27, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఈ ఆట పేరేమి?

మీలో ఎంతమంది ఈ బొమ్మలో ఉన్న ఆట ఆడారు ? నియమాలు ఏమైనా తెలుసా? పోనీ చిన్నప్పుడు మీరు ఈ ఆట ఆడేటప్పుడు ఒకవేళ ఓడిపోతే రోషంతో ఏంచేసేవాళ్ళు :-)

ఇప్పుడు అసలు ఈ ఆట ఎవ్వరూ ఆడుతున్నట్టుకూడా లేదు :(


7, సెప్టెంబర్ 2011, బుధవారం

ఆంధ్రా అన్నా హజారే శ్రీ శ్రీ శ్రీ శ్రీ మాజీ మాబాబు గారు.

ఈ మధ్య ఆంధ్రా అన్నా హజారే అవ్వాలని తెగ తాపత్రయంతో కనిపించిన బడిలోనల్లా దూరి నీతిమంతుడంటే నాలా వుండాలని మైకు విరగ్గొడుతున్న శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకూ తమ ఆస్థులను తమంతట తామే, స్వయంగా, ఎవరి ఒత్తిడులు లేకుండా నిజాయితీగా నిక్కచ్చిగా తను ఎంతగానే ప్రేమించే ప్రజల సాక్షిగా తను తృణపాయంగా ఎంచే ముఖ్యమంత్రి సీటు సాక్షిగా తన ఆస్థులను ఈనాడు వారికి వివరించారు.సారీ సారీ ఆంధ్రా ప్రజలకు వివరించారు. పేదవాడికి ప్రతిరూపమంటే నేనే, పేదలను ఎత్తుకొని సాకగలిగేది నేనే, ఆంధ్రాలో అవినీతి అధికారులను నిద్రకూడా పోనివ్వకుండా పనిచేయించగల నాయకుడిని నేనే నా లాంటి నాయకుడు దొరకడమ్ మీరు ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అని ఆయన చెప్పకపోయినా, తమంతట తామే ఆస్థులను వెల్లడించి ఎంతో మంది MLA లకు మార్గం చూపించిన వ్యక్తిగా గౌరవ దర్శకరత్న అవార్డు కూడా ఇవ్వవచ్చేమో. వారు తీసుకోవడానికి మొహమాటపడతారు.ఐనా మీలాంటి నాయకుడు మాకు దొరకడం మా అదృష్టం కాబట్టి మీకు తప్పక దర్శకరత్న అవార్డునిచ్చుకోవాలి. కాదంటారా?

మీలా నిజాయితీతో తమ ఆస్థులను ప్రకటించిన నాయకులెంతమంది చెప్పండి? తుదకు మీమామగారు కూడా మీలా ధైర్యంగా ఆస్థులను ప్రకటించలేక పోయారు. ఐనా మీ ఆస్థులన్నీ కలిపి వందకోట్లు కూడా లేవంటే నాకో దుర్బుద్ధి పుట్టింది. మా ఊర్లో దగ్గరున్న షాపుకెళ్ళి రోజూ ఒకకోటు కొనుక్కున్నా, ఓ వందరోజుల్లో మీకంటే ధనవంతుడినైపోతాను. అప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి నాకంటే బికారి అని చెప్పుకోవడానికి నాకెలాంటి సిగ్గువుండదు. మాజీ ముఖ్యమంత్రులు మీరే ఇంత బిచ్చగాళ్ళైనప్పుడు ఇక నాకు సిగ్గెందుకు చెప్పండి? అందుకే ముఖ్యమంత్రిగా మీరు సంపాయించినదేమీ లేదని ప్రఘాడంగా మీరు నమ్మి, మీకు ప్రజాక్షేమమే ముఖ్యమని మీరు చెప్పగా నమ్మిన వాళ్ళలో ప్రధముడిని నేను. కాబట్టి మీరే మా ఆంధ్రా అన్నా హజారే......