26, ఏప్రిల్ 2012, గురువారం

బొమ్మల చదరంగం - మెదడుకు మేత


ఈ బొమ్మను వేరొకరి బ్లాగులోనుంచి తస్కరించ బడినది :-)

ఇక ఈ క్రిందన వున్న బొమ్మలో అక్షరాలను రకరకాలగా కూర్చి ఓ ముప్పై  పజిల్స్ ఇచ్చారు. పజిల్స్ అంటే ఏదో అనుకోమాకండి. అసలు పజిల్ అంటేనే సక్రమమైన సమాధానాలు కాకుండా అక్రమంగా సమాధానాలు చెప్పి సంతృప్తి పరిస్తే చాలు. అంతే పజిల్ అంటే. ఇకనేమి విజిలేసి ఎన్ని సమాధానాలు సంతృప్తికరంగా చెప్పగలరో చూడండి.





సమాధానాల కొరకు అలా అలా అలా జారుతూ కిందకు పొండి.
Scroll Down
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.



Solution
=========

1. Seven Seas.
2. Split Level.
3. Forgive and Forget.
4. Missing You.
5. Downtown.
6. Lucky Break
7. He's By Himself
8. See Through Blouse
9. First Aid
10. West Indies
11. Six Feet Below Ground
12. Backward  Glance
13. Tricycle
14. Reading Between The Lines
15. Cross Roads
16. Three Degrees Below Zero
17. Neon Lights
18. Just Between You and Me
19. One In A Million
20. Broken Promise
21. You Are Out of Touch
22. Life Begins At Forty
23. Jack In A Box
24. Growing Economy
25. Up Before Eight
26. Just Around The Corner
27. Apple Pie
28. Making Up For Lost Time
29. Standing Ovation
30. I Understand You Undertake To Undermine My Undertaking.

21, ఏప్రిల్ 2012, శనివారం

Empires Of the Indus - Alice Albania ( సింధూనదిని పాకిస్తాన్ కు కోల్పోవటం మనకు లాభమా, నష్టమా?)








ఈ పుస్తకము సింధూనది గూర్చి, ఆ నది పరివాహక ప్రాంత ప్రజల గురించి, వారి చరిత్ర గురించి, ఆయా ప్రాంత ప్రజల మతముల గురించి, ఆచార వ్యవహారాలను గురించి, దేశ విభజన ద్వారా ఇండియా, పాకిస్తాన్ లకు జరిగిన నష్టాలగురించి, రాజకీయ అవసరాలగురించి రచయిత్రి స్వీయ అనుభావలను కూర్చి, తన అభిప్రాయాలకు పూర్వపు ముద్రిత గ్రంధాలలోని విషయాన్ని ఊతంగా చేసుకొని వ్రాసిన ఓ నాన్- ఫిక్షన్ (చరిత్ర) పుస్తకము.

ఈ పుస్తకము చదువుతున్నంత సేపూ నన్ను మూడు ప్రశ్నలు తొలిచేసాయి. అవి

౧) పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో రచయిత్రి ఒంటరిగా ఎలా తిరుగగలిగింది? తనకెటువంటి ఫిజికల్ హరాస్మెంట్/ టీజింగ్ అనుభవాలు కలుగలేదా? లేక తన మరో నవల Leela's book లో వ్యాసుడిని వెక్కిరిస్తూ వ్రాసినట్లు ( అంటే మహాభారత వక్త వ్యాసుడే కాబట్టి, తను చేసిన పనులను మంచిగా చూపించుకోవడం ) ఇక్కడ Alice Albania కూడా అలాంటి విషయాలను వ్రాయకుండా దాటవేసిందా? ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్  గురించి చదివిన, విన్న వార్తలను బట్టి తప్పక ఈ అభిప్రాయం కలుగుతుంది. లేదా మనము కన్నవి,విన్నవి సత్యదూరాలైనా అయి వుండాలి.

౨) ఈ సింధూనది పరివాహక ప్రాంతం మొత్తం ఈ రకంగా నెలల తరబడి తిరగడానికి ఎంత మొత్తము ఖర్చు అయి వుంటుంది? ఎన్ని నెలల ప్లాన్ ఇది? ఈ మొత్తము తన సొంత ధనమా లేక ఆమె రీసెర్చ్ చేస్తున్న యూనివర్శిటీ భరించిందా?

౩) లగేజ్ రూపంలో ఎప్పుడూ తనతో పాటు తీసుకు వెళ్ళే అత్యవసరమైన వేమిటి? ( కారణం రచయిత్రి దరిదాపు ౨౫౦-౩౦౦ కి.మీ నది వెంటనుండే ఊర్ల గుండా నడుస్తుంది. అలాగే టిబెట్ లో ట్రెకింగ్ కూడా)


ఈ ప్రశ్నలకు సమాధానాలేవైనా సరే,  చరిత్రను, యాత్రా విశేషాలను కలిపి ఆసక్తిగా చదివించ గలిగే పుస్తకమిది. ఇందులో నాకు అభ్యంతరకరమైన విషయాలు అక్కడక్కడ కనిపించినా, చాలా విషయాలపై పట్టుగల రచయిత్రిగా కనిపిస్తుంది Alice Albania. అలాగే కొన్ని కొన్ని విషయాలపై స్థరమైన అభిప్రాయాలు కల్గిన రచయిత్రి కూడా. అంటే, BJP/RSS అన్నా, అద్వానీ అన్నా మంట. స్త్రీ వాది అన్న అనుమానమూ కలుగుతుంది కానీ చెప్పలేము. మొత్తానికి నవలలో తన అభిప్రాయాలను సర్వమత సామరస్య పూర్వకంగానే చూపినట్లు మనకళ్ళకు గంతలు కట్టేస్తుంది :-)

రచయిత్రి లిటరల్ గా చాలా చోట్ల  మనస్పూర్తిగా ఆ నదీపరివాహక ప్రాంతాల్లో మమేకమై ఈ రచనను మనకందించింది. ఈ కారణం చేతనే ఈ పుస్తకం చివరిదాకా మనల్ని చదివించేలా చేస్తుంది. కానీ ఆసక్తి కరంగా భారతదేశంలో రచయిత్రి ప్రయాణం చాలా పేలవంగా నడిచి కొంచెం బోర్ కొడుతుంది కూడా. దీనికి కారణమేమైవుంటుందా అని ఆలోచిస్తే నాకు తట్టిన ఒకే ఒక్క సమాధానం, ఇక్కడ Alice Albania కు పెద్దగా ఇబ్బందులే ఎదురు కాలేదు. కష్టాలు లేవు కాబట్టి రచనలో విషయం లోపించింది. లేదా భారతదేశంలో సింధూనది పరివాహక ప్రాత నిడివి తక్కువ కాబట్టి రచయిత్రికి పెద్దగా ఆసక్తి కలిగించిన విషయాలు లభ్యమయి వుండక పోవచ్చు.

ఇక ఈ పుస్తకము నవలలా చదువడానికి వీలుపడదు. ఇందులో స్పృశించిన విభాగాలు చాలానే వున్నాయి. కరాచీలో మొదలైన తన ట్రావెల్ ప్రాజెక్ట్. ఇండస్ జన్మస్థలి ఐన టిబెట్ లో ముగుస్తుంది. ఈ మధ్యలో మనకు ఇండియా, పాకిస్తాన్ విడిపోవటం వల్ల ఇండస్ నదిని కోల్పోయి, ఇండియా అనే పదానికి అర్థము లేకుండా పోవడం గుర్తుకొచ్చి బాధవేస్తుంది. అలాగే పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ లలో నేటి పరిస్థితులు చూసి ఆ భాగము లేకపోవడమూ భారతదేశానికి అదృష్టమేమో అని కూడా అనిపిస్తుంది. ఈ నదిని,దీని ఉపనదులను కోల్పోవడం ద్వారా చాలా వరకూ నీటిని కోల్పాయాము. కానీ  భారతదేశానికి ఎప్పుడూ NW, లేదా ఉత్తర  దిశలో  శత్రువు వుండటం సాంప్రదాయమేమో :-)

పుస్తకము ద్వారా పాకిస్తాన్ రాజకీయ, సాంఘిక, మత చరిత్ర కొంతవరకూ తెలుస్తుంది. వజీరిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ చాలా సంవత్సరాలనుండే గాన్ కేసెస్ కాబట్టి ఆశ్చర్యమనిపించదు కానీ ఆ ప్రాంతాలలో రచయిత్రి తీసుకున్న రిస్క్ భయాన్ని కలిగిస్తుంది. బహుశా అమ్మాయి, దానితోటి అందమైన రూపు కూడా రచయిత్రికి కలిసి వచ్చి వుంటుంది. చాలా సునాయాసంగా గవర్నర్లను, మిలటరీ కమాండర్లను, పోలీస్ అధికారులను కలువగలుగుతుంది. భారత్, పాక్ రాజకీయాలు తెలిసిన ఎవరికైనా ఇది కష్ట సాధ్యమని ఇట్టే అర్థమవుతుంది. అంతకు మునుపు పత్రికా ఎడిటర్ గా ఢిల్లీ లో చేసిన అనుభవమూ తోడై వుండవచ్చు.

సూఫీ సైంట్స్ గురించి, సిక్కు మతం గురించి చక్కగా వ్రాసింది. రచయిత్రికి అలగ్జాండర్ పట్ల అమితమైన ఇష్టం. కారణం ఇండస్ ను దాటి భారతదేశాన్ని కొద్దిభాగాన్ని జయించిన మొదటి వ్యక్తి. వీరుడు. అందగాడు. కనుక ఎవరికి మాత్రం ఆరాధనా భావముండదు? ఇక్కడ బింబిసారుడు గురించి మౌర్యుల గురించీ ప్రస్తాపన వస్తుంది. పుస్తకము చదువుతుంటే అశోకుని  విస్తార సామ్రాజ్యమూ కళ్ళముందు కదులుతుంది. మనదేశంలో బౌద్ధం వ్యాప్తికీ, పతనానికీ కారణాలూ కొంతవరకూ తెలుస్తాయి.   అలగ్జాండర్ ఇండస్ ను బోట్స్ ద్వారా దాటినట్టు మనల్నీ బోటు ఎక్కిస్తుంది. బాబర్ తో పాటు  ఖైబర్ పాస్ కు తీసుకువెళుతుంది. ఆనాటి  సోమరసమంటే ఏమిటో కానీ , రచయిత్రి సోమరసాన్ని వైన్ లో చూపిస్తుంది. బహుశా నిజమేనేమో !! వైన్ ఐనా, సారాయి ఐనా వట్టి రసం బువ్వ ఐనా ఇప్పుడు తేల్చలేము కదా.

ఇండస్ పై రిజర్వాయర్లు కట్టటం ద్వారా, కంకరకోసం కొండను వాడుకోవడం ద్వారా మన ప్రాచీన చరిత్రను ఎలా కోల్పోతున్నామో చెప్తూ బాధపడుతుంది. ఇస్లామ్, బౌద్ధమతం పై ఎలా దాడి చేసిందో చెప్తూ, సిక్కు, ఇస్లాం,బౌద్ధమతాలు సామరస్యంగా శతాబ్దాలపాటు కలిసి వున్న వైనాన్ని వివరించింది.

పుస్తకం చదువుతూ, గూగుల్ శాటిలైట్ మ్యాప్స్ చూస్తూ, మనము రచయిత్రితో పాటు ఆ ప్రాంతాల్లో సంచరిస్తూవుంటే చాలా విషయాలు అవగతమవుతాయి. నేనూ ఊహల్లో తిరుగుదామనుకున్నాను కానీ, బార్బారిక్ ఇస్లాం టెర్రరిష్టుల గురించి తెలిసీ ఊహల్లోనైనా అలాంటి సాహసం చెయ్యాలని పించలేదు. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు ఆయా ప్రాంతాల్లో  పాకిస్తాన్ సామాన్య ప్రజానీకానికి, ఓవరాల్ గా పాకిస్తాన్ కి చెప్పులోని రాయి, చెవులోని జోరీగ చందము. కానీ రచయిత్రి సేకరించింన అభిప్రాయాల ప్రకారం అటు గవర్నమెంట్ కు కానీ, ఇటు ప్రజలకు కానీ ఈ టెర్రరిజం ఏమీ పట్టకపోగా, మద్దత్తు ఇస్తారట.

అభ్యంతరాలు : ఋగ్వేదం ఇందులో ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆర్యులకు ప్రధానమైనది  Indus river అని, వారు దాని పరివాహక ప్రాంతాలలో వుండేవారని,  Indus నుంచి ఇండియా, హిందూ వచ్చిందని, ఋగ్వేదకాలము క్రీ.పూ ౧౦౦౦ ప్రాంతమని అభిప్రాయ పడుతూ, పూర్వ గ్రంధాలను కోట్ చేసింది. కానీ ఈ ఇండియా,హిందూమతము  అన్నవి మనకు బ్రిటీష్ వారు నేర్పిన పాఠాలు. దీనికీ ఋగ్వేదానికి సంబంధము లేదు. ఋగ్వేదము ఒక్క మతానికి సంబంధించిన గ్రంధము కాదు. ఆ మాటకొస్తే మనకు వర్ణవ్యవస్థ తప్ప "హిందూమత"మే లేదు. అలాగే ఋగ్వేదంలో ప్రధానమైన నది భూమి పొరల్లో మాయమైపోయిన సరస్వతీ నది. ఇందులోని చాలా శ్లోకాలు ఈ నదిపైనే వున్నాయి. ఋగ్వేద కాలం నాడు ఈ నది ప్రవహిస్తూ వుండి, మహాభారతకాలం నాటికే మాయమై పోయింది. ఈ లెక్కన రచయిత్రి తీసుకున్న    క్రీ.పూ ౧౦౦౦ అన్నది చాలా అసంబద్ధమైనది.

హ్మ్మ్.... ఇంకా మరికొన్ని వున్నట్లున్నాయి కానీ ఇప్పుడు గుర్తురావడంలేదు...  కానీ వీలున్నప్పుడల్లా ఒకటికి రెండు సార్లు చదవవలసిన పుస్తకం. మీ స్నేహితులెవరికైనా బహుమతి ఇవ్వడానికీ వుపయోగపడే పుస్తకం. అవిభాజ్య భారత చరిత్ర గురించి తెలుసుకొనగోరువారికి వుపయోగపడే పుస్తకం

 కాలం సాగిపోతూనే వుంటుంది. కాలంతో పాటు హిస్టరీ థీరీస్ మార్పు చెందుతూ వుంటాయి. సత్యం ఎప్పటికీ స్థిరమై, నాశనము లేనిదై భూమి పొరల్లో కప్పబడిపోయి ఎప్పుడో ఎక్కడో మళ్ళీ వెలుగుచూస్తూ వుంటుంది.

20, ఏప్రిల్ 2012, శుక్రవారం

సుదూర తీరాలకు భారత "అగ్ని"




ప్రథమం మండలమ్ - ప్రథమో౭ష్టకః - ప్రథమో౭ధ్యాయః అనువాకః -1 , సూక్తమ్ - 1







ఋషిః             మధుచ్ఛందా వైశ్వామిత్రః   దేవతా : అగ్నిః          ఛన్దః  గాయత్రీ


1.     అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్ | హోతారం రత్నధాతమమ్ ||

2.     అగ్నిః పూర్వేభిరృషిభిరీడ్యో నూతనైరుత |  దేవాగ్ం ఏహ వక్షతి ||

3.     అగ్నినా రయిమశ్నవత్ పోషమేవ దివేదివే | యశసం వీరవత్తమమ్ ||

4.     అగ్నే యం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి |  ఇద్ దేవేషు గచ్ఛతి ||

5.     అగ్నిర్హోతా కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమః | దేవో దేవేభిరా గమత్ ||

6.     యదఙ్గ దాశుషే త్వమగ్నే భద్రం కరిష్యసి | తవేత్ తత్ సత్య మఙ్గిరః ||

7.     ఉప త్వాగ్నే దివేదివే దోషావస్తర్ధియా వయమ్ | నమో భరన్త ఏమసి ||

8.     రాజన్తమధ్వరాణాం గోపామృతస్య దీదివిమ్ | వర్థమానం స్వే దమే||

9.     సనః పిత్రేవ సూనవే౭గ్నే సూపాయనో భవ | సచస్వా నః స్వస్తయే ||





తెలుగు మరియు ఆంగ్ల భావము (వ్యాఖ్యాన సహితము)

1)    అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్ | హోతారం రత్నధాతమమ్ ||


భావము: పురోహితుని వలె యజ్ఞమును నడిపించువాడునుదేవతలను పిలుచుకొని వచ్చువాడునుఋత్విజుడై రత్నములను ధరించువాడును అగు అగ్ని దేవుని స్తుతించు చున్నాను.


వ్యాఖ్యానము :

Meaning: I glorify Agni, the high priest of the sacrifice, the divine, the ministrant, who presents the oblation (to the gods), and is the possessor of great wealth.


Commentary: A great variety of etymologies are devised to explain the meaning of the term Agni, the most of which are, obviously, fanciful,but the import of which expresses the notions entertained of his character and functions. On earth, he is invoked (niyate) the first (agra) of the gods ; in heaven, he is the leader (agrani) of the hosts of the gods ; he is the first of the gods (prathamo devatanam) ; he was the first-born of the gods (sa va eshogre devatdnam ajayata). In these derivations, Agni is compounded, irregularly, out of “agra”, first, and “ni”, to lead. It is also derived from “anga”, body ; because he offers his own substance, in the lighting of the sacrificial fire. The author of a Nirukta, or glossary, called StIt hlasht'hivm, derives it from the root knu, with the negative prefixed (aknopayati), he who does not spare the fuel. Another compiler of a glossary, S'akapuni, derives the word from three roots, i, to go, anj, to anoint, and dah, to burn, collectively ; the letters being arbitrarily changed to ag, and ni, from the root ni,being added.

See, also, Yaska's Nirukta, 7, 14.

Agni is termed the Purohita, the priest who superintends family rites, or because he is one of the sacred fires in which oblations are first (puras) offered (hita).

Deva, which, in common use, means a god, is ordinarily explained,in the passages in which it occurs in the Veda, as ' the bright, shining, radiant ; ' being derived from div, to shine : or it is also explained, one who abides in the sky or heaven (dyusthana). It is, here, also optionally rendered, liberal, donor ; the sense of giving being ascribed to the same radical.

Ritwij, a ministering priest, or, according to some, the Ritwij who is also the Hotri,—the term that follows in the text,

the priest who actually presents the oblation, or who invokes or summons the deities to the ceremony, accordingly as the word is derived from hu, to sacrifice, or hve, to call.


The word is ratnadhdtama, lit., holder of jewels : but ratna is explained, generally, wealth, and, figuratively, signifies the reward of religious rites.


2)  అగ్నిః పూర్వేభిరృషిభిరీడ్యో నూతనైరుత |  దేవాగ్ం ఏహ వక్షతి ||

భావము: పూర్వపు ఋషులచే గాకనవీన ఋషులచే కూడా పొగడబడుతున్న అగ్నిహోత్రుడుప్రీతితో దేవతలను పిలుచుకొని వచ్చి దివిరి వారికమిత హవ్యమునిచ్చుగాక.


Meaning: May that Agni, who is to be celebrated by both ancient and modern sages, conduct the gods hither.


Commentary: The terms puna and nutana, former and recent, applied to Rishis, or sages, are worthy of remark, as intimating the existence of earlier teachers and older hymns. The old Rishis are said to be Bhrigu, Angiras, and others ; perhaps, those who are elsewhere termed Prajapatis. (Vishnu Purana, p. 49.)


3 ) అగ్నినా రయిమశ్నవత్ పోషమేవ దివేదివే | యశసం వీరవత్తమమ్ ||

భావము:        స్తుతివలన అగ్నిస్తుతించిన యజమానికి దీర్ఘాయుష్షునుదినదినాభివృద్ధిచెందు ధనరాశులచేత కీర్తినివీరులైన పుత్రభృత్యులను ఇచ్చును.

వ్యాఖ్యానము :


 Meaning: Through Agni the worshipper obtains that affluence which increases day by day, which is the source of fame, and the multiplier of mankind.


4) అగ్నే యం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి |  ఇద్ దేవేషు గచ్ఛతి ||


భావము:       నాల్గు దిక్కులలో నాలుగు రూపాలతో అగ్నిహోత్రుడు వెలుగుతుంటే యజ్ఞవిఘ్నము లన్నీ తొలగిపోవును యజ్ఞమే దేవునికి తృప్తి కలిగించును.

వ్యాఖ్యానము :         ఆహవనీయమార్జలీయగార్హపత్యఅగ్నిధ్రియములను నాలుగు నామములతో నాల్గుదిక్కులయందు నగ్ని వెలుగుచున్నాడు.

Meaning:     Agni, the unobstructed sacrifice of which thouart, on every side, the protector, assuredly reaches the gods.

Commentary:         Adhwaram yajnam. The first is usually employed as a substantive, meaning, also, sacrifice : it is here used as an adjective, signifying free from injury or interruption,—that is, by Raakshasas, evil spirits, always on the alert to vitiate an act of worship

 "On every side" alludes to the fires which, at a sacrifice, should be lighted at the four cardinal points, east, west, south, and north,termed, severally, the AahavanIya, MaarjaalIya, Gaarhapatya, and Agnidhriya.





5) అగ్నిర్హోతా కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమః | దేవో దేవేభిరా గమత్ ||

భావముహోమమును సంపాదించువాడును,  విశేషజ్ఞానవంతుడునుసత్యము పలుకువాడును,పలు విధములైన కీర్తి కలవాడును అగు అగ్ని దేవతలతోకూడా వచ్చుగాక.

వ్యాఖ్యానము :

Meaning:     May Agni, the presenter of oblations, the attainer of knowledge, he who is true, renowned, and divine, come hither, with the gods.

Commentary:         Kavikratu is here explained to signify one by whom either knowledge or religious acts (kratu) have been acquired or performed (kranta). The compound is commonly used as a synonym of Agni.



6) యదఙ్గ దాశుషే త్వమగ్నే భద్రం కరిష్యసి | తవేత్ తత్ సత్య మఙ్గిరః ||

భావముఓ అగ్నీనీవు హవిస్సులనిచ్చు యజమానునకు అభివృద్ధిని ( పశుపుత్రాభివృద్ధి ) కలిగించినచో అది తిరిగి నీకే చెందగలదు. ( అంటే యజమాని అభివృద్ధి చెంది మరల మరల యజ్ఞములను చేయునని భావము)
వ్యాఖ్యానము :


Meaning:     Whatever good thou mayest, Agni, bestow upon the giver (of the oblation ), that, verily, ANGIRAS, shall revert to thee.


Commentary:         That is, the wealth bestowed upon the Yajamana—the person by whom, or on whose behalf, the sacrifice is performed,—will enable him to multiply his oblations, by which Agni, again, will benefit. Instead of Agni repeated, we have, in the second place, Angiras, as a synonym, which, in Manu and all the Purdtias, is the name of a Rishi or Prajdpati, one of the primitive mind-born sons of Brahma : and the appellation is used, frequently, in the text of the Veda, in that sense, as the designation of a Rishi, the founder of a family, or of a school. The commentator quotes Yaska , for the identity of Angiras with Angara (అంగార), a live coal ; and a passage from the Aitareya Brahmana is cited, in which it is said,

"the coals became the Angirasas" (ye'ngara asanste'ngiraso 'bhavan). The identification of Angiras with Agni, in function,though not in person, is the subject of a legend, told, rather confusedly and obscurely, in the Mahabharata, Vana-parva (printed edition, vol. 1., p. 712), by Markand'eya to Yudhisht'hira, in reply to his question, how it happened, formerly, that Agni, having gone to the forest, and his functions having ceased, Angiras became Agni, and conveyed the oblations to the gods. Connected with this question, he also inquires, how it is that Agni, who is one, should become many. Markand'eya therefore relates, that Agni, having engaged in penance, and relinquishing his duties, the Muni Angiras took upon him his office, and, when he prevailed upon Agni to resume it, became his son : his descendants, the Angirasas, are, therefore, also the descendants of Agni, or so many Agnis, or fires. Their enumeration, which follows at some length, shows them to be, for the most part, personifications of light, of luminous bodies, of divisions of time, of celestial phenomena, and fires adapted to peculiar occasions, as the full and change of the moon, or to particular rites, as the Aswamedha, Rajasuya, the Pakayajnas (or sacrifices with food), obsequial and funeral fires, expiatory fires, and the like. The legend is, possibly, intended to represent the organization of worship with fire,—which, in the first instance, was of a primitive and simple character,—and its appropriation to various occasions, by Angiras and his disciples.

The Mahabharata is not contented with the first account, but gives a second, in which the first Agni is called Saha; and he is said to have hidden himself in the ocean, to avoid the approach of Niyata,the son of Bharata, the fire of the funeral pile.

The text says,"through fear:" the commentary says, either through fear of being rendered impure by his contact, or being ashamed of his relationship ; Niyata being his own grandson. The gods coming to look for Agni, he designated, as his substitute, Atharvan, also called Angiras, who, for a time, acted as Agni, until the latter was induced to resume his office. The legend is constructed, as the commentary shows, out of Yadik texts : but the details are clumsily and contradictorily put together ; indicating, perhaps, their almost obsolete antiquity at the time of the compilation of the Mahabharata.

7) ఉప త్వాగ్నే దివేదివే దోషావస్తర్ధియా వయమ్ | నమో భరన్త ఏమసి ||


భావముప్రతిదినమూ ఉదయమూసాయంకాలమూ బుద్ధిగలిగినవారమై భక్తితో నీచెంత చేరుతున్నాము
వ్యాఖ్యానము :


Meaning: we approach thee, Agni, with reverential homage in our thoughts,daily, both morning and evening

8) రాజన్తమధ్వరాణాం గోపామృతస్య దీదివిమ్ | వర్థమానం స్వే దమే||

భావముప్రకాశించువాడునుహింసారహితమగు యజ్ఞములను కాపాడు వాడునుకర్మ ఫలములను మాటి మాటికి కనపరచు వాడునుగృహ సంపదను వృద్ధి పరచు ఓ అగ్నీ మనస్సుతో నిన్ను స్మరించుచున్నాము.
వ్యాఖ్యానము :

Meaning:     Thee, the radiant, the protector of sacrifices, the constant illuminator of truth, increasing in thine own dwelling


Commentary:         Swe dame, sua domo, the chamber in which fire-worship is performed, and in which the fire increases by the oblations poured upon it. Dama, for a home, or house, is peculiar to the Vedas.


9) సనః పిత్రేవ సూనవే౭గ్నే సూపాయనో భవ | సచస్వా నః స్వస్తయే ||


భావముఅగ్నీ,తండ్రీ పుత్రుల సంబంధమువలెమాకు మేలు చేయుటకు ఎల్లప్పుడూ మాతోనే వుండుము.
వ్యాఖ్యానము :

Meaning: Agni, be unto us easy of access; as is father to his son: be ever present with us, for our good.

16, ఏప్రిల్ 2012, సోమవారం

Wakeup incredible India !!

నిద్రపోతుంటే ఓ సారి మేల్కోవాలి ఇండియా !!  incredible India.  http://www.incredibleindia.org


SELECT a.id, a.title, a.alias, a.title_alias, a.introtext, a.catid, a.created, a.created_by, a.created_by_alias, CASE WHEN a.modified = 0 THEN a.created ELSE a.modified END as modified, a.modified_by, uam.name as modified_by_name,CASE WHEN a.publish_up = 0 THEN a.created ELSE a.publish_up END as publish_up, a.publish_down, a.attribs, a.metadata, a.metakey, a.metadesc, a.access, a.hits, a.xreference, a.featured, LENGTH(a.fulltext) AS readmore ,CASE WHEN badcats.id is not null THEN 0 ELSE a.state END AS state,c.title AS category_title, c.path AS category_route, c.access AS category_access, c.alias AS category_alias,CASE WHEN a.created_by_alias > ' ' THEN a.created_by_alias ELSE ua.name END AS author,ua.email AS author_email,contact.id as contactid,parent.title as parent_title, parent.id as parent_id, parent.path as parent_route, parent.alias as parent_alias,ROUND( v.rating_sum / v.rating_count ) AS rating, v.rating_count as rating_count,c.published, CASE WHEN badcats.id is null THEN c.published ELSE 0 END AS parents_published FROM iio_content AS a LEFT JOIN iio_categories AS c ON c.id = a.catid LEFT JOIN iio_users AS ua ON ua.id = a.created_by LEFT JOIN iio_users AS uam ON uam.id = a.modified_by LEFT JOIN iio_contact_details AS contact on contact.user_id = a.created_by LEFT JOIN iio_categories as parent ON parent.id = c.parent_id LEFT JOIN iio_content_rating AS v ON a.id = v.content_id LEFT OUTER JOIN (SELECT cat.id as id FROM iio_categories AS cat JOIN iio_categories AS parent ON cat.lft BETWEEN parent.lft AND parent.rgt WHERE parent.extension = 'com_content' AND parent.published != 1 GROUP BY cat.id ) AS badcats ON badcats.id = c.id INNER JOIN iio_content_frontpage AS fp ON fp.content_id = a.id WHERE a.access IN (1,1) AND CASE WHEN badcats.id is null THEN a.state ELSE 0 END = 1 AND (a.publish_up = '0000-00-00 00:00:00' OR a.publish_up <= '2012-04-16 05:24:49') AND (a.publish_down = '0000-00-00 00:00:00' OR a.publish_down >= '2012-04-16 05:24:49') ORDER BY c.lft, CASE WHEN a.publish_up = 0 THEN a.created ELSE a.publish_up END DESC , a.created DESC




8, ఏప్రిల్ 2012, ఆదివారం

మానవ సంబంధాలు. Leela's book





Alice Albinia, Empires of the Indus పుస్తక రచయిత్రి ద్వారా వెలువడిన "లీలాస్ బుక్ ( leela's book )" మహాభారతంలో కొద్ది పాత్రలను ఈ నాటి సమాజానికి అనుసంధానించి వ్రాసిన ఓ నవల. ఇది ఈవిడ మొదటి నవల లేదా రెండవ రచన. Empires of the Indus అనే పుస్తకం ఓ Non-fiction book.


 ఈ leela's book  చదవడం మొదలెట్టిన రోజు ఇదొక సుత్తి నవల అనుకున్నాను. మొదటి రోజు కథలోని పాత్రలు పెద్దగా అర్థంకాలేదు. హిందూ వ్యతిరేక వాది వ్రాసిన పుస్తకమనిపిస్తుంది. పుస్తకమంతా చదవడానికి సుమారుగా వారం రోజులు పట్టింది. Introductions, prefaces ఏమీ లేని ఓ 420 పేజీల పుస్తకం.


కథ ఇక్కడ చెప్పేస్తే ఈ నవల చదవాలనుకున్న వారికి ఉత్కంఠత తగ్గి చదివేటప్పుడు ఆత్రుత లోపిస్తుంది. మొదటి 250 పేజీలు చదవడానికి ఓ నాలుగు రోజులు పడితే, చివరి 150 పేజీలు ఓ రాత్రి కూర్చొని చదివేశంతటి ఆసక్తి వచ్చింది. నవలలో అక్కడక్కడా తెలియని పదాలు పంటికింద రాళ్ళలాగా తగిలినా సగం పుస్తకం చదివేటప్పటికి రచయిత్రి రచనా విధానం అర్థమౌతుంది కనుక మిగతా సగం సులభంగా చదివేయవచ్చు.


ఇక్కడ కథకంటే ఈ నవలా రచయిత అభిప్రాయాలను ముచ్చటించటం బాగుంటుంది.


రచయిత్రికి హిందూమత పైన ద్వేషం పెద్దగా కనిపించదు కానీ, ఇస్లాం మతంపై ప్రేమ కనిపిస్తుంది. ఎక్కడో ఇంగ్లాండ్ లో పుట్టి , న్యూఢిల్లీ లో ఓ పత్రికా విలేఖరిగా కొద్ది సంవత్సరాల అనుభవంతో భారతదేశ సమాజాన్ని, ఇక్కడి మతాలను, ఆచార వ్యవహారాలను ఇంత దగ్గరగా గమనించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓ రకంగా మన చరిత్రగా చెప్పుకుంటున్న, మన పురాణాలలోని  పాత్రలను కొంతవరకూ పరిశీలించినట్లే అనిపిస్తుంది కానీ నాటి సామాజిక వ్యవస్థమీద పూర్తి అవగాహన లేదేమోనని కూడా అనిపిస్తుంది. కథ చివరికి వచ్చేటప్పటికి మన అభిప్రాయం నిజమా అన్న ప్రశ్నకూడా కలుగుతుంది. మహాభారత కాలంనాటి సమాజానికి, నేటి సమాజానికి వ్యత్యాసం ఎంతగా కనిపించినా  స్త్రీ,పురుష మధ్య సంబంధాలలో ఇప్పటికీ పెద్దగా వ్యత్యాసం కూడా లేదేమో నన్న భావం కూడా కలుగుతుంది. ఈ నాటి సింధూపరివాహక ప్రాంత ముస్లింలు కూడా హిందువులని సూచాయగా చెప్తుంది.


చాలా సునిశిత పరిశీలనా రచయిత అని చెప్పవచ్చు. మహాభారత వక్త వేదవ్యాస కు, నవలలో ఒక ముఖ్య పాత్ర వేదవ్యాస చతుర్వేదికి లింకు పెద్దగా సరిపోలేదు కానీ, కథలో పాత్రల అల్లిక అద్భుతం. అక్కడక్కడ మహాభారత ప్రదేశాలకు, రచయిత ఊహలోని ప్రదేశాలకు పోలిక బాగానే వుందనిపించింది. రచయిత హిందూమతంపై  తన అభిప్రాయాలను  శివప్రసాద్ శర్మ, అతని భార్య, వారి దగ్గర కుటుంబం ద్వారా  హేళనా స్వరం తో నవలలో బాగానే అల్లింది. నవల పూర్తయ్యేటప్పటికి ఊర్వశి ఒక ముస్లింని చేసుకోవడం ద్వారా నిజాయితీ పరురాలయినట్లు చూపినట్లనిపిస్తుంది. ఇక నవలా హీరోయిన లీల ద్వారా రచయిత ఏం చెప్పాలనుకున్నదో అది పాఠకుల ఊహకే వదిలేసింది. 


నిజానికి నవలమొదటిలో హిందూమతాన్ని విమర్శిస్తూ వ్రాస్తున్నట్లు స్పష్టంగా తెలిసిపోతుంది. కథ మధ్యలోకి చేరుకొనేటప్పటికి కథలోని పాత్రలపట్ల విపరీతమైన ఆశక్తి మొదలౌతుంది. సమాజంలో మనం నిత్యము చూసే మనుషుల అంతరంగ జీవితాలను బట్టబయలు చేసినట్లనిపిస్తుంది. ఏది మంచో ఏది చెడో కూడా అర్థము కాకుండా అల్లిన నవల ఇది. అసలు మంచి చెడూ అన్నవి లేనేలేవు అన్నదే ఈ నవల సారంశం అనిపిస్తుంది. అలాగే పుట్టుకకు మరణానికి మధ్య మనమేమి చేస్తామన్నదే ముఖ్యమన్న సందేశమూ వుంది.


రచయిత్రికి ఇస్లాం మతం పై ప్రేమా లేక కరడు గట్టిన హిందూవాదులపై ద్వేషమా లేదా మానవ సంబంధాలు మతానికతీతమని చెప్పాలనుకున్నారా ? అన్నది మన ఆలోచనల్లో తప్పక మెదలాడుతూ వుంటుంది. తాను గడిపిన, తాను చూసిన, తను భాగమైన హిందూ సమాజపు ఢిల్లీ జీవితాన్ని రచయిత్రి అణువణువు వర్ణించింది. మన పెళ్ళిళ్ళు ఎంత కృతకంగా వుంటాయో చెప్పకనే చెప్పింది. సంస్కృత పండితుల అంతరాత్మలనూ ఆవిష్కరించింది. ఆర్యులు ఇక్కడివారే అని మనము ఋజువు చేయాలన్న తాపత్రయాన్ని కథలో భాగంగా చేర్చింది. తను బహుశా పరిశోధనలకోసం వ్రాసుకున్న మన పురాణ పాఠాలనూ అక్కడక్కడ తన అభిప్రాయలతో కలిపి నవలలో కూర్చింది. నవలంతా చదివాక నిజానికి హిందూ మతాన్ని విమర్శించడంకన్నా  పురాణాలను అల్లిన వారిని , వాటిలోని sugar coated కథలను ఈవిడ విమర్శిస్తుందన్న అభిప్రాయం బలపడుతుంది.


 శాంతినికేతన్ లో ఇందిరాగాంధి గడిపిన రోజుల గూర్చి రచయిత కొంత పరిశోధన చేసిందో లేకా ఇందిరాగాంధీ జీవితచరిత్ర చదివిందో కానీ కథలోని శాంతినికేతన్ భాగాన్ని చదివేటప్పుడు ఆ వివరాలు మన మనసులో తచ్చాడుతూ వుంటాయి కూడా. నాకైతే ఖరగ్ పూర్ లో వున్నప్పుడు ఇండియా టుడే లో వచ్చిన బసంతపంచమి వ్యాసంతో పాటు బెంగాల్ అమ్మాయిలూ చాలా చాలా సార్లు గుర్తుకొచ్చారు. ఆ బసంతపంచమిలో ఓ అమ్మాయి రూపంకూడా చాలారోజులకు మళ్ళీ వెంటాడటం ముదలెట్టింది.


కథ పూర్తయ్యాక మనల్ని ఆలోచనల్లోకి నెట్టివేసి సమాధానాలకోసం మీరే వెతుక్కోండి అని ఛాలెంజ్ చేసినట్లుగా ముగుస్తుందీ నవల. 


గెలుపన్నది ఎవరిది? కథ చెప్పేవానిదా?కథ వ్రాసినవానిదా? వ్యాసునిదా లేక గణేశ్/వినాయకునిదా? మీరా ఓడిందా లేక లీల గెలిచిందా? ఆర్యులెవరన్నది తేల్చడంలో శర్మ పాత్ర ఏమిటి? ఆర్యుడెవడన్నది తెలుసుకున్న శర్మ గెలిచాడా ఓడిపోయాడా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఈ పుస్తకం చదివిన తరువాత మీరే ఆలోచించుకోవాల్సి వస్తుంది. తప్పక చదువవలసిన ఓ మంచి నవల.


అంతా చదివాక కొద్దిరోజులు కథలోని పాత్రలు కచ్చితంగా మనను వెంటాడతాయి.

1, ఏప్రిల్ 2012, ఆదివారం

సరాగ - శ్రీరామ నవమి శుభాకాంక్షలతో మరో కథ, వ్యాసము




ఆ సీతా రాములు మానవాళి అంతటికి ప్రశాంత జీవనాన్ని ప్రసాదించాలని, కోరుకుంటూ.ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

ఇయం సీతా మమ సుతా
సహధర్మ చరీ తవ |
ప్రతీచ్చ చైనాం భద్రం తే
పాణీం గృహ్ణీష్వ పాణినా ||


ఇక సరాగ పత్రిక లో శ్రీరామ నవమి సందర్భంగా విధి విలాసము అనే కథనూ, తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాల వ్యాసాన్ని ఉగాది సంచిక ద్వారా అందిస్తున్నది. ఇంతకు మునుపు ఉగాదినాడు విడుదలైన పత్రికను ఇక్కడ (http://patrika.haaram.com) చూడవచ్చు.