20, నవంబర్ 2017, సోమవారం

జగన్ పన్నెండవ రోజు పాద యాత్ర - నా పద్యము

ఈ రోజు పాదయాత్ర డైరీలోని కొంత భాగం

"పాదయాత్రలో ఆదివారం వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వచ్చి కలిశారు. విద్యార్థులు, అవ్వాతాతలు, రైతులు, విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, అక్కాచెల్లెమ్మలు అందరూ వచ్చారు. వారంతా బాధల్లో ఉన్నారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారడం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. అవ్వాతాతలకు పింఛన్‌లు ఇవ్వడం లేదు. రైతుల పంటకు గిట్టుబాటు ధర లేదు. కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్‌ అయ్యే సూచనలు లేవు. అక్కాచెల్లెమ్మల డ్వాక్రా రుణాలు రద్దు కాలేదు. వారికి సున్నా వడ్డీ రుణాలు పుట్టడం లేదు. బోయలను ఎస్టీలలో, రజకులను ఎస్సీలలో చేరుస్తామని, కాపు, బలిజలను బీసీలలో చేరుస్తామని, మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేస్తామని కూడా చంద్రబాబు ఎడాపెడా హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరినీ మోసం చేశారు. ఎన్నికల సమయంలో నోటికి వచ్చిన వాగ్దానాలు చేసి, ఆశతో ఓటేసిన ప్రజలను అధికారంలోకి వచ్చాక మరిచిపోయే నాయకులకు శిక్షలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అందుకే ఎన్నికల వాగ్దానాలకు చట్టబద్ధత ఉండాలి. అలా ఉంటే.. ఎన్నికల హామీలు నెరవేరని పక్షంలో నిస్సహాయంగా ఉండాల్సిన అవసరం ప్రజలకు ఉండదు.. వాళ్ల స్థితిని చూసి వెటకారం చేసే అవకాశం పాలకులకు రాదు."

ఆ.వె || బాస లెన్నొ చేసె బాబెన్నికలవేళ
ముఖ్య మంత్రి గాగ మొక్కు తీర్చ
డయ్యె, మోస పోయి డగ్గుత్తికన విల
పించు ప్రజల బాధ త్రెంచు నెవడు?

3 కామెంట్‌లు:



  1. హృదయస్పందన సవ్వడిన్ భళిభళీ హృత్సారమైనిల్పి జా
    లి,దయన్గాంచెను మా జగన్! ప్రజలనాళిన్గట్టిగా బట్టి‌ నా
    డు! దవంతుల్ సయి గాంచి దాటి నడిపాడోయీ జనాళిన్నహో
    కదనంబందున దూకె జూడ నట సాకారంబు గానన్ కలల్‌!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జిలేబి గారూ మీ పద్యాలు ఇప్పుడిప్పుడే నాక్కూడా అర్థమౌతున్నాయి :)

    JK

    రిప్లయితొలగించండి

  3. ధన్య వాదాలండి 'అర్ధం' అర్థ మవు తోందన్నారు అదే బడీ బాత్ హై :)


    మీ పద్యాలు జిలేబిగారు, మజ సుమ్మీ !ధన్యవాదాలయా !
    కాపాడారుగ మంచిమార్కు లను మా కైవేసి మీరున్న హో !
    రాపాడంగను మేలుగాంచు ప్రతిదీ, రాయంగ రాయంగ మా
    మీ పద్యమ్ములిటన్భళీయని సదా మించారు కైపున్నహో !

    జిలేబి

    రిప్లయితొలగించండి

Comment Form