9, డిసెంబర్ 2020, బుధవారం

త్రాగునీరు - అమెరికా వర్సెస్ భారతదేశం.

 

ఏలూరులో జరిగిన ఘటన దరిదాపుగా త్రాగునీరు కలుషితమవడం వలన జరిగివుండవచ్చని ప్రాధమికంగా ఒక నిర్థారణకు వచ్చినట్లే వుంది. కచ్చితమైన సమాచారం కావాలంటే మరో నాలుగైదురోజులు పట్టవచ్చేమో... కానీ ఈ దుర్ఘటన చదివిన తరువాత నాకు అమెరికా కుళాయి నీళ్ళ ని భారతదేశపు కొళాయినీళ్ళతో పోల్చాలనిపించింది. దీనికి ఒక కారణం కూడా వుంది. సాధారణంగా చాలామంది అమెరికాలో కొళాయి నీళ్ళే త్రాగుతారు. బాటిల్డ్ వాటర్ త్రాగరా అంటే త్రాగుతారు కానీ సగటు అమెరికన్ ఇంటి కొళాయిలో వచ్చే నీళ్ళే ప్రతిదానికీ వాడుతాడు. ఇంతకీ ఈ వివరణ ఎందుకంటే ఈ సంవత్సరం జూలై నెలలో మాయింటికి మున్సిపల్ వాళ్ళ దగ్గరనుంచి ఒక లెటర్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే గత వారంనుంచి మీరుత్రాగే నీళ్ళలో క్లోరైడ్ శాతం మేము పోయిన సంవత్సరం పంపిన రిపోర్ట్ కంటే కొంచెం ఎక్కువగా వున్నదనీ, కానీ ఈ నీళ్ళు త్రాగడం వల్ల ఎటువంటి హానీ జరగదనీ, క్లోరైడ్ శాతాన్ని రిపోర్ట్ లో చెప్పిన గణాంకాలకు అనుగుణంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామనీ ఒక ఉత్తరం పంపారు. మేము ఎందుకొచ్చిన గొడవలెమ్మని ఓ నెలపాటు అనగా మళ్ళీ వారు ఉత్తరం పంపేవరకూ ప్యూరిఫైడ్ బాటిల్ వాటర్ కొనుక్కుని త్రాగాము. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక నివేదిక ఇంటికి పంపుతారు. అందులో నీళ్ళలో ఏమైనా బాక్టీరియా వున్నాయా, హెవీ మెటల్స్ ఎంతశాతం వున్నాయి మొదలైన సమాచారమంతా పంపుతారు. 


ఇక్కడ ఇంటికి వచ్చే నీళ్ళు కలుషితం కావడం చాలా అరుదు. మన భారతదేశంలో లాగా పొలాల్లో / చేపల చెరువుల్లో పెస్టిసైడ్స్ నీళ్ళను త్రాగునీటి కాలువలు,నదుల్లోకి వదలరు. ప్రజానీకం కూడా బాధ్యత గుర్తెరిగి మసలు కుంటే మంచిది. ప్రభుత్వాలు కూడా మంచిణీటి చెరువులు కాలువల్లోకి ఇలా కలుషిత నీటిని వదిలే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.


మా టౌన్ షిప్/ మున్సిపాలిటీ లో ౨౦౨౦ లో ప్రచురించిన నీటిలో అవశేషాల గణాంకాలు...





2 కామెంట్‌లు:



  1. ఇప్పుడర్థమవుతోంది దేశంలోనికి రాగానే ప్రవాసీయులు జబ్బు పడిపోతారెందుకనో!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అది ఒక ప్రధాన కారణం కావచ్చు. అందుకే చాలా మంది అక్కడికి వచ్చిన కొద్ది రోజులవరకూ కాచి చల్లార్చిన నీళ్ళనో లేదా ప్యూరిఫైడ్ వాటర్ నో త్రాగుతారు.

      తొలగించండి

Comment Form