రాబోయే సరాగ శివరాత్రి సంచికలో జానపదుల పదనాట్య తాండవాల ద్వారా ఆచార వ్యవహారాలను, తెలుగు భాషాతీరుతెన్నులను తెలియచెప్పే ప్రయత్నం.
ఉదాహరణగా....
యాన్దోళ్ళ పెళ్ళిళ్ళు ఎంత మంచి పెళ్ళిళ్ళు
బొట్టుతో పనిలేదు బోనాలక్కర లేదు
కొత్త చీరలొద్దు అత్త పోర్లు వద్దు
చుట్టాలు రావొద్దు చూడనైనా వద్దు
కలుసుకుంటే చాలు మురుసుకుంటుండొచ్చు
అల్లుళ్ళ పోరొద్దు ఆస్తి పాస్తులొద్దు
మేళ తాళాలొద్దు మంత్రతంత్రాలొద్దు
మంగమూరు దేముడికి మొక్కుకుంటే చాలు
గోత్రాలు మాకేల గీత్రాలు మాకేల
నేత్రాలు ఒకటైతే సూత్రాలెందుకయ్యా
మంగళ సూత్రాలెందుకయ్యా
తినడానికి తిండిలేదు కట్టడానికి బట్టలేదు
వండుకోను కుండలేదు పండుకోను పంచలేదు
ఎందుకయ్య పెండ్లి ఎందుకయ్య మాకు.
31, జనవరి 2012, మంగళవారం
26, జనవరి 2012, గురువారం
గణతంత్ర దినోత్సవం
దరిద్ర జీవుల నిద్రలేపుచు
వెలుగు రేఖల ముద్దులాడుచు
వచ్చెనదిగో నిండు స్వాతంత్యం
మూడుపూటల ముద్దనిడి
పసుపు ధూళినింట రాల్చగ
సమసమాజ స్థాపననుచు
విరియబూచిన పుష్పవాటికలు
వచ్చె నదిగో నవవసంత గణతంత్రం
చల్లగాలుల చెరిగిపోయిన
పేదవాని ఇంటి సాక్షిగా
ఎఱ్ఱకోట బుఱుజులోపల
ప్రణయమాఱగ కూసె నొక గణతంత్రకోకిల
పాడవలె సమసమాజ గీతకని
విరుల తేనెలు చిమ్మగా
వినుటకెంతో కమ్మగా
వెలుగు రేఖల ముద్దులాడుచు
వచ్చెనదిగో నిండు స్వాతంత్యం
మూడుపూటల ముద్దనిడి
పసుపు ధూళినింట రాల్చగ
సమసమాజ స్థాపననుచు
విరియబూచిన పుష్పవాటికలు
వచ్చె నదిగో నవవసంత గణతంత్రం
చల్లగాలుల చెరిగిపోయిన
పేదవాని ఇంటి సాక్షిగా
ఎఱ్ఱకోట బుఱుజులోపల
ప్రణయమాఱగ కూసె నొక గణతంత్రకోకిల
పాడవలె సమసమాజ గీతకని
విరుల తేనెలు చిమ్మగా
వినుటకెంతో కమ్మగా
18, జనవరి 2012, బుధవారం
సరాగ కోసం రచయితలనుండి రచనలకాహ్వానం.
మహా శివరాత్రి పర్వదినానికి సరాగ తీసుకురాబోవు మరో ప్రతి కోసం రచయితలనుంచి ఉత్తమమైన రచనలను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కల రచయితలు దయచేసి patrika@haaram.com కు మీ రచనలను మైల్ చేయవలసినదిగా మనవి.ఈ సారి రచనలు పూర్తిగా రచయిత స్వాతంత్ర్యమే.
అలాగే ఇంతకుముందు ప్రతికి రచనలను పంపి బహుమతులను గెలుచుకున్నవారు రాబోవు రెండురోజుల్లో మీ Amount మీకు చేరకపోతే admin@haaram.com కు ఓ మైల్ చేయ మనవి.
అలాగే ఇంతకుముందు ప్రతికి రచనలను పంపి బహుమతులను గెలుచుకున్నవారు రాబోవు రెండురోజుల్లో మీ Amount మీకు చేరకపోతే admin@haaram.com కు ఓ మైల్ చేయ మనవి.
13, జనవరి 2012, శుక్రవారం
రేపు మరో టపా :-)
భోగి వస్తుంది కదా రేపు భోగి మీద ఓ టపా రాసేస్తా.ఈ రోజు ఏమీ లేదని ఈ టపా ;-) JK
భోగిపండ్లు ఎలా పొయ్యాలి అన్న దాని మీద రేపు ఒక శాస్త్రీయ సాంకేతిక పద్ధతి తెలుసుకుందాం.
భోగిపండ్లు ఎలా పొయ్యాలి అన్న దాని మీద రేపు ఒక శాస్త్రీయ సాంకేతిక పద్ధతి తెలుసుకుందాం.
12, జనవరి 2012, గురువారం
ఆ.సౌమ్యా/బులుసు గారూ ఈ టపా మీకోసమే....:-)
PS: ఏమండోయ్ అసలే ఈ రోజుల్లో ఏది సక్రమంగా రాస్తున్నామో, ఏది వంకరగా రాస్తున్నామో తెలియక జనాలు తికమక పడుతున్నారంట. ఇందుమూలంగా యావన్మంది బ్లాగులోకపు ప్రజానీకానికి తెలుపుకొనేదేమంటే, నాబ్లాగులో అన్నీ Straight టపాలే. ఒకవేళ ఎప్పుడన్నా అలాంటివి వ్రాస్తే తప్పక చెప్తాను.
ఏంటబ్బా మాపేర్లతోటి టపా అనుకోని ఆశ్చర్యపోవద్దు. ముందుగా ఒక చిఱునవ్వు చివరిగా ఒక పెడనవ్వు నవ్వండి :-). ఇంతకీ మిమ్మల్నెందుకు తలుచుకున్నానంటే నవభారతి అని ఒక పత్రిక ఉండేదట. అందులో వి.సిమ్మన్న అని ఒక రచయిత బాపిరాజు నవ్వులు అని ఒక వ్యాసం వ్రాసారు. ఆ నవ్వుల రకాలు ఇక్కడ ఇస్తున్నా మీ లిస్టుకు ఇవీ యాడ్ చేసుకోండి మరి :))
చిఱునవ్వు
ఒంటిచిఱునవ్వు
వెలవెలబోయే చిఱునవ్వు
పెదవుల్ని ప్రసరించే చిరునవ్వు
అర్థపూరితమైన చిఱునవ్వు
విషాధచ్ఛాయలు ఆక్రమించిన చిరునవ్వు
పరిహాస పూరిత చిరునవ్వు
వెన్నెల లాంటి చిరునవ్వు
దివ్యమైన చిరునవ్వు
చిరుపూలుగల వెలుగుల నవ్వు
ఏడుపురంగరించిన నవ్వు
దీనమైన నవ్వు
తనలో నవ్వు
బోసినవ్వు
సిగ్గునవ్వు
ముసిముసినవ్వు
ఘొల్లుమని నవ్వు
విరగబడి నవ్వు
పకపకానవ్వు
పకాలున నవ్వు
కిలకిలా నవ్వు
కళకళానవ్వు
వరములిచ్చేటప్పటి నవ్వు
ఉషఃకాంతుల నవ్వు
ఎఱ్ఱటి నవ్వు
కన్నుల నవ్వు
పెదవుల నవ్వు
పెదవులు కదలించి నవ్వు
పెదవుల్లో మందహాసం
గుండెలు పగిలే పామునవ్వు
వంకరనవ్వు
పెడనవ్వు
ఇక నాపైత్యంకూడా
పరవశాన నవ్వు
పరువపు నవ్వు
పక్కింటోడిని చూసి నవ్వే నవ్వు
అమెరికా నవ్వు
చుట్టాల్ని చూసి నవ్వే నవ్వు
ప్రొద్దుట మన పేసు అద్దంలో చూసుకొని నవ్వే నవ్వు :))
ప్రియురాలితో ఉన్నప్పుడు పెళ్ళాంకనపడితే నవ్వేనవ్వు
అబ్బో ఇంకా చాలా వున్నాయి కానీ ముందు వీటికి సం.నా.క చెయ్యగలరేమో నని ఇక్కడ ఇలా.

11, జనవరి 2012, బుధవారం
సరాగ (హారం పత్రిక) లో బహుమతులు
సరాగ ( హారం పత్రిక) తొలి పత్రికా ప్రతి "కుసుమాంజలి" లో బహుమతులు గెలుచుకున్న వారందరికి మైల్స్ ఇచ్చాను. ఒకవేళ నా మైల్ స్పామ్ లోకి వెళ్ళి మీరు చూడకపోయినట్లైతే వారందరికి ఇది బహిరంగ విజ్ఞప్తి. దయచేసి నాకు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను / అడ్రసు వివరాలను admin@haaram.com కు మైల్ చేయ ప్రార్థన.
9, జనవరి 2012, సోమవారం
http://patrika.haaram.com హారం పత్రిక "సరాగ" విడుదలైంది
హారం పత్రిక "సరాగ" విడుదలైంది. హారం లో ఈ లింకు ఇచ్చేంతవరకు, పాఠకలోకం ఈ క్రింది లింకునుంచి ఈ తొలి ప్రతి "కుసుమాంజలి" చదువవచ్చు. హారం సంకలినికిచ్చిన ప్రోత్సాహాన్నే సరాగ పత్రికకూ అందించగలరని ఆశిస్తూ
http://patrika.haaram.com
మీ
భాస్కర రామిరెడ్డి
http://patrika.haaram.com
మీ
భాస్కర రామిరెడ్డి
7, జనవరి 2012, శనివారం
హారం పత్రిక 8 లేదా 9 వ తేదీల్లో విడుదల
గతనెల తలపెట్టిన హారం పత్రిక తొలిప్రతి ఈ నెల 8 లేదా 9 వ తేదీల్లో మీముందుకు రాబోతుంది. ఆ రోజే హారం పత్రిక కోసం నిర్వహించిన పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకున్న వారి పేర్లను కూడా ప్రకటించడం జరుగుతుంది. keep watching :-)
ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరైనా రచనలు ఆ రోజులోపల పంపినా స్వీకరిస్తాను.కానీ బహుమతులకు అర్హత వుండదు.
ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరైనా రచనలు ఆ రోజులోపల పంపినా స్వీకరిస్తాను.కానీ బహుమతులకు అర్హత వుండదు.
6, జనవరి 2012, శుక్రవారం
నూతన సంవత్సరంలో కూలు కూలుగా హాయి హాయిగా నవ్వుకోండి. బ్లాగర్లూ వాళ్ళ కలల కలాల పేర్లు -2
రెండో విడత - బ్లాగరూ వాళ్ళ కలల కలంపేర్లూ
____________________________________________________________________
జిలేబీ:
అరవగోల. ఈవిడ ఓ తెగ జిలేబీలేస్తానంటుందికానీ జిలేబీల బదులు కారప్పూసలౌతాయి. అప్పుడప్పుడు తెలుగును అ"రవం" గా వ్రాయడంలో స్పెషలిస్టు.
రాఫ్సన్ :
అరేబియన్ పాలేరు. పాలకోసం ఒక ఆవును కష్టపడికొనుక్కున్నాడు. అది తన్ని పారిపోయింది.
సుభ :
పెన్సిల్ దెయ్యం. పెన్సిల్ తో పొడిచి చంపేస్తుంది.
పద్మార్పిత:
art museum. బువ్వపెట్టమ్మా అంటే బొమ్మపెడతా నంటది.
ఉమ:
ట్రింగ్ ట్రింగ్ .. నా తెల్లని నవ్వుకు కోల్గేటే కారణం
ఉష:
తప్పిపోయిన బ్లాగరి. కానీ ప్రక్కనే వున్న అడవిలో పుట్టలు, కొమ్మలూ, పూలూ, పక్షులూ అని పాడుకుంటుందిలే.
జయ:
హిస్టరీ పుస్తకం .. అప్పుడప్పుడు చరిత్ర యుద్ధాలు గుర్తుకొచ్చి నిద్రలో తూటాలు,గుళ్ళు పేలుస్తుంటారు ( ప్రక్కనింటోళ్ళు చెవుల్లో దూదిపెట్టి). జంధ్యాలలా ఆశీర్వచనాలను ఇవ్వడంలో సాటిలేని మేటి.
ఎందుకోఏమో:
cut copy paste
అప్పారావు:
ఇరగతీస్తా బిడ్డా... ఏమి తీస్తాడో
కౌటిల్య:
Dr kitchen surgen. మనుషుల్ని రేపు కొయ్యొచ్చు. ఈరోజుకు ఈ వంకాయకు సర్జెరీ చేస్తా.
శేఖర్:
24X7 ప్రంపంచ వార్తా స్రవంతి. కానీ వీరెప్పుడూ తన కుర్చీవదిలి పక్కూరుకూడా వెళ్ళరు ( వార్తలకోసం).
సుధ :
singer in bathroom.( అదేంటో వినేవాళ్ళకు male voice వినిపిస్తుంది మరి.)
రసజ్ఞ :
ms Research ( లోపల మాత్రం ఎదవ రీసెర్చ్.... హాయిగా పెళ్ళిచేసుకోని పిల్లల్ని కనక ఏంటో నాకీతిప్పలు )
మహేశ్వరరెడ్డి :
Dr వయసుపిలిచింది. పెళ్ళీడొచ్చింది కానీ జిలేబే దొరకలేదింక.

5, జనవరి 2012, గురువారం
నూతన సంవత్సరంలో కూలు కూలుగా హాయి హాయిగా నవ్వుకోండి. బ్లాగర్లూ వాళ్ళ కలల కలాల పేర్లు -1
అయ్యలారా, అమ్మలారా ముందు చెప్పినట్టు ఇది సరదాకు మాత్రమే. ఎవరినైనా నొప్పిస్తే మన్నించమని ప్రార్థన.
భాస్కర రామిరెడ్డి :
ప్రవరాఖ్యుడు. కానీ వరూధిని పారిపోయింది. ( ఇంకా మీకేమన్నా తడితే అవన్నీ ... కాస్త చూసి పెట్టండి బాబులూ నొప్పిలేకుండా ;-)
భరద్వాజ్ :
కత్తుల రత్తయ్య ఆఫ్ ది బ్లాగ్పేట్ . ..నా కత్తెక్కడ....నాకామెంటెక్కడ.
ప్రవీణ్ శర్మ :
బ్లాగ్ గూర్ఖా
శరత్ :
ఒక్కడే ఒక్కడు..వాడే బ్లాగు సీతయ్య. వీడు ఎవ్వరిమాటా వినడు. కానీ ఎప్పుడూ తోడుకోసం వెతుకుతుంటాడు. ఆడైనా మగైనా
తాడేపల్లి :
బ్లాగ్దేశపు శంకరశాస్త్రి
చదువరి:
నా పేరు చదువరి. నేను యమా సీరియస్సు.
సత్యనారాయణ శర్మ (ఆలోచనా తరంగాలు) :
బ్లాగ్దేశపు వ్యాస మహర్షి. వీరు రామాయణపు కాలమునాటి దండకారణ్య పంచవటి లో వ్యాసమునీంద్రులు. శిష్యగణానికి వేద పాఠాలు చెప్తారు.
జ్యోతి వలబోజు :
ది యాంకర్... oprah winfrey in Pramadaavanam Show.
నీహారిక :
ఆడ సీతయ్య - ఎవరిమాటా వినదు. చివరికి వాళ్ళాయన మాటకూడా
సుజాత :
పుస్తకాల చలం... ఈ రోజు ఏమి పుస్తకం దులపాలబ్బా ( మచ్చు వైపు చూస్తూ )
సౌమ్య :
లేడీ బాలకృష్ణ... మగాడితో సమానంగా తొడగొడతా
జాజిపూల నేస్తం:
నా వయసు పద్దెనిమిదే. ( మొదట నిత్య యవ్వని అని పెడదామనుకున్నాను కానీ వీరు ఎలా తీసుకుంటారో తెలియక జంకుతున్నాను )
బులుసు సుబ్రహ్మణ్యం:
రేలంగి ఆఫ్ ది బ్లాగ్స్. No one can "beat" me.
మందాకిని:
బ్లాగులోకపు ఏకైక కవయిత్రి. పద్యంతో కొడతా.
రవిగారు:
హఠయోగి. నా సుధ నాక్కావాలి.
చంద్రశేఖర్ కాటుబోయిన ( chinny-bunny.blogspot.com):
తప్పు తప్పు... నాపేరు రాజశేఖర్.

4, జనవరి 2012, బుధవారం
నూతన సంవత్సరంలో కూలు కూలుగా హాయి హాయిగా నవ్వుకోండి
ఈ నూతన సంవత్సరంలో మన బ్లాగర్లందరూ హాయి హాయిగా కూలు కూలు గా చల్ల చల్లగా నవ్వుకోవాలని సరదాగా ఏదో చిన్న ప్రయత్నం. ఇంతకీ సంగతేంటంటే బ్లాగులన్నీ ఈ మధ్య సీరియస్సు విషయాల మీద తెగచర్చలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరికి కాస్త ఉపశమనం కలగచేద్దామని ఈ ప్రయత్నం.
ఎంత తన్నుకున్నా, తిట్టుకున్నా తెలుగుబ్లాగరులందరిదీ ఒకటే కుటుంబం. తెలుగు కుటుంబం. సో.. ఈ కుటుంబ సభ్యులలో నాకు గుర్తుకొచ్చిన కొందరి పేర్లు ఇక్కడ వ్రాస్తున్నాను. వీళ్ళనే ఎందుకు వ్రాస్తున్నాను అంటే, సరదా విషయాలు సరదాగా తీసుకుంటారనే నమ్మకంతోనే. ఒక వేళ మీకు ఇష్టము లేకపోతే దయచేసి పేరు తీసివేయమని చెప్తే తీసివేస్తాను.
అలాగే మీపేరు ఇక్కడ లేకున్నా, మీరు ఇష్టపడితే మీపేరు, బ్లాగుపేరు చెప్తే మిమ్మల్ని చేరుస్తాను. ఇక విషయానికొస్తే ఈ క్రింది తెలుగు కుటుంబ బ్లాగర్లకు కొన్ని నిక్ నేమ్స్ పెట్టడమైనది. అభ్యంతర కరంగా వుండవు కానీ ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు కనుక ముందుగా మీకీ విన్నపం.
ఇక బ్లాగర్ల పేర్లు. నిక్ నేమ్స్ మరో 10 గంటల్లో. నిక్ నేమ్స్ చదివి మీకు నచ్చితే శుభాకాంక్షలు నాకు చెప్పండి. ఒకవేళ నచ్చకపోతే గుద్దులు సుధ గారికి :-).
గమనిక : నిక్ నేమ్స్ అనగానే పొగడ్తల నిక్ నేమ్స్ అనుకోకండి. సరదాగా నువ్వుకోవడానికి ఉపయోగపడే నిక్ నేమ్స్ అన్నమాట. కబట్టి ఇష్టము లేని వారు నిరభ్యంతరంగా తొలగిపోవచ్చు. ఇష్టపడే వాళ్ళు పేరు నమోదు చేసుకోవచ్చు.
రెడీ 1 - 2 -3 set go.........
౧) నేను అంటే నేను అనబడే భాస్కర రామిరెడ్డి
౨) ప్రవీణ్ శర్మ
౩) భరద్వాజ్
౪) శరత్
౫) అప్పారావు
౬) బులుసు సుబ్రహ్మణ్యం
౭) సత్యనారాయణ శర్మ
౮) రాఫ్సన్
౯)శేఖర్ ( ఫ్రాన్సిస్ )
౧౦) మహేశ్వర రెడ్డి
౧౧) ఫణిబాబు
౧౨) కష్టేఫలే శర్మ
౧౩) చదువరి
౧౪) తాడేపల్లి
౧౫) కౌటిల్య
౧౬) వేణు
౧౬) ఎందుకోఏమో
౧౭) సుబ్బారెడ్డి
౧౮) రవిగారు
ఇంకా మీరు చేర్చే పేర్లు
ఇక లేడీ బ్లాగర్స్
౧) నీహారిక
౨) జ్యోతి
౩) ఉమ
౪) ఉష
౫) సుజాత ( తెలుగు )
౬) సౌమ్య ( మాయదారి :-))
౭) సుధ
౮) పద్మార్పిత
౯) మందాకిని
౧౦) సుభ
౧౧) రసజ్ఞ
౧౩) జిలేబీ
౧౪) చిన్ని ( హిమబిందు)
౧౫) సునీత
౧౬) నేస్తం
౧౭) జయ
ఇలాగే ఇక్కడ ఇంకా మీరు చేర్చే పేర్లు..
మరి వేచి చూడండి.

1, జనవరి 2012, ఆదివారం
నూతన సంవత్సర శుభాకాంక్షలు
సమస్తావనీనాధ సందోహనేతా
సమానాభిమాన ప్రజానీకపోషా
క్షమాషడ్గుణైశ్వర్య శశ్వత్ప్రకాశా
మమత్వోద్ధతిద్వేష మాంపాహిదేవా
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
సమానాభిమాన ప్రజానీకపోషా
క్షమాషడ్గుణైశ్వర్య శశ్వత్ప్రకాశా
మమత్వోద్ధతిద్వేష మాంపాహిదేవా
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు