14, డిసెంబర్ 2011, బుధవారం

ఈ జానపద గేయం తెలిసిన వారు కామెంటెయ్యడోచ్

ఓ గుర్రాల గోపిరెడ్డి
దాచేపల్లికె దానమైతివా!!
శేరుశేరు ఎండి మురుగుల్
సేతులకు పెట్టుకొని
కట్టమీదా వస్తావుంటే
కలకటేరు వనుకొంటిర కొడకా,
వయ్యారికొడక, బంగారు కొడక
దాచేపల్లికె దానమైతివా!!

ఆ పక్క ఒకసేను
ఈపక్క ఒకసేను
నడుమలోన నాపసేను
నందున నిని నలుగురు పట్టి
నరికిరి కొడక, వయ్యారి కొడక

ఎక్కేది ఎల్లగుల్లం
కట్టేది కాయపంచ
సుక్కవంటి నీ సక్కదనము
సూడకన్నులు లేవుర కొడక
బంగారుకొడక, చిన్నారికొడక
దాచేపల్లికె దానమైతివా!!

27 కామెంట్‌లు:

  1. ఈ పాట మొన్న జూన్ లో వెబ్సైటులోకెక్కించా....వివరాలు ఈ పోష్టులో....

    http://janatenugu.blogspot.com/2011/06/blog-post_24.html

    ఆడియో కావాలంటే - మాగంటి.ఆర్గ్ వెబ్సైటు లోకెళ్లి జానపదం - ఆడియోల సెక్షన్లో వినవచ్చు....

    రిప్లయితొలగించండి
  2. ఓ అవునా!!!!... చాలా చాలా ధన్యవాదాలు వంశీ. ముందు ఆ పాట విని వస్తానుండండి.

    రిప్లయితొలగించండి
  3. ఈ పాట వినాలనుకున్న వారికి లింకు (maganti.org) ఈ క్రింద.
    http://www.maganti.org/audiofiles/folksongs/manapragada_gurrala.html

    అందించిన వంశీకి మరోసారి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. ఈ జానపద గేయం పాత 'రైతు బిడ్డ '(సారథీవారి ఫిల్మ్ )లో ఉన్నది.ఒక నిజమైన సంఘటన అనుసరించి పుట్టిన పాట,అని చెప్తారు.

    రిప్లయితొలగించండి
  5. కమనీయం గారూ అవును. ఇది 1890 వ సంవత్సరానికి దరిదాపుల్లో జరిగిన యదార్థ సంఘటన.

    రిప్లయితొలగించండి
  6. భాస్కర చేతానంద స్వామీజీ గా మారిన పిదప స్వామీ వారికి పూర్వ జన్మ జ్ఞాపకమా ఇది భారారె గారు ?

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  7. హహ..కాదు కాదు పూర్వుల జ్ఞాపకమేమో అంటే బాగుంటుంది :)

    రిప్లయితొలగించండి
  8. హన్నా భారారె,

    అది కూడానా !

    ఈ దాచేపల్లి ఎక్కడ వుంది ?

    ప్రస్తుత జమానాలో దాచేపల్లి = అమెరికా !

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  9. ఈ గేయం విన్నాను. ఎక్కడా అని ఆలోచిస్తుంటే కమనీయం గారి కామెంట్ కనిపించింది.

    రిప్లయితొలగించండి
  10. @భాస్కర రామి రెడ్డి: ఎప్పుడో చిన్నప్పుడు దూరదర్శన్ లో చూసిన ఈ పాట మళ్ళీ గుర్తు చేసినందుకు thanks. ఈ పాటకు మూలమయిన యదార్థ సంఘటన గురించి వివరాలు తెలిస్తే రాయండి please.

    రిప్లయితొలగించండి
  11. జిలేబి గారూ, నాకు మాత్రమేమి తెలుసు దాచేపల్లి గురించి, ఏదో బూచేపల్లైతే ఏమన్నా తెలుస్తుందేమో కానీ :)).
    దాచేపల్లి గురించి వివరాలకు గూగులమ్మ కంటే గుంటూరోళ్ళు బెస్ట్. ప్రయత్నించండి :))



    బులుసు గారూ, మీరూ విన్నారా? నాకు సినిమా పాట తెలియదండి.



    జై, నేను బంధువులద్వారా, మా పిచ్చిగుంట వారి ద్వారా విన్నసంఘటనను తప్పక వ్రాస్తాను. కొంత సమయం పడుతుంది.

    రిప్లయితొలగించండి
  12. భారారే గారు...పద్మర్పితా గారి బ్లాగులో మీ కామెంట్స్ చూసాను......ప్చ్ ....ఏంటో చదువుకున్న, మేధావి అయిన మీరు కూడా....సాఫ్ట్వేర్ రంగం లో ఉంది కూడా భారతీయ ముస్లిముల మనోభావాలను సరిగా డికోడింగ్ చేయలేకపోయారు....100 మంది లో 10 మంది తప్పు చేస్తే....100 మందిని దోషులుగా చూసే మీ మైండ్ నాకు అర్ధం కావట్లేదు...కొంతమంది నాలాంటి వాళ్ళు కుడా ఉంటారండి బాబు....

    నాది మత పిచ్హి అని మీరు అనుకోకండి....అందరు అలా వేరుచేస్తే మమ్మల్ని.. మేము ఎలా ఉండాలండి...?? ఏదో అందరిని ఒకే గాటాన కట్టకుడదని నా ప్రయత్నం...ఆపై మీ ఇష్టం అనుకోండి ...ఇక ముందు మీ (మత) భావాల కామెంట్ల మీద ఎలాంటి రి కామెంట్లు చేయను.....నేను శాంతి ని కోరుకునే వాడిని జనాలలో ఈర్ష్యను పెంచాను,,నొప్పిస్తే క్షమించండి....

    రిప్లయితొలగించండి
  13. రాఫ్సన్ గారూ, నాకు ఏమతానికి సంబంధించిన "మనుషుల" మనోభావాలను గాయపరిచే ఉద్దేశ్యము ఏమాత్రం లేదు. I still want you to comeout and write your rational thoughts on this topic.

    have a good evening.

    రిప్లయితొలగించండి
  14. ఈ పాట నాకు తెలియదు. తెలుసుకుందామనే వచ్చాను! ఇప్పుడు కామెంటచ్చా? కామెంటకూడదా?

    రిప్లయితొలగించండి
  15. కామెంటేసినాక ఇలాంటి అనుమానాలు రాకూడదండీ :)

    రిప్లయితొలగించండి
  16. ఏమో అండి నాకసలే మీరంటే ఒక కేజీ భయం! అందుకే ఈ సందేహం ఏమంటారో అని!

    రిప్లయితొలగించండి
  17. అమ్మో భయమే !! మరేమో నేనేమో..మనుషులని తినేస్తా కదా :)

    ఇంతకీ ఎందుకంట భయమండీ?

    రిప్లయితొలగించండి
  18. ఓ గుర్రాల గోపిరెడ్డి పాట చాలా సార్లు ఆకాశవాణి విజయవాడనుంచి ప్రసారమయింది. చాలా సార్లు విన్నది. పాడినవారి పేరు గుర్తులేదు.

    రిప్లయితొలగించండి
  19. శర్మగారూ, ఈ పాట మీరు వినివుండకపోతే మా దాకా వచ్చి వుండేది కాదేమో.

    రిప్లయితొలగించండి
  20. లీలగా గుర్తు బందావారు పాడినట్లుగా.

    రిప్లయితొలగించండి
  21. ఏమో అండీ! అన్నీ అలా చెప్పేస్తారా ఏంటి? మీరే అర్ధం చేసుకోవాలి ;)

    రిప్లయితొలగించండి
  22. కష్టేఫలే గారూ ధన్యవాదాలు.పైన మాగంటి వంశీ మోహన్ ఆడియో లింక్ ఇచ్చారు చూడండి. అక్కడ పాడిన వారి పేరు కూడా వుంది.

    రసజ్ఞ గారూ, ప్లీజ్ ప్లీజ్ చెప్పరా :))

    రిప్లయితొలగించండి
  23. ఆశ, దోశ, పులిహోర, శర్కరపొంగలి :P

    రిప్లయితొలగించండి

Comment Form