5, ఏప్రిల్ 2009, ఆదివారం

శ్రీ సీతారామ కళ్యాణము - 5



రామాయణం జరిగిందా ? కల్పితమా ? రామాయణం భూస్వామ్య వ్యవస్థ కు అద్దం పడుతుంది.

ఇవి మొదట నేను రంగనాయకమ్మ గారి రామాయణము చదివిన తరువాత మదిలో పాతుకుపోయిన ప్రశ్నలు. [ కాదు కాదు, అప్పటిదాక వున్న నమ్మకాన్ని తుడిచేసి విషబీజం నాటిన ప్రశ్నలు ]. నాలాగే రంగనాయకమ్మ గారి రామాయణము చదివిన తరువాత కచ్చితంగా ప్రతి సాటి మనిషి లో వుద్భవించే ప్రశ్నలు.

ప్రశ్న) రామాయణము జరిగిందా ?

జవాబు ) జరిగింది [అయితే గొడవలేదు ]

ప్రశ్న) రామాయణము జరిగిందా ?

జవాబు ) జరగలేదు. లేక నిరూపించండి.

ఈ సమాధానము మీదైతే నాదొక చిన్న విన్నపము. మీ రన్నట్టే జరగలేదు. కానీ రామయణ కావ్యం పురాతనం,అది ఒక కవి రచించాడు అనే దానిలో ఎవరికీ ధర్మ సందేహాలుండవేమో ? మరి ఆ కావ్యం చదివి అందులో మంచి తీసుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి ? అసలు మంచేముంది అంటారా ? మీరు కచ్చితంగా భారత సంస్కృతి వినాశనానికి పావులు కదుపుతున్నారని నేను చెప్పక్కరలేదు. కాదు అంటారా ? మీ అంతరాత్మ ని సమాధాన పరచుకోలేక ఈ లోకంలోనే నరకము అనుభవించే మనస్తత్వము మీది.

భారతదేశంలో జీవన ఆవిర్భావం ఎప్పుడు జరిగిందో చెప్పడం కష్టం. ఆంగ్ల భాషా ప్రవీణులు , ఆ, మహా అయితే ఎంత ౩౦౦౦ సంవత్సరాలంటారా ? ఇప్పుడు నేనడుగుతాను, ఋజువులేవని? మీరు ఠక్కున ఏమంటారో తెలుసా ?

Book No 1 -- written by a
Book No 2 -- written by b
Book No 3 -- written by c
Book No 4 -- written by d

మనకు ఈ పుస్తకాలు సైటిఫిక్ ఆధారాలు, కానీ రామాయణం కాదు... కదా?

వేదాలు భారతీయుల అతి ప్రాచీన సాహిత్యం. సంస్క్రృతంలో వుండి ఇవి బతికి పోయాయి. లేకపోతే ఇవి కూడా ఏ మధ్య ఐరాపా నుంచో పుట్టించేవారు.

భద్రం ఇచ్చంత ఋషయఃస్వర్విదః తపోదీక్షా ముపాసేదుః అగ్రే |
తతో రాష్ట్రం బలం ఓజశ్చజాతం తదస్మై దేవా ఉపసం నమంతు ||

భావము : ఆత్మ ఙ్ఞానులైన ఋషులు లోక కళ్యాణం కోరుతూ సృష్టి ప్రారంభంలో దీక్షతో చేసిన తపస్సు నుండి జాతి నిర్మాణమైనది.జాతీయ శక్తి,తేజస్సు ప్రకటితమైనాయి. వివేకులైన వారందరూ దీనికి నమస్కరించాలి.

పైశ్లోకం భావము యధావిధిగా తీసుకుంటే అసంబద్ధంగా లేదూ?

దానికి అర్థం ఇది అని చేప్తే శ్లోకం అర్థం మార్చామని గగ్గోలు పేడతాము. వున్నది వున్నట్టు చెపితే అర్థం కాదు. మార్చి వ్రాస్తే తప్పు . ఇలాంటి ఆలోచనలు కచ్చితంగా అమాయకులకు రావు.

భావము ( వ్యాఖ్య ) : మంచి మనుషులు నాటి సంఘ మేలు కోరి బాగా ఆలోచించి జాతిని నడిపే సూత్ర గ్రంధాలు వ్రాశారు. అవి పెద్దలు అనుభవంతో వ్రాశారు కాబట్టి వాటిని మనము ఇప్పుడు పాటిద్దాం.

ఇలా వ్రాస్తే ఇది మీ భావన ( opinion ) అంటారు. ఇదీ ప్రస్తుత మన పరిస్థితి.

రామాయణ కావ్యాన్ని విమర్శించే వారు కావ్య లక్షణాలను తెలుసుకొని విమర్శిస్తే అర్థవంతంగా వుంటుంది.

కావ్యలక్షణాలు చదివితే తెలిసేవి కావు.

తమకు తాము గా ఒక శ్లోకమో లేక ఒక పద్యమో ఒక కవితో వ్రాస్తే , కవి ఊహాలోకాలలో ఎందుకు విహరిస్తాడో అర్థమవుతుంది.

రామాయణము మీద ( ఇది రామాయణము మీదనే కాదు ప్రతి ఛందో పద్య కావ్యాల పైనా ) మరో విమర్శ చెప్పాలంటే వ్యాకరణానికి అనువుగా పద్యం వ్రాస్తారని. అవును అలా రాస్తేనే పద్యం పండుతుంది. అలాగని ఛందస్సు కోసం భావాన్ని మార్చి , వేరే అర్థాలు వచ్చే పదాలు వాడి కావ్య రచన ఏ కవీ చేయడని మనవి. తన భావం ఆ పద్యంలో ( శ్లోకం లో ) పలకక పోతే వేరే ఛందో రీతి ని వాడతాడు. ఏదీ కాకపొతే గద్యమైనా రాస్తాడు కానీ భావం మార్చడని కొద్దిపాటి కవితా ఙ్ఞాన మున్న ఏ మనిషికైనా ఇట్టే అర్థమవుతుంది.

అలాగే ప్రతి శ్లోకానికి ఈ పదం అర్థము ఇది కాబట్టి ఈ శ్లోకం అర్థమిది అని అర్థం చేసుకుంటే నిజంగానే రామాయణం లో పిడకలు కూడా దొరకవు ( మురళి గారు, ఇది మీరు వ్రాసిన వ్యాఖ్య గా దయచేసి తీసుకోవద్దు. ). అందుకే రామాయణం చదవడానికి, చదివి అర్థం చేసుకోవటానికి కవితా హృదయం తప్పని సరి.

భ్రాతర్యదీదం పరిదృశ్యతే జగన్మాయైవ సర్వం పరిహృత్యచేతసా |
మద్భావనాభావిత శుద్ధమానస స్సుఖీభవానన్దమయో నిరామయః ||

పైశ్లోకం శ్రీరాముడు లక్ష్మణుని తో అన్నది. ఇక్కడ ఇది లక్ష్మణుని తో అన్నట్టు కాకుండా మీకు చెప్పినట్టు చదువుకోండి. చదివి తరించండి

సమాప్తం,

శుభమస్తు
జై శ్రీరామ |

6 కామెంట్‌లు:

  1. ముందుగా మీకు అభినందనలు. ఒక బృహత్కార్యాన్ని తలపెట్టారు, ఎలా పూర్తి చేస్తారా? అన్న సందేహాన్ని చక్కని టపాలతో పటాపంచలు చేశారు. ఇక నేను రాసిన ఆ వ్యాఖ్య కేవలం సరదాగా రాసిందే అన్న విషయాన్ని మీరు అర్ధం చేసుకున్నారు.. చాలు.. మరో సరదా వ్యాఖ్య.. చక్కగా కళ్యాణం జరిపించారు. మరి చూసి తరించిన వారందరికీ పానకం, వడపప్పు ఏవండి?

    రిప్లయితొలగించండి
  2. చాలాలాలాలా బాగా, చాలా తార్కికంగా వ్రాసారు.

    రిప్లయితొలగించండి
  3. పైన వారిరువురి వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ, మీ మాటల పదును చాలా స్ఫూరిదాయకంగా, ఇదివరలో చూడని క్రొత్త కోణంలో తిరిగి మన పురాతన రచనలు చదవాలిపించేలా ఆలోచనలని ఉత్తేజపరిచాయని మాత్రం జతపరుస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. మురళి గారు, వడపప్పు,పానకం మొన్ననే తిన్నారు గదా ... మళ్ళీ వచ్చే శ్రీరామ నవమి దాకా ఆగాల్సిందే

    రిప్లయితొలగించండి
  5. ఆదిలక్ష్మి గారు.. మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  6. ఉష గారు.. తొలి వ్యాఖ్య కి కృతఙ్ఞతలు. మీకు నా ఆలోచన నచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

Comment Form