15, డిసెంబర్ 2012, శనివారం

నేనూ తిరుపతి వెళుతున్నాగా !!

తిరుపతికైతే వెళదామనుకున్నాను.వెళ్ళి ఆ మహాసభలలో లబ్థప్రతిష్టులైన కవుల కుంచెలనుంచి జాలువారిన నవరస రసరమ్యమ పదాలను సుశ్రావ్యమైన గళములనుండి విందామని ఆశ పడ్డాను.

సమాచారం క్షణాల్లో చేరవేసే మాధ్యమాలు, విశ్వవ్యాప్తమైన విజ్ఞానాన్ని మధించి చిటికెలో మనముందుంచే వ్యవస్థలు ఇన్ని వుండగా విషయాన్ని తెలుసుకోవడం ఎంతసేపు? ఈ ప్రపంచ తెలుగు మహాసభల గూర్చి వెతుకుతుంటే ఓ వెబ్ సైట్ నాకంట పడింది.

http://www.worldteluguconference.com


కానీ మూడురోజులు తిరుపతి మహాసభలలోనైతే  గడపటానికి సమయాభావమడ్డు వస్తుంది.కాబట్టి నచ్చిన కార్యక్రమాలున్న ఏదో ఒకరోజు లేదా ఒకటిన్నరరోజు వుందామని కార్యక్రమాల వివరాలకై చూశాను.కానీ  ఏ కార్యక్రమం ఎక్కడ/ఏ హాల్ లో ఏ రోజు జరగబోతున్నదన్న వివరాలు ఎక్కడా కనిపించటము లేదు.


సమావేశ స్థలానికి చేరుకొని వెతుకులాడుకుంటూ చూడాలనుకున్న ఒకటి రెండూ కార్యక్రమాలను కూడా ఈ వెతుకులాట సమయంలో మిస్ చేసుకొనే పరిస్థితి రాకుండా వుండాలంటే  కార్యక్రమాల పూర్తి వివరాలను వెబ్ సైట్ లో ప్రచురిస్తే బాగుంటుందేమో.

16, నవంబర్ 2012, శుక్రవారం

చిట్టి చిట్టి సరదాలే.... ఇవి బుజ్జి బుజ్జి కోరికలే...



జిల్లెళ్ళపాడెళ్ళి వేడి వేడి అన్నంలో చింతకాయపచ్చడి అప్పుడే నిప్పులమీద కరగబెట్టిన నెయ్యి వేసుకోని తినాలి. పొలాల్లోకి బొయ్యి రేగ్గాయలు కోసుకోని ఉప్పేసి దంచుకోని తినాలి. దోసకాయలు,అలసందకాయలు కూడా..వీలైతే సుబ్బమ్మ కొట్టు కాడ  సోల రాగులుపోసి నూగుజీడీలు తినాలి ;)

ఇంగామాయిన భైరవకోనకుఁబొయ్యి కోటి లింగాల దర్శనంతోపాటు సెలయేట్లో తడవాలి. అక్కడే వె(ఎ)లక్కాయలూ,బీరకాయలు,బిక్కికాయలూ అన్నీ తినాలి. వీలైతే బత్తాకాయల దొంగతనమూ చెయ్యాలి :). అక్కడనుండి నెల్లూరెళ్ళి ఎండుచేపల కూర తినాలి. ఇంగామైన ఆదార్నటే పెత్తిరుపతికి పొయ్యి ఎంకన్న దర్శనమయ్యాక నాలుగు లడ్లు గుటక్కిన మింగి చిన్తిరుపతొచ్చి..... ఒంగూలు పొయ్యి బస్టాండు దగ్గర ఇడ్లీ, మైసూరుపాకు లాగించాలి. ఆడ్నే మద్దేన్నానికి మా అక్క/చెల్లళ్ళింటికి అట్టాపొయ్యి నాటుకోడి కూర కుమ్మెయ్యాలి. దర్శిలో నేమో పప్పుచారు, కాలవదగ్గర జగన్మాత పీఠం ( ఇక్కడ తిండిగోల లేదులెండి. గురువు గారు కొడతారు) ,  గాంధీనగరంలోనేమో సొరకాయ కూర  తిన్నాక ఇనకొండ మీదుగా నర్శింగపాడు బొయ్యి   పచ్చిమిరపకాయ పచ్చడి గడ్డపెరుగుతో పెద్దపళ్ళాన్ని నాకెయ్యాలి :)

సందెగాల గుంటూరుఁబొయ్యి  సకుటుంబసపరివారసమేతంగా నాజ్ సెంటర్లో ఫష్ట్ షో చూసుకోని విందుభోజనాలారగించి అప్పుడు ..... ఇశాకపట్నం, ఇజీనగరంబోవాల. ఇజీనగరంలో  ఏమేమి స్పెసలో చూస్కోని అయ్యన్ని తిన్నాక హైదరాబాదు కుపోవాలి. అదికూడా ఏడికిరా నువ్వొచ్చేది ఆంధ్రావోడా అనకపోతేనేలెండి :-) హైదరాబాద్ కు పొయ్యాక ఇంక జూస్కో నా సామిరంగా మస్తు మస్తు ఎంజాయ్ చెయ్యాలి.

ఆమాయిన ఒక్కొక్కరోజు కలల్లో బొంబాయి జుహూబీచి కెళ్ళాలి. తోడుగా కనీసం Lover ను అన్నా తీసుకెళ్ళాలి. కుదరకపోతే నారిమన్ పాయింట్ అయితే పక్కా.   అలా అరేబియా అందాలు చూసి మర్సరోజు  మీరారోడ్డు , బోరివలి, అంధేరి,మాతుంగ, దాదర్, మహాలక్ష్మి, సెంట్రల్, గ్రాంట్ రోడ్, ఛర్నీరోడ్డు, మెరైన్ లైన్స్ చూసుకొని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర పావురాళ్ళ ఫొటో తీసుకొని  ఎలిఫెంటా కేవ్స్ కు వెళ్ళోచ్చాక అలసి పొయ్యుంటాము కదా... అప్పుడు తాజ్ లో ఒక చాయ్ కొట్టాలి. వీలైతే నా ఫేవరేట్ లాడ్జింగ్ ప్లేస్ ఆంధ్రమహాసభ లోనే వుండాలి :)

మరొకరోజు కలకత్తా నుంచి ముంబాయి కి పట్టపగలు Gitanjali Express లో తలుపు తీసుకొని కూర్చొని భారతదేశ అందాలన్నీ చూడాలి. ఖరగ్ పూర్ లో మట్టి చిప్పలో టీ తాగాలి.


ఇంకోరోజు ఆగ్రా, మధుర, ఫతేఫూర్ సిక్రీలు చూసేస్తాను.
మధుర లో పొద్దుపొద్దున్నే పాలల్లో జిలేబీలద్దుకోని తినాలి :)
నిద్రరాకపోతే ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతాను. నీబొంద కల అని చెప్తూ నిద్ర అంటావేంటటే..అదంతే.. ఇది పగటికల ;)

ప్చ్...ఇంతచేసినా సగం భారతం కూడా చూడలేకపోతున్నా.

13, నవంబర్ 2012, మంగళవారం

దీపావళి ఢాం...డాం..... టప్.. తుస్ ... టపాకాయలు - హారం.

అసలు ఈ రోజు దీపావళికి ఏదైనా కవిత వ్రాయాలని కూర్చున్నా...

దీపావళీ
గాలిడోలికలయందు అనురాగ వీచికలయందు
తరళమై సరళమై మమతానురాగములై వర్థిల్లు దీపావళీ!!

ఇలా ఏవో నాలుగైదు లైన్లు వ్రాసి చివరిగా

కాంతియే శాంతియై, శాంతియే చైతన్యమై... వినువీధుల వెలుగు తారలై .

.అంటూ ఏదో వ్రాసుకుంటూ పోతున్నానా ఇంతలో  ఎవరి దగ్గరినుంచో హారం ఫీడ్ బ్యాక్ ద్వారా ఓ "లక్ష్మీ" బాంబ్ పేలింది. ఇలాంటి టపాసులు రోజూ సాధారణమే ఐనా ఈ రోజు అసలే దీపావళీ కనుక దీని ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టపాకాయ :))

ఈ పండుగ ఉపయోగం, పరమార్థం ఎంతమందికి తెలుసో అని నాకెప్పుడూ అనుమానమే!! ఇలాంటి మైల్స్ ఇచ్చేవాళ్ళ ను చూస్తే మరీ ఎక్కువ అనుమానం వస్తుంది.హారం ద్వారా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఆ ఇబ్బందులను హారం దృష్టికి తీసుకురావడానికి ఓ feedabck పేజీని పాఠకుల సౌకర్యార్థం వుంచడమైనది. అదుగో ఆ పేజీనుండి ఇలాంటి టపాకాయలు వేస్తుంటారు. ఇప్పటికి ఈ సంవత్సరానికి గాను 4994 మైల్స్ వచ్చాయి. ఇవి కేవలం feedabck  ద్వారా వచ్చిన మైల్స్ మాత్రమే ( బ్లాగ్ ను కలుపమని వచ్చే మైల్స్ కాదు )

అందులో మూడొంతులు టపాకాయలే. కొన్ని చిచ్చుబుడ్లు, భూచక్రాలు, కాకరొత్తులు, ఇంకొన్ని థౌజన్ద్ వాలాలు వుండవచ్చు. చిచ్చుబుడ్లు సాధారణంగా పేలకుండా కాంతినిస్తాయి. అంటే హారం ను ఏవిధంగా ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావచ్చో ఈ చిచ్చుబుడ్ల ద్వారా తెలుస్తుంది. :)). సాధారణంగా వీరికి ప్రత్యుత్తరము తప్పక ఇస్తాను.

ఇక భూచక్రాలేమో భూమి గుండ్రముగా వుండును అన్నట్లు వీరినుంచి సహజంగా ఒకే రకమైన ఫీడ్బ్యాక్ వుంటుంది. నా టపా కనిపించడం లేదని. ఈ టపా కనిపించకపోవడానికి సవాలక్ష కారణాలు. ఒక్కోసారి బ్లాగు దొరికిందే సందుగా టపాలను కుమ్మేస్తుంటారు. అది వారిష్టం కానీ నిర్ణీత గడువులో నిర్ణీత టపాలకంటే ఎక్కువ వస్తే ఆ బ్లాగు ఓ రోజు పాటు స్పాం లో వుంటుంది. అలాగే మరికొన్ని నియమాలూ వున్నాయి. ఇవి కాక శాండీ లాంటి దెబ్బలు తగిలి మనుషులకే దిక్కులేకపోతే ఇక హారం ఎక్కడ? ఇలాంటి కారణాలు బోలెడు. సాధారణంగా ఈ భూచక్రాలకు మొదటి మైల్ కు రిప్లై ఇవ్వను. రెండవసారి కూడా మైల్ ఇస్తే అప్పుడు తప్పక సమాధానముంటుంది. కారణం అన్ని మైల్స్ కు సమాధానాలివ్వడం ఇప్పట్లో నాకు కుదరని పని.

ఇక కాకరొత్తులు చాలా తక్కువన్నమాట :)). వీళ్ళు రంగురంగుల కలలతో హారం కు వెలిగిస్తామని వస్తారు. నేనూ " ఆహా ఏమి నాభాగ్యము!! ఎంతకాలానికి మా మా మానసముల్లాతోత్సవ
డోలికలూగుచూ  దీపావళి జరుపుకొనుచున్నదని సజ్జ నిండుగా కనులకింపుగా ఇష్టమృష్టాన్నములైన విందునంతా కూర్చి" తిరిగి మైల్ పంపుదునా.... హతవిధీ ఏమీ ఈ వైపరీత్యమూ ఒక్కరో ఒక్కరూ... ఒక్కరైననున్... అని దీపావళి కి  అమావాస్య పాట పాడుకోవటమే :)

ఇక Thousand waalaa లు. వీరు తమకు తెలిసిన Technology ని అంతా హారం పైన చూపిస్తుంటారు. :-). అంటే మీకిప్పటికే అర్థమయి వుంటుందనుకుంటా. చూసి నవ్వేసుకోవడమే :)).  అంటే వీళ్ళు తమ బ్లాగుని Add చేయమని పదే పదే మైల్స్, ఫీడ్ బ్యాంక్ లు చేస్తుంటారు. వీరికి మైల్ రిప్లై ఇచ్చినా ఉపయోగం వుండదు కనుక Thousand waalaa లకు సహజంగా సమాధానముండదు. వీళ్ళు టప్ టప్ టప్ మని బుద్ధిపుట్టినప్పుడల్లా పేలుతుంటారు :))


చివరిగా కొంతమంది అసలు సిసలైన బాంబులేస్తుంటారు. వీళ్ళు కనీసం ఓ రోజు కూడా ఆగలేని బాపతులన్నమాట. అసలు మైల్ ఇవ్వడివడమే నేను కత్తిని, నాపేరు బాకు ఏమనుకున్నావో తెలుసా...నువ్వు గనక నా బ్లాగును వెంటనే నీ సైట్ నుండి తీసెయ్యక పోతే నీమీద DMCA complaint  ఇస్తాం. జాగ్రత్త ఏమనుకున్నావో.. మాకు గూగుల్ తెలుసు..నీకు తెలుసా..గూగులోడికి కూడా complaint  చేస్తాం....ఇది నీకు వార్నింగ్... ఇలా పేలుతుంటాయి.

సహజంగా ఇలాంటి మైల్స్ కు నా reply వుండదు. కారణం వీళ్ళు హారం ను అసలు చూడరు. మరికొంతమందికి నా మీద అప్పుడప్పుడూ ఎక్కడో కాలుతుంది :)). అలాంటప్పుడు ఇలాంటి మైల్స్ వస్తుంటాయి. ఓ రకంగా చెప్పాలంటే హారం ఆయా  సైట్లకు ఓ చిన్నపాటి compitator అని వాళ్ళు ఫీల్ అయిపోయి ఇలా ఫట్ మని లక్ష్మీ బాంబులేస్తుంటారు.

ఇలాంటి వాటికి నా reply వుండదు. ఒక్కోసారి నిజంగానే జనాల పౌరుషాన్ని(? కాదు అమాయకత్వం) చూసినప్పుడు నవ్వు వస్తుంది. మరోసారి ఏముందబ్బా ఆ బ్లాగులో అని చూసి అబ్బబ్బా ఈ ఆడ/మాడా/మగాడిదొక బ్లాగు వీడివొక వ్రాతలు దానికొక కాపీరైట్ అని ఫీల్ అయిన రోజులూ వున్నాయు. కారణం అయ్యగారు బ్లాగునిండా ఇంటర్నెట్ లోనుంచి కాపీకొట్టిన ఫొటోలో లేదా వికీపీడియా కాపీనో లేదా Microsoft MSDN నుంచో మక్కీకి మక్కీ దించేసి వుంటారన్న మాట :))

ఇలా ముందు ఢాం ఢాం అని పేలుతారు. కాస్త గట్టిగా webhosting వాళ్ళ దగ్గరా పేలుతుంటారు. గూగుల్ దగ్గరా పేలుతుంటారు. హ్మ్..ఎంత పేలినా హారం ఎక్కడికీ పోదు. పేలి పేలి తుస్ మనడం తప్పించి ఇలాంటి మైల్స్ వల్ల ఉపయోగమూ వుండదు. కానీ ఇలాంటి మైల్స్ సహజంగా Americans నుంచి రావు. వాళ్ళ మైల్స్ polite గా వుంటాయి. నిజమే కదా అమెరికా వాళ్ళకు దీపావళి లేదాయె టపాకాయలు పేలుద్దామంటే :)).

ఇంతకీ దీపావళి కి కవిత వ్రాద్దామని కూర్చుంటే ఓ ఆడామె లక్ష్మీబాంబేసింది. అందుకోసం ఈ టపా వ్రాయాల్సి వచ్చింది. టపాసుల్లో రకాలు వేరయా అన్నట్టు ఈ టపాసు మొదటి మైలే మహా ఘాటుగా వేసింది. చదవాలని వుందా???

అబ్బా ఆశ దోశ అప్పడం ఆవడ :))))
ఇలాంటి వారికి దీపావళి ప్రాశస్త్యం తెలిసి మనసు తిమిరం తొలగితే నిజంగా దీపావళే ఆరోజు.

అదీ నా ఈ నాటి దీపావళి కవితన్నమాట:))

చివరిగా పాఠకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

12, నవంబర్ 2012, సోమవారం

కర్ణుడిని కుంతీదేవి పది నెలలు మోసి కన్నదా లేక సద్యోగర్భము(?) ద్వారా కన్నదా?

ఆంధ్రవిద్యార్థి 1934 ఆగష్టు సంచికలో  కర్ణుని గురించి వచ్చిన ఒక చిన్న వ్యాసమిది. వ్యాసకర్త శ్రీ కూచిభొట్ల ప్రభాకర శాస్త్రి గారు.
మనకు ఇష్టమైన వారేదైనా సంఘ విరుద్ధమైన పని వల్ల అపకీర్తికి బద్ధులయ్యే అవకాశముంటే  దానిని రకరకాలుగా తర్కించి అది తప్పు అని నిరూపించడానికో చక్కని ఉదాహరణ ఇది.  ఇందులో ప్రధానమైన ప్రశ్న కుంతీదేవికి కర్ణుడు జీవపరిణామ నియమాలకు లోబడి పుట్టాడా లేదా సద్యోగర్భము వలన పుట్టాడా అన్నది ప్రశ్న. వ్యాసకర్తకూ ఈ విషయం తెలిసినా కుంతీదేవి అంతఃపుర స్త్రీ, గొప్ప వ్యక్తి కాబట్టి ఆమెకు  పెళ్ళికాకముందే కర్ణుడు పుట్టినాడంటే అపకీర్తి కాబట్టి అలా చెప్పకూడదని, అది సమంజసము కాదని అంటాడు. మనకున్న అభిమానము పెడదారులు పట్టినప్పుడు ఇలాంటి సిద్ధాంతాలు వ్యాప్తి చెందుతాయేమో !




8, నవంబర్ 2012, గురువారం

అమెరికా ఎలక్షన్లు - రిపబ్లికన్స్ Vs డెమోక్రాట్స్ - ఓ పరిశీలన


ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశాన్ని తీసుకున్నా ప్రజలే అధిపతులు. అమెరికా కానివ్వండి లేదా భారతదేశం కానివ్వండి. మొన్న అమెరికాలో జరిగిన ఎలక్షన్ల ఫలితాలను విశ్లేషించినట్లైతే రెండు పార్టీల ఎజండా ఎలా వున్నప్పటికి  ముఖ్యంగా రిపబ్లికన్స్  వైట్ అమెరికన్ల ను టార్గెట్ చేసుకొని ప్రచారం కొనసాగించింది. అమెరికాలో వీరి శాతం 72% కు పైగానే వున్నారు. ఇక డెమోక్రాట్స్ విషయానికి వస్తే వీరు ముఖ్యంగా మైనారిటీ వర్గాలను, మధ్య తరగతి వర్గాన్ని దృష్టిలో వుంచుకొని ప్రచారం చేసింది. ఇక పార్టీల ఎజండా విషయంలో ఎన్ని అభిప్రాయ బేధాలున్నా ఇరువర్గాలు చెప్పిందీ దేశ సంక్షేమం అభివృద్ధి గురించి. అమెరికా ప్రజలు ఇక్కడ పరిస్థితులను బట్టి సహజంగా  అక్షరాశ్యులు. స్వయంగా నిర్ణయాలు తీసుకోగల జ్ఞానం కలవాళ్ళు. ఇక జాతీయత, దేశాభిమానం, ప్రాంతీయాభిమానం విషయాలకొస్తే ఇక్కడున్న మైనారిటీ వర్గాలు శ్వేతజాతీయులకు ఏమాత్రం తీసిపోని వారు.

మరి 72 శాతానికి పైగా  శ్వేతజాతీయులున్న ఈ దేశంలో రిపబ్లికన్లు ఓడిపోవటానికి గల కారణాలను భారతదేశంతో పోల్చి చెప్పాలంటే, 70 శాతం హిందువులున్న దేశంలో BJP ఎప్పుడూ ఓడిపోతుండంటంతో పోల్చవచ్చు. కారణం చాలా మంది పౌరులకు నేను శ్వేతజాతీయుడనా లేక హిందువునా అనే దానికన్నా ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  నేను లేదా నాదేశం బాగుపడుతుంది అన్నదే ప్రధాన సమస్య. ఈ కారణం చేతనే ఇక్కడున్న శ్వేతజాతీయుల్లో సగం మంది ఒబామాకు ఓటు వేశారు. మరో ప్రధానకారణం ఒబామా outsourcing ని బాహాటంగా వ్యతిరేకించడం. outsourcing ని అడ్డుకోలేకపోవచ్చు కానీ రాయితీలను తగ్గించవచ్చు. అలా రాయితీలు తగ్గడం వల్ల ఇక్కడే ఉద్యోగాలిచ్చే సంస్థలు పెరుగవచ్చు. దీని ద్వారా అమెరికాలో ఉద్యోగావకాశాలు పెరుగవచ్చు.

ఇక అమెరికాలోనున్న లాటిన్ అమెరికన్లలో  70 శాతానికి పైగా ఓటర్లు ఒబామాకు ఓటు వేశారు. దీనికి దారితీసిన కారణాలను చూస్తే ముఖ్యంగా రెండు కనిపిస్తున్నాయి. ౧) రిపబ్లికన్స్ లో శ్వేతవర్గీయుల హవా తప్ప మిగిలిన జాతీయుల భాగం కానీ, వారి అధికారాలు కానీ అత్యంత స్వల్పం. కలుపుకోయే మనస్తత్వమూ తక్కువే అని ఆరోపణలూ వున్నాయి ౨) ఒబామా అనుసరిస్తున్న  ఇమ్మిగ్రేషన్ పాలసీలు.

అతి కొద్దిశాతమే ఐన ఏసియన్ అమెరికన్ల ( 3 % ) లో సుమారు 48% శాతం ఒబామాకు ఓటు వేశారు. ఎవరెవరు ఎలా వేశారో తేల్చడం కష్టం కానీ రోమ్నీ బాహాటంగా పాకీస్తాన్ ను సపోర్ట్ చెయ్యడం వల్ల చైనా దేశస్థులు, పాకీస్థాన్ దేశస్థులు రోమ్నీకి వేయగా భారతీయులు ఒబామా కు వేసి వుండవచ్చు.అలాగే ఆఫ్రికన్ అమెరికన్స్ కూడా ఒబామా కే సపోర్టు.

ఇదంతా చూస్తుంటే దేశమేదైనా అధికారానికి ఈ సమీకరణాలు తప్పనిసరేమో. కాకపోతే మనదేశం ఈ సమీకరణాలల్లో అమెరికాకంటే చాలా ముందంజలో వుంది.
ఇక్కడ ఖండాలూ, దేశాల వారీగా విడిపోయి సమీకరణాలు చేసారు. ఇలా విడిపోయి ఓట్లు వేసినా ఆ తరువాత అంతా అమెరికా కోసం పాటు పడేవారే.

మరి మనదేశంలో  దీన్ని మించిన కులసమీకరణాలు. ఓటింగ్ తరువాత కూడా అవే వర్గాలు. ఇక్కడ రోమ్నీ ఓటమి చూసిన తరువాత నాకో విషయం జ్ఞప్తికి వస్తుంది. నేను విశాఖలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ లో వున్నప్పుడు జరిగిన ఓ చిన్న సమావేశంలో బెజవాడ గోపాలరెడ్డి పాల్గొనడం జరిగింది. ఈపాటికే అది ఏ సమావేశమో మీకు అర్థమై వుండవచ్చు. బెజవాడ గోపాలరెడ్డి చెప్పిన వాక్యం యథాతథంగా ఇక్కడ

" మీరు రాజకీయాలలో రాణించాలంటే కులాభిమానాన్ని తగ్గించుకోవాలి" .

ఇది అక్షర సత్యం. మన రాష్ట్రంలో తనకులాన్నే నమ్ముకుని అధికారంలోకి వచ్చిన పార్టీ గానీ నాయకుడు గానీ ఒక్కడు కూడా లేడు. అమెరికాలో  రిపబ్లికన్స్ కూ, భారతదేశంలో BJP కి  జరిగిందదే.

5, నవంబర్ 2012, సోమవారం

హృదయమే శూన్యమై, శూన్యమే సంపూర్ణమై

హృదయమే శూన్యమై, శూన్యమే సంపూర్ణమై
ఆలపిస్తున్నా నేనీ ఆలాపనా...
నే  నీ ఆలాపనా      !! హృ||

అరుణకిరణ సమయమిది, జననమరణ భూతమది
నింగినేగు మేఘమది, మలయమారుత పవనమిది
వికసించిన మొగ్గయది, నేలరాలిన పుష్పమది
జనన మరణముల మధ్య గాలివాటు గమనమిది   

నువ్వా నేనంటూ సాగే పయనంలో
ముందో వెనకో నేనూ నువ్వూ చేరే గమ్యం ఒకటేలే
రక్తీ ముక్తీ, ప్రేమా ద్వేషం
వాడీ వేడీ, వాడూ వీడూ అన్నీ నేనూ నువ్వేలే
అంతా మూణ్ణాళ్ళ ముచ్చటేలే !            !! హృ||



కణకణమూ రగిలే రంగులబంతి కణములోపలి విష్ఫోటనము గని
కనులు మూసిన నిలిచేనా నువ్వూ నేనూ !
అహరహం రగిలే అగ్నిజ్వాలలే సమస్తావనికీ మూలాధారం
అది మింటికి రాజైనా,  నువ్వైనా, నేనైనా  !! హృ||

28, అక్టోబర్ 2012, ఆదివారం

జానపదుల పెరటి గుమ్మంముందు గుభాళించిన మల్లెల సువాసన


జానపదుల పెరటి గుమ్మంముందు గుభాళించే మల్లెల సువాసనలకు ఓ ఉదాహరణ మాత్రమే యిది. ప్రాచీన సంస్కృత కవుల వర్ణనలకు ఏమాత్రమూ తీసిపోని పల్లెటూరి వాడి విరహవేదన.

మంచి వెన్నెల సమయం. మల్లెపూల పందిరి. పరిశరప్రాంతమంతా మల్లెల సువాసన. ఆ ఆహ్లాదకర వాతావరణంలో ప్రియుడు వెండికట్ల వీణ చేతపట్టి ప్రియురాలిని పిలుస్తున్నాడు. ఒకవేళ ప్రియురాలు వచ్చినా గలగలా నవ్వుల సరసములతోనే తెల్లవారి పోతుందట.  విరహవేదనలో తన ప్రియురాలి పెదవులను కొండగోగులు, కొండనిమ్మలతో పోలుస్తున్నాడు. గూగుపూలు
లేత పసుపు, నిమ్మకాయల రంగు లేత పసుపు. ఈ కొండగోగులు పూయడం వల్లనో , లేత నిమ్మ  కాయడం వలనో నీ పెదవులు దొండపండు రంగులో వుంటాయి. ఓ వయ్యారీ నువ్వు రానట్లైతే నా మనసును ఎవరి పాలు చెయ్యాలి?

మల్లెలు ఆహ్లాదానికి, మథురమైన ఆలోచనలు కలగడానికి ఉత్ప్రేరకాలుగా వుపయోగపడుతాయి. మల్లెలు తెలుపు. తెలుపు  స్వచ్ఛతకు గుర్తు. అలాగే ముట్టుకుంటే కందిపోయే గుణం, సున్నితత్త్వం కూడా దీని సొంతం .  ఇంతటి విశిష్ట గుణాలున్న మల్లెలతో ప్రియురాలిని పోలుస్తున్నాడు.

నాయిక మాటలాడుతుంటే మల్లెలంత మధురంగా వుందట. మనసు మల్లెపూవు వంటిదట. అంటే అంత స్వచ్ఛమూ సున్నితమూనూ! ఇంతటి అందమైన గుణగణాలున్న నా ప్రేయసి రాకపోతే ఈ మల్లెపందిరినుండి రాలే మల్లెలెవరికివ్వాలి నేను?

మనకు ఈ కాలువల సౌకర్యం తక్కువగా వున్నప్పుడు ప్రజలు సాధారణంగా మెట్ట పైరులే వేసేవాళ్ళు. మెట్టప్రాంతాల్లో మినుములు, కందులు ప్రధానం. ఈ రెండూ కూడా వేసవికాలపు పంటలు.అంటే మార్చి నుండి జూన్ వరకూ పండించే పంటలు. ఈ కాలంలో పశువులకు పచ్చిక దొరకదు. పచ్చిక బదులు పశువులు ఈ కందిపైరు కొసలు మేస్తాయి. ఇప్పుడు నాయకుడేమంటున్నాడంటే నందీ పూసింది, కందీ కాసిందీ ఆ కంది కొసలను ఎద్దు కూడా తినడం అయింది అంటున్నాడు. అంటే ఎండాకాలమైపోయి వర్షాకాలం మొదలైంది. ఈ కాలంలో కూడా నా శరీరం విరహతాపంతో చల్లబడటంలేదు. కాబట్టి కొంచెం గంధమైనా పంపమని వేడుకుంటున్నాడు. ఇక్కడ మరో విశేషము కూడా వుంది.  ఎంతమంది ఎద్దులు నడిచేటప్పుడు  చూసి వుంటారో లేదో గానీ, మంచి బలమైన ఒంగోలు జాతి ఎద్దులు నడుస్తుంటే స్పష్టమైన ఠీవి కనిపిస్తుంది. అలాంటి ఠీవిగల మంచి నడకతో రావా ప్రియురాలా అని వేడుకుంటూ, రాలేని పక్షంలో గంధమైన పంపమని అభ్యర్థిస్తున్నాడు. గంధము శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.


చూశారు కదా!   అలంకారాన్ని నెమరువేస్తూ వ్రాసే కావ్యాలు ఈ చిన్న పాట పొలిమేరలచెంతకైనా రాగలవా? ఇప్పుడు ఆ పాట చదవండి


వేళజూడ వెన్నెలాయె వెండికట్ల కిన్నెరాయె
మల్లెపూల పందిరాయె, వయ్యారీ రావే - నవ్వులోనె తెల్లవారును

కొండగోగులు పూసెనేమొ కొండనిమ్మలు కాసెనేమొ
దొండ పండులాంటి పెదిమె, వయ్యారీ రావే - మనసు ఎవరిపాలు చేతును

మల్లెపూలు పూసినట్లు మళ్ళి మళ్ళి మాటలాడు
మల్లెపూలవంటి మనసు, వయ్యారీ రావే - పూవులెవరి పాలు జేతును

నందిపూసె కందిగాసె కందికొనలు నందిమేసె
అందమైన మేలినడల వయ్యారీ రావే - గంధమైన పంపబోతివి

23, అక్టోబర్ 2012, మంగళవారం

ఆహా ఏమి ఫలితాలు..ఓహో ఏమి ఫలితాలు... అద్భుతమైన ఫలితాలు బా.....బూఊఊఊఊఊఊఊఊఊఊ...



గూగుల్ వాడ్ని అడిగితేనేమో బోలెడు డాక్యుమెంట్లు చూపించి దీనిమీద జనాలు ఆడేసుకున్నారంటాడు. జనాలేమో పేపర్లమీద పేపర్లు ముద్రించి మేము 90-99% కచ్చితంగా గుర్తించామని గ్రాఫులు గీసి మరీ చూపిస్తారు. ఇంకొంతమందేమో ఇది under graduate project క్రిందనే మేము రఫ్ఫాడించామంటారు. ఏంటో అంతుచిక్కని ప్రశ్నలు....

ఇంతమంది 90% అబౌవ్ ఇంత కచ్చితంగా  గుర్తించగలిగాము అంటున్నారు ఎలా? నేను ఒత్తులను ప్రక్కనుంచి మిగిలిన అచ్చులు,హల్లులు, నకారాలు, గుణింతాలు అన్నీ కలిపి 541 అక్షరాలను (గౌతమి ఫాంట్ సైజ్ 18, 26 )   ట్రైన్ చేసి అదే అక్షరాలను ఇస్తే అబ్బో నా ప్రోగ్రామ్ కూడా 100 శాతం ఫలితాలను సాధిస్తుంది. కానీ దీనివల్ల ఉపయోగమేందయ్యా అంటే అచ్చనగాయలాడుకోవడమే ! మనకు కావలసినదదికాదు కదా? ఒక్కసారి ట్రైన్ చేసాక ఏ పుస్తకంలోని పేజీని ఇచ్చినా ఇద్దోబాబు నీకోసం కష్టపడి ఇవి గుర్తించాను, నువ్వు టైపు చేసే పనిని కూడా నీకు తగ్గిస్తున్నాను కాబట్టి నామేలు మర్చిపోకయ్యా అని చెప్పాలికదా ఈ OCR లు ? అలా చెప్పలేనప్పుడు ఇదెందుకంటా? అలా కాదు నీకు కావాల్సిన పుస్తకంలో కొన్ని అక్షరాలను తీసుకొని నాకు నేర్పిస్తే ఏదో మిగిలినవి గుర్తిస్తాను మరీ అంత తీసిపారేస్తున్నావేంటని కోప్పడిందనుకోండి. అలాచేస్తే ఫలితాలు బాగానే వుంటాయి. పేపరు ముందే లీకవుతుందికదా మరి. కానీ జనాలకిదేపని బాబు, ఓ రెండు పుస్తకాలను OCR ద్వారా కాపీ చేసుకోవాలంటే ఓ రెండునెలలు కావాలా? ఇంతకీ ఇదంతా ఎవడికోసమంటా? దాన్ని అలా మార్చేబదులు మంచంమీద బోర్లా పడుకొని ఎంచక్కా కలలు కంటూ నిద్రపోతే ఎంత సుఖమో కదా?

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే మిగిలిన వాళ్ళకొచ్చిన 90% ఫలితాలు అంతకంటే ఎక్కువ నాకు అదే అక్షరాలను వాడినప్పుడుమాత్రమే వచ్చింది. మిగిలిన సందర్భాలలో అంటే Digital library వాళ్ళ స్కాన్డ్ ఇమేజెస్ వాడితే నాఫలితాలు ... ఎందుకులే బాబు కిక్కిక్కి అని నవ్వుకుంటారు....వద్దులే.....బాబూ...

చివరిగా .... ఇంతకీ అసలు తెలుగులో commercial గా నైనా ఈ OCR లు వున్నాయా?

16, అక్టోబర్ 2012, మంగళవారం

సటైర్స్ - చిచ్చుబుడ్లు - సీమ టపాకాయలు

జానడంత లేవు నీకు సెక్సుపుస్తకాలెందుకు?
నేను కాదు నా తమ్ముడు చదివేటందుకు

మన ప్రేమ స్థిరంగా ఉండాలంటే మార్గమేమిటి ప్రియా?
పెళ్ళిమాని ఎల్లకాలం యిలాగే వుండాలి చెలియా

ఎవరయ్యా ఆ లారీక్రిందపడ్డ వ్యక్తి?
"రోడ్డు ప్రమాదాలు - జాగ్రత్తలు" గ్రంధం వ్రాసిన వ్యక్తి

కొత్తకథ వ్రాసుకొచ్చాను చదువుతావా డైరక్టరూ?
తీసేది తెలుగు సినిమా కథెందుకు కవిగారూ!

పదేళ్ళుగా అమ్మాయి వయసు పదహారే అంటున్నారు?
ఒకేమాటపై నిలబడమని వకీలు సలహా యిచ్చారు

ఆడది గడపదాటితే అనర్థమంటారెందుకని?
ఇల్లేకాదు వీధికూడా రణరంగమౌతుందని.

డా|| ఉండేల మాలకొండారెడ్డి గూర్చి బ్లాగులోకంలో ఎక్కువమందికి తెలిసి వుండకపోవచ్చు కానీ, CBIT లో చదివిన విద్యార్థులకు  తప్పక తెలిసే వుండవచ్చు. మరి నువ్వు CBIT లో చదివలేదు కదా నీకెలా తెలుసని గొప్ప గొప్ప ప్రశ్నలను అడగమాకండి. వీరిది మా ఊరుకు దగ్గర. అలాగే ఈ కాలేజీలొ నాకు తెలిసిన కొద్ది మంది ప్రొఫెసర్లూ వున్నారు. పైన పేర్కొన్న చమక్కులు ఆయన వ్రాసిన ఒడిసెల రాళ్ళు పుస్తకం నుంచి

మాలకొండారెడ్డి వ్రాసిన మిగిలిన గ్రంధాలెలావున్నా హైస్కూలు,కాలేజీ విద్యార్థిగా వీరు వ్రాసిన నేతాజీ, వివేకానందుడు పద్య గ్రంధాలను వీలైతే తప్పక చదువ వలసిన పుస్తకాలు. వాటిపై విమర్శవ్రాసే స్థాయి నాకు లేదు కానీ యుక్తవయస్కునిగా వున్నప్పుడు వ్యక్తి యొక్క  తెలివి తారాస్థాయిలో వుంటుంది కాబట్టి ఈ పద్య కావ్యాలలోనూ వారి ప్రతిభ ధారాశుద్ధి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.


వీరు వ్రాసిందే మరొక్కటి..జీవిత సత్యాన్ని ఆవిష్కరిస్తుంది.

రాళ్ళుతిని ఆరగించుకొనే నాడు తినడానికి రాళ్ళు లేవు
పళ్ళెంనిండా రాళ్ళున్ననాడు తినడానికి పళ్ళు లేవు.

15, అక్టోబర్ 2012, సోమవారం

నిండు జాబిలి ....కారుచీకటి

నిండు జాబిలి తూర్పుకొండలపై వికసింప
పొంగు కెరటాలతో నింగికెగసదవేల
కోలుపోయిన సుధాకోశ మనుకుంటివా?
ఎంత యెగసిన కుప్పిగంతులేకద నీవి
అందుకో లేవులే అమృతాంశ బింబమును

అమావాస్య పౌర్ణమికి
ఎగరడం నీనైజం
ఎగిసి పడటం ప్రకృతిధర్మం.



************************


పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల విరిసిన వేళ
మల్లెలు పరిచాను త్రోవ పొడవునా....
కాలు క్రిందపూవు లీలగా తగిలిందోలేదో
రాలు రప్పలీ కాలిబాట యని
వెళ్ళిపోయింది వెనుదిరిగి చూడకనే

కాటుక పులిమినట్లు కారుచీకటి ముసిరినవేళ
పల్లేరు ముళ్ళు పరచాను దారిలో
గ్రుచ్చుకున్న ముండ్లను విచ్చిన పూచెండ్లుగా భావించి
చేరవచ్చింది తిన్నగా !!!

9, అక్టోబర్ 2012, మంగళవారం

పిల్లలతో జంతుప్రదర్శనశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త !!


ఓ సారి ఈ చిన్నారి జీవితాన్ని ఊహించండి? పెద్దలగా మనం కాసేపు ఏమరపాటుగా వున్నందుకు ఆ బాబుకు జీవిత శిక్ష. ఇలాంటి వార్త చదవడమిదే మొదటిసారి.




8, అక్టోబర్ 2012, సోమవారం

అనంతపురపు బురదను చూసిన శ్రీ చంద్రబాబుగారు

ఈ రోజు వార్తాపత్రికలోని ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది. ఎండనక వాననక మాజీముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు అనంతపురం జిల్లాలో  పాదయాత్రను చేస్తూ ఆ సందర్భంగా బూటుకాలుతో బురదను పరిశీలించి బురదలోనడవడంలోకల కష్టాలను తెలుసుకొని ఆ రకంగా ముందుకుపోతున్నారు.


1940 లో ఒక గ్రామం - సాంఘిక అసమానతలపై ఓ బ్రహ్మాస్త్రం

సాంఘిక అసమానతలపై ఓ బ్రహ్మాస్త్రం ఈ సినిమా. చాలా మందికి ఈ సినిమా నచ్చకపోవచ్చు కానీ మనసులోని అహంభావాన్ని ప్రక్కనపెట్టి ఓ క్షణంపాటు ఆలోచిస్తే నిజమనిపిస్తుంది. అహంభావి దీక్షితులు పాశ్చాత్తాప పడడం నిజజీవితంలో సాధ్యమో కాదో కానీ సినిమాలో బాగా పండింది.

సినిమాలో మాటలు చాలా సాగతీతగా అనిపించినా ఈ సినిమా లక్ష్యమే అది కావడంతో ఓపికగా వినాల్సి వస్తుంది.

సాంఘికజీవనంలోని కట్టుబాట్లు ఎంతతీవ్రంగా వుంటాయో, వాటికి ఎదురీదాలంటే ఎంతటి మనోస్థైర్యంకావాలో ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఆత్మశుద్ధి, ఆచరణశుద్ధి జీవితానికి ఎంత ముఖ్యమో చక్కగా చూపిన సినిమా. చదివిన వేదవిజ్ఞానికి, వల్లించే నీతివాక్యాలకు,చేసేపనులకు ఏమాత్రమూ పొసగని నేటి సమాజమంతా తప్పక చూడవలసిన సినిమా.

సుశీల, సూరిల ప్రేమసామ్రాజ్యం ఈ సినిమా. ఓ 60, 70 సంవత్సరాలనాటి సాంఘిక కావ్యం ఈ సినిమా. వెరసి ఓ మంచి నీతికావ్యం ఈ సినిమా. నాటి పరిస్థితులకూ, నేటి పరిస్థితులకూ నిజంగా ఎంత తేడానో. భారతదేశం అభివృద్ధి చెందిందా లేదా?


1940-lo-oka-gramam-telugu-movie-online

7, అక్టోబర్ 2012, ఆదివారం

ప్రకాశం జిల్లా పప్పుచారు, మామిడికాయ ఊరగాయ




ఈ రోజు మా ఇంట్లో జిల్లెళ్ళపాటి వంకాయ వేపుడు, ముద్దపప్పు, ప్రకాశం జిల్లా పప్పుచారూ, మామిడికాయ ఊరగాయ, ప్రక్కనే నెయ్యి, మజ్జిగ పులుసు అంతా అయ్యాక రసగుల్లా స్వీటు, బాదంపిస్తా ఐస్క్రీమ్...

ఇన్ని తిన్నాక  తృప్తిగా కాసేపు అలా సోఫాలో కూర్చుంటే ఎదురుగా కంప్యూటర్ మీద శశాంక విజయం పుస్తకం రా..రామ్మని పిలిచింది. ఇంకనేం పుస్తకాన్ని తెరిచి ఓ పేజీ తిరగేయగానే ఈ పద్యం....

అంతే నాలో కళాకారుడు రెక్కలు విచ్చుకొన్నాడు :-). నా బాధ పడలేక ఇంట్లో వాళ్ళు చెవులు మూసుకొని  పారిపోతున్నా వినిపించుకోకుండా తిన్నది అరిగేదాకా పొట్టకూ, కంఠానికి ఏదో ఇలా వ్యాయామం :))


మరో మాట మొత్తానికి కుస్తీ పట్టీ పట్టీ..పట్టీ.... ఈ రోజు ఆడియో ఫైల్స్ ను బ్లాగర్లోకి ఎలా అప్లోడ్ చెయ్యాలో నేర్చుకున్నాను :-)
 




ఏలా లతా జాల డోలా సమాలోల బాలామణీ గాన భాసురములు
థీ రానిల వ్రాత ధారా చల చ్చూత దూరాపతద్ర జోధూసరములు
మోదావ హానంగ  వేదాభ రవ భృంగ ఖేదావహ జ్జాతి కేసరములు
నాళీక దృక్కాంత పాళీన వైకాంత కేళీపరన్యూత కేసరములు

కనదగె నకుంఠ కలకంఠ కంఠ నాద
పటు భ టాహ్వాన కుపిత బిభ్య త్ప్రపంచ
పంచ సాయక మద హస్తి పైసరములు
మీసరమ్ములు, మధుమాస వాసరములు.

3, అక్టోబర్ 2012, బుధవారం

కాకతీయులు, రెడ్డి రాజుల కాలంలో ప్రభుత్యోద్యోగాలు - వారి అధికారాలు - పట్టిక



కాలంతో పాటు మనిషి జీవనం, జీవించడానికి చేయవలసిన వృత్తులూ మారుతూ వస్తుంటాయి. ఈరోజు మనం చేసే ఉద్యోగాలకు రేపు ప్రాధాన్యత వుండకపోవచ్చు. అలాగే ఆనాడు వాళ్ళు చేపట్టిన ఉద్యోగాలకూ ఈరోజు పెద్దగా ప్రాముఖ్యత లేదు.  రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా తగిన పరివారం మందీ మార్బలం లేకుంటే ఆరాజ్యం విచ్ఛిన్నం కాక తప్పదు. పరిపాలన సజావుగా సాగాలంటే మంత్రాంగం, దానికి తగ్గ యంత్రాంగం తప్పనిసరి.

 కాకతీయులు,రెడ్లు,విజయనగర రాజులకాలంలో అధికారాలు,అధికారులు ఏఏపేర్లతో పిలువబడ్డారో ఆరోజులలో వెలువరించిన శాశనాలద్వారా, సాహిత్యము ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా కాకతీయుల కాలంలో అధికారులను 72 విధాలైన వైవిధ్యాలతో కూడిన వారుగా విభజించారు. బహుశా ఇప్పటిలాగా ఆరోజుల్లో UPSC లేకున్నా అంతకంటే మేలైన తరహాలో ఈ పదవుల అధికారులను ఎన్నుకొనేవారనుకుంటాను. కారణం వీళ్ళు ఆయా వృత్తిబాధ్యతలను నిర్వర్తించండంలో నిష్ణాతులైతే తప్ప రాజ్యం పటిష్టంగా వుండే అవకాశం లేదు. ఈ 72 విధాలైన అధికారులపై ఓ పెద్దాయన వుండేవాడు.అతనిని బాహత్తర నియోగాధిపతిగా వ్యవహరించేవారు.

72 నియోగాలనూ, వారి వారి అధికారాలనూ ఈ క్రింద పేర్కొనబడడం జరిగింది. నియోగము అంటే ఆజ్ఞ లేదా ఆజ్ఞాపించిన పని, పరిజనము మొదలైన అర్థాలున్నాయి.  నియోగి అనగా నియోగించెడి అధికారము కలవాడు - ఒక తెగ బ్రాహ్మణుడు. ఈ నియోగి పదాన్ని చూస్తే అప్పటికి మనదేశంలో  వర్ణ వ్యవస్థ వుండేదేమో కానీ కుల వ్యవస్థ వున్నట్లు కనిపించదు. కుల వ్యవస్థ ఇప్పటిలా కాక వృత్తిపరమైనదని తెలుస్తుంది. అప్పట్లో ఈ పనులను చేసే వారిని లేదా వారిపై అధికారిని నియోగి అనిపిలిచేవారనుకుంటాను. వీళ్ళే తదనంతరకాలంలో రకరకాలుగా విడిపడి కులాలుగా మార్పు చెంది వుండవచ్చు.


మూలం : రాయలసీమ తెలుగుశాశనాలు - సాంస్కృతిక అధ్యయనం ( డా. యం. ఆదినారాయణ శాస్త్రి )








29, సెప్టెంబర్ 2012, శనివారం

అసంతృప్తి అసంపూర్తి అర్థంపర్థం లేని ఆలోచనల ప్రవాహం... మనరోజులో ఎక్కువభాగం ఇలాగే వుంటుందేమో



 రాత్రి 11 గంటలు. నిద్రపోదామని పండుకోని కూడా " ఆ రేపు శనివారమే కదా అప్పుడే ఏమి పండుకొంటాములే" అనిపించి తలగీక్కోవడం మొదలు పెట్టాను. జిల పుట్టి కాదులేండి. ఏంచేయాలా అనుకుంటూ.....

ఈ మధ్య నాకు నా ఆన్లైన్  డైరీ మీద బొత్తిగా భయమూ భక్తీ తగ్గినట్టనిపిస్తుంది.దీని మొఖం చూడక కొన్ని సంవత్సరాలైపోయినట్టుంది. Office లో చూస్తేనేమో పగలేకాదు ఈ మధ్య రాత్రులు కూడా Applying Crossapply on over a billion records - Fingers crossed అన్నట్టైపోయింది నాపని. ఎదవగోల ఎప్పుడూ పనిగోలేనా? ఇంట్లో పెళ్ళాము ఆన్లైన్లో second setup (  బ్లాగేలేండి విపరీతార్థాలు తీయక్కరలేదు :-)) ఎదురుచూస్తున్నాయన్న జ్ఞానమేమన్నా వుందా అంటూ Table మీదున్న కంప్యూటర్ కన్నుగొట్టి మరీ అడిగింది.

అసలు ఏమి రాసి బ్లాగు కాగితాన్ని నలుపుచేద్దామా అని ఒకటే ఆలోచన. కాగితమంటే గుర్తుకొచ్చింది. ఈ మధ్య అసలు పెన్నుపట్టి తెలుగు వ్రాసి ఎన్ని రోజులైంది? రోజులేనా? ఏమో నెలలే ఐనట్లుంది. చేతివ్రాత అని ఆలోచనరాగానే నాకు ఇంకుపెన్నే గుర్తుకొస్తుంది. అందులో కూడా ప్రసాద్ ఇంకు పెన్ను. అబ్బో దీనికొక పేద్ద కథ వుందిలే... ఈ పెన్నులు పోవడం నాకు వీపు విమానంమోత మోగడం... అస్సలు ఏ తబలా, మద్దెలకూడా నా అంత మధురంగా ఏడ్చుండవు.

  ఇంతకీ ఏమివ్రాద్దామని ఈ వ్యాసమంటారా? నీ బండబడ మౌస్ తో నాలుగు పిచ్చిగీతలు అక్షరాల రూపంలో గియ్యగానే వ్యాసమైపోద్దా?? పోదా? ...దు కదా??? అందుకని మళ్ళీ నెత్తిగీరుకోని.......

హ్మ్.... ఇప్పుడు దెయ్యాలు తిరిగేవేళయ్యింది. బయట చిమ్మచీకటి. అర్థరాత్రి 12:14AM. కిటికీలోంచి అట్టాచూశానో లేదో బయట.... ఊఊఊఊఊఊఊహూఊఊఊఊ... యాఆఆఆఆఆ.....అన్న శబ్దం. అమ్మో .... తల బయటపెట్టలేదు కానీ ..పెట్టుంటేనా....కసుక్కున కొరికేసి పండగరోజు అనుకోనుండేదేమో.... ఆ దెబ్బతో భయమేసి గబగబ కిటికీమూసేసి మళ్ళీ నాలుగు గీతలు బరుకుదామని ఇట్టొచ్చా

నాకు కుడి వైపుగా ఫ్యాన్ తిరుగుతుంది. అవును చాలా వేగంగా తిరుగుతుంది. నాకు శబ్దము కూడా వినిపిస్తుంది. చాలా స్పష్టంగా వినిపిస్తుంది. నీకేమన్నా పిచ్చంటరా  ఫ్యాన్ తిరుగుతుంటే, ఆహా ఎంత చల్లగాలి, పిల్లగాలి అని వర్ణించుకుంటూ రాసుకోక శబ్దాల గొడవేందివయ్యా అని కచ్చితంగా అనుమానము రావాల కదా? .... వచ్చిందా?...... ఆ... ఈ ఫ్యాను వల్ల గాలి మనదాకా వస్తేకదా పిల్లగాలిని వర్ణించడానికి. అప్పుడర్థమయిందేందయ్యా అనుకుంటుంటే... మన ఇంద్రియాలకు అందనిది మనము వర్ణించలేమని.

ప్రక్కన విక్స్ డబ్బా... తీసి కొద్దిగా తలకు రాసుకున్నా... వ్యాసం వ్రాస్తున్న నాకే ఇంత తలనొప్పిగా వుంటే  చదువుతున్న మీకు ఇంకెంతుండాలి? మీ గూట్లో పెట్టిని ఝండూబామ్ ని తీసి నాకోసం మీరుకూడా వ్రాసుకోండి.  ఛత్... ఎనకటికెవడో చదవంగ చదవంగ "పెసలు" ను కాస్తా పిసలు పిసలు అనడం మొదులు పెట్టాడంట. అట్లావుంది నాయవ్వారం. లేకపోతే "ఝండూబామ్ ని తీసి నాకోసం మీరుకూడా వ్రాసుకోండి" ఏందది? వ్రాసుకోండా..రాసుకోడి అనా? ఏదో ఒకటిలే ఏది రాసుకున్నా శిరోభారం తగ్గడమే కదా అంటారా? నచ్చినది వ్రాసుకున్నా శిరోభారం తగ్గిపోద్దికదా? మరి ఇప్పుడు నేనేమనాలి? వ్రాసుకోండి అని అనాలా లేక రాసుకోండి అని అనాలా?

ఊంగా ఊంగా అని మంచి ఊపున్న పాట వస్తుంది. ఉండండి నేను కూడా మాంచి ఫిల్టర్ కాఫీ తెచ్చుకోని మళ్ళీ వ్రాయడం మొదలుపెడతాను.....

26, సెప్టెంబర్ 2012, బుధవారం

http://www.sakshi.com -- ఆన్లైన్ సాక్షి దినపత్రిక వారికి ఒక సలహా



మీరు ఉన్నపళంగా సాక్షి వెబ్సైట్ ను పటిష్టం చేయడం మంచిది. ఇప్పుడున్న వెబ్సైట్ సెక్యూరిటీ పరంగా ఏమాత్రమూ ఆశాజనకంకా లేదు. ఏ కొంచెమైనా  Database knowledge మరియు Visual basic.net knowledge వున్నవారికి ప్రస్తుత వెబ్ సైట్ ఓ స్వర్గధామంలా కనిపిస్తుంది. మీ పూర్తి వివరాలతో మిగిలిన వివరాలకు ramireddy.mvb@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.

10, సెప్టెంబర్ 2012, సోమవారం

సొగసు కీల్జడదాన ! సోగ కన్నుల దాన ! వజ్రాల వంటి పల్వరుసదాన


 

శ్రీనాథుడు ఆస్థాన కవిగా విద్యామంత్రిగా పదవీబాధ్యతలను చేపట్టి చాలా కావ్యాలను తెలుగులోకి అనువదించినప్పటికీ, ఓ యాత్రికునిగా దేశాటనం చేస్తూ ఆశువుగా చెప్పిన పద్యాలు కోకొల్లలు. ఆ కాలంలో కులాలు వున్నప్పటికి ఇప్పటిలాగా కాకుండా చాలా సామరస్యంగానే వున్నాయని చెప్పవచ్చు. అప్పట్లో కులవృత్తి గౌరవప్రదమైనది. ఓ బాపనాయనకు ఎన్ని వేదవేదాంగాలు తెలిసినా ఆయన గౌరవం అంతవరకే. కాటికాపరికి ఎంత వేదాంతం తెలుస్తుందో వేదవేదాంగాలు ఆపోసన పట్టినా అంతకంటే పెద్దగా తెలిసేదేదీ వుండదు.మిగతా పనులు చేసుకునే వృత్తుల వారి కులంలో కూడా వారి వారి వృత్తులననుసరించి తత్త్వజ్ఞానమూ వుండేది. అంటే ఎవరి వృత్తి వారికి ఆదర్శ ప్రాయం. ఊరని వుంటే ప్రతికులానికీ ప్రాధాన్యత తప్పక వుండాలి. లేకుంటే ఆ ఊరికి మనుగడ కష్టసాధ్యమయ్యేది.

ఇలా శ్రీనాథుడు దేశాటనం చేస్తూ ఆయా కులాల్లో వున్న సుందరాంగుల వర్ణనలు చాలానే చేశాడు. అలాంటి వర్ణనలతో కూడిన కొన్ని చాటు పద్యాలు ఇవి.

ముందుగా శ్రీనాథునిగా చెప్పుకుంటున్న ఓ పద్యం. కానీ ఈ శైలి శ్రీనాథునుది కాదేమో ననిపిస్తుంది. ఏమైనా చిన్న చిన్న పదాలతో చిన్నదాన్ని వర్ణించడం బాగుంది.

సొగసు కీల్జడదాన ! సోగ కన్నుల దాన ! వజ్రాల వంటి పల్వరుసదాన
బంగారు జిగి దాన ! బటువు గుబ్బల దాన ! నయమైన యొయ్యారి నడల దాన
తోరంపు గటిదాన ! తొడల నిగ్గుల దాన ! పిడికిట నడగు నెన్నెడుము దాన
తళుకు జెక్కులదాన ! బెళుకు ముక్కెరదాన ! పింగాణి కనుబొమ చెలువుదాన

మేలిమి పసిండి రవ కడియాల దాన
మించి పోనేల రత్నాల మించుదాన
తిరిగి చూడవె ముత్యాల సరుల దాన
చేరి మాటాడు చెంగావి చీర దాన

ఇప్పుడంటే చాకలివృత్తి మిగిలిన వృత్తులతో పోలిస్తే లాభదాయకం కాకపోవటంతో ఆ వృత్తి చేసేవారి సంఖ్య తగ్గిపోయింది కానీ, పూర్వకాలంలో ఇప్పటిలా వ్యాపారాలు చేసి పనికిరాని కాగితాల సంపాదనా నిల్వలు వుండేవి కాదు కదా!! మహా ఐతే ధాన్యాన్ని మార్పిడి చేయడం ద్వారా బంగారు నాణేలను ప్రోగు చేసుకొనేవారేమో !!   వాషింగ్ మిషన్లు వచ్చి ప్రతియింట్లో ఇల్లాలే చాకలి వృత్తి చేస్తుంది కానీ, ఆ రోజుల్లో ఊరన్నాక ఓ చేరువో వాగో సాధారణం. ఆ వాగులో చాకలి వాళ్ళు బట్టలు ఉతకటం కూడా అంతే సర్వ సాధారణం. నిజానికి బట్టలు ఉతకటం శరీరానికి మంచి వ్యాయమం. ఈ వ్యాయామం వల్లనే ఏమో కానీ చాకలి వాళ్ళు సాధారణంగా అందగత్తెలై వుంటారు. ఇది నా అనుభవం మాత్రమే !!

అలాంటి అనుభవమే శ్రీనాథునికి ఎదురైతే..ఇంకేముంది... పద్యం పరవళ్ళు తొక్కింది.

శ్రీకర భూషణంబులును,సిబ్బెపు గుబ్బలు, ముద్దు చెక్కులున్
గోకిలవంటి పల్కులును గొల్చిన జేరల గేరుకన్నులున్
బ్రాకట దేహకాంతియును,బంగరు చాయకు హెచ్చువచ్చు నీ
చాకలివారి సుందరికి,సాటిగ రారిక దొంటి జవ్వనుల్


బలిజ వాళ్ళ వృత్తి ఏమిటో నాకు ఇదమిద్ధంగా తెలియదు. కారణం మా ఊరి వద్ద నా స్నేహితుల కుటుంబాల వాళ్ళు కొంతమంది వ్యాపారం కొంతమంది వ్యవసాయం చేసేవారు. కానీ అదేమి చోద్యమో కానీ ఈ కులంలో అమ్మాయిలు చాలా చాలా బాగుంటారు :-)

నాలాగే శ్రీనాథునికీ నచ్చారు మరి. అప్పుడేమైందంటే

పసగల ముద్దు మోవి, బిగి వట్రువ గుబ్బలు, మందహాసమున్
నొసట విభూతిరేఖయు, బునుంగున తావి, మిటారి చూపులున్
రసికులు మేలు! మేలు! భళిరా యని మెచ్చగ రాచవీటిలో
బసిడి సలాక వంటి యొక బల్జె వథూటిని గంటి వేడుకన్

పాపం శ్రీనాథుడంతటివాడి గుండెలోకి బంగారు సలాక కస్సుమని దిగింది.

ఇకా మా రెడ్డి పిల్లలూ వుంటారు ఒంకరటింకరగా.కాకపోతో పొలం పనుల వల్ల కొన్ని భాగాలు పుష్టిగా వుంటాయి :-)
  ఇలాంటి రెడ్డి పిల్ల ఒకటి ఈన కంట్లో పడింది.

విడిబడి నిట్టవేగి, యట బిఱ్ఱున వ్రాలిన నంతలోన, దా
వడిసెల చేత బట్టుకొని, వట్రువ గుబ్బల బైట జాఱగా
నడుము వడంకగా, బిఱుదు నాట్యము సేయగ, కొప్పు వీడగా
దొడ దొడ యంచు నెక్కె నటు దొడ్డ మిటారపు రెడ్డి కూతురున్

అలాగే పల్లెటూళ్ళలో వడ్లమిల్లులు రాకముందు, వడ్లను ఏరోజుకారోజు రోట్లో పోసి ఇంట్లో ఎవరు ఖాళీగా వుంటే వాళ్ళు దంచి, ఆ దంపుడు బియ్యాన్ని వాడి వంటచేసేవాళ్ళు. అలా ఓ ముగుడు, పెళ్ళాలిద్దరూ వడ్లు దంచేపద్ధతినీ, ఆ పిల్ల నంద పదాలతో మొగుడిని కవ్వించే విధానాన్నీ సుందరంగా వర్ణించాడు

పువ్వులు కొప్పునం దుఱిమి, ముందుగ గౌ నసియాడుచుండగా
జెవ్వున పంగ సాచి యొక చేతను రోకలి బూని, యొయ్యనన్
నవ్వు మొగంబుతోడ దన నందను బాడుచు నాథు జూచుచున్
సువ్వియ సువ్వి యంచునొక సుందరి బియ్యము దంచె ముంగిటన్

మరికొన్ని కులాల అమ్మాయిల సౌందర్యాన్ని గూర్చి మరో టపాలో ....


7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

అమెరికా వెలుగు - ఒబామా ( America's hope - Mr President Obama)

What a speech!!! Love the confidence and your vision of America Mr President Obama.

దేశము, దేశానికి నాయకత్వం, నాయకునికి వుండవలసిన ముందు చూపు, సామాన్య ప్రజలపట్ల మమకారం, విద్యార్థులు వాళ్ళ భవిత, అమెరికాకు కావలసిన సాంకేతిక విజ్ఞానాన్ని మళ్ళీ పట్టాలపైకెక్కించటం, భూమి పై పొల్యూషన్ పెరగకుండా చేయవలసిన బాధ్యత, కర్మాగారాల అవసరం, Export import policy, విదేశాంగ విధానం ఒక్కటేమిటి మీరు ప్రసంగించిన ప్రతి అంశం ప్రతిదేశానికి ఎంత అవసరమో కనీస జ్ఞాన మున్న ఏ పౌరునికైనా అర్థమవుతుంది.

ఈ ప్రసంగం విన్న తరువాత నాకు అనిపించిన నాలుగు వాక్యాలు.

భారతదేశంలో ఇలాంటి రాజకీయనాయకులు ఎందుకు పైకి రావడంలేదు? అసలు మన రాజకీయాలకు అమెరికా రాజకీయాలకు ఎందువల్ల ఇంత వ్యత్యాశం. మన ప్రజల ఆలోచనా సరళిలో వున్నదా లేక మన స్వార్థంలో వున్నదా? ముందు రాజకీయాలపట్ల విశ్వాసం సామాన్య మానవునికి ఎందువల్ల సన్నగిల్లింది? రాష్ట్రాలను ప్రక్కనపెట్టి దేశరాజకీయాలను చూసినా నాకెప్పుడూ ఇలాంటి వక్త ఓ బహిరంగ సభలో కనిపించలేదు. ఎంతసేపూ ఎదుటి వాడిపై బురద చల్లడం, కులాల వారిగా రిజర్వేషన్లు పెంచుతామని మభ్యపెట్టటం లేదా ప్రాంతీయ ద్వేషాగ్ని ని రగిలించడం లాంటి విశేషాలే కనిపించాయి కానీ ఎప్పుడైనా

మూతపడుతున్న చిన్న పరిశ్రమల గురించి కానీ, పెరుగుతున్న రోగాల గురించి కానీ, నాణ్యత లోపిస్తున్న విద్యా విధానాల గురించి కానీ, అరడుగు లోతున గుంతలపడ్డ రోడ్ల గురించికానీ, స్వయం సమృద్ధికి కావలసిన పాలసీల గురించి కానీ, విద్యుత్, మంచినీరు, ఆహార కొరత ఇలాంటి వాటిపై ఓ జాతీయ విధానాన్ని రూపొందించి ఎలా అమలు చేస్తారో కనీసం ముచ్చటించనైనా ముచ్చటించరు. ప్చ్

"Made in America"  When I heard this sentence in Obama speech (while speaking on industry policy) , ప్రతి శ్రోత కి రోమాలు నిక్కపొడుచుకొని వుంటాయి. What a great feeling !!!.  మన దేశంలో మనమెప్పుడైనా Made in India అనే పదాలకోసం వెతుకుతామా? నిజం చెప్పాలంటే దానిపైన " Made in USA" అని ముద్ర వుందా లేదా అని చూస్తాము. దానర్థం మనము నాణ్యతగల వస్తువులు ఉత్పత్తి చేయలేమనే కదా? what a shame !!!


ఇలా చెప్పుకుంటూ పోతే ఈనాటి ప్రసంగంలో ప్రతి వాక్యము కూడా ఓట్లు వేశే ప్రతి పౌరుడూ విని ఆలోచించుకోవలసిన ప్రసంగం. నాయకులు ఎలాగూ మారరు....కాదు కాదు వాళ్ళని మార్చే దివ్య మంత్రం ఓటరుదే.

27, ఆగస్టు 2012, సోమవారం

ఒక పేజీని చూడకుండానే ఆ పేజీలో ఏమేమి వుండగలవో ఎలా ఊహించవచ్చు?



 పైన చూపించినది ఒక స్కాన్ చేసిన పేజి యొక్క హిస్టోగ్రామ్. దీన్ని జాగ్రత్తగా గమనించినట్లైతే కొంత వరకూ ఆ స్కాన్ పేజీలో ఏమి వుండి వుండగలదో చెప్పవచ్చు.

1) Heading

2)  ఒత్తులు ( అక్షరాల క్రింద ఈ లైనులో ఒత్తులు ఎక్కువగా వుండి వుండవచ్చు )

3) paragraph space ( మొత్తం 5 paragraphs వున్నట్టున్నాయి )

4) poems/kavitalu or broken lines

5) పొల్లులు

6) longest line ( or more glyphs ) in the page

7) shorter lines  ( or less glyphs ) in the page

8)  space between heading and first line

బొమ్మలో చూపినట్లు ఓ మోస్తరుగా వెలుపలికి వచ్చిన నల్లచారలను లెక్కపెడితే అవి మొత్తం 22 వున్నాయి కాబట్టి ఆ పేజీలో మొత్తం 22 లైన్లు వున్నట్టు లెక్క.. హిస్టోగ్రామ్ లో రెండు నల్లటి చారల రేఖల మధ్య ఖాళీ ఏర్పడిందంటే  అక్కడ అక్షరాలు ఏమీ లేకుండా తెల్ల కాగితం మాత్రమే వుందని అర్థం. ఈ ఖాళీ ప్రదేశాలను పటంలో 8, 3 అంకెలతో సూచించాను.

3 వ నంబరు ఖాళీ ప్రదేశంతో పోలిస్తే 8 నంబరుకు ఖాళీ ప్రదేశం ఎక్కువ.  అంతే కాకుండా 1 వ నెంబరు నల్ల చారలు మొదటిలోనే పొట్టిగా వుండి దాని తరువాత ఎక్కువగా ఖాళీ ఏర్పడింది కాబట్టి 1 వ నెంబరుగా సూచించినది బహుశా పేజీ హెడ్డింగ్ లేదా పేజీ నెంబరు అయి వుండవచ్చు. అంటే shortened black stripes వున్న దగ్గర కొద్ది అక్షరాలు మాత్రమే వుంటాయని అర్థం. అదే పటంలో 6 వ నెంబరు గా చూపిన నల్లచారలు పొడవుగా వున్నాయి కాబట్టి scan చేసిన పేజీలో ఆ లైను ఎక్కువగా అక్షరాలను కల్గి వున్నదని అర్థం.

అలాగే ఖాళీ ప్రదేశం కూడా ఒకవేళ ఎక్కువగా వున్నట్లైతే దాన్ని పేరగ్రాఫ్ ఖాళీ గా భావించవచ్చు. ఈ  histogram చూస్తే అలాంటి పేరగ్రాఫ్ లు 5 వున్నట్టు తెలుస్తుంది.

పేజీలో నెంబరు 4 అంకెతో సూచించిన black stripes  పొట్టిగానూ ఇంచుమించు ఒకే పొడవులో వున్నాయి. మన తెలుగులో ఇలా నాలుగు లైన్లు వరుసగా ఒకే పొడవుతో పేజీలోని మిగిలిన black stripes  కంటే చిన్నవిగా కనిపిస్తే బహుశా అవి Broken sentences లేదా కవితలు లేదా పద్యా లైనా కావచ్చు.

హిస్తోగ్రామ్ లో ఒక్కో నల్ల చారల సమూహం ఒక్కో లైనును సూచిస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే హిస్టోగ్రామ్ base వద్ద వెడల్పుగా వుండడం గమనించవచ్చు. తెలుగు వాక్యాలలో పొల్లులు ఒత్తులు ఎక్కువగా వుంటాయి. అవి ఎంత ఎక్కువగా వున్నాయన్న దానిపై హిస్టోగ్రామ్ లోని black stripes base అధారపడి వుంటుంది. అంటే ఒక వాక్యాన్ని తీసుకొని పొల్లులు, ఒత్తులు రాకుండా రెండు సమాంతర రేఖలు గీస్తే ఆ రెండు లైన్లకు పైన క్రింద ఏమేమి పొల్లులు లేదా ఒత్తులు వుంటాయో దానిపైన black stripes base అధారపడి వుంటుంది. వాటిని 5 వ నెంబరు, 2 వ నెంబరు తో సూచించాను. సహజంగా వాక్యము మధ్యభాగంలో అక్షరాలు వుండే అవకాశం ఎక్కువ కాబట్టి black stripes మధ్యభాగాన పొడవుగా వుంటాయి.

ఉదాహరణ



ఇప్పుడు పైన చెప్పుకున్న హిస్టోగ్రామ్ యొక్క అసలు పేజీ ఇది




ఈ క్రింద మరో హిస్టోగ్రామ్ ను దానికి సంబంధించిన పేజీని ఇస్తున్నాను.




15, ఆగస్టు 2012, బుధవారం

స్వరాజ్యం - స్వాతంత్ర్యం - సురాజ్యం



భారత దేశ చరిత్రలో 1947 ఆగష్టు 15 వతేది సంవత్సరానికొక్క రోజైనా సంస్మరణీయ దినం. పల్లె టూళ్ళలో ప్రభుత్వపాఠశాలలు దివ్యంగా వెలుగుతున్న రోజుల్లో పిల్లలైతే ఆరోజు కోసం ముందుగా ఓ పది రోజులనుండే స్కూలు గోడలకు సున్నము వేయించడం దగ్గరనుండి, ప్రతిక్లాసులో రంగు కాగితాలనంటించడం, వక్తృత్వ పోటీలకు సన్నద్ధులవడము, స్వాతంత్ర్య దినోత్సవం రోజు మాట్లాడడానికి ముందుగా రిహార్సల్స్ చేసుకోవడం లాంటి తీరిక లేని పనులతో గడిపేవారు. అమ్మాయిలైతే ప్రతిరోజూ ఆలపించే "మాతెలుగు తల్లికి" పాటతోపాటు హిందీ గీతమైన "ఝండా ఊంఛా రహే హమారా" లతో కుస్తీ పట్టడం కూడా జరుగుతుండేవి. హిందీ, ఇంగ్లీషు అయ్యవార్లైతే క్లాసులో ఒక మంచి చురుకైన విద్యార్థినెన్నుకొని హిందీ, ఇంగ్లీషుల్లో స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగాన్ని కంఠతా పెట్టించి వారిచేత ఆరోజు ప్రసంగించే ఏర్పాట్లు చేసేవారు. ఆ ప్రసంగాన్ని విని తృప్తిగా విద్యార్థిని ఆశీర్వదించేవాళ్ళు కూడా! ఇదంతా ఒక ఎత్తైతే Physical Education  Period మరో ఆనందకరమైన సన్ని వేశం. సావ్ ధాన్, విశ్రమ్ లతో కొద్దిపాటి కవాతును చేయడానికి పిల్లలకు తర్ఫీదును కూడా ఇచ్చేవాళ్ళు. ముఖ్యంగా C.P.L ( class pupil leader ), S.P.L ( school pupil leader ) లు Head Master కు వందన ప్రమాణాలు చేసే సన్నివేశం చాలా బాగుంటుంది. ఉన్న వాటిలో శుభ్రమైన తెల్ల రంగు చొక్కాలు ధరించి పిల్లలంతా వచ్చేవాళ్ళు.  బహుశా రెండులోనో, మూడులోనో అనుకుంటా ఈ స్వాతంత్ర్యదినోత్సవం గురించి నాకు పరిచయమవ్వడం జరిగింది. అదికూడా Elementary school  ప్రక్కనే వున్న High school లో చాక్లెట్లు పంచుతున్నారని  పిల్లలందరిని తీసుకొని వెళ్ళారు. ఆ మరుసటి రోజు మా అయ్యవారు స్వాతంత్ర్యదినోత్సవాన్ని గురించి చెప్తూ గాంధీ, నేతాజీ, నెహ్రూ లగురించి కూడా వివరించారు. చాక్లెట్లు పంచడంవల్ల అప్పటి సన్నివేశం బాగా గుర్తుండి పోయింది. అప్పటినుండి ఎప్పుడెప్పుడు హైస్కూల్ కు వెళదామా అని ఒకటే ఆరాటం.

" నేటితో మనకు స్వాతంత్ర్యమొచ్చి 38 సంవత్సరాలు పూర్తయిందంటూ" మొదలయ్యే ప్రసంగాలు ఆద్యంతం ఆకట్టుకొనే విదంగా సాంతంత్ర్య సాధనలో అసువులు బాసిన నాయకుల జీవిత చరిత్రనుంచి స్ఫూర్తి పొందే విధంగా సాగేవి. మధ్యమధ్యలో ఆవేశ పూరితమైన కవితా ప్రసంగాలూ వుండేవి. స్వచ్ఛమైన పిల్లల మనసులో సమసమాజ బీజాక్షరాలనూ ఇక్కడే నాటేవారు. ( అది స్కూలు వరకే పరిమితం. స్కూలు నుంచి పై చదువులకని విశ్వవిద్యాలయాలకు వెళ్ళగానే పూర్తి ప్రపంచం కనిపిస్తుంది లెండి ).

బహుమతుల ప్రదానోత్సవము కూడా అయ్యాక, క్రమశిక్షణ గల సైనికుల్లా ఎవరిక్లాసుకు వాళ్ళు వెళ్ళేవారు. ఒక్కసారి చాక్లెట్లు చేతిలో పడగానే  ఇంటివైపు పరుగోపరుగు. మరుసటి రోజు స్కూలుకొచ్చాక అందంగా కనిపించే స్కూలుని చూసి లోలోపల మురిసేవాళ్ళం కూడా. అది ఆనాటి మాట.

రాను రానూ పాఠశాలల్లోకి రాజకీయాలు ప్రవేశించాయి. అయ్యవార్లు రాజకీయ ప్రతినిధులుగా మారారు. విద్యార్థికీ, ఉపాధ్యాయునికీ వుండవలసిన సత్సాంగత్యము కూడా చెడుతూ వచ్చింది. ప్రసారమాధ్యమాల హోరు వల్లనైతేనేమీ, మారుతున్న జీవన విధానాలవల్ల నైతేనేమీ  పెద్దల తో పాటు పిల్లల మనసులు కూడా సున్నితత్త్వాన్ని కోల్పోతున్నట్టున్నాయి. స్వాతంత్ర్యదినోత్సవం పాతబడిపోయి "ఆ స్వాతంత్ర్యదినోత్సవమా" అనే స్థాయికి వచ్చాము. ప్రజాస్వామ్యంలో వున్నా మనకు ప్రజాస్వామ్యమంటే ఏమిటో తెలియదని చెప్పుకోవాలేమో !.  స్వాతంత్ర్యం కూడా సరిగా అర్థమవక విచ్చలవిడి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామేమో !

భారత పౌరులు మాత్రమే దేశాన్ని పరిపాలించాలని పోరాడిన నాయకులు రాజ్యార్హతకు భారతపౌరసత్వాన్ని కొంత కఠినతరం చేసి వుంటే బాగుండేది. స్వారాజ్యం, స్వాతంత్ర్యంలతో పాటు సురాజ్యము మనకు కావాలి. నాయకులలో చిత్తశుద్ధి పెరిగే విధంగా ప్రజలతీర్పు వుంటే బాగుంటుంది. కానీ 1947 నాటి పరిస్థితులతో పోలిస్తే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి. ప్రజలకు ముఖ్యమైన విద్య, ఆరోగ్యం ఓ రెండు దశాబ్దాలవరకూ అభివృద్ధి సాధించినట్లే వున్నది కానీ నేడు అవిరెండూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చల్లగా జారుకుంటున్నాయి. ప్రైవేటు వ్యవస్థలకు ఆదాయం ముఖ్యము కాబట్టి రాబోవుకాలాలలో పేదవాడు చదువుకు, ఆరోగ్యానికి దూరం కావచ్చు. అలాగే  విద్యుత్ సరఫరా, రహదారులు నిర్మాణాలలో ప్రభుత్వం మొదటినుంచి దారుణంగా విఫలమయ్యింది. ప్రైవేటు వ్యవస్థల వల్ల ఇవి కొంతవరకూ మెరుగైనాయని చెప్పవచ్చు.

ఇక ఆన్నింటికంటే ముఖ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం. దీనికి మనదేశంలో ఇప్పుడొచ్చే నష్టమంటూ ఏమీలేదు. అంటే సైనిక పరిపాలన రాదు.  కానీ ప్రజలే ప్రజాస్వామ్యాన్ని Manipulate చేసే స్థాయికి ఎదిగారు. ప్రజాస్వామ్యానికి ఈనాడు నిజమైన అడ్డంకి ప్రచార సాధనాలే. ఏ ఒక్క పేపరు కానీ, ఛానలు కానీ స్వప్రయోజనాలు లేనిదే వార్త ప్రచురించండం లేదు. ఏది వార్తో, ఏది అభిప్రాయమో, ఏది ప్రకటనో తెలియకుండా ప్రచారసాధనాలు జాగ్రత్త పడుతూ తమవారికి మేలు చేసే విధంగా చెమటోడ్చి కష్టపడుతున్నాయి. ప్రజలకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనీయకుండా అయోమయానికి గురి చేస్తున్నారు. ప్రభుత్వమున్నది ప్రజలకోసం అని ప్రజలు ఏనాడో నమ్మడం మానేశారు. ప్రభత్వం ఏదో చేసి వాళ్ళ బ్రతుకులను మార్చుతుందన్న అపోహలూ ఇప్పుడు ప్రజలలో లేవు. ఏనాడైతే ప్రజలు ఎన్నికల పట్ల విముఖత చూపుతున్నారో ఆనాడే దేశంలో ప్రజాస్వామ్య ఆనవాళ్ళు  దిగజారుతున్నాయని చెప్పవచ్చు.

ఇంతకుముందు రాజకీయనాయకుల మాటలలో Secular state అనే పదమన్నా వినిపించేది. ఇప్పుడు దాని స్థానంలో so called  "సామాజిక న్యాయం" అనే Posh పదం వచ్చి చేరింది. పుట్టుకతో వచ్చిన కులం, రాజరిక వ్యవస్థను పోలిన అధికారం మొదలైన అనాదిగా వస్తున్న ఆచారాలే ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటివి.

స్వార్థ రహిత పరపీడన పరాయణత్వం సహింపని అమృత లాంఛనం మన ధర్మచక్రం. సమత, స్వాతంత్ర్యం సౌఖ్యం సూచించే త్రివర్ణ పతాకం మనది. త్రవర్ణ రేఖల మధ్య భాషించే ధర్మచక్రాన్ని రక్షిచడం భారత పౌరుల ధర్మం

జై భారత్.





14, ఆగస్టు 2012, మంగళవారం

1915 వ సంవత్సరపు మూడవతరగతి తెలుగు వాచకంలో నుంచి ఓ కథ.

ఓ సంవత్సరం క్రితం Download చేసిన ఓ తెలుగు పుస్తకము ఒకటి ఈ రోజు కంట్లో పడింది. చూస్తే ఈ పుస్తకం 1915 వ సంవత్సరంలో మొదటి మూడు తరగతులకు నిర్దేశించబడిన తెలుగు పుస్తకం. ఆరోజుల్లో అంటే ఒకే ఒక్క తరం ముందు మూడవతరగతి తెలుగు ఇలా వుండేదన్న మాట. 100 సంవత్సరాలలోనే ఇంతగా మార్పు !!! బహుశా 1960/1970 ల వరకూ తెలుగువాచకాలకు  ఇదే ప్రమాణాలు పాటించేవారేమో.

ఆ పుస్తకంలోనుండి ఓ కథ ఇది.






ఈ క్రింద పై పాఠానికి లఘు టీక 



11, ఆగస్టు 2012, శనివారం

ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ విద్యార్థుల ర్యాంగింగ్ లో అతి ముఖ్యమైన ప్రశ్న


అసలే ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు మొదలయ్యే సమయం. పుష్కలంగా మొదటి సంవత్సరంలో విద్యార్థులు చేరే సమయం. 2nd year కు వచ్చిన వారు కొత్త బ్యాచ్ ఎప్పుడెప్పుడు చేరుతుందా ఎప్పుడెప్పుడు Ragging చేద్దామా అని పంచెలు ఎగకట్టి మరీ ఎదురు చూస్తుంటారు కాబట్టి కొత్త విద్యార్థుల ర్యాంగింగ్ లో తప్పక వుండే అంశం "అమ్మాయి వర్ణన" అలాంటి అమ్మాయి వర్ణన వారికోసం ఇక్కడ

ఇప్పుడంటే తుపాకులు, మిస్సైల్స్, ఆటంబాంబులు వచ్చాయి కానీ పూర్వకాలంలో ఒకరాజ్యాన్ని మరో రాజ్యం జయించాలంటే విల్లంబులతో బాణప్రయోగాలే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటి మిస్సైల్స్ అయినా అప్పటి బాణాలైనా శత్రువుకు దూరంగా వుండి ప్రయోగించడము మూలానే
 వీటికి అంతటి ప్రాముఖ్యత.  అంతటి ప్రాముఖ్యత గల విల్లంబులను ఓ సొగసరి కనుబొమలతో పోలిస్తే? అది కూడా ఒకే కాలంలో పదునాల్గు లోకాలను జయించగల విల్లంబులతో పోలిస్తే?

నదీ ప్రవాహంలో తెప్పలు తేలుతూ వెళుతుంటాయి. నదిలో నీరు ప్రధానం. నీటికి ప్రవాహం సహజగుణము. అదే కాంతి ప్రవాహమైతే? ఆ ప్రవాహంలో ఈదుతున్న కుండతెప్పలైతే? ఆ తెప్పలు కూడా రాత్రివరకూ కనిపించలేదంటూ యౌవన ఉదయముతో ఉద్భవించిన ఇంతి స్థనములైతే? అంటే అమ్మాయిలకు వయసు వచ్చేకొంది స్థన సంపద వృద్ధి అవుతుందని కవితాత్మకంగా చెప్పడం. ఆ కాంతి ప్రవాహంలో మన్మధులు ఈదులాడుతూ వుంటారు.

ఆ కమలముఖి యొక్క నడుము ఇంతయే. ఇంతయే అంటే పిడికిలిలో ఇమిడేతంటటి చిన్నది. అలాంటి నడుమును చేటి వేళ్ళతో పట్టుకోగా వ్రేళ్ళ సందులలో నుంచి ఉబికిన భాగములే నడుము ముడతలైతే?

ఇక ఆ ఇందువదన కురలైతే యవ్వనములోనున్న మనసు లనే లేళ్ళ సమూహమును కట్టి పడేసే మన్మధకురులైతే? వేటకాని వలలో లేళ్ళు పడినట్టు ఈ ఇంతి కురులలో యౌవ్వనవంతులైన వారి మనస్సులు చిక్కుకు పోతే?


ఆమె పాదముల అడుగులు సూర్యుని వరప్రభావముచేత పుట్టినటువంటి పంకజములే. తామరపూలు సున్నితత్వానికి సూచిక. ఇక్కడ ఆమె కాలి అడుగులు కూడా అంతే సున్నితము.

ఇన్ని సంపదలు ఆ దేవుడు ఈ సుందరాంగికి చేకూర్చి విభజన రేఖను స్పష్టపరిచాడు మరి. అంటే biological గా ఇన్ని మార్పులు చేకూరిన తరువాతే యవ్వనవతి... దానికి పూర్వ మంతా బాల్యమే. బ్రహ్మ గీసిన ఈ  విభజనరేఖ స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ చంద్రముఖి జవ్వనియే.



వర్ణనలో ఇది ఒక భాగము మాత్రమే !! ఇంతటి వర్ణనా చాతుర్యమెవ్వరికుంటుంది ఒక్క శ్రీనాధునికి తప్ప. అదీ శ్రీనాధుని సీసమైతే.....
భావము తెలిసిన తరువాత, పైన వ్రాసిన వాక్యాలకంటే ఈ క్రింది పద్యము ఎంత మనోహరమో చూడండి.



జగము లొక్కుమ్మడి సాధింపనెత్తిన రతి మన్మథుల విండ్లు రమణి బొమలు
కాంతి నిర్ఝరమీదు కామయౌవనముల కుంభప్లవము లింతి కుచయుగంబు
నడుమింత యని కేలదొడికి పట్టిన ధాత యంగుళిరేఖ లబ్జాస్యవళులు
యువమనోమృగరాజి దవిలింప దీర్చిన మదనవాగుర లిందువదన కురులు

బాల్యతారుణ్య సీమా విభాగమునకు
నజుడు వ్రాసినరేఖ తన్వంగియారు
భానువరమున బడసిన పంకజముల
యపర జన్మంబు పూఁబోడి యడుగు లధిప

10, ఆగస్టు 2012, శుక్రవారం

కళా సౌందర్యము - కావ్య సౌందర్యము - 2

మనిషి తన పరిశరాల ప్రభావానికి లోనై దాని ప్రోద్బలంవలన సుఖదుఃఖాల సమ్మేళనాన్ని అనుభవిస్తుంటాడు. ప్రకృతి నుండి మనిషి ఉదయించడం వలననేమో మానవుని హృదయం ప్రకృతి ధర్మాలను ప్రతిబింబింపచేసే దర్పణము. ప్రకృతి, పరిశరాల ప్రోద్బలంతో ఆనందానుభూతిచే ప్రభావితుడై ఏకాంతంగా మనసు విప్పి ప్రకృతితో  చర్చిస్తుంటాడు. కొన్ని సందర్భాలలో సత్యస్వరూపాన్ని శ్రవణానందంగా అంతరంగంలో గానం చేస్తూ గడిపేస్తుండవచ్చు కూడా. ఆ సత్యస్వరూపం మనసుదాటి స్వరరూపం సంతరించుకుంటే కవిత్వమౌతుంది.

కవియొక్క భావమేఘాలు ప్రపంచమంతటా ఆవరించి అలుపెరుగక సంచరిస్తుంటాయి. మనఃప్రేరేపితముతో స్వేచ్ఛగా ఏభావప్రపంచంలో సంచరించడానికి అవకాశమున్నదో అచటికల్లా ప్రయాణమౌతాడు. పయనించి ఏకాంతంలో అనుభవించినదంతా కవితారూపంలో రంగరించి కావ్యాన్ని రచిస్తాడు. ఆలోచనలు, అనుభూతులూ సామాన్య మానవులకూ వుంటాయి. కానీ ఈ జగతికి ప్రాణాభూతమైనది ఆత్మ. చేతనాచేతనలకు మూలమూ ఆత్మనే. కవి అంతరంగంలో ఈ సాదృశ్యమైన తత్వాన్ని చూస్తాడేమో. అందుకే చాలా కావ్యాలలో తత్త్వానుభూతి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది కూడా.

మనస్సు నివురుగప్పిన నిప్పులాంటిది. ప్రకృతిలో లీనమైన మనిషికి అచేతనావస్థలో మనస్సు తాత్కాలిక తేజస్సుతో విరాజిల్లి ఆ అమృతమయమైన క్షణాలలో మహత్తర కవిత్వము వెలువడుతుంది. ఆ కవిత స్పృశించిన ప్రతి విషయమూ స్వర్ణమయము. ఆ సమయంలోనే లయ/ఛందోబద్ధమైన కవిత్వం అలవోకగా పలుకుతుంది.

కొందరు శబ్దార్థాలతో కూడినది కవిత్వమన్నారు. మరికొందరు ఇష్టార్థములతో, అలంకారములతో  కూడుకున్నదాన్ని కవిత్వమన్నారు. మరికొంత ముందుకెళ్ళి మాధుర్యము, ప్రసాద, శ్లేష,సమాధి,ఔదార్యము,సుకుమారము, కాంతి సమములతో కూడి దోషములు లేనిదాన్ని కవిత్వమన్నారు.  అంతటితో ఆగక "వాక్యం రసాత్మకం కావ్యం" అని అన్నారు.

అలంకారికులు కావ్యాన్ని స్త్రీ తో పోల్చారు. స్త్రీ సౌందర్య రూపిణి. ప్రాణం కలిగినది. అలాగే కావ్యానికి ప్రాణం కావాలన్నారు. ఆ ప్రాణమేదన్నదానిపై భిన్నాభిప్రాయాల వలన అనేక సిద్ధాంతాలు వెలువడ్డాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే వికృతంగా వున్న దానిని కూడా సుందరంగా చూపించే ప్రక్రియే కవిత్వమేమో. వైకల్యంలో కూడా తత్త్వం అంతర్లీనం. తత్త్వం సుందర రూపం. అందుకే అలాంటి కవిత్వం చదవగానే మానసికోద్బోధన చేసి పరిచ్ఛిన్నత్వమును తొలిగిస్తుంది. మన భావనాపరిధులను విశాలం చేసే మనోవికాశం కవిత్వం. సత్యసౌందర్యముల ఆవేశమే కవిత్వం. అనుభూతి, అవేశము, భావము, ఊహ సమ్మేళనమే కవిత్వము. నవరసాలు కవితాకన్యకు ఆభరణాలు.

9, ఆగస్టు 2012, గురువారం

కళా సౌందర్యము - కావ్య సౌందర్యము



శతాబ్దాల తెలుగు చరిత్రలో మహా మహా కావ్యాలు వెలువడ్డాయి.సర్వలక్షణ సమన్వితమై వున్న కావ్యాలూ చాలానే వుండవచ్చు. వ్యాకరణ, అలంకార,సాహిత్య భూషితమై కావ్యం లాక్షణికుల మన్ననలను పొందవచ్చు. వీటన్నింటినీ మించి ఆ కావ్యంలో  సౌందర్యము లోపించినట్లైతే కాలగర్భంలో కలిసిపోక తప్పదు. చాలాసార్లు ఓ తెలుగు కావ్యాన్ని చెప్పగానే అది శృంగార కావ్యమా లేదా భక్తి కావ్యమా లేదా మరొకటా అని విభజన చేసేస్తుంటాము కానీ, నిజానికి నవరస కళా సౌందర్యము లేని ఏ కావ్యమైనా క్షరము కాక తప్పదు. మానవుడు తన పరిశరాల ప్రభావంతో తన ఆలోచనా పరిధులకు లోబడి మాత్రమే కావ్యాన్ని కానీ, చిత్రాన్ని కానీ, గానాన్ని కానీ ఆస్వాదించగలడు. ఈ సౌందర్యారాధన, దాని ఆస్వాదన, ఆయారంగాలలో తను చేసే కృషిపైన కూడా ఆధారపడే వుంటుంది. ప్రతిమనిషీ సౌందర్యారాధకుడే. ప్రతి జీవీ ఆ కళాసౌందర్యాన్ని ఏదో ఒకనాడు అలౌకికంగా అనుభవించినవాడే. ప్రతి వ్యక్తీ కోపము, ఆనందమూ, దుఃఖము, దయ,  మున్నగు విశేషణాలకు లోబడి చరించువాడే. ఇవన్నీ నిత్యజీవితంలో మనకు అనుభవపూర్వకాలే. ఆ సందర్భాలలో అనుభవపూర్వకంగా ప్రతివాని నోటినుండి వాక్యాలు మాటల గుచ్ఛాలుగా వెలువడుతూనే వుంటాయి. కానీ ఈ వాక్యాలు కవిత్వము కాదుకదా? మరి కవిత్వమంటే ? ఛందోబద్ధముగా వ్రాస్తే కవిత్వమా ? లేదా వాక్యాలను  కుళ్ళబొడిచి విడివిడిగా వ్రాస్తే కవిత్వమా? దేన్ని కవిత్వమంటారు?  మనఃచలనము మూలంగా కలిగిన తాత్కాలిక భావాన్ని క్రమబద్ధీకరించి సౌందర్యముగా చెప్పినదే కవిత్వమేమో !!

కావ్యానికి సౌందర్యము కావాలి. సౌందర్యాన్ని వ్యక్తపరచడానికి భాషకావాలి. అదికూడా క్రమబద్ధంగా వుంటేనే రాణిస్తుంది. మన:చలనము వలన కలిగే భావాలు అస్పష్టంగా వుంటాయి. అస్పష్టంగా  వున్నా సరే ఆ వ్యక్తి తన మనసులో కల్గిన భావాన్ని తప్పక అనుభవిస్తాడు. కవికి, పాఠకునికి తేడా ఇక్కడే!! కవి తను తన మనసులో అస్పష్టంగా, చెల్లా చెదురుగా వుద్భవించిన భావాన్నిసౌందర్యంగా  అక్షర బద్ధం చేసి ఇవ్వగలడు. అదే సౌందర్యాన్ని పాఠకుడు చూడగలడా/అనుభవించగలడా లేదా అన్నది పాఠకుని రస పిపాసపై అధారపడి వుంటుంది. అంటే రచయిత భావనావీధుల వెంట తిరుగాడుతూ తను చూసే భావచిత్రాన్ని పాఠకుని హృదయ ఫలకముపై ఎంతగా ఆవిష్కరించబడితే రచయిత అంత సఫలమైనాడని చెప్పవచ్చు. ఇది ఒక్క కావ్యానికే కాదు, చిత్రం, గానం లాంటి కళలకూ వర్తింస్తుంది.

విద్యుద్దీప కాంతులు ఇంటి లోగిళ్ళల్లో ధగధగలుగా మెరువక ముందువరకూ నిరుపేద చూసే పున్నమీ , శ్రీమంతుడు చూసే పున్నమీ ఒకే రకంగా వుండేవేమో. ఆ పున్నమిని ఇద్దరూ ఒకే రకంగా ఆస్వాదించేవారేమో. కానీ ఇప్పుడు వీరిరువురూ వేరు వేరు. వెన్నెల రాత్రులే తెలియని వాడు ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోవడమూ అత్యంత సహజం కూడా !! అందుకే  నేటి తరానికి తగ్గట్టు కవిత్వమూ మారుతూ వస్తుంది.

3, ఆగస్టు 2012, శుక్రవారం

Smart Phones - Native Vs Mobile applications

ఆధునిక యుగంలో మొబైల్ సాంకేతిక పరిజ్ఞానం మొదటి Apple ఐఫోన్ విడుదలతో ప్రారంభమైంది. ఓ రకంగా దీని పుట్టుక 2007 వేసవి. దీనితో "going mobile" అనే కొత్త పదం కూడా బయలుదేరింది. నిజానికి రాబోయే మరో దశాబ్దం పాటు ఈ విప్లవం ఇలాగే కొనసాగవచ్చు. "Native Vs Mobile site " అని ఒక్కసారి గూగ్లింగ్, బింగిగ్  చేస్తే కుప్పలు కుప్పలు లింకులు కనిపిస్తాయి. వాటి నిండా ఎవరికి తోచిన భావాలు వాళ్ళు వ్రాసుకున్నారు. మరి నేనో !!! అందుకే నాకు తోచింది ఇక్కడ.

ఇంతకు Native application కి mobile site కు తేడా ఏంటి? ఇప్పుడు www.haaram.com ను ఏ మొబైల్ లో బ్రౌజ్ చేసినా వున్నంతలో  బాగానే కనిపిస్తుంది కదా? మరి దీన్ని Native application లో Develop చెయ్యడం వల్ల ఉపయోగాలేంటో వ్రాయాలంటే

1) A native application is much less exposed to network latency so, at times it may comeup quickly
2) Application can be viewed even in disconnected mode
3) It offers better user experience
4) In native applications we can  integrate well with the device and use hardware and built-in software services
5) Native applications are device specific ( for each device, we need a seperate application )

మరి మొబైల్ సైట్స్ గురించి చెప్పాలంటే
౧) A mobile site works by interacting with the web server. subsequently, it’s subject to network latency and may be sensitive to high-traffic slowdowns.
౨)  Off line mode may not be posible
3) we need to type URL in the browser, so its user experience and performance mainly depends on the supported browser
4) It is based on pure HTML
5) It is subjected to browser caching
6) It is cross plotform, meaning as long as browser supports HTML we just need one version of our application

ఇంకా.... చాలానే వుండొచ్చు.

ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటే, చాలా సందర్భాలలో వీటి రెండింటికీ తేడా తెలియకుండానే " we want to move to smart phone" అనే వాక్యం తరచూ వినిపిస్తుంటుంది. సాధారణంగా దీనికి బీజం ఎక్కడ పడుతుందంటే ఎక్కడో ఏమీటింగులోనో ఏప్రయాణంలోనో కంపెనీలోని ఒక ముఖ్య వ్యక్తికి ఓ మంచి iPAD application కనిపిస్తుంది, అప్పటినుంచి పురుగు తొలిచేస్తుంటుంది. ఇంకేముంది నాలుగైదు మీటింగులైన తరువాత "going mobile" అయిపోతుంది. In the minds of most developers and managers, going mobile requires no more (and no less) than planning an iPhone application. infact it was a good approach for the past few years, but I doubt this strategy in future.

before going into the details of  Native Vs mobile sites,  here are the details of most popular mobile platforms






ఒకే ఒక్క common mobile platform API అయితే ఊహించలేము కానీ Cross-platform mobile development is the Holy Grail  people are seeking now a days and with Monotouch and monodroid, C# is evolving as a cross platform development language. This can be used  for Windows Phone, iPhone,and Android through Xamarin’s MonoTouch and MonoDroid platforms. కానీ ఇది ఎంతవరకు ఫలితాన్నిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. 


నన్నడిగితే iPhone development Objective C లో, Android Development java లోనూ చెయ్యమనే చెప్తాను. కారణం కామన్సెన్స్ అని తప్పుకుంటాను. నిజానికి ఈ కామన్సెన్స్ గురించి చెప్పడమనేది చాలా వాటికన్నా కష్టమైన పని.

అలాగే Phonegap and Titanium frameworks are also best  bets for mixed native and web features.

2, ఆగస్టు 2012, గురువారం

Baby - you are a devil's spawn


 First things first, Ever since I started my development in Eclipse, it keeps on testing my patience, p Pinches on my nerves. At times Close and restart eclipse . Delete previously loaded projects, to make sure I get errors only from the existing application. Not only that, it remember even deleted project errors. Intellisense... do you even call this as intellisense? I can go and pee before you respond with intellisense list.

Ohh..yeah, debugging is pain in the ass. I can't even list out f.... debugging/error window alignments.
 What not…. heck, I hate you Eclipse. You are not even close to what Visual studio offers to the windows community, not even worthy of standing in its shadow.



Second : Android Emulator sucks .. Why? There is no way to reload an Android application in the emulator without closing the emulator. Google hear us, you are releasing version after version, can you name at least one single version which is bug free and works with Eclipse? I better stick to Android version 2.2


Android in Eclipse environment totally sucks…why? Only God can list out all the problems with Android version 4.0 and later.

Over all my days are going wild with this gay baby. May be I am the only sufferer with this piece of shit. At last I vented out my frustration and now I can peacefully go home and sleep.

By the way now I understand why delivering a baby in java using Eclipse takes so long. yes, you guessed it right. They use few gay tools to deliver a baby without a female.

29, జులై 2012, ఆదివారం

సీజర్ సాంకేతిక లిపి - RotN సీజర్

సీజర్ సాంకేతిక లిపిని ప్రతిక్షేపణ సాంకేతిక లిపి అని కూడా పిలుస్తారు. ఇది రహస్య సమాచార బట్వాడా కోసం రకరకాల పద్ధతుల్లో ఓ మూడు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ వాడుతూ వుండేవారు. ఇప్పటికీ వాడుతున్నారో లేదో నావద్ద సరైన సమాచారమైతే లేదు గానీ ఇది ప్రధానంగా అక్షరముల క్రమాన్ని మార్చడం ద్వారా సమాచారాన్ని ప్రత్యర్థులకు అర్థంకాకుండా చేస్తుంది.  ఉదాహరణగా “Rapid bits”  అనే పదాన్ని తీసుకొని ప్రతి అక్షరాన్ని మూడు అక్షరాల తరువాత వచ్చే అక్షరంతో ప్రతిక్షేపించినట్లైతే “udslg elwv”  గా మారుతుంది.  


 
ఈ పద్ధతినే మూడు అక్షరాలకు బదులు n th అక్షరానికి మార్చినట్లైతే రకరకాల combinations వస్తాయి. ఈ Encrypted message అక్షర స్థానాన్ని మార్చడం ద్వారా ఏర్పడుతుంది కాబట్టి ఈ క్రింది రెండు ఫార్ములాల ద్వారా encrypt/ decrypt చెయ్యవచ్చు. రహస్య సమాచార బదిలీ లో ఇది చాలా చాలా మొదటి మెట్టు అని గుర్తుంచుకోవాలి.

  C=E(P)=(P+n-1)%26  + 1
  P=D(C)=(C-n+25)%26 +1 

ఇక్కడ C= ciphered text , P= plain text, n= rotation number

ఆంగ్లంలో వున్నది 26 అక్షరాలే కాబట్టి అక్షర స్థాన చలనము 25 రకాలుగా మాత్రమే జరుగుతుంది. కానీ కంప్యూటర్ ద్వారా సమాచారాన్ని పంపేటప్పుడు అంకెలు, వేరే గుర్తులు కూడా వుంటాయి కాబట్టి దీని విస్తృతి మరికొంత పెరుగుతుంది. 

 

Rot5, Rot13, Rot18, Rot47  అనేవి చాలా ఎక్కువగా వాడేవారు. ఇంకా వాడుతున్నారేమో కూడా!. Rot అనేది Rotation కి సంక్షిప్త నామము. Rot5 అంటే ప్రతి అక్షరాన్ని 5 స్థానాల తరువాత వచ్చే అక్షరంతో ప్రతిక్షేపించారు. ఈ క్రింద కొన్ని C# లో వ్రాసిన scripts వున్నాయి.

)      RotN Encryptor
private string RotNEncrypt(string s, int n, bool includeNumbers)
        {
            string result = "";
            char[] carray = s.ToCharArray();
            for (int i = 0; i < carray.Length; i++)
            {
                int ascii = carray[i];
                int rot = ascii;
                if (ascii > 64 && ascii < 91)
                {
                    rot = rot + n;                  
                    if (rot > 90)
                    {
                        rot += -90 + 64;
                    }
                    if (rot < 65)
                    {
                        rot += -64 + 90;
                    }
                }
                // Lowercase letters are 97 to 122
                else if (ascii > 96 && ascii < 123)
                {
                    rot = rot + n;
                    if (rot > 122) rot += -122 + 96;
                    if (rot < 97) rot += -96 + 122;
                }
                // Numeric digits are 48 to 57
                if (includeNumbers == true && ascii > 47 && ascii < 58)
                {
                    rot = rot + n;
                    if (rot > 47) rot += -57 + 47;
                    if (rot < 58) rot += -47 + 57;
                }

                char character = (Char)rot;
                result = result + character.ToString();
            }
            return result;
        }


2)      Rot13 Encrypter and Decrypter

private string Rot13(string s)
        {
            if (String.IsNullOrEmpty(s)) return s;
            char[] character = s.ToCharArray();
            for (int i = 0; i < s.Length; i++)
            {
                char c = s[i];
                if (c >= 97 && c <= 122)
                {
                    int rot = c + 13;
                    if (rot > 122) rot -= 26;
                    character[i] = (char)rot;
                }
                else if (c >= 65 && c <= 90)
                {
                    int rot = c + 13;
                    if (rot > 90) rot -= 26;
                    character[i] = (char)rot;
                }
                else
                {
                    character[i] = c;
                }
            }
            return new string(character);
        }


3)      Rot47 Encryptor and Decryptor

private string Rot47(string s)
        {
            string cipher = "";
            foreach (char c in s.ToCharArray())
            {
                if (c != ' ')
                {
                    int rot = c;
                    rot += 47;
                    if (rot > 126) rot -= 94;
                    if (rot < 33) rot += 94;
                    cipher = cipher + (char)rot.ToString();
                }
                else
                {
                    cipher = cipher + " ";
                }
             
            }
            return cipher;
        }

26, జులై 2012, గురువారం

క్రెడిట్ కార్డులు - గీకటాలు ...... సాఫ్ట్వేర్లు - చట్టాలు



చాలా సందర్భాలలో చట్టంలోని నిబంధనలను అర్థం చేసుకోవడం, దాన్ని గ్రహించడం విసుగుతో కూడుకున్నదే కాక కొంచెం కష్టమైన పని కూడా. ఎక్కువ శాతం సాఫ్ట్ వేర్ డెవలపర్లు చట్టపరమైన విషయాలను అర్థం చేసుకొనే నేపథ్యాన్ని కలిగి వుండరు. ఇలాగే చట్టాన్ని, నిబంధనలను తయారు చేసే వారికి సాఫ్ట్ వేర్ గురించి ఓనమాలు తెలియకపోవడమూ సహజమే. ఈ రెండు గ్రూపలు  బ్రతుకు దెరువు కోసం ఎంచుకున్న విభిన్న మార్గాలు ఈ రెండూ. వేరే వేరే దారుల్లో, వేరు వేరు మైండ్ సెట్ తో  ప్రయాణించే వాళ్ళు కాబట్టి ఒకరి మాటలు మరొకరు అర్థం చేసుకొనే శాతం కూడా తక్కువే. నిబంధనల్లో వుపయోగించిన భాషను, వాక్యాలను సాఫ్ట్ వేర్ Requirement document లోకి one to one map చేయడమూ సాధ్యము కాని పని కూడా. దీనికి తోడు పెరిగిపోతున్న Regulations,  ఈ నిబంధనలు కూడా  ప్రతి రాష్ట్రానికి మారిపోతుండడమే కాకుండా, దేశానికి వేరే నిబంధనలు వుండడంతో మొత్తంగా సాఫ్ట్ వేర్ డెవలపర్ల పని గొడ్డు చాకిరితో పాటు, పరమ బోరుగా తయారయ్యింది.

అమెరికాలోని  కొన్ని నిబంధనలు

HIPAA         : Confidentiality, integrity, and availability of health care information.
PCI            : Confidentiality of credit card information stored and used by merchants.
GLBA            : Confidentiality and integrity of personal financial information stored by financial institutions.
Sarbanes-Oxley     : Privacy and integrity of financial data in publicly traded corporations.
SB 1386        : Confidentiality of customers personal information stored by any organization that does business in the state of California
BASEL II        :Confidentiality and integrity of personal financial information stored by financial institutions. Availability of financial systems. Integrity of financial information as it is transmitted. Authentication and integrity of financial transactions.



ఒకవేళ మీరు చేస్తున్న అప్లికేషన్ పై తరగతులలో ఎందులో వున్నా, ఈ నిబంధనల వుచ్చులో గిల గిల కొట్టుకొంటున్నా సందేహ పడనవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు కాకున్నా రాబోయే రోజుల్లో నైనా తప్పక ఏదో ఒక సందర్భంలో వీటి గురించి తెలుసుకోవడం అవసరం కూడా. సాఫ్ట్వేర్ వినియోగదారులకు కూడా ఇది ఓ క్లిష్టమైన సమశ్యే. ఒకవేళ వీటిని విస్మరిస్తే వ్యాపారాన్నే మూసేసుకోవాలి మరి. ఇక్కడ ఒక ఆనంద దాయకమైన విషయం ఏంటంటే ఇందులో చాలా వరకు ఈ నిబంధనలు ఆపరేషన్స్ వాళ్ళకు వర్తించేవి. అలాగే వ్యాపారసంస్థలకూ !. డెవలపర్ గా కొన్ని నిబంధనలను మాత్రం కోడ్ రూపంలో ఎక్కిస్తే సరిపోతుంది. అదే మీరే వ్యాపార సంస్థ అధిపతి అయితే మాత్రం  నిబంధనలన్నీ మీకు వర్తిస్తాయి.

ఈ టపాలో ఒక్క PCI-DSS ( Payment Card Industry Data Security Standard) గురించి మరికొంత సమాచారమిక్కడ. ఇది ముఖ్యంగా Credit card transactions నిబంధనలకు వర్తిస్తుంది. దీన్ని ఈ ప్లాస్టిక్  కంపెనీ ( Credit card network organizations) వాళ్ళు, bank వాళ్ళతో కలిసి వ్యాపారసంస్థల ద్వారా మనలని దోచుకోవడానికి డబ్బులు లేకుండా నే మీకవసరమైన వస్తువులు కొనుక్కోమని తాయిలాలు చూపిస్తూ ప్రారంభమైన వినూత్న పథకం. దీని నిబంధనలను CC రంగంలో అతిపెద్దవైన నాలుగు నెట్వర్క్ వాళ్ళు ( VISA, AMEX, MASTER,DISCOVER) కలిసి తయారు చేశారు. ఈ నిబంధనలన్నీ తప్పకుండా ప్రతి వ్యాపారస్థునితో పాటు, Credit card processing service  providers కూడా తప్పక పాటించవలసిన నియమాలను తెలుపుతుంది. Credit card ఏ రూపంగా నైనా వాడవచ్చు కాక , అంటే వ్యక్తిగతంగా వ్యాపారస్థుని దగ్గర మిషన్ లో గీకడం దగ్గరనుంచి, ఫోను, ఇంటర్ నెట్, మొబైల్ ద్వారా, ఏ రూపంగా వాడినా సరే ఈ నిబంధనలు తప్పక పాటించాలి.

ప్రతి వ్యాపారస్థుడూ కూడా ఈ సర్టిఫికేట్ తప్పకుండా పొంది వుండాలి. వ్యాపారాన్ని నాలుగు తరగతులుగా విభజించి ( 1, 2, 3, or 4.) మీకు ఏఏ నిబంధనలు వర్తిస్తాయో చెప్తారు. ఎన్ని ఎక్కువ transactions జరుగుతుంటే PCI ప్రమాణాలు ముప్పు అంత ఎక్కువగా మీపై వున్నదన్నమాటే !

 గోప్యత మరియు ప్రామాణీకరణ: ఈ PCI  ప్రధాన ఉద్దేశ్యం వినియోగదారుల క్రెడిట్ కార్డు సమాచారం రక్షించడం. కానీ దురదృష్టవశాత్తు, డెవలపర్లు అప్లికేషన్ ను డెవెలప్ చెయ్యగలరే కానీ,  క్రెడిట్ కార్డ్ హ్యాండ్లింగ్ ప్రక్రియ మీద పూర్తి నియంత్రణ వుండదు.  క్రెడిట్ కార్డ్  సమాచారం తరచుగా వినియోగదారులకు తెలియని మధ్యవర్తులు గా వ్యవహరించే ( Merchants, Pay ment gateway, Payment processors, Credicard network, Bank ) ఎజెంట్ల  ద్వారా వెళుతుంది. ఇక్కడ ఎక్కడ చిల్లు పడ్డా, బ్యాంక్ బాలెన్స్ కి బొక్కే!!. దీన్ని నియంత్రించడానికి ఏర్పరచిన రూల్స్ అవి.

 Logging and Auditing: ఇది ఈ నిబంధనల్లో రెండవ ముఖ్యమైనది. ప్రతి లావాదేవీతో పాటు, వినియోగదారునికి సంబంధించిన ప్రతి అంశాన్నీ తప్పక log చెయ్యాలి.

హ్మ్ తెలుగులో వ్రాయడం అంత వీజీ కాదు కాబట్టి...

Logging and Auditing main intention is, in case fraud, merchant must proactively identify fraud and protect consumer's interest. Logging and Auditing is very important if you are developing any PCI compilence software.

While developing PCI compilence software following are few guide lines from MSDN

 1)     Protect cardholder data : Do not rely on custom or untrusted encryption routines. Use platform provided cryptographic APIs, because they have been thoroughly inspected and tested rigorously. Use an asymmetric algorithm such as RSA when it is not possible to safely share a secret between the party encrypting and the party decrypting the data. A symmetric algorithm such as AES can be used when it is possible to share a secret before the encrypted communication begins. It is important to choose an appropriately sized key so that the encryption is not easily broken. When using RSA, choose a 2048 bit key. When using AES, choose a 128 bit key. These key sizes give some room for growth but will eventually need to be replaced with larger keys as computing power increases.

2) Integrity: Hashing should be used to store confidential information, such as passwords, that may need to be validated but won't need to be retrieved in whole form. Integrity checks should be used to ensure that confidential data has not been tampered with. Use SHA1 when hashing and use HMAC-SHA1 when conducting integrity checks. It is important, however, to keep in mind that the hashing algorithm may need to change over time as computing power increases and previously strong algorithms fall out of favor.

3) Availability: Data availability includes the use of storage solutions that are reliable such as RAID and offsite backups. It is also important to make sure that these backups can be secured. For developers, this means that applications should be designed so that key information is archiveable and recoverable even if there is a terminal failure in the system. Where encryption is used, this means having a mechanism to export keys so that data can be recovered if the system is destroyed. Another important consideration for developers is secure failover of the system. This means that error handling code must not weaken the security of the system and, where appropriate, it should support clustering and safe failover. Error-handling in particular is a common point of failure. When designing and implementing your error handling mechanisms, keep the following guidelines in mind:

    Create a consistent error-handling architecture and use it throughout your application.
    Do not reveal sensitive information to the user, or the caller, when your application fails.
    Catch exceptions or error return values on every API call that can provide such information.

4) Auditing and Logging: Carefully avoid logging any sensitive data — there is no guarantee that access to the logs and access to the sensitive data will require the same privileges. If you are involved in system deployment, ensure that the event log is only exposed to administrators. Even if no private information is logged, the information contained in the log can be used to further attacks on the system. If you are using ASP.NET 2.0 to write your application, you can use the new health-monitoring feature to instrument your application and capture relevant information. For other .NET applications on the Windows platform, you can use the System.Diagnostics.EventLog class. For unmanaged applications you can use the ReportEvent API within the Windows Platform SDK. A common attack that malicious users may employ in order to tamper with logs is to overwhelm the logging mechanism with millions of log events that either cause important information to be lost or obscure the important data. Guard against this by throttling your logging. You may also consider logging to a separate protected system to guard against attacks by unauthorized users. Event logs should contain enough information to make it possible to reconstruct system activity up to any point of failure so that the error can be quickly resolved and fixed.

5) Authentication: When setting up authentication systems, be sure to enforce strong passwords. At a minimum, require passwords to be seven characters long and contain at least one non-alphanumeric character. Do not enable or provision for "guest" accounts or other means of access that do not correlate a specific identity with the accounts or resources being utilized. When storing passwords, be sure to use sufficiently strong encryption to protect the credentials from attackers that might gain access to them. Enforce password policies that will expire credentials on a semi-regular basis. Make sure that inactivity causes automatic log-off when a user is idle for a specific period of time. If you are writing an ASP.NET application you can set the sliding Expiration configuration setting to true in order to expire user sessions in a set amount of time.



ఏమిటో ఈ కార్డులు ఇవ్వటమేమిటో, దాన్ని రక్షించడానికి ఇంత డిఫెన్సివ్ system ఏమిటో !!.