2, డిసెంబర్ 2010, గురువారం

రాష్ట్ర కాంగ్రెస్ -- జగన్ ముందున్న భవిత???

ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా వుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వున్నా లేకున్నా, జరుగుతున్న రాజీనామా పరిణామాలతో ఒక రాష్ట్ర భవిష్యత్తును ఢిల్లీలో కూర్చొని తన కనుసన్నలలో నడపాలనుకుంటున్న అప్రజాస్వామ్యక వ్యవస్థ కు ఆంధ్రప్రదేశ్ తొలి వేదిక కావడం ఆనందాన్నిస్తుంది. ఇలాంటి పరిణామాలు ఎప్పుడో కానీ జరగవు. సోనియాను చూసి ఆంధ్ర ప్రజలు ఓటు వేసివుంటారనమే భావనైతే నాకు కలగడం లేదు. ఇప్పుడు అసంతృప్త మంత్రులందర్నీ ఏరకంగా బుజ్జగించి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారో అని చాలా ఆసక్తి గావుంది. అదే ఒక ప్రజాదరణ కలిగి ప్రజలద్వారా ( ప్రత్యంక్షంగా కాకపోయినా ) ఎన్నుకోబడే ముఖ్యమంత్రి ఈ సమయంలో వున్నట్లైతే ఏ మంత్రి కూడా కిక్కురుమనకుండా ఇచ్చిన శాఖను తీసుకొని వుండేవారు. కాదంటారా?
ఈ పరిస్థితుల్లో జగన్ చెయ్యవల్సిందేమిటి? బలహీన ప్రభుత్వాన్ని ప్రజల సమస్యలతో నిజంగా ఇరుకునపెట్టి రాబోయే రెండేళ్ళు ప్రజల పక్షాన నిలిచి నిజమైన ప్రజానాయకుని గా ఎదగాలి. తన తండ్రి వారసత్వ సంపదగా ఇచ్చిన ప్రజాభిమానాన్ని తనవైపు వుండేటట్టు నిల్పుకుంటూ, ప్రజల నిజమైన సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలి. ఇప్పుడు అమ్మగారిని కీర్తించనక్కరలేదు కాబట్టి సగం పని సులభమైనట్టే. అంటే రాజశేఖర రెడ్డి లాగా డిల్లీ అధిష్ఠానాన్ని సంతృప్తి పరచాల్సిన అవసరం లేదు. కానీ అన్ని రాష్ట్రాలలో లాగే మనరాష్ట్రంలో కూడా వ్యక్తులతో సంబంధంలేకుండా కాంగ్రెస్ పార్టీ కి కొంత ఓటు బ్యాంకు వుంటుంది. ఈ ఓటుబ్యాంక్ ను రాష్ట్రంలో అసలైన కాంగ్రెస్ మాదే అనే భావాన్ని కల్పించడం ద్వారా, తెలుగు జాతి పరువు ప్రతిష్టల భావాన్ని ఆత్మాభిమానం కలవారిలో రగిలించాలి. అంతేకానీ ప్రభుత్వాన్ని కూల్చి లేదా మళ్ళీ అమ్మ దయతోతాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఉవ్వీళ్ళూరుతుంటే దివ్యమైన తన రాజకీయ భవితను తానే కూల్చుకున్నవాడవుతాడు. దానికంటే ఇలా ఢిల్లీ అమ్మతో దాగుడుమూతలాడుతూ రాష్ట్రంలో ప్రజాపక్ష నాయకునిగా ఎదగడమే తన ముందున్న మంచిమార్గం. తను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని సోనియాగాంధి రోశయ్యను ముఖ్యమంత్రి చేయడం ద్వారా గండికొట్టింది.

1, డిసెంబర్ 2010, బుధవారం

ఓ క్రొత్త రకం వైరస్ మా ఇంట్లో ఇంటర్నెట్ కి వచ్చి కూర్చుంది. ( http:// www.epoclick.com )






ఈ మధ్య ఓ నాలుగు రోజుల క్రితం ఓ క్రొత్త రకం వైరస్ మా ఇంట్లో ఇంటర్నెట్ కి వచ్చి కూర్చుంది. ఇది నేను మొదటిసారిగా గుర్తించింది statcounter.com site open చేద్దామనుకుంటే దానిబదులు googleanalytics site open అయ్యేది.
మొదటి రోజు చాలా ఆశ్చర్యం వేసింది. statcounter ని గూగుల్ కొనేసిందేమో అనుకొని చాలా దిగులు పడ్డాను కూడా. అలాగే రాను రాను Random గా ఏ లింకు click చేసినా epoclick.com కు ఒక add Id , query string గా add చేసి (ఈ రకంగా http://www.epoclick.com/?ad=1291167677) పేజీని ఒపెన్ చేసేది. computer clean చేద్దామని Anti virus software run చేసినా ప్రయోజనం దొరకలేదు.

ఈ మధ్య సెలవులో వుండటం మూలాన ఇంట్లో తప్పించి వేరే ప్రదేశాలనుంచి browsing చేసే అవకాశం పెద్దగా రాలేదు. కానీ నిన్న office లో Statcounter open చేస్తే బాగానే పనిచేసింది. Internet లో ఈ వైరస్ removal కోసం వెదికినా ప్రయోజనం లేదు. అలాగే ఇప్పుడున్న చాలా Antivirus softwares కి కూడా ఇది దొరకదు. నిన్న నేను ఇంట్లో వాడే laptop తో office లో Browse చేస్తూ ఈ వైరస్ ఏమైనా http://www.epoclick.com ని Open చేస్తుందేమో నని observe చేస్తూ వున్నాను. కానీ ఒక్కసారికూడా http://www.epoclick.com open అవలేదు. అప్పుడు వెలిగింది బల్బు. ఈ వైరస్ నేరుగా నా Router లో వెళ్ళి కూర్చొందని. అందుకే Antivirus softwares కి దొరకలేదు.

ఇంతకీ రౌటర్ మీద ఎలా దాడిచేసిందబ్బా అని ఆలోచిస్తే ఈ మధ్య కొత్త ఇంటర్నెట్ కనక్షన్ తీసుకున్న తరువాత router admin యొక్క Default user name , password మార్చడం మర్చిపోయాను :(. తీరా రౌటర్ అడ్మిన్ పాస్వర్డ్ మారుద్దామన్నా అప్పటికే epoclick default password ని మార్చేసింది. ఇప్పుడెలా?

ఇలాంటి సందర్భాల్లో Router వెనకాల ఒక చిన్న రంధ్రం లో చిన్న button వుంటుంది. దాన్ని ఒక పది నుంచి ఇరవై సెకన్ల పాటు వత్తి పట్టుకొని వదిలేస్తే మరో ముప్పై సెకన్లలో Router settings అన్ని కూడా Factory manufacturing status కి మారిపోతాయి. అప్పుడు తిరిగి మన default admin / password వుపయోగించి login కావచ్చు. login ఐన వెంటనే password ను మార్చండి. అలాగే epoclick.com ను router block list లో చేర్చండి.

Internet లో ప్రస్తుతానికి ఈ వైరస్ ని ఎలా clean చేయాలో ఎక్కడా సమాచారం లభ్యమవక పోవడం ఈ టపా వ్రాయడానికి మూల కారణం. నా అనుమానం ఈ వైరస్ సృష్టి కర్తలు Statcounter వారు కానీ లేదా google వారు కానీ అని ఎక్కడో చాలా బలంగా అనిపిస్తుంది. Prove it అని మాత్రం అడక్కండి :-). ఇలాంటి వాటికి proof లు వుండవు.

చివరిగా వీలైతే మీ ఇంటెర్నెట్ ప్రొవైడర్ కి ఫోను చేసి మీ router IP address ని మార్చమని అడగండి.

కథలో నీతి : Router కదా అని password మార్చడం మరువకండి. కారణం మనం Browse చేసే ప్రతిదీ ఈ Router గుండా వెళ్ళాల్సిందే !!!