11, ఆగస్టు 2020, మంగళవారం

మాతోట పూల సందడి....

మా ఇంటి తోట మళ్ళీ పూల సందడి చేస్తుంది. ఈ మధ్యనే మా తోట కొద్దిగా బెండకాయలను బహూకరించింది.ఆ బెండకాయలతో చేసిన సాంబారు అద్భుతంగా వుంది.ఎట్లైనా మనం మన తోటలో పండించుకున్న కూరగూయల రుచే వేరు. ఆ తృప్తి మరిదేనితోనూ రాదు. గోగాకు తాజా ఆకులతో నోరూరిస్తుంది. వచ్చే వారం దాన్ని కోసి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని రోటి పచ్చడి చేసుకొని తినాలి.

దోసకాయ, గుమ్మడి,సొరకాయ చెట్లనిండా పూతతో కనులకు విందు చేస్తుంది.కానీ సెప్టంబరు నాటికన్నా వాటి ఫలాలు వస్తాయో రావో అనుమానంగా వుంది. సెప్టెంబరు కు రాకపోతే అక్టోబరు లో చలిమొదలై చెట్లు చచ్చిపోతాయి.

పూలవనం మాత్రం రెండో సారి సందడి చెయ్యడం మొదలుపెట్టింది. మొదటి విడతగా తులిప్, గులాబీ పూలు పలకరించాయి. ఈ సారి గులాబీలతో పాటు జినీయ పూలూ సందడి చేస్తున్నాయి. గులాబీ చెట్లకు మధ్యలో తెగులు వచ్చింది. చచ్చిపోతాయామోనని అనుకున్నాను.కానీ మళ్ళీ తిరుక్కొని పూలు పూస్తున్నాయి. ముద్దబంతి, కారం బంతి పూలు ఏపుగా పెరగనైతే పెరిగాయి కానీ ఒక్క మొగ్గకూడా పెట్టలేదు ఇంతవరకూ :(









గోంగూర, దోసకాయలు ఈరోజుకి పక్వానికొచ్చాయి. దోసకాయాలైతే గుత్తులు గుత్తులు కాస్తున్నాయి. ఈ రెండూ మాకిక్కడ దొరుకుతాయికానీ కాస్త ధర ఎక్కువ. ఇంట్లో మందులు లేకుండా సహజసిద్ధంగా పండిన కూరగాయలతో బయటకొన్నవి సరికాదు కదా :) ఇక రేపు మరిన్ని వెల్లుల్లి వేసి వీటిని పచ్చడి చేసుకోవాలి :)



29 కామెంట్‌లు:



  1. గోగాకు తాజా ఆకులతో నోరూరిస్తుంది. వచ్చే వారం దాన్ని కోసి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని రోటి పచ్చడి చేసుకొని తినాలి.

    ....


    వెల్లుల్లి వేయడం మరవకండేం :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హ్మ్మ... గోంగూర లో వెల్లుల్లి వేస్తారా? ఏమో మా ఆవిడనడగాలి :)

      తొలగించండి


    2. వెల్లుల్లి వేస్తారా అని దాంతో తలీ ఉంగలియా !

      పంచదశ లోకంలో వెల్లుల్లి ప్రహసనం ఓ వారం రోజుల పాటు ఘాటుగా సాగుతూంటేనూ


      ప్రో అండ్ ఆంటీ క్లబ్బుల పెట్టేసుకునేదాకా వచ్చేసిందండి ! మీరేమిటీ మరీ జెర్సీ అయిపోయేరు :)



      జిలేబి

      తొలగించండి
    3. కామెంటు చదివి కాసేపు బుఱ్ఱగోక్కున్నాను :) తరువాత ఆగ్రిగేటర్ల కామెంట్ల టాబ్ లు వదలకుండా చదివినాకూడా నాకు జరిగిన చర్చ/గొడవేమిటో అర్థం కాలేదు కానీ మొత్తానికి ఏదో జరిగిందని అర్థమైంది :)

      హహ్హహ.. జెర్శీ లో పడ్డాక జెర్శీ అవక తప్పలేదండీ...పనిదినల్లో బ్లాగులు చూడటం కుదరడం లేదు. మొత్తానికి చానానే మిస్ అవుతున్నట్టూన్నాను :)

      నేను పక్కా వెల్లుల్లి ఫేన్ ని. ప్రో వెల్లుల్లి క్లబ్ కు మా ఇంట్లో అందరి ఓట్లూ... దొంగఓట్లు వేసే అవకాశముంటే తలుపులు మూసీ మరీ వెల్లుల్లి గుర్తుపై రిగ్గింగ్ చేస్తాను :)

      తొలగించండి


    4. వెల్లుల్లి ఐస్ క్రీమ్స్ దాకా కత నడిచిందండీ !


      తొలగించండి
    5. వెల్లుల్లి ఐస్క్రీమా... ఈసారి దొరికితే టేస్ట్ చెయ్యాలి :)

      తొలగించండి
  2. గోంగూరలో వెల్లుల్లి వేస్తారా అని అడుగుతున్నారా ? మీరసలు ఆంధ్రావాళ్ళేనా ? వెల్లుల్లి లేకుండా ఏ పచ్చడీ ఉండదు, ఉండబోదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీహారిక గారూ..నేను అన్ని కూరల్లో తెల్లబాయలు వేస్తారని అనుకోలేదు :)

      తొలగించండి
    2. పచ్చడి దాకా ఎందుకుసార్. గోంగూరని ఉడకబెట్టి, వెల్లుల్లి
      ప్లస్ ఎర్ర మిరపకాయలతో పోపు పెట్టి కాస్త వేయించి, అన్నంలో వేసుకుని, ఆపైన ఇంత నెయ్యి వేసి కలుపుకుని తింటూ ఉంటే... anti వెల్లుల్లి గ్రూప్ వారు కళ్ళల్లో నిప్పులు పోసుకోరూ?☺️

      తొలగించండి


    3. ఎక్కడ ఎక్కడ ఆంటీ వెల్లుల్లి వారొచ్చి యిక్కడ ధర్నా చేయాలె :)



      జిలేబి

      తొలగించండి
    4. "యాంటీ వెల్లుల్లి గ్రూప్"

      త్రివిక్రం కూడా పనికిరాడు. ఏం డైలాగుల్రాబాబూ!

      తొలగించండి
  3. వెల్లుల్లి లేని గోంగూర పచ్చడి ఊహించలేం.
    అంతెందుకు, ginger garlic మాత్రమే ఉన్న pickles చాలా brands దొరుకుతాయి.

    రిప్లయితొలగించండి
  4. "యాంటీ వెల్లుల్లి గ్రూప్ " చాలా పెద్దది.
    https://www.ktvu.com/news/today-marks-1-year-since-mass-shooting-at-gilroy-garlic-festival

    రిప్లయితొలగించండి
  5. >>>యాంటీ వెల్లుల్లి గ్రూప్ " చాలా పెద్దది.>>>
    ఎ..క.. డా ? అమెరికా లోనా ?
    మీరు కూడా vnr sir పార్టీ నా రావు గారు ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Of course. మరి మా పార్టీ అంటే ఏమిటనుకున్నారు? సప్త సముద్రాల అవతల కూడా సభ్యులు ఉన్నటువంటి పార్టీ 😎.

      తొలగించండి
    2. అవును నీహారిక గారూ . పిజ్జా, బర్గర్లు, ఇటాలియన్, గ్రీక్, చైనీస్, వియత్నాం   ఫుడ్స్, కాచప్ (Hunts ), నిషిద్ధం. వీటన్నిట్లోనూ వెల్లుల్లి  ఉంటుంది.

      తొలగించండి
  6. ఉల్లి, వెల్లుల్లి, మాంస హారం, చేపలు .. ఇవి తామసిక ఆహారాలు గా ఆయుర్వేదం లో చెప్పా బడింది. ఆ వాసన కొందరికి పడదు.

    Chinese people eating all types of animals birds insects etc. Which is dangerous like Corona.


    It is better to eat pure vegetarian food without onion and garlic.

    European people are turning vegetarians. Indians consumes 90 % vegetarian food.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొంత మందికి వెల్లుల్లి నిషేధమేమో కాని సామాన్యులకు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేదం లో చెప్పి ఉండవచ్చు.

      తొలగించండి
    2. శ్రీకృష్ణుడికి వెన్న అంటే ఇష్టం, వెన్న తినండి అని భగవద్గీతలో వ్రాసారు. ఎవరికి నచ్చినవి వాళ్ళు వ్రాస్తూ ఉంటారు.
      తమకి నచ్చని విషయాలు ఆయుర్వేదం లో ఉన్నా వేదాల్లో ఉన్నా అంగీకరించరు కొందరు.

      తొలగించండి
    3. వెన్నతినండీ అనీ భగవద్గీతలో ఎక్కడ ఉందండీ?

      తొలగించండి


    4. పంతొమ్మిదో అధ్యాయం - "నీహారికా యోగః"
      ౧ వ శ్లోకంలో కలదు.


      తొలగించండి
    5. ఆహా. దొరికిందండీ.
      ఏకోనవింశత్యధ్యాయః
      నీహారికా యోగః

      భగవానువాచ.
      యోగో నీహారికా నామ
      పురా మయాకృతం శృణు
      నవనీతాశనా దేన
      మోక్షం ప్రాప్నోత్యనుత్తమం. 1

      ధన్యవాదాలు జిలేబీ గారూ.

      తొలగించండి
    6. బుధు ' లష్టాదశ ' గీతకు ,
      కధలల్లిరి యొకటి సేర్చి కమనీయముగా ,
      మధురాధినాధు డనెనట !
      సుధలూరెడి వెన్న మెసవ శుభమగు ననుచున్ .

      తొలగించండి


    7. ఆ అష్టాదశ యోగాలిట్లాగే డెవలప్ అయ్యేయేమో ఎవరికెరుక :)

      నారదా నీకేమన్నా తెలుసా :)


      జిలేబి

      తొలగించండి
    8. ఎంత సొగసుగాడివి ! తను
      వంతయు భూషణచయమ్మె యలరెడు కృష్ణా !
      సుంతయు చూపులు మరలవు
      సాంతము నిను జూచుచుందు జగదీశ ! హరీ !

      తొలగించండి
    9. కవి పుంగవులు, హేమా హేమీ లందరిని బ్లాగ్ ముఖముగా ఇదో ఇట్లా కరోనా కాష్టమందు ఒహ చోట చూడడం ఒహింత చూడ ముచ్చటగానే ఉంది (మ్యాస్క్, బౌతిక దూరం పాటిస్తు)

      శ్యామలీయం సర్..

      రోజులయ్యాయి నెలలు.. నెలలు కాస్త పావు వత్సరంబు
      తానేమి తక్కువ కాదునని బెట్టేమో.. అందరికి ఎబెట్టు కలిగేలా పుట్ట గొడుగు మాదిరి కరోనా అంకెలు.. మాజి రాష్ట్రపతి కారాదు అనర్హమని మరీ ప్రణవ్ ముఖర్జీ గారికి సైతం సోకి.. అల్లకల్లోలం గ్లోబ్ పావు వంతు.

      వేంకట లక్కాకుల రాజ రావు మ్యాస్టారు
      కరోనా కర్కషంబమున క కనుమరుగై
      కనుల వెంట హింది రోనా
      ఇదో టీకా అదో టీకా ఇంక మరి ప్రయోగ దశ
      ఏపాటికి బుడ్-బుడ్ లాడేనో ఈ కోవిడ్
      ఏనాటికి సద్దు మణిగేనో ఈ భయానక హడావిడ్ ప్చ్

      జీలేబి వారికి పాకాభి వేలు
      జిగటగా గొంతులో చేరి కరోనా
      చేసేత్తదట శ్వాసకోసకే హైరానా
      కంటికి కనపడనంత పరిమాణం
      ఏమి కాబోతోందో తెలియదు పరిణామం

      రామిరెడ్డి గారు:
      పూలతోట పూలతో గుభాళిస్తే
      వర్ణాల బ్లాగ్ వ్యాఖ్యాలతో నిండితే

      ~శ్రీ

      తొలగించండి
  7. ఆహా!! నా ఈ పోష్టు వ్యాఖ్యాతల సందడితో కళకళలాడుతుంది కదా :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనట్లు మీ గార్డెన్ లో జినియా ఎలిగన్స్ పూలు, కాస్మస్ సల్ఫ్యూరస్ పూలు, రోజ్, ఇతరత్ర వన్ని బాగున్నాయి సర్..

      తొలగించండి

Comment Form