17, మే 2016, మంగళవారం

ఎండుతున్న ఊటబావి

బ్లాగునొకకంట చూడక ఇన్ని దినంబుల్ సంసార సాగరంబందీదులాడి
కార్యాలయమున భారమున్మోసి తప్పటడుగుల నడకనేర్చు చిన్నారి ఓలె
తిరిగి వచ్చు చుంటి నా ప్రియసఖి చెంతకు మనసులోని మాటలన్
మురిపెముల ముచ్చట్లు పూసగ్రుచ్చినట్లు ముచ్చటించుకొరకు

మరిచితిని ఛందోగణాంకములను
మరిచితిని యతిప్రాసలను పద్యలక్షణముల్
చూడగ తెలుగే తరిగిపోవు సంధి కాలమున
తిరిగి చూచు చుంటి బ్లాగ్దేవి మోమున్

యతిప్రాసాదిగణ లక్షణముల్ తదుపరి నేర్వవచ్చు
వాక్కునకు మూలమగు స్పందన అడుగంటి
 ఒట్టిపోక మునుపె భావ ఝరుల కక్షర రూపమిచ్చి
నా చిరుస్పందనల బ్లాగునందు కుప్పలు పోయవలె

11 వ్యాఖ్యలు: 1. మెండుగ మెచ్చితి భాస్కర !
  నిండగు మీ పద జిలేబి నిదురయు లేచెన్ !
  రండు,యిక జేతుము దినము
  చెండుల కోలా టమిచట చెంగట రమ్మా!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. జిలేబి గారూ, కామెంటు పద్య రూపమున పెట్టి ఆహ్వానము పల్కుతూ పూర్వపు రోజులను గుర్తుకు తెచ్చారు.భావపరిమళాలు మదిలో క్రమ్ముకోవాలే గానీ వ్రాయటమెంతసేపు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Don't praise jilebi. It will inundate your blog with useless and meaningless poems.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అజ్ఞాత, I think Zilebi is trying to improve her Padyam skills by writing comments in the form of padyam.By doing so,probably one day Zilebi will come up with fine poetry.

   తొలగించు
 4. "Don't praise jilEbii" అంటే ఎలాగండి? :)
  ఈ సందర్భంగా ఓ పాత జోక్ గుర్తొస్తోంది (ముళ్ళపూడి వారిది అనుకుంటాను). నాకు గుర్తున్నంత వరకూ ఆ జోక్ ఏమిటంటే -
  - ఓ సభలో ఒకాయన పాట పాడతాడని ప్రకటిస్తారు. ఆయన పాట పూర్తవగానే జనం వన్స్‌మోర్ అని అరుస్తారు. గాయకుడు మరోసారి పాడతాడు. మళ్ళా జనం వన్స్‌మోర్ అంటారు, ఆయన పాడతాడు. ఇలా నాలుగైదు వన్స్‌మోర్లు అయిన తర్వాత గాయకుడు నాపాట మీకందరికీ బాగా నచ్చినట్లుంది, అందుకే మళ్ళీ మళ్ళీ పాడమంటున్నారు అని అంటాడు మైకులో. దానికి జనం నువ్వు పాట సరిగ్గా పాడేంత వరకు వన్స్‌మోర్ అంటూనే ఉంటాం, నువ్వు పాడుతూ ఉండాల్సిందే అని అరుస్తారు.
  కాబట్టి జిలేబీ గారి ప్రయత్నాల్ని మెచ్చుకుంటుండాల్సిందే :)
  jk

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఒకపరి మరియొక పరి యనె
  అకటా నిదియే జిలేబి అచ్చు యనుకొనెన్
  వికవిక నవ్విరి జనులే
  లకలక, లవణీ లలామ లబ్జుగ నేర్వన్ :)

  జేకె :)
  చీర్స్
  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form