22, ఆగస్టు 2010, ఆదివారం

గోదా కల్యాణం కొన్ని ఘట్టాల ఫొటోలు

ఈరోజు న్యూజెర్సీ లో జరిగిన గోదా కల్యాణం లోనుంచి కొన్ని ఘట్టాల ఫొటోలు.










21, ఆగస్టు 2010, శనివారం

"తెలుగు బ్లాగుల తేనె పట్టులు" - ఈనాడులో సంకలినులపై వ్యాసం.

"తెలుగు బ్లాగుల తేనె పట్టులు" శీర్షికతో ఇప్పుడున్న తెలుగు సంకలినులన్నింటిపైనా ఈరోజు ఈనాడులో ఈతరం పేజీలో సుజాత గారు వ్రాసిన వ్యాసం వచ్చింది. ఇందులో హారానికి స్థానం కల్పించినందుకు వారికి నా తరపున ధన్యవాదాలు.

లింకు : http://eenadu.net/specialpages/sp-etaram.asp?qry=sp-etaram1

6, ఆగస్టు 2010, శుక్రవారం

అమ్మాయిల పేర్లు ... చీపురు కట్టలు




నాకు ఈ మధ్య నా గాళ్ ఫ్రెండ్ ( అదేలేండి కొద్దిగా వెరైటీ కోసం ఈ గాళ్ ఫ్రెండ్ ప్రయోగం ) పేరును ఈ రకంగా మార్చాలని పించి అలాగే పిలిచాను. ఎంత చక్కగా వున్నాయో చూడండి ఆపేర్లు. మీకు కూడా నచ్చాయి కదా

౧) ప్రణతి
౨) ప్రజ్వల
౩) నిశ్చల

నాకైతే అన్ని పేర్లూ నచ్చాయి కానీ మొదటి పేరు బాగుంది కదా అని ఆ పేరుతో పిలిచాను. అటువైపు నుంచి సమాధానం లేదు. సరే చెవుడేమోలే, వినపడలేదేమో అని మళ్ళీ పిలిచాను. మళ్ళీ సమాధానం లేదు. ఈ సారి గట్టిగా పిలిచాను, పిలవగానే "ఊ" అని ఏంచక్కా పలకొచ్చు కదా. అబ్బే కట్ చేస్తే..

చీపురు కట్ట తీసుకోని నా వెంట పడింది. ఇంతకీ నేను చేసిన తప్పేంటబ్బా? ఎంత ఆలోచించినా అర్థం కాక తననే అడిగాను. అసలు ఆ పదానికి అర్థం తెలుసా నీకు అని మళ్ళీ వెంట పడింది. లగెత్తి లగెత్తి గస పెడుతూ ఇటు బ్లాగుల్లో ఎవరన్నా సపోర్టు వస్తారేమోనని దాంకోని మరీ ఈ టపా వ్రాస్తున్నా. మీరన్నా చెప్పండి అందులో నేను చేసిన తప్పేంటో.

అసలు అర్థం పర్థం లేని పేర్లకంటే ఈ పేర్లు ఎంత అందంగా వున్నాయో కదా. వున్న పేరునే సరిగ్గా పలకలేని ఈ కాలంలో హాయిగా నిమిషానికోపేరుతో నేను పిలుస్తుంటే పిలిపించుకోవచ్చుగా? చెవులకు ఇంపైన పదాలతో ఎంత ఆనందమో కదా. అదే మా పిల్లలు చూడండి ఒకరేమో తన అసలు పేరునొదిలేసి చెల్సియా ట్రాక్సెల్ అంటే కానీ పలకడం లేదు, మరొకరేమో రోజలీనా అంటే కానీ పలకటం లేదు. ప్చ్.. ఇలాంటి పేర్లకంటే నేను పైన చెప్పిన పేర్లు అందంగా వున్నాయా లేవా మీరే చెప్పండి. అందుకే పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదు "ఆడు వారి మాటలకు అర్థాలే వేరులే" అని. అంతేనా అదేదో సామెత గుర్తు లేదు కానీ ....ఆడవాళ్ళ మెదడు చదవడం మహా కష్టం సుమీ! " అంటాను నేను. "అబ్బ చా వూరుకో బాసు, వాళ్ళకు అసలు మెదడుంటే కదా" అంటారా? ఏమో బాబూ, ఆ మాట నేనంటే ఈ సారి నెత్తి బొప్పి కడుతుందేమో కాబట్టి నేననను కానీ , మీ గాళ్ ఫ్రెండ్స్ దగ్గర మీరు ట్రై చేసుకోండి. ఒకవేళ తేడా వస్తే ఎవ్వరికీ కనిపించకుండా నెత్తిన గుడ్డేసుకోని వచ్చి ఇక్కడ కామెంట్ వ్రాయండి. ముందే చెపుతుండా ఆడ లేడీస్ కు నో ప్రవేశం.