28, జులై 2011, గురువారం

ఏలు పెడితే చాలు కవితలు కసుక్కున కొరికేస్తున్నాయి

ఈ మధ్య ఎక్కడన్నా ఏలు పెడితే చాలు కవితలు కసుక్కున కొరికేస్తున్నాయి. కాదులేండి, ఏలెట్టకన్నా వెతుక్కోనొచ్చి మరీ కొరుకుతున్నాయి.

అవి చదివీ చదివీ చానారోజులకు నాకూ ఒక కవిత రాయాలని బో యిదిగా వుంది. చదివాక బతికే వుంటే ఒక కామెంటుతో గిల్లిపోండి :)బయట భోరున వర్షం
వర్షానికి చెట్లు తడుస్తున్నాయ్
తడిసి పులకరిస్తున్నాయ్!
ఇంట్లో జోరుగా ఫ్యాను
ఫ్యాన్ గాలికి పేపర్లు లేస్తున్నాయ్
ఒక్కొటొక్కటిగా, నా మనసు పేజీల్లా

పైనుంచి మట్టిపెళ్ళ రాలిపడింది
మనసంతా మరకైపోయింది
ఆకాశం ఎప్పుడు చిల్లుపడుతుందో
నా మనసెప్పుడు కడిగేస్తుందో

వహ్వా వహ్వా వహ్వా చప్పట్లు, ఈలలు, కామెంట్లు.....;)

మరో కవిత చిత్తగించండి.

ఒరే
పిచ్చోడా
ఏందిరా
సన్నాసి
టైం
పదకొండు
ఇక పడకెక్కి
గుఱ్ఱుపెట్టు

బ్రతికే ఉన్నారా? ఇంకా పోలేదా? సరే ఇది చిత్తగించండి మరి భావకవిత్వపు కలికి తురాయి .... :-)

ఇంట్లో నలుగురే
ఇంటికున్న నాలుగు గోడల్లా!!!!
నేనూ నువ్వు
సమాంతర కుడ్యాల్లా!!!!!!!!!!

ఎంత భావమో... ఏంటి నీబొంద అందులో భావమంటారా? మీరు ఊహించుకోవాల మరి. ఎవరి ఊహ ఎంత గొప్పదైతే అంత బాగా అర్థమౌతుంది మరి :)

26, జులై 2011, మంగళవారం

మిట్టూరోడి పుస్తకం.. కథల పుస్తకానికే కాదు, బూతు పుస్తకానికీ తక్కువే


ఆమధ్య ఇండియా వెళ్ళినప్పుడు ఓ నలభై పుస్తకాల దాకా కొని తెచ్చుకొన్నాను. అందులో రకరకాల పుస్తకాలున్నాయి.అంటే అలా పైపైన ఓ లుక్కేసే పుస్తకాలనుంచి, జీవితకాలం చదివినా అర్థం కాని పుస్తకాలదాకా. మరికొన్ని ఆనోటా ఈనోటా విని ఎలా వుంటుందో చదవాలన్న కుతూహలం తో కొన్న పుస్తకాలు. అలా కొన్న పుస్తకాలల్లో మిట్టూరోడి పుస్తకం ఒకటి.

పుస్తకం రంగు బాగుంది. క్రొత్త పుస్తకం కాబట్టి వాసనా బాగుంది. అట్టపై వేసిన బొమ్మా బాగుంది. అలాగే పుస్తకం పై వ్రాసిన కథల పేర్లూ బాగున్నాయి. కథలన్నా ( చందమామ కథలు తప్పించి ) , నవలలన్నా ఆమడ దూరం పరిగెత్తే నాకు ఇంత మంచి బాహ్య సౌందర్యం గల్ల పుస్తకం అలా పుస్తకాల అరమరలో కనపడితే చదవాలన్న కోరిక మరీ ఎక్కువవ్వడంతో అక్కడక్కడ ఓ కథ చదివి వుండబట్టలేక ఈ టపా.

అసలు ఇంతలేసి పుస్తకానికి ఒక పోస్టుకూడా అవసరమా అనిపించింది కానీ, ఇందులో అక్కడక్కడా తగిలే గ్రామ్య భాషే ఈ టపాకు ప్రేరణ.

అక్కడక్కడా అని మాత్రమే ఎందుకన్నానంటే, మీకు ఏ కథ తీసుకున్నా నాబట్ట, సవితి, లంజ, గుడిసేటి ముండ ఇలాంటి పదాలు లేని కథ భూతద్దము పెట్టి వెతికినా కనిపించదు. తల్లి ని కూడా కొడుకుచేత లంజ అని పిలిపించి ప్రసిద్ధికెక్కిన రచయితగా చిరకాలం నిలిచిపోతారనడంలో సందేహం లేదు. వాటిని తిరిగి ఇక్కడ ఎత్తిరాయడం కూడా దండగే. కథ/కథలు చదువుతున్నంత సేపూ పాఠకుడు ఈరకమైన భాషనుపయోగించే జాతిని నేనెక్కడైనా ఇలాంటి సందర్భాలలో చూసానా అని కచ్చితంగా ప్రశ్న వేసుకోక మానడు. కథల్లో రాయలసీమ మాండలికం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ నేను పెరిగిన ఊళ్ళలో సాధారణ పరిస్థితులు లేదా కథా సన్నివేశ పరిస్థితులలో ఎక్కడ కూడా ఈ భాషవాడడం చూడలేదు.

నేను మరిచిపోయిన లేదా గుర్తున్నా కాల ప్రవాహంలో క్రొత్తగా తోచిన మాండలిక పదాలు

అలివిగాని
యెంటికలు
లోటా
సమ్మచ్చరం
యెంగటేస్పరస్వామి
తిరప్తి
గెన్శిగెడ్డ
సినబ్బ
మఖాయిష్టం ( మహాయిష్టం)
కుశాల
ఈమద్దిన

ఇంతటితో ఈ బొక్కు అటకెక్కేసింది.

24, జులై 2011, ఆదివారం

Google+ is now Google --

జూలై 12 2011, అప్పటికింకా Google+ hype చాలా ఎక్కువగా వుందనే చెప్పుకోవాలి. చాలా మందికి అసలు ఈ + లో వున్నదేమిటో చూడాలన్న ఉత్సాహం. ఎవరైనా ఆహ్వానిస్తే ఒక్కసారి చూసి జీవితాన్ని ధన్యం చేసుకుందామన్న కోరిక. సరే ఎలాగూ ఈ hype తో పాటుగా హారానికి ప్రచారం చేసుకుంటే !!!. అప్పటికి హారం భారతీయ భాషా బ్లాగులు చూపడం మొదలై సరిగ్గా వారం రోజులు. పురిటినొప్పులు కూడా పూర్తిగా తగ్గలేదు. సరే Google+ ఆహ్వానాన్ని పంపిస్తూ హారం ప్రచారం చేసుకుంటే రెండువైపుల లాభ సాటిగానే వుంటుంది కదా అని ఓ అవిడియా వచ్చింది. అలా ఆహ్వానాలు పంపడం మొదలైంది కానీ ఒక్క గంటఆహ్వానాలు పంపినా ఇరవై ముఫ్ఫై ఆహ్వానాలు దాటి పంపలేకపోయాను. ఊహూ ఇలా లాభం లేదని హాయిగా నిద్రపొయ్యి, రెండో రోజు మా శకుని మామ నడిగితే ఓ తంత్రం చెప్పాడు. ఇంకేముంది.. ఆరోజు మరుసటి రోజుకల్లా అక్షరాలా 4800 మందికి ఆహ్వాన పత్రికలను పంపించాను.

All happies, no troubles

మూడోరోజు.. అబ్బా చాల్లే అనిపించింది కానీ ప్రక్కన friend suggestion చూస్తే బిల్ గేట్స్, సెర్గెబ్రిన్ కనిపించారు. అప్పటికే గూగుల్ లో పనిచేసే చాలా మందికి వృత్తాలు చుట్టేసాను. వీళ్ళను మాత్రం ఎందుకు వదలాలి అని బిల్ గేట్స్, సెర్గెబ్రిన్ ఇద్దరికి వృత్తం చుట్టేసాను.

ఒక రెండురోజులు బిజీ... మూడోరోజు వెళ్ళి చూస్తే ఇంకేముంది అకౌంట్ బ్లాక్ !!!!
ప్చ్, అసలు నేను google+ లో ఏల చేరవలె?
చేరితినిపో ఏల 4800 ఇండియన్స్ కు ఆహ్వానం పంపవలె??
పంపితినిపో ఏల సెర్గెబ్రిన్ కు వృత్తం చుట్టవలె???
చుట్టితినిపో, వారేల హారం పై కన్నువేయవలె???
వేసితిరిపో, అకౌంట్ ఏల బ్లాక్ చేయవలె????
( ఇప్పుడంటే left and right accounts block చేస్తున్నారు కానీ ఈ అకౌంట్ బ్లాక్ చేసేనాటికి అంటే జూలై 15 లేదా 16 నాటికి బ్లాక్ చేసిన అకౌంట్స్ ను వేళ్ళ మీద లెక్కించ వచ్చు )

ఏంటబ్బా అని చూస్తే వాళ్ళ పాలసీలకనుగుణంగా కాక ఒక కమ్యూనిటీని కించ పరస్తూ టపా వ్రాశానట. వార్నీ నాకంత సీనా!!!! అని వాళ్ళ పాలసీలు చదివితే నాకెక్కడా పాలసీ వయలేట్ చేసినట్టు కనిపించలేదు ఇంతకీ నేను వ్రాసింది బాంబేలో జరిగిన బ్లాస్ట్స్ గురించి. (ఆ తరువాత కొద్దిరోజులు వాళ్ళ పాలసీలను మారుస్తూ వచ్చినట్టున్నారు ) సరే అని చెప్పేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే , ఓ నాలుగురోజుల తరువాత బిజినెస్ ప్రొఫైల్స్ కు ఇప్పట్లో అవకాశం లేదు, ఇది కేవలం ఫీల్డ్ ట్రైల్ మాత్రమే అని status update చేసారు. No issues..., Atlast they were able to respond with right answer.

ఇంతటితో ఈ వ్యవహారం ముగిసినట్టులేదు, గత కొద్ది రోజులుగా కనిపించిన అకౌంట్ నల్లా పీకేస్తున్నట్టున్నారు. కనిపించిన అకౌంట్ అనడం కన్నా మరీ ఎక్కువగా ఫ్రెండ్స్ కలిగిన అకౌంట్స్ అని చెప్పవచ్చేమో. కానీ గూగుల్ చెప్పే సమాధానం మాత్రం

" we are currently limiting profiles to real people"


what a joke? who is real and who is fake in social media? Do you think people submit their bank a/c numbers, SSNs, passport, Photo etc to google+? I think any social media with this restriction suicides itself and intelligent companies like google must be aware of this fact, but then why are they doing?

Is the dam + bubble exploded with high number of concurrent transactions? who knows, intially I thought it's their policy to ban products, which is fair enough policy, but reading articles like this http://www.zdnet.com/blog/violetblue/google-plus-deleting-accounts-en-masse-no-clear-answers/567?tag=mantle_skin;content gives a surprise to anybody.

Google, now, you are no more +,people started --.

9, జులై 2011, శనివారం

భాభీ కా నామ్ google कौर

ఈ రోజు random గా హిందీ బ్లాగులు చదువుతుంటే ఒక హాస్యకరమైన టపా కనిపించిది. మీరు చదివి నవ్వుకోండి. ఆడ లేడీస్ నామీద యుద్ధం ప్రకటించవద్దు. అసలే ఈ మధ్య మా ఆవిడ ఇంటికొచ్చి కంప్యూటర్ తాకితే చేతివేళ్ళు ఇరగ్గొడతానని వార్నింగ్ కూడా ఇచ్చింది.

ఇక ఆ హాస్యకర సన్నివేశం

సంతా : ఓయ్, భాభీ కా క్యా నామ్ హై
బంతా : గూగుల్ కౌర్
సంతా : ఐసా క్యోం?
బంతా : సవాల్ 1 కరో , జవాబ్ 10 మిల్తే హై


:-)


source : http://haaram.com/CompleteArticle.aspx?aid=280657&ln=hi

or

http://www.pawanmall.net/2011/07/blog-post.html

7, జులై 2011, గురువారం

heights of communication - person perspectives

మొన్న ఇంద్రసేన, నిన్న రమ్య ఇద్దరూ హారం పనిచేయడం లేదు అని చెప్తే ఏంటబ్బా నాకు వస్తుంది కదా వాళ్ళకు ఎందుకు రావడం లేదు అనుకుంటూ ఊఊఊఊఊ వున్నా. అసలు సమస్య ఏంటో కూడా తెలియలేదు. Error ఏమి వస్తుంది అని అడిగితే "హారం మైటెనెన్స్ లో వుంది" అని వస్తుంది అని చెప్పారు. కానీ ఆ పేజీ సైట్ లైవ్ అయిన ఒక గంటలోనే తీసేసా కదా, మళ్ళీ ఇదేంగోలరా బాబూ అనుకుంటు జోగుకుంటూ కూర్చున్నా. .....

ఇప్పుడు ఈ సమస్య లేదు కానీ ఈ సిల్లీ సమస్య తీర్చాక ఒక పేద్ద టపా వ్రాయాలని వుంది. దేనిమీదంటే..... heights of communication - person perspectives అన్న దాని మీద. వచ్చే వారమో ఆ పై వచ్చే వారమో....
ఇంతకీ ఇప్పుడు హారం http://haaram.com అని కొట్టినా వస్తుంది.

5, జులై 2011, మంగళవారం

హారం ఏగ్రిగేటర్ లిమిటెడ్ వెర్షన్

హారం ఏగ్రిగేటర్ , మరిన్ని భారతీయ భాషలలో లిమిటెడ్ వెర్షన్ గా ఈ రోజు రోలౌట్ ఐంది. limited version ఎందుకంటే ఇందులో ఇంకా అన్ని సదుపాయాలు లేవు. ముఖ్యంగా విభాగాల టపాల Database ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. అలాగే ఇంతకు ముందు నుంచి హారం వాడే వారికి సుపరిచితమైన ఎక్కువగా చదివిన టపాలు కూడా ఓ రెండు మూడు రోజులు కనిపించవు. అదేకాక వేగం కూడా ఇంకా పూర్తి స్థాయిలో లేదు. తెలుగు,కన్నడ,ఆంగ్ల భాషల కు తప్పించి మిగిలిన భాషల స్థానికీకరణ పదాలు కూడా ఇంకా చేర్చవలసి వుంది. help కూడా అసంపూర్ణమే.

కన్నడ బ్లాగుల కొరకు స్థానికీకరణ పదాలనందించిన సుధ గారికి ప్రత్యేక అభినందనలు.

ఇన్ని రోజులు తెలుగు బ్లాగులోకంలో హారాన్ని వాడి దాన్ని ఒక విశిష్టస్థాయికి తీసుకు వచ్చిన ప్రతి బ్లాగరు కు నా మనఃపూర్వక అభినందనలు.కారణం ఏ వెబ్ సైట్ అయినా , ఎంత గొప్పదైనా చదివే వారు లేనప్పుడు చేసి వుపయోగం లేదు కదా! ఇదే స్ఫూర్తితో మిగిలిన భాషలలో కూడా ఆదరిస్తారని కోరుకుంటూ, మరో వారం రోజుల్లో మళ్ళీ తెలుగు నిఘంటువు పనులలోకి పరకాయ ప్రవేశం :)more to come in coming weeks.

4, జులై 2011, సోమవారం

బ్లాగు ఏగ్రగేటర్ గా హారం ప్రస్థానం. ఎటునుంచి ఎటు?

దరిదాపు ఒక నెలన్నర క్రితం హారాన్ని తమిళ,కన్నడ,హింది భారతీయ భాషలలోకి విస్తరించాలనుకున్న ఆలోచన వచ్చాక ఎప్పుడో సంవత్సరం క్రితం వ్రాసిన కోడ్ ను దుమ్ము దులిపి చూస్తే అప్పుడు ఏది ఎందుకు వ్రాసానో ఒక్క ముక్క కూడా అర్థము కాలేదు. అప్పుడు మొదలు పెట్టిన మార్పులు , చేర్పులు అతి కష్టం మీద ఈ రోజుకు ఒక కొలిక్కి వచ్చాయి. ఈ హారం ఆధునీకరణ మూలంగా ఈ మధ్య కాలంలో ప్రధానంగా దెబ్బతిన్నది తెలుగు నిఘంటువు పని. హారం పని మొదలు పెట్టినప్పుడు ఒక్క UI మాత్రము మారిస్తే సరిపోతుంది అనుకున్నాను కానీ, అన్ని భాషల బ్లాగుల పట్టిక చూసాక పార్సింగ్ కు సమయం ఎక్కువ పడుతుండటముతో haaram core engine లో threading implement చెయ్యక తప్పింది కాదు. ఇన్ని భారతీయ భాషల బ్లాగులను ఒకే చోట చూపించడంతో హారం అతి త్వరలోనే భారతదేశపు అతిపెద్ద బ్లాగు సంకలిని గా అవతరించబోతుంది. కానీ దీనికి గూగుల్ ఎంత వరకు సహకరిస్తుందో చూడాలి. ఇప్పుడైతే హారంలో పలు బ్లాగులను ఒకేసారి చదవగలిగే అవకాసం వున్నప్పటికి గూగుల్ మాత్రం వారి సర్వర్స్ లో ఎక్కువ రిక్వెశ్ట్స్ ఈ ఐ.పి నుంచి వస్తున్నాయని Random గా requests ను block చేసి http error code 503 పంపుతుంది. ఏమైనా ఇప్పుడు హారం దరిదాపు 40,000 బ్లాగులను ప్రతి 20 నుంచి 40 నిముషాలకు update చేస్తుంది. ఇంకో 1,80,000 బ్లాగులున్నాయి కానీ ఆ లింకులు కావాలంటే ప్రస్తుతానికి ఆటోమేషన్ ద్వారా చెయ్యడానికి వీలు లేదు. గూగుల్ వాడు దానికి సహకరించడం లేదు. Manual గా 1,80,000 లింకులను ఎంటర్ చేసే ఓపిక, సమయం నాకు లేవు. ఇప్పటికి ఈ 40,000 తోనే సరిపెట్టుకుంటాను.

కానీ తెలుగు భాష బ్లాగులు మాత్రము మునుపుటికంటే వేగంగా పని చేసే అవకాశం వుంది. ఇంతకు ముందు 90 సెకన్ల నుండి, 150 సెకన్ల మధ్య కనిపించే బ్లాగు టపా ఈ సారి ఇంకొంచెం ముందుగానే కనిపించవచ్చు. హారం లో ప్రస్తుతమున్న ప్రధాన సమస్య దీనికి Dedicated server లేక పోవడమే. ఈ సమస్య వల్ల 20 seconds to 30 seconds కోల్పోవలసి వస్తుంది. ఒక పది పదిహేను రోజుల Data చూసిన తరువాత కచ్చితమైన సమాచారం ఇస్తాను.

ఇంతకీ ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకంటే, హారం ఈ రోజు, రేపు మైంటెనెన్స్ మోడ్ లో వుండవచ్చు. కాబట్టి మీ బ్లాగు టపాలు కనిపించకపోవచ్చు. ఒక్కోసారి అసలు పని చేయక పోవచ్చు.

ఇక పోతే 2008 డిసెంబరు లో మొదలైన హారం Statistics ఈ రోజు చూసాక చాలా సంతోషం వేసింది. అవి మీకోసం ఈ క్రింద.( సంవత్సరాల వారీగా )


Year 2009
----------
Year 2010
-----------Year 2011 (ఇప్పటి దాకా. అంటే జూలై లో రెండురోజులు కలుపుకొని)
----------