30, ఏప్రిల్ 2009, గురువారం

పంభూతాలు






ఏ చిత్రం చూసినా ఏమున్నది గర్వ కారణం?
నలుపు తెలుపుల జాడలు తప్ప.

ఏ రేఖ చూసినా ఏమున్నది శాస్త్రసాంకేతికం
గజి బిజి వంకర టింకర దారులు తప్ప

ఏ రంగు చూసినా ఏమున్నది చిత్రలేఖనం
రంగు సిరా విదిల్చిన ముద్రలు తప్ప

ఏ అంకె చూసినా ఏమున్నది మరోకారణం
అనంత సంఖ్యల గణన తప్ప

ఎన్ని తెలిసినా లోకమెంత మారినా
ఎవరికెరుక దీని రాక పోక?


మీ ముందుకు ... మరింత సమాచారం .... మన తెలుగులో.....
మరిన్ని విషయాలకై........... త్వరలో చూడండి...........

సైనికులారా పదండి ముందుకు
బూజు పట్టిన బానిస భావాల వలలు దెంచి
పదండి తోసుకు....

నవ యవ్వన భారతం మనది
నవ మన్మధ చేష్టలాపి
నవ్య భారత నాంది పలుక
పదండి ముందుకు..

మసిబారిన చెత్త నాపి
కుళ్ళిన కంపు నాపి
చేతన శోధన చేయ
పదండి తోసుకు....


14 కామెంట్‌లు:

  1. 'శ్రీశ్రీ జయంతి సందర్భంగా..' అని చివర్లో రాశారేమో అని చూశాను.. కనిపించలా.. బాగుందండి..

    రిప్లయితొలగించండి
  2. మురళి గారూ, ఆ మహానుభావుని పనిగట్టుకొని పేరుతో నేను గుర్తుచేయాలంటారా? పదాలకు పదాలు మార్చకుండా వాడుకున్నాకదా.ఇంతకంటే ఒక కవిని ఏరేకంగా గుర్తుచేసుకోవాలి.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శ్రీ గారి కవితా పరిమళాలు
    తాకి వెళ్ళాయ్..
    బావుంది..

    రిప్లయితొలగించండి
  4. బావుందండీ ! శ్రీ శ్రీ గారిని స్మరింప చేస్తూ ....

    రిప్లయితొలగించండి
  5. ఋషి, పరిమళం గారికి,

    శ్రీ శ్రీ గారి కవితా విన్యాసం లో గొప్పతనమదే నండి. ఎట్లా రాసినా ఆ మహాకవి గుర్తుకు రావడం యాదృచ్చికం కాదు.దాని వెనుక శ్రీశ్రీ గారి తపన వుండటమే ఆ కవితలకు అంత ఆదరణ అనుకుంటా!

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శ్రీ గారు ధన్యజీవి. ఇలా ఎన్నో క్రొత్త పుంతలు త్రొక్కే కవితల్లో ఇంకా సజీవంగా నిలిచారు. సమిధ ఆనంద్ కూడా ఆయన్ని స్మరించారు. మీరు, ఇంకా మీలా మరెందరో వుండి వుంటారు. సమయాభావం వలన వారందరి టపాలు చూడలేకపోయినా, మీది షడ్రసపోత కవితావిందునిచ్చింది.

    రిప్లయితొలగించండి
  7. భాస్కర్ గారు, మీరు కాంగ్రెస్ వాదినని చెప్పుకున్నారు కదా, ఇందిరా గాంధీని విమర్శించిన శ్రీశ్రీకి మీరు అభిమాని ఎలా అయ్యారు?! కొన్ని విధానాలలో నేను కాంగ్రెస్ నే సమర్థించాను. జవహార్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల టైమ్ లో బ్యాంకుల్ని జాతీయీకరించడం జరిగింది. ఆ టైమ్ లోనే మా అమ్మానాన్నలు బ్యాంక్ ఉద్యోగంలో చేరడం, ఉద్యోగ భద్రత పొందడం జరిగింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వల్ల మా కుటుంబం కూడా ప్రయోజనం పొందింది. కానీ పి.వి.నరసింహారావు ప్రారంభించిన ప్రైవేటీకరణ విధానాల వల్ల నాకు కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగింది. శ్రీశ్రీలో కూడా అనేక నెగటివ్స్ ఉన్నాయి. విప్లవ రచయితనని చెప్పుకున్న శ్రీశ్రీ విప్లవ వ్యతిరేకులు చేసే పని అయిన వ్యభిచారం చెయ్యడం. ఈ విషయం శ్రీశ్రీయే స్వయంగా చెప్పుకున్నాడు.

    రిప్లయితొలగించండి
  8. ప్రవీణ్,
    కాంగ్రెస్ వాదినయినంత మాత్రాన, కాంగ్రెస్ ను వ్యతిరేకించే వాళ్ళందరితో శత్రుత్వమా? అలాగే శ్రీశ్రీ గారి వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించి ఆయన కవితలను దూరం చేసుకోవాలా? ఇంకోమాట, సంఘ వ్యవస్థలో ఏ పని ఫలితమైనా కొంతమంది కి మంచి జరిగితే అది తప్పకుండా కొంతమందికి చెడు చేస్తుంది. ఏదైనా సాపేక్షతే, మంచి - చెడులు, మంచి మనిషి - చెడ్డమనిషి.. కాబట్టి.. మన మనుసుకు ఏది మంచి అనిపిస్తే అది చేసెయ్యడమే ... ఫలితం చెడు గా వుంటే , రెండో సారి వేరే దారి వెతకడమే...

    రిప్లయితొలగించండి
  9. ఉష గారు,
    షడ్రసపోత కవితావిందు ... పెద్ద తిట్టే తిట్టారండీ.. ఇలా అంటే ఈ సారి కవిత రాసేటప్పుడు ఎంత జాగ్రత్తగా రాయాలో తలచుకుంటే చమటలు పడుతున్నాయి.

    రిప్లయితొలగించండి
  10. "జనం నేను ఋఆసిన అమృత భాండాలను వదిలేసి, నేను తాగి పడేసిన బ్రాందీ బాటిళ్ళ మూతల/సిగరెట్ పీకల వాసన చూస్తున్నారు" అని శ్రీశ్రీ ఒకసారెప్పుడో అన్నాట్ట, చిలిపిగా....

    ప్రవీణ్ గారి వ్యాఖ్య చదివాక, అలా ఎందుకు అన్నారో అర్థం అయ్యింది. అమృతభాండాలూ, బ్రాందీ బాటిళ్ళూ పక్క పక్కన ఉంచితే, లేదు నేను బ్రాందీ బాటిళ్ళే వాసనచూస్తా అంటే అది శ్రీశ్రీ దౌర్భాగ్యమా :)

    రిప్లయితొలగించండి
  11. పై వాక్యం లో "జనం నేను రాసిన అమృత...." అని చదువుకోండి...

    శ్రీశ్రీ కవితల నషాలో మాటలు తడబడుతున్నయ్ :)

    రిప్లయితొలగించండి
  12. యోగి, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. హారం.కామ్ లో కొత్త మార్పు వచ్చింది చూడండి.

    రిప్లయితొలగించండి
  13. రామి రెడ్డి గారు - హారం చూసాను. కొత్తగా వ్యాఖ్యలు కూడా కలిపినట్టున్నారు.. బాగుంది.

    హారం కు ఒక మంచి లోగో, ఇంకొంచెం ఆకర్షణీయమైన డిజైన్

    రిప్లయితొలగించండి
  14. :( , అబ్బో, UI స్కిల్స్ లో మనము సుమారు ఒక 10 సార్లు తప్పి వుంటాను. అందుకని వేరే developer కోసం చూస్తున్నాను.

    రిప్లయితొలగించండి

Comment Form