11, ఫిబ్రవరి 2012, శనివారం

రెండు చాటు పద్యాలు

1) కూడు తలప జోళ్ళు కూరకారామళ్ళు
చెవులంత వ్రేలాళ్ళు చేలుమళ్ళు
దుత్తెడునాగళ్ళు దున్నపోతుల యేళ్ళు
కలవు మాపటివేళ గంజినీళ్ళు
మాటమాటకు మళ్ళు మరిదొంగదేవుళ్ళు
చేదైన పచ్చళ్ళు చెరకునీళ్ళు
వంట పిడ్కలదాళు వాడనీతుల నీళ్ళు
విన విరుద్ధపుబేళ్ళు వెడదనోళ్ళు

దళమయినట్టి కంబళ్ళ తలలు బోళ్ళు
పయిడికిని జూడ బియిడెత్తు ప్రత్తివిళ్ళు
చలముకొని వెదికినను లేవు చల్లనీళ్ళు
చూడ వలసెను ద్రావిళ్ళ కీడుమేళ్ళు.



2)
మీగాళ్ళ జీరాడు మేలైన కుచ్చెళ్ళు
తీరున మడి చీర దీర్చి కట్టి
బిగువు గుబ్బల మీద నిగనిగల్ధళుకొత్తు
నోర పయ్యెద కొంగు జారవైచి
వలపుల కొకవింత గలుగగా గొప్పవౌ
కురులు నున్నగ దువ్వు కొప్పు వెట్టి
నెలవంక నామంబు సలలితంబుగ నుంచి
తిదుచూర్ణమా మీద దీర్పు జేసి

ఓరచూపుల విటులదా నూరడించి
గిల్కు మెట్టెల రవరవల్ గుల్కరింప
జికిలి చేసిన తామ్రంపు చెంబుబూని
వీధినేతెంచె సాతాని వేడ్కలాడి

4 కామెంట్‌లు:

  1. మీరేనా రాసింది?

    మీగాళ్ళ జీరాడు మేలైన కుచ్చెళ్ళు

    నెలవంక నామంబు సలలితంబుగ నుంచి


    ఈ వాక్యం చాలా బాగుందండీ

    మీరేనా రాసింది ?

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. మొదటి పద్యం ఎత్తుగీతి మొదటి పాదంలో ‘దళమయినట్టి’ అంటే గణదోషం. అది ‘దళమయినయట్టి’

    రిప్లయితొలగించండి
  3. శంకరయ్య గారూ, గణ సవరణ చెప్పినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

Comment Form