలు లేదా ఎనిమిది నెలలు గడిపితే ..ఈ లోపు మీకు వ్యాసాలు పంపే వాళ్ళు పంపుతూ ఉంటారు ..అవి మీ డేటా బెస్స్ లో సేవ్ చేసుకోండి ...ఎప్పుడైతే మీ దగ్గర వ్యాసాలు ఎక్కువగా ఉన్నాయ్ అనుకుంటారో అప్పుడు అప్పుడు ప్రతి వారం ఒక వ్యాసం పెట్టండి ...ఈ లోపు మీ ఐడియా క్లిక్ ఐతే ఇంకా వ్యాసాలు వస్తూనే ఉంటాయి ..... అప్పుడు రోజు కి ఒకటి చొప్పున పెట్టవచ్చు....కాని ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే మీరు మన హారం లో వ్యాసం పెట్టిన రోజు అది అందరికి తెలియాలి ...ఈ రోజు హారం లో వ్యాసం పోస్ట్ అయింది అని, ఎందుకంటే అది హారం కి వచ్చే వాళ్ళ సంఖ్యా ను పెంచుతుంది తద్వారా మీకు రచయితలు పెరుగుతారు ....

    PS : ఇది మాత్రం సీరియస్ గానే కమేంటాను ...నా తెలుగు కొంచెం బాగుండదు, నేను ముస్లిం అవ్వటమో లేక ఇంగ్లీష్ మీడియం చదువుల వలనో గాని భావ వ్యక్తీకరణలో లోటు పాట్లు ఉంటాయి ,, తప్పులు దొర్లినా పిమ్మట కోపగించుకో కుండా సరిజేయగలరని మనవి...

    రిప్లయితొలగించండి
  5. భారారె
    చాలా మంచి ప్రశ్న లేవ నెత్తారు. మీరు ఆ మొదటి టపా రాసినప్పుడు ఈ విషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకొనే రాసారని భావించాను. కాని ప్పుడు కాదని అనిపిస్తోంది.

    ఆ మధ్య పల్లకి పత్రిక స్టార్ట్ చేసినప్పుడు, ఓ ఆర్నెల్ల మేటర్ పెట్టుకుని ఆ పై ఓ మోస్తరు కమిటెడ్ రచయిత్రుల రచయితల జాబితా పెట్టుకుని స్టార్ట్ చేసారని చదివినట్టు గుర్తు. సో మీరు ఇట్లా ఓ కమిటెడ్ పీరియడ్ నిర్ణయించు కోవాలి. ప్రారంభానికి ఒక నెలకి ఒక సారి బెటర్. ముందస్తే ఓ ఆర్నెల్ల మేటర్ దగ్గిర పెట్టు కోవటం వీలయితే ఓ సంవత్సరపు మేటర్ పెట్టుకోవడం మంచిది.

    ఇక కాలమ్న్స్ గురించి. ఒక కాలం మీరు ఆంధ్రుల చరిత్ర, వ్యాకరణం, రాజకీయం , సినిమా ఇట్లా జనాల టాపిక్ పెట్టుకూంటే వీటికి ఎల్లప్పుడూ మేటర్ లభ్య మయి తీరుతాయి.

    ఇక కమిటెడ్ రచయితలంటారా , మరో టపా రాయండి, కమిటెడ్ రచయితలకి ఆహ్వానం అంటూ. ఎంతమంది దాక రావచ్చు అన్నది తెలుస్తుంది.

    మాలిక వాళ్ళది, కౌముది పత్రిక లు చూస్తె మరింత బోల్డన్ని ఐడియా లు తట్ట వచ్చు మీకు. మీకున్న creativity కి హద్దే లేదు. అల్ ది బెస్ట్.

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  6. రాఫ్సన్....ఈ రకంగా వచ్చే వ్యాసాలు ఇప్పటికే వారి వారి బ్లాగుల్లో ప్రచురితమయినవి వస్తుండటం గమనించాను. ఇది కేవలం వారి వారి వ్యాసలకు హారాన్ని మరో సాధనంగా ఉపయోగించుకోవడమే ఔతుంది కాబట్టి ఆ బ్లాగుల్లో ఇప్పటికే ప్రచురితమైన వాటిని తిరిగి హారం వ్యాసాల క్రింద పెట్టడం అర్థంలేని పని. కాబట్టి ఇలా ప్రచురించడం విరమించుకున్నాను.

    ఇక పత్రిక... పత్రిక ను నడపడానికి నాకున్న సమయం సరిపోదు. దీనికి రచయితలతో మాటా మంతి నిర్వహించాలి. అలాగే సంపాదకత్వం బాధ్యతలను నిర్వర్తించాలి. జ్యోతిగారన్నట్టు ఒక క్రమ పద్ధతిలో సరైన సమయానికి పత్రికను వెలువరించగలగాలి. ఇవన్నీ కూడా ఉచితంగానే కదా!!! కాబట్టి అంత సమయాన్ని నేను నాకున్న బాధ్యతల మధ్య కేటాయించలేను.

    రిప్లయితొలగించండి
  7. జిలేబీ, మీరు పత్రికను నడిపారా? మీ కామెంట్ చూసాక పల్లకి పత్రిక కోసం చూసాను కానీ నాకు అది లభ్యమవ్వలేదు. మీరు చెప్పిన వర్గాలు బాగున్నాయి. పైన చెప్పినట్టు ఈ పని నేను చెయ్యలేను. ఎవరైనా సంపాదకత్వ బాధ్యతలతోపాటి రచయితల నుండి రచనలను రాబట్టే బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైతే, దానికి సరిపడ సాంకేతిక సహాయాన్ని కొంతవరకూ అందించగలను.

    కొసమెరుపు : ఈ పత్రిక కోసమై మొన్నకరోజు ఓ బుల్లి రెండు పేజీలను చేసాను. దీన్ని వాడడానికైనా ఒక్క పత్రికా సంపాదకునిగా ( ఏక్ సంపుటీ సంపాదకస్య ;-) అవతారమెత్తుతానేమో :))

    రిప్లయితొలగించండి
  8. భారారె గారు,

    జిలేబి పత్రికను నడపడమా! అంత క్రెడిట్టు నాకు ఇచ్చినండులకి నెనర్లు. దేశమును పరిపాలించితిని సివిలూ సేర్వెంటై అంత మాత్రమె ! పత్రికను నడుపు కార్యదక్షతా భాద్యతలు స్వీకరించలేదు సుమా!

    మీరన్నట్టు అది ఒక కత్తి మీది సాము విద్యే. సమయమూ కావలె మరి. మీ ఆ చిన్ని ఏక సంపుటీ సమాహారము శీఘ్రమేవ వెలుగొందు గాక !

    చీర్స్
    జిలేబి ఐఏఎస్.

    రిప్లయితొలగించండి
  9. ఈ కత్తి మీద సాము చెయ్యడానికి రెడీనా మరి :)).అదేనండీ పత్రిక నడిపి చేయి కాల్చుకుంటారా అని.

    రిప్లయితొలగించండి
  10. Zilebi , అన్నట్టు మీరు వ్రాస్తానన్న వ్యాసాన్ని మాత్రం తప్పక పంపండి. ఇక వేరే వ్యాసాలకు కూడా ఆహ్వానం ఈ రోజు రాత్రికే.

    ఒకవేళ ఎవ్వరూ పంపలేదనుకోండి. అప్పుడు సంక్రాంతి పత్రికలో మన "సుమన్ బాబు" తరహా లో కవి,పండిత,హాస్య,చిత్ర,సాంకేతిక,సకల కళా భారారే గా అన్నీ నా అవతారాలే చదువుకోవాలి. అయినా పోయేది చదివేవాళ్ళే కాబట్టి నాకేం బాధలేదు.

    రిప్లయితొలగించండి
  11. భారారె
    కత్తి మీది సాము కట్టె మీద పోయేకాలములో ఉన్న మాకు కుదరని పని. ఆహ్వానములకు నెనర్లు. ఆ కార్యములను గంధర్వులే తీర్చుదురు గాక ! యుగంధరులు మీరు గావిమ్పుడు

    ప్రయత్నిస్తాను, బాణం మీ మీదే - ఓ ఫ్యాన్ అఫ్ భారారె - ఓ ఫన్ విత్ జేకే !

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  12. Zilebi ,ఆశీర్వాదములకు ధన్యవాదాలు. ఎలాగూ బాణమెక్కుపెట్టానంటున్నారు కాబట్టి వదలండి మరి :))

    రిప్లయితొలగించండి

Comment Form