12, జులై 2020, ఆదివారం

మళ్ళీ బ్లాగుల్లోకి.....

గత కొన్ని సంవత్సరాలుగా ఫేస్ బుక్ వాడుతున్నా గానీ నాకెందుకో బ్లాగంత సౌలభ్యంగా వుండటంలేదు.ఏదైనా వ్యాసం బొమ్మలతో వివరించాలంటే ఆ బొమ్మలొక చోట వ్యాసం మరోచోట వుండటంతో ఏబొమ్మ ఏవాక్యానికి లింకో సరిగ్గా తెలియడంలేదు.కాకపోతే అక్కడ మన సెలెక్టెడ్ లిస్టులో వాళ్ళకు మాత్రమే కనిపించేటట్టు పోస్టు వ్రాసే సౌలభ్యముంది.బ్లాగర్ పబ్లిక్ డొమైన్ కాబట్టి ఈ సదుపాయం దొరకదు.ఫేస్ బుక్ ఒకటి రెండు వాక్యాలు వ్రాసుకోవడానికి, బొమ్మలు ప్రచురించు కోవడానికి సౌలభ్యంగా వుంటుంది.కాబట్టి ఇక నుంచి పబ్లిక్ గా ఏమైనా పంచుకొనదలిస్తే బ్లాగులోనూ అలా కుదరని వాటిని ఫేస్ బుక్ లోనూ వ్రాద్దామనుకుంటుంన్నాను. వ్యాసాల నిర్వహణ,అరేంజ్మెంట్ లకు నాకు ఫేస్ బుక్ అస్సలు నచ్చలేదు. ఇక్కడైతే చక్కగా మనకు కావలసిన దానిని ఇట్టే పట్టుకొని అవసరమనుకున్నప్పుడు లింక్ లు కూడా ఇచ్చుకోవచ్చు.
 
అన్నట్లు ఇప్పుడు రోజువారీ తెలుగు బ్లాగర్లెందరుండవచ్చు? మాలిక,శోధిని బ్లాగు ఏగ్రిగేటర్ల నిర్వాహకులు ఏమైనా గణాంకాలు పంచుకొనగలరా? పరిస్థితి మరీ అధ్వాన్నంగా వుంటే ఇక్కడ పోస్టువ్రాసి ఫేస్ బుక్ లో లింకు ఇచ్చుకుంటే చదివే వారి సంఖ్య పెరగవచ్చు.

15 వ్యాఖ్యలు:

 1. "హారం" భాస్కర రామిరెడ్డి గారూ! మీరు మళ్ళీ బ్లాగుల్లోకి వస్తున్నందుకు సంతోషం.. మీలాగే ఒకప్పటి బ్లాగర్లందరూ కనీసం వారానికి ఒకటో రెండో టపాలు వ్రాయాలని ఆశిస్తున్నాను. నిజానికి ఇక్కడ పరిస్థితి బాగోలేకపోయినా .. ఆశాజనకంగా ఐతే ఉంది... ఒకప్పుడు విరివిగా వ్రాసిన వాళ్ళు ఎక్కడ వ్రాస్తున్నారో తెలీడంలేదు. గూగుల్ ప్లస్ లో , ఫేసుబుక్కులో వాస్తున్నారు అని ఒకప్పుడు అనుకున్నాం.. కానీ ప్లస్సు మూసేసినా ఇటు రాలేదు. ఫేస్ బుక్ లో కూడా మంచి రచనలు కనపడ్డం లేదు.

  మీరు అన్నట్లు బ్లాగుల్లో వ్రాసి ఫేస్ బుక్, ట్విట్టర్ లలో లింకు ఇస్తే బాగానే ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు శోధిని ఖాతాల ద్వారా ఆసక్తికరమైన టపాలను ఇలా షేర్ చేసాను.

  రోజువారీ తెలుగు బ్లాగర్లు ఎంతమంది ఉండొచ్చు అని అడిగారు. వ్రాసేవాళ్ళు సరాసరి ఓ పదీ-పదిహేనుకి మించరు అనుకుంటున్నా!!

  మీరైతే రాయడం షురూ చేసెయ్యండి...

  శ్రీనివాస్

  (శోధిని)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీనివాస్ గారూ, ఒకప్పటి బ్లాగరలంతా ఇప్పుడు ఫేస్ బుక్ లో వున్నారు.అప్పుడు విరివిగా వ్రాసిన వాళ్ళెవరూ ఇప్పుడు వ్రాయడంలేదు. ఎవరికి వారు నాకెందుకొచ్చిన గొడవలే అనుకొనో లేక నేను వ్రాయకపోతే కొంపలేం మునిగిపోవులే అనుకొనో లేక వ్రాయాలన్న తృష్ణ తగ్గిపోయో చాలావరకూ మానేసి ఒకటి రెండు వాక్యాలతో సరిపెట్టుకుంటున్నారు.నాకప్పుడప్పుడూ ఏమని అనిపిస్తుందంటే మనసుకు ఏది తోస్తే అది రెండు వాక్యాల్లో ఫేస్ బుక్/ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో వ్రాస్తుండడం వల్ల వ్యాసరూపంలో వ్రాయడమనే కోరిక సన్నగిల్లి పోయిందనిపిస్తుంది.

   ఇక రోజువారి తెలుగు బ్లాగర్లు పది/పదిహేనుమందంటే చాలా తగ్గిపోయారనే చెప్పొచ్చు :( ఒకప్పుడు 150 నుంచి 200 మంది వుండేవారు.

   తొలగించు


 2. బ్లాగర్ పబ్లిక్ డొమైన్ కాబట్టి ఈ సదుపాయం దొరకదు.ఫేస్ బుక్ ఒకటి రెండు వాక్యాలు వ్రాసుకోవడానికి, బొమ్మలు ప్రచురించు కోవడానికి సౌలభ్యంగా వుంటుంది..... :)


  ఇది అర్థం కావడానికి ఓ అర్ద దశాబ్ద కాలం పట్టిందా !


  I wonder at ' telugodi' burra :)  బ్రేవ్ :)

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీ నీకు చిన్నమెదడు పూర్తిగా చితికిపోయినట్లుంది. నా పోస్టూకు విపరీతార్థాలు తీస్తున్నారు :)

   jokes apart, అది అర్థమవడానికి అర్థ దశాబ్దం పట్టిందంటే నేను ఫేస్ బుక్ ను అంత విరివిగా వాడానన్నమాట :). నిజానికి ఫేస్ బుక్ రీచ్ ఎక్కువ. పేస్ బుక్ లో మనం వ్రాసే విషయానికి మధ్యలో వీడియోలు/ఫొటోలు జతచేసే సౌలభ్యం వుంటే బ్లాగర్ అవసరం అసలుండకపోవచ్చు.

   తొలగించు
  2. "జిలేబీ నీకు చిన్నమెదడు పూర్తిగా చితికిపోయినట్లుంది. " - 100 % correct. బ్లాగుల్లో న్యూసెన్స్ నాన్ సెన్స్ జిలేబీ.

   పనికి మాలిన వ్యాఖ్యలు గిద్యాలు భరించలేక బ్లాగులు వదిలేశారు చాలా మంది

   తొలగించు


 3. మళ్లీ " మా" హా! రం వస్తుందా :)  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పైన శ్రీనివాస్ గారి కామెంట్ చూశారుగదా? ఐనా హారం అవసరముంది అనుకుంటే ప్రతి సంవత్సరం డొమైన్, సర్వర్ హోస్టింగ్ డబ్బులు మీరు పెట్టుకోండి ( దరిదాపు సంవత్సరానికి రెండొందల డాలర్లు) అప్పుడు హారం ను మళ్ళీ సరికొత్త టెక్నాలజీతో లైవ్ చేస్తాను :)

   తొలగించు


  2. వామ్మో! రెండు వందల డాలర్లే!/ అదిన్నూ ప్రతి సంవత్సరమున్నూ ! అబ్బే మా జిలేబివదన బ్లాగ్ అగ్రిగేటరే బెటరు ముఫత్ కా మాల్ :)


   రెండు వందల డాలర్లంటే రూపాయల్లో ఎంతండీ ?   జిలేబి

   తొలగించు
  3. జిలేబి గారూ మీరు మరీను..ఎక్కాలే తెలియనట్టు డాలరు కు ఎన్ని రూపాయలో తెలియకుండా షేర్ షంషేర్ అయ్యారా :)

   తొలగించు
 4. దీన్నే “The Return of the Native” అనవచ్చు (Thomas Hardy గారి నవల పేరు) 🙂. Welcome back రెడ్డి గారు.

  // “ అక్కడ మన సెలెక్టెడ్ లిస్టులో వాళ్ళకు మాత్రమే కనిపించేటట్టు పోస్టు వ్రాసే సౌలభ్యముంది.బ్లాగర్ పబ్లిక్ డొమైన్ కాబట్టి ఈ సదుపాయం దొరకదు.” // అన్నారు పైన మీరు.
  మరి మన బ్లాగులోకంలో కొంతమంది బ్లాగు యజమానులు తాము ఆహ్వానించిన వారికి మాత్రమే తమ బ్లాగును సందర్శించడానికి అనుమతి అంటారే, అంటే ఆ సౌలభ్యం ఇక్కడ కూడా ఉన్నట్లే అనుకోవచ్చా?

  ఏమైనప్పటికీ మరోసారి స్వాగతం.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విన్నకోట నరసింహారావు గారూ ధన్యవాదాలు.
   బ్లాగ్ ను ఆహ్వానితులకు మాత్రమే మార్చవచ్చు కానీ ,ప్రతిపోస్టు ఆహ్వానితులకు మాత్రమే అనుకోలేము కదా! ప్రతి సారీ ఇలా సెట్టింగ్స్ మార్చుకోవడం చిరాకు/శ్రమతో కూడిన పనని నా అభిప్రాయం.

   తొలగించు
 5. NinnanE anukokunDa post vrasAnu, okka friend ki share chestE 10 clicks vachAyi. SodhistE sodhini ..meeru ippudE vachAru. Happy.no more haaram..sodhini aggregator chalu �� . Welcome back ( blogs Loki kaadu sumaa)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మొళి గారూ చాలాకాలం తర్వాత పలకరింపు. ఎలా వున్నారు? ఫేస్ బుక్ లో ఎక్కడా తారసపడలేదు , మీరక్కడ లేరా? చిన్నమనవి మీరు తెలుగులో నన్నా వ్రాయండి లేదా ఇంగ్లీష్ లో నన్నా వ్రాయండి.ఇలా తెలుగుని ఇంగ్లీష్ లో వ్రాస్తే చదవడం కష్టంగా వుంటుందండి.

   తొలగించు
 6. భాస్కర రామిరెడ్డి గారు ఇప్పుడే మీ బ్లాగునీ చూసాను అండి చాలా బాగుంది. చాలా ఆసక్తికరమైన విషయాలు పొందుపరిచారు. ఒక 3,4 నెలల నుంచి బ్లాగులకు సంబంధించి అన్ని చూస్తు ఉన్నా, అలా ఇప్పుడే తెలుగు బ్లాగు అనీ గూగుల్ లో టైప్ చేస్తే, మీ బ్లాగు తారసపడింది. అప్పట్లో బ్లాగుల మీద ఉన్నా ఆసక్తి, ఇప్పటి అంటే మా తరానికి అంతగా లేదు అనీ నిస్సందేహంగా చెప్పొచ్చు . అందరూ సామాజిక మాధ్యమాలలో బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఇక ఒక బ్లాగు నడిపే టైమ్ ఎక్కడ ??? కానీ అప్పటి మీ బ్లాగులు, ఆ టపాలు చూస్తుంటే నేను కుడా మీలాగ ఆ సమయంలో ఎందుకు పోస్ట్ చేయాలేక పోయాన అనీ చిన్న బాధగా ఉంది అండీ.కానీ ఇప్పుడు ఆ బాధని తీర్చుకోవాలని, నేను కూడా ఒక బ్లాగుని ప్రారంభించాను. మరీ అది ఎప్పటి వరకు కొనసాగిస్తానో తెలీదు కానీ బ్లాగు రాయడం ఎప్పటికీ ఒక మంచి సరదా వ్యాపకంగా మిగిలిపోతుంది మన జీవితంలో, అనీ మాత్రం చెప్పగలను

  మీరు కూడా ఇప్పుడు తిరిగి బ్లాగు లోకానికి
  తిరిగి వచ్చినందుకు సంతోషం ...!!!
  ఇక సెలవు
  ధన్యవాదాలు !!!!!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జాన్సన్ గారూ , నా బ్లాగు నచ్చి మీలో వ్రాయాలన్న కోరికను కలగజేసినందుకు సంతోషంగా వుంది. బ్లాగులోకానికి మీకు సాదరాహ్వానం.

   తొలగించు

Comment Form