29, ఫిబ్రవరి 2020, శనివారం

వసంతాగమన నిరీక్షణ...ముద్దబంతి,తామర,రోజా పూల సందడి

ఈ సారి న్యూజెర్శీ లో వసంతం కొంత ముందుగా వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో మా తోటపని మొదలైంది. ఏమేమి పూలమొక్కలు వెయ్యాలా అని  తెగ ఆలోచించి మధ్యే మార్గంగా కొన్ని రకాలను ఎంచుకున్నాము. మొక్కలు కొని వెయ్యాలా లేకపోతే మనమే గింజలనుంచి మొలకెత్తించాలా అన్న సందిగ్ధంలో కొంతకాలం కొట్టుమిట్టాడి, గింజలనుంచే మొలకెత్తించాలని నిర్ణయం తీసుకున్నాము. ఫిబ్రవరి కి చివరిరోజు ఈ రోజు. గింజలనుంచి మొలకెత్తించాలంటే మార్చిలో జెర్మినేషన్ ( అంకురోత్పత్తి) మొదలెట్టాలి కాబట్టి అమెజాన్ లో రకరకాల ముద్దబంతిపూల గింజలు, మూడురకాల రోజాపూల గింజలు, తామరపూల గింజల తోపాటి వాటికి కావాలసిన కుండీలు మొదలైనవి పంపమని అమెజాన్ వాడికి విన్నపం చేసుకున్నాము. అనుకున్నట్టే రెండో రోజుకల్లా అన్నీ వచ్చాయి కానీ రోజాపూల గింజలు కనిపించలేదు.

ఇక వీటిని ఎలా మొలకెత్తించాలా అని యూట్యూబ్ లో వీడియోల మీద వీడియోలు చూసి మొదటి విడతగా గా తామరపూల గింజలను రెండురోజుల క్రితం రెండు గాజు సీసాల్లో వేసి పెట్టాను.అదేంటో వీడియోల్లో అందరికి రెండురూజులకల్లా మొలకలు కనిపిస్తే నాకేమో యింతవరకూ ఉలుకూ పలుకూ లేకుండా వేసినవి వేసినట్టే వున్నాయి. మరో మూడునాలుగు రోజులు చూడాలి.







వారాంత షాపింగ్ కోసమని నిన్న శుక్రవారం కాస్ట్కో షాపింగ్ కు వెళితే అక్కడ రకరకాల రోజా పూల మొక్కలు అమ్మకానికి పెట్టి వున్నాడు.మనకెలాగూ రోజా పూల విత్తనాలు అమెజాన్ వాడు పంపలేదు కదా అని ఒక జత రోజా పూల మొక్కలు కొన్నాము.



ఎలా నాటాలో అట్టల మీదున్న విధానం చెప్తుంది. దాని ప్రకారం ఈ రోజు గడ్డకట్టే చలిలో మా ఇంటి ముందు తోటలో సుమారు పద్దెనినిమిది అంగుళాల లోతు వెడల్పు తో ( వెడల్పు కొంచెం తక్కువగా వుండవచ్చు) చిన్న గుంత తీసాను. ఇంతకష్ట పడ్డందకు మా ఆవిడ నాకు వంద డాలర్లు బాకీ పడింది. అంటే అది వంద డాలర్ల గుంత :-).




తీసిన గుంతలో మట్టి వేసి (పాటింగ్ మిక్స్) ఒక మొక్కను నాటాను. రేపు బాక్యార్డ్ లో మరో మొక్కను నాటాలి.






ఇక చివరిగా బంతి పూలు. వీటికి ఇంకా ముహూర్తం కుదరలేదు. ఈ వారంలో వాటిని కూడా నాటి అవి మొలకెత్తుతాయో లేదో అని ఎదురు చూడడమే... వసంతం కోసం ఎదురు చూసినట్టు.

5 కామెంట్‌లు:



  1. గ్రామపు అబ్బోడికే ఇంత కనాకష్టంగా వుంటే మా లాంటి వాళ్లకేమి అర్థమగును :)


    కుశలమేనా ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ :-) కష్టమేమీ లేదండీ..మామూలుగా ఆ చిన్నగుంత తీయడానికి కూడా ఇక్కడ బాగానే డబ్బులవుతాయని చెప్పడమే నా ఉద్దేశ్యం. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు కొద్దిగా బాగానే వున్నాయని వసంతం రాకుండానే నాటేశాను. చస్తుందో బ్రతుకుతుందో చూడాలి.

      మేమిచట కుశలమే..మీరచట కుశలమేనా :)

      తొలగించండి

Comment Form