3, మార్చి 2012, శనివారం

సామెత

నా చిన్నప్పుడు మా గుంటూరు దగ్గర ఊర్లలో చెప్పుకొనే సామెత

పనిలేని మంగలోడు పిల్లి --- గొరిగాడట

3 వ్యాఖ్యలు:

  1. గుంటూరులోనే కాదు చాల ప్రాంతాలలో అలాగే వాడుకలో ఉంది. పనిలేని మంగలి పిల్లితల గొరిగాడు అని. కాని పిల్లికి మంగలి గొరగవలసినంత తలకట్టూ ఉండదు, దానితలగొరగడం మంగలిపనీకాదు. ఇది వాస్తవానికి పిలిచి తలగొరిగాడనేది వాడుకలో పిల్లితలగా రూపాంతరంపొందిఉంటుందనేది ఒక వాదం. ఇది కొంత నిజమై ఉండవచ్చుననిపిస్తుంది. గ్రామాలలో మిరాశి విధానం వ్యవహారంలో ఉండేరోజుల్లో కామందులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మంగలివచ్చి క్షురకర్మ నిర్వహించే ఏర్పాటు వుండేది. అలాంటి సందర్భంలో వ్యవసాయ పనులు ప్రారంభంకాబోయేముందు మంగలివాళ్ళు తమ తమ కామందులందరికీ క్షురకర్మలు పూర్తిజేసి (కొండొకచో అవసరం లేనివాళ్ళకు కూడ అంటే కొంత ముందుగా)వాళ్ళ వ్యవసాయ పనులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తపడి ఉండవచ్చు. ఈఎర్పాటు కామందులకు, వాళ్ళుకూడ రైతులే గనుక అసౌకర్యం అయి వుండదు. ఇదే వ్యవహారంలో పిలిచి తలగొరగడమై, కాలక్రమేణ పిల్లితలగా రూపాంతరంచెంది ఉంటుంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. అన్వేషి, మీ వివరణకు ధన్యవాదాలు.బాగుంది.

    ఫణీంద్ర గారూ, నాకసలే సిగ్గెక్కువాయె మరి

    ప్రత్యుత్తరంతొలగించు

Comment Form