7, మార్చి 2013, గురువారం

హంపీ యాత్ర (సమాచారము) - 1

ఆ మధ్య భారతదేశానికి వెళ్ళేముందు "హంపి" పరిశరప్రాంతాలన్నీ తిరిగి చూసి ఓ డాక్యుమెంటరీ తీద్దామని పెట్టాబేడ సర్దుకోని వెళ్ళానా... కానీ వెళ్ళిన తరువాత హంపీ కి వెళ్ళడానికి సమయం సరిపోలేదు. ఇందులో కొత్తేముందిలెండి ఇక్కడనుంచి  చుట్టపు చూపుగా ఇండియా వెళ్ళినచాలా మందికి ఇలాంటి అనుభవాలే వుంటాయి. అలా నా ట్రిప్ ప్రిపరేషన్ లో భాగంగా హంపీ, దాని పరిశర ప్రాంతాల గూర్చి కొంత సమాచారాన్ని సేకరించాను. ఆ సమాచారాన్నంతా ఇక్కడ పెట్టేస్తే ఈ సారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడో వెతుక్కోకుండా సమాచారమంతా ఒకేచోట దొరుకుతుంది కదా. అందులో భాగంగా మొదటి వ్యాసమిది.

ఈ వ్యాసాన్ని ప్రాచీనాంధ్ర నగరములు - మొదటి భాగము ( రచయిత ఆదిరాజు వీరభధ్ర రావు ) గ్రంధంనుండి సేకరించడం / తస్కరించడం జరిగింది. ముందుగా ఆనగొంది సమాచారము.










6 కామెంట్‌లు:

  1. మూడు ఆరు పేజీలు తారుమారుగా అప్లోడ్ ఐనట్లు ఉన్నాయండి. ఓ సారి చూడండి:))

    రిప్లయితొలగించండి
  2. హబ్బ..సునీతగారెన్ని రోజులకు తెలుగు అక్షరాలు వాడి కామెంటు వ్రాసినారు :).
    పేజి నెంబరు తప్పు అని చెప్పారంటే పోస్టు చదివారన్నమాట. Thanks for reading the article.
    ఇప్పుడు order మార్చాను చూడండి.

    రిప్లయితొలగించండి
  3. మీ essay లో చారిత్రక విశేషాలను అందించారు.
    ఆనెగొంది- అంటే ఏనుగుల కోన - అని రచయిత ఆదిరాజు వీరభద్ర రావు రాసారు
    కానీ, ఏనుగుల సందు - అని అర్ధమేమో??

    రిప్లయితొలగించండి
  4. అనిల్,
    గొంది అంటే కన్నడంలో "కోన" అని అర్థముందేమో అనుకున్నా... ఐనా ఈ సందు గొందులు వింటుంటే ఎప్పుడో ఎక్కడో విన్న ఓ వాక్యం గుర్తు కొస్తుంది.

    "సందులో సుందరి గొందిలోకి రమ్మంది" అని. సాధారణ వాడుకలో "సందు" కంటే "గొంది" మర్మమైన ప్రదేశము. అంటే పైపైన చూచేవాళ్ళకు కనిపించని ప్రదేశము.

    రిప్లయితొలగించండి
  5. అనగొంది ఇప్పుడు ఏ పేరుతో పిలవబడుతుంది? అక్కడ ఎల్లమ్మ తల్లి గుడి ఉంది అని చదివాను. ఇప్పుడు అక్కడ ఉందా?

    రిప్లయితొలగించండి
  6. ఆనెగుంది అనే పిలుస్తారు. గంగావతి పట్టణానికీ దగ్గరలో ఉంది. తుంగభద్రా నదికి ఒకవైపు ఆనెగుంది, అవతలి గట్టు హంపీ.

    రిప్లయితొలగించండి

Comment Form